breaking news
nandeeswarudu
-
గోవర్ధన తీర్థం: ఒకానొకప్పుడు జాబాలి అనే..
ఒకానొకప్పుడు జాబాలి అనే బ్రాహ్మణ కర్షకుడు ఉండేవాడు. వ్యవసాయంలో పొలం దున్నడానికి నాగలికి జోడెద్దులను కట్టేవాడు. అతడు ఎడ్లను సరిగా చూసుకునేవాడు కాదు సరికదా, నీరసించిన ఆ ఎడ్లు వడి వడిగా పొలం దున్నలేకపోతే, చీటికి మాటికి వాటిని మునికోలతో కొడుతూ, పొడుస్తూ హింసించేవాడు. పాపం! నోరులేని ఆ మూగజీవాలు అతడు పెట్టే బాధలకు భరిస్తూ, లోలోన దుఃఖిస్తూనే పనిచేస్తుండేవి.ఒకనాడు గోమాత అయిన కామధేనువు ఆ ఎద్దుల బాధను చూసింది. వాటి బాధలకు కలత చెందింది. ఆమె నందీశ్వరుడి వద్దకు వెళ్లి, ఆ ఎద్దులు పడే బాధలు చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకుంది. కామధేనువు ద్వారా అంతా విన్న నందీశ్వరుడు ఆ వృషభాలపై జాలి చెందాడు. తన ప్రభువైన పరమశివుని వద్దకు వెళ్లి, జాబాలి వద్దనున్న ఎద్దులు పడే బాధలు చెప్పాడు. ‘నందీ! నువ్వేమీ దిగులు చెందకు. ఈ విషయంలో నువ్వు తలచినది జరిగేలా వరమిస్తున్నాను. నీకు ఇష్టమైన రీతిలో నీ కోరిక నెరవేర్చుకో’ అన్నాడు పరమశివుడు.నందీశ్వరుడు వెంటనే ముల్లోకాలలో ఉన్న గోజాతిని సమావేశపరచాడు. ‘మీరెవ్వరూ ఇక్కడి నుంచి మరెక్కడికీ పోవద్దు. మీరు ఎవ్వరికీ కనిపించవద్దు’ అని ఆదేశించాడు.రోజులు గడుస్తున్నా, గోజాతి కనిపించకపోవడంతో ముల్లోకాలలోనూ గగ్గోలు మొదలైంది. దేవతలందరూ పరుగు పరుగున బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లి, మొరపెట్టుకున్నారు.‘బ్రహ్మదేవా! ఏమైందో ఏమో గోజాతి అంతా ఒక్కసారిగా మాయమైంది. ముల్లోకాలలోనూ ఒక గోవూ కనిపించడం లేదు. గోవులు లేకుండా ముల్లోకాలలో జనులు జీవించడమెలా?’ అని వాపోయారు.‘దేవతలారా! ఇందులో నేను చేయగలిగినదేమీ లేదు. మీరంతా పశుపతి అయిన పరమశివుని వద్దకు వెళ్లి ప్రార్థించండి. అతడే తరుణోపాయం చెప్పగలడు’ అని పలికాడు బ్రహ్మదేవుడు.దేవతలంతా కైలాసానికి చేరుకున్నారు. పరమశివుని స్తుతించి, ముల్లోకాలలోనూ గోగణాలు కనిపించకుండా పోయిన సంగతిని విన్నవించుకున్నారు.‘గోగణాల సంగతి నాకేం తెలుసు? నా వాహనం నందీశ్వరుడిని అడగండి’ అని చిద్విలాసంగా చెప్పాడు పరమశివుడు.దేవతలు నందీశ్వరుడి వద్దకు వెళ్లారు.‘నందీశ్వరా! పరోపకారీ! దయచూపి, మాకు గోప్రదానం చేసి, లోకాలను రక్షించు’ అని వేడుకున్నారు.‘దేవతలారా! గోసంతతికి చెందిన వృషభాలను జాబాలి అనే బ్రాహ్మణ కర్షకుడు బాధలు పెడుతున్నాడు. అందుకు ప్రతిగానే నేను గోగణాలను నా ఆశ్రయంలో ఉంచాను. మీరందరూ గోమతీ తీరానికి వెళ్లి, అక్కడ గోసవన యాగం చేయండి. గోహింసను పాపంగా ప్రకటించండి. అక్కడకు ముల్లోకాలకు చెందిన గోవులన్నీ వచ్చి, మిమ్మల్ని సంతుష్టులను చేస్తాయి’ అని పలికాడు.నందీశ్వరుడు చెప్పినట్లే దేవతలు గోమతీ తీరంలో గోసవన యాగం ప్రారంభించారు. యాగం మొదలైన కొద్దిసేపటిలోనే ముల్లోకాల గోగణాలన్నీ లెక్కకు మిక్కిలిగా అక్కడకు చేరుకున్నాయి. నేల ఈనినట్లు గోమతీ తీరమంతా ఎటు చూసినా గోగణాలతో కళకళలాడింది. దేవతలు, మానవులు ఆ దృశ్యాన్ని సంభ్రమాశ్చర్యాలతో తిలకించారు. గోవులు తిరిగి కనిపించడంతో వారంతా పరమానందం చెందారు.దేవతలు చేపట్టిన గోసవన యాగం దిగ్విజయంగా పరిపూర్ణమైంది. నాటి నుంచి ముల్లోకాలలోను గోవులకు పూజ్యత హెచ్చింది. దేవతలు గోసవన యాగం చేపట్టిన ప్రదేశం గోవర్ధన తీర్థంగా ప్రసిద్ధి పొందింది.పురావిశేషం..ఈశాన్య రాష్ట్రాల్లోని అరుదైన పురాతన దేవాలయాల్లో మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లోని మహాబలి ఆలయం ఒకటి. దీనిని క్రీస్తుశకం 1725లో నాటి రాజు గరీబ్ నివాజ్ నిర్మించాడు. అతడిని స్థానికంగా ‘మహారాజా పామ్హీబా’ అని పిలుస్తారు. అప్పట్లో మణిపూర్‌లోని సన్యాసి శాంతిదాస్ గోసాయి బోధనలకు ఆకర్షితుడైన గరీబ్ నివాజ్, ఆయన వద్ద రాముడిని ఆరాధించే ‘రామానంది’ మతాన్ని స్వీకరించాడు. రామదూత హనుమంతుడు మూలవిరాట్టుగా ‘మహాబలి’ ఆలయాన్ని ఇంఫాల్ నది ఒడ్డున నిర్మించాడు. ఈ ఆలయ నిర్మాణం బెంగాలీ ‘దో–చాలా’ శైలిలో ఉంటుంది. ఆలయ గర్భగుడిలోని హనుమంతుడి విగ్రహం నృత్యభంగిమలో ఉండటం విశేషం. గరీబ్ నివాజ్ మరణానంతరం మణిపూర్‌లో రామానంది మతం కనుమరుగై, గౌడీయ వైష్ణవం ప్రాబల్యం పుంజుకుంది. ఈ ఆలయంలో ఏటా హనుమజ్జయంతి, దీపావళి, హోలీ వేడుకలు విశేషంగా జరుగుతాయి.- సాంఖ్యాయన -
పాలుతాగావా.. బసవన్నా!
తాండూరు రూరల్: మండల పరిధిలోని కరన్‌కోట్ గ్రామంలోని బసవన్న దేవాలయంలో నందీశ్వరుడు పాలు తాగినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరలయ్యాయి. దీంతో భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కరన్‌కోట్ గ్రామంలోని మెయిన్ బజార్లో పురాతన బసవన్న దేవాలయం ఉంది. గ్రామానికి చెందిన పూజ, స్రవంతి శుక్రవారం ఆలయంలో నైవేద్యం సమరి్పచేందుకు వెళ్లారు. అక్కడే ఉన్న నందీశ్వరుడి విగ్రహానికి పాలుతాపే ప్రయత్నం చేయగా... నిజంగా పాలు మొత్తం తాగినట్లు ఆ మహిళలు గ్రామస్తులకు తెలిపారు. దీంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున నందీశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే పురాతన ఆలయం కావడంతో శనివారం ఉదయం ఆలయం ముందు భాగం కూలిపోయింది. ఇదంతా దేవుడి మహిమ అని త్వరలో ఆలయానికి మరమ్మతులు చేపడతామని ఉప సర్పంచ్ హేమంత్‌కుమార్ తెలిపారు. నందీశ్వరుడు పాలు తాగిన విషయం నిజమేనని ఉపసర్పంచ్ కూడా చెప్పారు. బీసీలకు రెండు -
ఏకంగా దేవుణ్నే ఎత్తుకెళ్లారు..
రొంపిచర్ల: గుంటూరు జిల్లా రొంపిచర్ల మండల కేంద్రంలోని శంకరస్వామి శివాలయంలో నందీశ్వరుడి విగ్రహాన్ని దుండగులు ఎత్తుకెళ్లారు. ఆదివారం తెల్లవారుజామున గుడి ఆవరణలోకి వెళ్ళిన పూజారి రొంపిచర్ల శ్రీనివాసశర్మ ఈ విషయాన్ని గమనించాడు. గుడి పక్కనే ఉండాల్సిన నందీశ్వరుడి విగ్రహం లేకపోవడంతో ఆయన విషయాన్ని ఆలయ అధికారులకు తెలియజేశారు. నందీశ్వరుడి విగ్రహం ఉండాల్సిన చోట గడ్డపారలతో తవ్వి పెకలించారు. ఈ సంఘటనతో రొంపిచర్ల గ్రామస్తుల్లో కలకలం చెలరేగింది. ఆలయ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో వెంటనే పోలీసులు ఆలయాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని వెళ్లారు. ఆలయం ఊరికి దూరంగా నరసరావుపేట రోడ్డులో ఉండటంతో పాటు ప్రహరీ గోడ లేకపోవడమే దొంగతనానికి అవకాశాన్ని కలిగించిందని గ్రామస్తులు అంటున్నారు. ఐదేళ్ల క్రితం గాలిగోపురం కూలిపోయిందని, ఇప్పటి వరకు పునరుద్ధరణ జరగలేదని స్థానికులు ఆరోపించారు. ఇప్పటికే ఓసారి ఆలయంలోని విగ్రహాలు, ద్వజస్తంభ గంటలు కూడా చోరీకి గురయ్యాయని వారు తెలిపారు.


