breaking news
nallapareddy prasannakumar reddy
-
చంపేస్తారేమోనని భయపడ్డా..
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘రాత్రిపూట వందలాది మంది వచ్చి నా ఇంట్లో పడ్డారు. కర్రలు, కత్తులు, సమ్మెటలతో నానా బీభత్సం చేశారు. ఇంటి గోడలు తప్ప ఏమీ మిగల్చలేదు. ఆ సమయంలో మా ఇంట్లో పనిచేసే వారొచ్చి అమ్మా గది నుంచి బయటకు రావొద్దు.. చంపేస్తారమ్మా అంటూ లాక్ వేశారు. ఏమి జరుగుతోందోనని బయటకు చూశా. కేకలు, అరుపులు, చంపేస్తామంటూ బండబూతులు.. నా నోటితో చెప్పలేను. ఆ పరిణామాలు చూసి భయమేసింది. అసలే కంటి ఆపరేషన్ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నా. నన్నూ చంపేస్తారనుకుని బాత్రూమ్లోకి వెళ్లా. కరెంట్ తీసేశారు. భయానక వాతావరణాన్ని చూసి నా బిడ్డ, మనవడ్ని చంపేస్తారేమోననే భయంతో ఏడ్చా. 85 ఏళ్ల వయస్సులో ఇలాంటి ఘటనను చూస్తాననుకోలేదు’.. ఇది వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తల్లి మాజీ మంత్రి దివంగత నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి సతీమణి శ్రీలక్ష్మమ్మ కన్నీటితో చెప్పిన మాటలు. ‘సాక్షి’ ప్రతినిధితో గురువారం ఆమె మాట్లాడారు. ఆమె ఏమన్నారంటే..ప్రశాంతిరెడ్డి నుంచి మాకు ప్రాణహాని ఉంది..80 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాం. పేదల కోసం పనిచేసిన చరిత్ర నల్లపరెడ్లది. ధనబలం, అధికార అహంకారంతో రాజకీయాల్లోకొచ్చి ప్రజాస్వామ్యాన్ని గబ్బు పట్టించిన ప్రశాంతిరెడ్డి తీరు ప్రజాస్వామ్యంలో సరికాదు. నల్లపరెడ్ల కుటుంబాన్నే లేకుండా చేస్తానంటూ సవాలు విసిరి.. మితివీురిన గూండాయిజం, రౌడీయిజం చేశారు. మా కుటుంబానికి ప్రశాంతిరెడ్డి నుంచి ప్రాణహాని ఉంది. రౌడీ రాజకీయాలతో రాజ్యమేలాలనుకుంటున్న ఆమె సమాజానికి ఏ సందేశామివ్వలనుకుంటున్నారో అర్థంకావడంలేదు.వాడెక్కడ.. వాడిని చంపేయాలన్నారు..ఇంటికొచ్చి తలుపులు తట్టారు. నా కుమారుడు ప్రసన్నను తిడుతూ వందల మంది బీభత్సం చేశారు. ఎక్కడ దాచావో చెప్పు.. వాడెక్కడ.. వాడిని చంపేయాలన్నారు. ఆ మనిషి మా ఇంటికి పంపించింది చంపేసి రమ్మనే. అయితే, బాత్రూంలో దాక్కున్న నన్ను బయటకు రమ్మన్నారు. నా గదిలో వస్తువులను పగలగొట్టి నన్ను వదిలేశారు. ఎక్కడున్నాడు లం...కొడుకూ... నీ.. అంటూ పెద్దవయస్సులో ఉన్న నాతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. అప్పటికే అల్లరిమూకలు ఇంట్లో, మిద్దెపైన, చుట్టూ చేరి వస్తువులన్నీ పగలగొడుతున్నారు. శబ్దాలు వింటున్నాను. అడ్డుకోలేని వయస్సు నాది. అన్నీ చూస్తూ మౌనంగా ఉండిపోయా. ఇంతటి అరాచకాన్ని ఎప్పుడూ చూడలేదు. మేమూ నీలాగా వ్యవహరిస్తే నీ పరిస్థితి ఏమిటి?భయం నా రక్తంలోనే లేదుచెయ్యి బాగోలేక చెన్నైలో ఆస్పత్రికి వెళ్లాఇంతలోనే పారిపోయానంటూ చెప్పడం సిగ్గుచేటుఅరెస్టుచేసి జైల్లో పెట్టినా భయపడేదిలేదుమాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డినెల్లూరు రూరల్ : తమది నల్లపరెడ్ల కుటుంబమని.. తమ రక్తంలో భయమనేదే లేదని.. ఎమ్మెల్యే వేమిరెడ్డిని చూసి భయపడి పారిపోయానని చెప్పడం సిగ్గుచేటని మాజీమంత్రి, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తెలిపారు. నెల్లూరులో గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. నడమంత్రపు సిరితో అందలమెక్కిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తమ కుటుంబంపై లేనిపోని ఆరోపణలు చేశారని మండిపడ్డారు. తన ఇంటిపై దాడికి పాల్పడిందెవరో జిల్లా ప్రజలకు తెలుసునన్నారు. అహంకారం తగదని, దీన్ని అణిచే రోజు దగ్గర్లోనే వస్తుందని చెప్పారు. తన చేయి బాగోలేక నొప్పిగా ఉంటే చెన్నైలోని ఆస్పత్రికి వెళ్లొచ్చేలోపే, ప్రసన్న పారిపోయాడని చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. ఫిర్యాదు చేసినా కేసు నమోదేదీ..?తన ఇంటిపై దాడిపై తాను ఫిర్యాదు చేసి నాలుగు రోజులవుతున్నా, ఇప్పటికీ కేసు నమోదు చేయలేదని ప్రసన్నకుమార్‌రెడ్డి చెప్పారు. పోలీసులపై ఎవరి ఒత్తిడి ఉందో అర్థమవుతోందన్నారు. తన కాళ్లు, చేతులు కట్టి ఈడ్చుకురావాలంటూ కొందర్ని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఆదేశించారని, తాను ఇంటి వద్దే ఉన్నానని, ఎవరైనా రావొచ్చని సవాల్ విసిరారు. వేమిరెడ్డి నేరుగా పోలీసులను తీసుకొచ్చి తనను అరెస్టుచేసి జైల్లో పెట్టినా భయపడేదిలేదని చెప్పారు. ఇక తన ఇంటిపై దాడిచేసిన వారి పేర్లు తెలుసునని, ముఖ్యంగా నలుగురు దాడి చేయించారని ఆయన చెప్పారు. అన్ని వీడియోలు తన వద్ద ఉన్నాయని, పోలీసులు విచారణను జరిపి, కారకులపై కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. డబ్బు, అహంకారంతోనే ఆమె ఇలా వ్యవహరిస్తున్నారని ప్రసన్నకుమార్‌రెడ్డి విమర్శించారు. -
Nallapareddy Prasannakumar: ఇది నల్లపరెడ్డి బ్లడ్.. భయపడే ప్రసక్తే లేదు
-
అ'శాంతి'కి పోలీసుల ఆజ్యం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పోలీసులు టీడీపీ నేతల అడుగులకు మడుగులొత్తుతున్నారు. వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ మూకలు, రౌడీలు దాడులు, దౌర్జన్యాలతో రెచ్చిపోతూ.. ఆస్తులు ధ్వంసం చేస్తున్నా ఇక్కడి పోలీసులు కనీస చర్యలు కూడా తీసుకోవడం లేదు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై ఫిర్యాదులు వస్తే మాత్రం ఆగమేఘాలపై కేసులు నమోదు చేస్తున్నారు. మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై టీడీపీ మూకలు దాడికి తెగబడి.. విధ్వంసం సృష్టించి 48 గంటలు గడిచినా కేసు నమోదులో తాత్సారం చేస్తున్నారు. ప్రసన్నకుమార్‌రెడ్డిపై టీడీపీ నేతల ఫిర్యాదు అందిందే తడవుగా అక్రమ కేసు నమోదు చేయడం వారి ‘పచ్చ’పాత ధోరణికి అద్దం పడుతోంది. ఎమ్మెల్యే ప్రశాంతి పాత్ర ఉండటం వల్లే.. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి ఆదేశాలతో సోమవారం రాత్రి టీడీపీ రౌడీమూకలు మారణాయుధాలతో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంట్లోకి ప్రవేశించి బీభత్సం సృష్టించారు. ఆయనను చంపేస్తామని కేకలు వేస్తూ విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై అదే రోజు రాత్రి ప్రసన్నకుమార్‌రెడ్డి డీఎస్పీ పి.సింధుప్రియకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విధ్వంసానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఈ ఘటన వెనుక కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి పాత్ర ఉండటంతో అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి కేవలం జనరల్ డైరీ (జీడీ) ఎంట్రీతోనే సరిపెట్టారు. దాడి జరుగుతున్న సమయంలోనే పోలీసులు నల్లపరెడ్డి ఇంటికి చేరుకున్నారు. రౌడీమూకల ధ్వంసరచనను అడ్డుకునే అవకాశం ఉన్నప్పటికీ ఏమీ చేయకుండా వేడుక చూశారు. టీడీపీ మూకలు దర్జాగా వెళ్లిపోతున్నప్పటికీ వారిలో ఒక్కరిని కూడా పట్టుకునే ప్రయత్నం చేయలేదు. ఎమ్మెల్యే ప్రశాంతి ముఖ్య అనుచరులు దగ్గరుండి దాడులకు పురిగొల్పుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నా.. సాక్ష్యాధారాలను వైఎస్సార్సీసీ నేతలు బయటపెట్టినా ఇంతవరకు పోలీసులు కేసు నమోదు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. అయితే ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి ఫిర్యా దు చేసిన వెంటనే ప్రసన్నకుమార్‌రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేయడం, మరికొందరు నేతలను కేసులో ఇరికించేందుకు పలు సెక్షన్లు పెట్టడంపై ప్రజాస్వామ్యవాదులు మండిపడుతున్నారు. దీని పై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోవడంతో చట్టపరంగా ఎదుర్కొనేందుకు వైఎస్సార్సీపీ నేతలు సిద్ధమవుతున్నారు. -
టీడీపీ దురాయి దురాగతం
కోవూరు: ఓట్ల కోసం టీడీపీ బరి తెగించింది. మత్స్యకార గ్రామాల్లో ‘దురాయి’ కట్టుబాటుతో గంపగుత్తగా ఓట్లు వేయించుకునే కుట్రకు తెరతీసింది. ఓటర్ల స్వేచ్ఛాయుత హక్కును కాలరాస్తూ ఎన్నికల కమిషన్ ఆంక్షలు ధిక్కరించే దుస్సాహసానికి తెగబడింది. ‘దురాయి’ పేరుతో రాజకీయ కక్షలకు నిప్పు రాజేస్తోంది. ఇందుకూరుపేట మండలం మైపాడు పంచాయతీ కృష్ణాపురం మత్స్యకార గ్రామంలో ఊరి పెద్దలుగా కాపులు ఉంటారు. వీరిని ప్రలోభపెట్టి ఓట్లను రూ.80 లక్షలకు కొనుగోలు చేయడం మత్స్యకార గ్రామాల్లో అలజడి సృష్టిస్తోంది. ‘దురాయి’ అంటే ? మత్స్యకార గ్రామాల్లో వివాదాలు, ఘర్షణలు, తప్పులు జరగకుండా, ‘ఎవరైనా తప్పు చేస్తే.. ఆ తప్పును సరిదిద్దేందుకు’ నిర్దేశించుకున్న అసాంఘిక కట్టుబాటు ‘దురాయి’. విద్యకు, విజ్ఞానానికి, సామాజిక చైతన్యానికి దూరంగా ఉన్న రోజుల్లో ఆ పల్లెల్లో ‘దురాయి’ ఆచారంగా సాగింది. ఈ దురాచారాన్ని అడ్డంపెట్టుకుని చంద్రబాబు టీడీపీని కబ్జా చేసినప్పటి నుంచి మత్స్యకార గ్రామాల్లో ఓట్లను ఏకపక్షంగా వేయించుకునే కుట్రలు చేశారు. మత్స్యకార గ్రామాల్లో యువత రెండు తరాలుగా చదువుకుంటూ విద్యావంతులుగా మారారు. దీంతో వారిలో చైతన్యం వెల్లివిరిసింది. దురాయిని క్రమక్రమంగా పక్కన పెట్టేశారు. ఓట్ల విషయంలో ఎవరి ఇష్టప్రకారం వారు వేసుకుంటున్నారు. ఇప్పు డు తెలుగుదేశం పార్టీ తన స్వార్థానికి ‘దురాయి’ని మళ్లీ వాడుకునేందుకు బయటకు తెచ్చింది. ఈ విధానాన్ని ఆ గ్రామంలో కొందుకు అంతర్గతంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ దురాయితో మళ్లీ గ్రామంలో వర్గ రాజకీయాలు చెలరేగే ప్రమాదం ఉందని ఆ మత్స్యకార గ్రామంతోపాటు మిగతా గ్రామాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఐదేళ్లలో సంక్షేమ పథకాలతో.. కృష్ణాపురంలో 716 ఓట్లు ఉన్నాయి. కేవలం మత్స్యసంపదపై ఆధారపడిన ఆ కుటుంబాలు వేట లేని సమయంలో వ్యవసాయ కూలీ పనులతో జీవనాన్ని సాగిస్తున్నారు. ఎంతో వెనుకబాటుకు గురైన గ్రామస్తులు నాలుగు దశాబ్దాలుగా పొలాలు వారి సాగులో ఉన్నా పట్టాలు లేక, ప్రభుత్వ పథకాలు అందక నానా ఇబ్బందులు పడుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామంలో 33 మంది మత్స్యకారులకు 31.64 ఎకరాల భూమికి అసైన్మెంట్ పట్టాలు ఇప్పించి, ఆ భూములకు శాశ్వత హక్కులు కల్పించింది. 40 ఏళ్ల నుంచి కాళ్లరిగేలా తిరిగినా ఏ ప్రభుత్వం చేయని ఈ పనిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సహకారంతో ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి మత్స్యకారులకు చేసిపెట్టారు. నుడా నిధులు రూ.75 లక్షలు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య నిధులు రూ.10 లక్షలతోపాటు మరో రూ.85 లక్షలలో గ్రామంలో సిమెంటు రోడ్ల నిర్మాణం చేపట్టారు. ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఎంపీ నిధుల నుంచి రూ.5 లక్షలతో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేశారు. కృష్ణాపురం మత్స్యకారులకు డీబీటీ ద్వారా రూ.5.98 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా రూ.3.06 కోట్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందించింది. గ్రామంలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి రూ.35 లక్షలతో ప్రతి వీధికి పైపులైన్ వేసి ఇంటింటికీ మంచినీటి కుళాయి ఏర్పాటు చేసింది. దీనికి అదనంగా మరో రూ.5 లక్షల ఖర్చు చేశారు. జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా రూ.25.68 లక్షలతో పీడీ కండ్రిగలో బోరు, మోటారు వేసి సుమారు 4.5 కిలోమీటర్ల మేర నీటిని నడిపి కృష్ణాపురంలోని వాటార్ ట్యాంక్‌కి కలిపి మంచినీటికి ఇబ్బందికి లేకుండా చూసిన ఘనత వైఎస్సార్సీపీది. తాజాగా ఏం జరిగిందంటే.. మత్స్యకార గ్రామాల్లో కలహాలు రేపేందుకు టీడీపీ కుట్రలు చేస్తోంది. ఎన్నికల సమయంలో ‘దురాయి’ అనే దురాచారాన్ని అడ్డంపెట్టుకుని గ్రామాల్లో అలజడులు సృష్టించేందుకు కుట్రలు చేస్తోంది. మత్స్యకార గ్రామాల్లో ఓట్లను టీడీపీకి ఏకపక్షంగా వేయించుకునేందుకు తెరతీసింది. ఇందుకూరుపేట మండలం కృష్ణాపురంలో ప్రజలతో సంప్రదించకుండా కేవలం గ్రామానికి చెందిన కాపులతో మాట్లాడి ‘దురాయి’ విధించడాన్ని గ్రామస్తులంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇందుకూరుపేట మండలం మైపాడు పంచాయతీ కృష్ణాపురంలో శనివారం కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమ ప్రభుత్వ హయాంలో ఆ గ్రామానికి చేసిన అభివృద్ధిని వివరించారు. ప్రజలు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందాలంటే మరోసారి వైఎస్సార్సీపీని ఆదరించాలని గ్రామస్తులను కోరారు. గ్రామస్తులందరూ ఎమ్మెల్యేకు తమ సంఘీభావం తెలిపారు. అయితే రాత్రికి రాత్రే టీడీపీ ఇందుకూరుపేట మండల కన్వీనర్ వీరేంద్రనాయుడు, వైఎస్సార్సీపీ నుంచి వెళ్లిన దువ్వూరు కళ్యాణ్‌రెడ్డి ఆ గ్రామ కాపులతో రహస్య ఒప్పందం చేసుకుని ఓట్లు కొల్లగొట్టేందుకు ‘దురాయి’కి ఒప్పించారు. దురాయి ప్రకారం ఎవరైనా తమ ఓటును టీడీపీకి వేయకపోయినా.. అసలు ఓటుకు రాకపోయినా రూ.లక్షల్లో జరిమానా, గ్రామ బహిష్కరణ విధించాలని నిర్ణయించినట్లు తెలిసింది. గ్రామస్తులతో ఎలాంటి సమాచారం లేకుండా కేవలం గ్రామానికి చెందిన కాపులతో ‘దురాయి’ విధించడంపై గ్రామస్తులందరూ వ్యతిరేకిస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఏం చెబుతోందంటే.. ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల కమిషన్ చెబుతోంది. ఓట్లను కొనడం రాజ్యాంగ విరుద్ధమంటోంది. అయితే ఎన్నికల కమిషన్ ఆంక్షలను ధిక్కరించి టీడీపీ ఏకంగా దురాయి పేరుతో గంపగుత్తగా ఓట్లు కొనేందుకు తెగబడడం చూస్తే ఎన్నికల కమిషన్ ఆదేశాలను బేఖాతారు చేయడమేనని స్థానికులు, రాజకీయ పక్షాలు పేర్కొంటున్నాయి. ఒకే పోలింగ్ బూత్‌లో ఏకపక్షంగా ఓట్లు పడితే మళ్లీ రీపోలింగ్ జరిపే అవకాశం ఉంది. దురాయి పేరుతో ఓటర్లపై ఆంక్షలు విధించినట్లు నిర్ధారణ అయితే అందుకు బాధ్యులైన గ్రామ పెద్దలతోపాటు, ఓట్లు వేయించుకున్న పార్టీ అభ్యర్థిపై ఎన్నికల కోడ్ నిబంధనల మేరకు చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. దురాయి విధించడంపై రాజకీయ పక్షాలు రాష్ట్ర, కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. -
బాబు మనవడితో ముచ్చట్లు పెట్టేందుకే...
నెల్లూరు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ...ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనవడితో ముచ్చట్లు పెట్టేందుకే అమరావతి శంకుస్థాపనకు వచ్చినట్లు ఉందని వైఎస్ఆర్ సీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మండిపడ్డారు. పార్లమెంట్ నుంచి మట్టి తెచ్చి ఆంధ్రా ప్రజల మొఖాన కొట్టి ...ప్రత్యేక హోదా ప్రస్తావన లేకుండా మోసం చేశారని ఆయన శుక్రవారమిక్కడ విమర్శించారు. ప్రత్యేక హోదాపై ప్రజల పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లారని నల్లపరెడ్డి ధ్వజమెత్తారు. కాగా శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన ప్రధాని మోదీకి చంద్రబాబు తన కుటుంబసభ్యులను పరిచయం చేశారు. ఈ సందర్భంగా నారా లోకేష్ కొడుక్కి ...మోదీ తన కళ్లజోడు పెట్టి ముచ్చట తీర్చుకున్న విషయం తెలిసిందే.