బాబు మనవడితో ముచ్చట్లు పెట్టేందుకే... | ysrcp leader nallapareddy prasanna kumar reddy slams narendra modi | Sakshi
Sakshi News home page

బాబు మనవడితో ముచ్చట్లు పెట్టేందుకే...

Oct 23 2015 10:14 AM | Updated on Aug 15 2018 2:20 PM

బాబు మనవడితో ముచ్చట్లు పెట్టేందుకే... - Sakshi

బాబు మనవడితో ముచ్చట్లు పెట్టేందుకే...

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ...ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనవడితో ముచ్చట్లు పెట్టేందుకే అమరావతి శంకుస్థాపనకు వచ్చినట్లు ..

నెల్లూరు:  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ...ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనవడితో ముచ్చట్లు పెట్టేందుకే అమరావతి శంకుస్థాపనకు వచ్చినట్లు ఉందని వైఎస్ఆర్ సీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మండిపడ్డారు.  పార్లమెంట్ నుంచి మట్టి తెచ్చి ఆంధ్రా ప్రజల మొఖాన కొట్టి ...ప్రత్యేక హోదా ప్రస్తావన లేకుండా మోసం చేశారని ఆయన శుక్రవారమిక్కడ విమర్శించారు. ప్రత్యేక హోదాపై ప్రజల పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లారని నల్లపరెడ్డి ధ్వజమెత్తారు.

కాగా శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన ప్రధాని మోదీకి చంద్రబాబు తన కుటుంబసభ్యులను పరిచయం చేశారు. ఈ సందర్భంగా నారా లోకేష్ కొడుక్కి ...మోదీ తన కళ్లజోడు పెట్టి ముచ్చట తీర్చుకున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement