breaking news
nagnur
-
ఫైవ్‌స్టార్ చాక్లెట్స్‌తో పాఠశాలకు ఆహ్వానం
కరీంనగర్ మండలం నగునూరు పాఠశాలలో హెచ్ఎం కట్ట వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపాధ్యాయులు ఫైవ్‌స్టార్ చాక్లెట్లతో స్వాగతం పలికారు. కరీంనగర్‌లోని మంకమ్మతోటలో గల ధన్గర్‌వాడీ పాఠశాలలో ప్రార్థన సమయంలో విద్యార్థిని సాయి స్పృహతప్పి పడిపోగా, ఉపాధ్యాయుడు ప్రథమ చికిత్స చేశాడు. సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘పొద్దున లేవాలి.. స్నానం చేయాలి.. బడికెళ్లాలి.. ప్రార్థన చేయాలి, పాఠాలు వినాలి.. మైదానంలో ఆడాలి.. సాయంత్రానికి మాసిన బట్టలతో ఇంటికి చేరుకోవాలి.. ఇదే ప్రపంచంలో ఎక్కడైనా విద్యార్థి దినచర్య. కానీ, కరోనా మహమ్మారి దెబ్బకు ఏడాదిన్నరగా విద్యార్థుల దినచర్య పూర్తిగా స్తంభించిపోయింది. నిత్యం స్మార్ట్ఫోన్లలో పాఠాలు విన్న విద్యార్థులకు బుధవారం నుంచి ప్రత్యక్ష బోధన మొదలైంది. ఏడాదిన్నర అనంతరం పాఠశాలకు వెళ్తున్నామనే హుషారు విద్యార్థుల్లో కనబడింది. కరోనా వల్ల పాఠశాలలకు దూరమైన విద్యార్థినీ విద్యార్థులకు ప్రత్యక్ష బోధనకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు బడిబాట పట్టారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులు మాస్కులు ధరించి పాఠశాల, కళాశాలలకు హాజరవ్వడం కనిపించింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రత్యక్ష తరగతులు నిర్వహించాయి.’ చదవండి: కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్‌కు దరఖాస్తులు ఆహ్వానం 18 నెలల అనంతరం..! గతేడాది మార్చి 23 నుంచి దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్లో భాగంగా విద్యాసంస్థలు మూతబడ్డాయి. 2019–20 విద్యాసంవత్సరానికి గాను పదో తరగతి, ఇంటర్, కొన్ని ఉన్నత విద్యలకు సంబంధించి ప్రభుత్వం నేరుగా పాస్ చేశారు. 2020–21 విద్యా సంవత్సరంలోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. సెకండ్ వేవ్ ముగియడం, ప్రత్యక్ష బోధన కొరవడటంతో విద్యార్థుల్లో విద్యాప్రమాణాలు పడిపోతాయన్న ఆందోళనతో ప్రభుత్వం కూడా ప్రత్యక్ష బోధన వైపు మొగ్గుచూపింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు దాదాపు 18 నెలల అనంతరం విద్యార్థులు బడిబాటపట్టడం గమనార్హం. పాఠశాలల్లో 21.11 శాతం, కళాశాలల్లో 22.65 శాతం.. పాఠశాలలు, కళాశాలల పునఃప్రారంభమైన తొలిరోజు హాజరు శాతం అతి తక్కువ నమోదు కావడం గమనార్హం. విద్యార్థులను బలవంతం చేయొద్దని, ఆన్లైన్, ఆఫ్‌లైన్ విద్యార్థుల కోరిక మేరకు విద్యాసంస్థల యజమానులు వ్యవహరించాలని వచ్చిన వార్తలతో తొలిరోజు విద్యార్థులు, తల్లిదండ్రులు గందరగోళానికి గురికావడంతోనే హాజరు శాతం తగ్గిందని ఉపాధ్యాయ వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలలను శుభ్రం చేసి విద్యార్థులు ప్రత్యక్ష «తరగతులకు హాజరయ్యేలా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తొలిరోజు జిల్లా వ్యాప్తంగా 662 ప్రభుత్వ పాఠశాలల్లో 42,698 మంది విద్యార్థులకు గాను 9,014 మంది (21.11 శాతం).. ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో 13,059 మంది విద్యార్థులకు గాను 2,958 మంది (22.65 శాతం) హాజరయ్యారు. -
ఆశ్రమంలో ఉద్రిక్తత
నార్నూర్, న్యూస్‌లైన్ : నార్నూర్ మండలం జామ్ గ్రామంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో ప్రేమ పేరిట వేధిస్తున్న ఉపాధ్యాయుడిని తొలగించాలని శుక్రవారం విద్యార్థినులు ఆందోళనబాట పట్టారు. ఉపాధ్యాయుడు శంకర్ తీరుపై హెచ్ఎం లక్ష్మణ్‌కు రాతపూర్వకంగా రాసి ఇచ్చారు. విషయం తెలుసుకున్న గిరిజన సంఘాల నాయకులు, పోలీసులు పాఠశాలకు చేరుకున్నారు. తరగతి గదిలో బోధిస్తున్న ఉపాధ్యాయుడు శంకర్‌ను చితకబాదారు. ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులు అందోళనకు దిగారు. అడ్డుకోబోయిన ఎస్సై సంతోష్సింగ్తో వాగ్వాదానికి దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తరగతి గదిలో ప్రేమ పాఠాలు బోధించడం, రాత్రి వేళల్లో పడుకున్నా గదిలోకి వచ్చి ఇబ్బంది పెట్టడం, సదరు విద్యార్థినికి సబ్బులు, డ్రెస్సులు, వస్తువులు ఇచ్చి మభ్య పెట్టేవారని విద్యార్థినులు పేర్కొన్నారు. మూడేళ్లుగా ప్రేమ వ్యవహారం జరుగుతున్న విషయాలు హెచ్ఎంకు చెప్పినా పట్టించుకోలేదన్నారు. నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలి.. : గిరిజన సంఘాల డిమాండ్ కీచక ఉపాధ్యాయుడు శంకర్ ను సస్పెండ్ చేసి నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు కనక యాదవ్రావ్, గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు వెడ్మా బొజ్జు, తుడం దెబ్బ జిల్లా అధ్యక్షుడు ఆత్రం తిరుపతిలు డిమాండ్ చేశారు. పాఠశాల ప్రధాన గేటు ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన పాఠశాలల్లో గిరిజన విద్యార్థినిలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. నిర్లక్ష్యం వహించిన సిబ్బంది, బాధిత ఉపాధ్యాయులను వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. చర్య తీసుకోకుంటే అందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. వాస్తవమే.. నివేదిక ఐటీడీఏ పీవోకు సమర్పిస్తా.. - చందన, ఏటీడ బ్ల్యూవో అందోళన విషయం తెలుసుకున్న ఏటీడ బ్ల్యూవో చందన పాఠశాలను సందర్శించారు. వివరాల ను విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. బా ధిత ఉపాధ్యాయునిపై వచ్చిన ఆరోపణ వాస్తవమేనన్నారు. నివేదికను ఐటీడీఏ పీవోకు సమర్పిస్తానని తెలిపారు. పాఠశాలను సందర్శించిన వారిలో లంబాడ హక్కుల పొరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు రాథోడ్ ఉతం, సర్పంచ్‌లు రాథోడ్ మధకర్, బానోత్ గజానంద్‌నాయక్, రాయి సెంటర్ జిల్లా సార్మెడి దుర్గు పటెల్, ఎల్‌హెచ్‌పీస్ జిలా అధ్యక్షులు అడే సురేశ్ తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు.