breaking news
myhome
-
ప్రతిష్టాత్మక ‘మై హోమ్ సయూక్’ ను లాంచ్ చేసిన స్టైలిష్‌స్టార్
సాక్షి, హైదరాబాద్: పాపులర్ రియల్ ఎస్టేట్ సంస్థ మై హోమ్ గ్రూప్ మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌ను లాంచ్ చేసింది. ‘మై హోమ్ సయూక్’ పేరుతో దీన్ని ప్రారంభించింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దీన్ని గ్రాండ్‌గా లాంచ్ చేశారు. గోపనపల్లి-తెల్లాపూర్ రోడ్లో,ఐటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, హైటెక్ సిటీలకు అత్యంత సమీపంలో మై హోమ్ సయూక్ ప్రాజెక్ట్. 12 టవర్లతో, 3780 ఫ్లాట్స్‌గా నిర్మించనున్నారు.మై హోమ్ సయూక్‌లో 6 టవర్ల కోసం బుకింగ్స్‌ను కూడా ప్రారంభించారు. భారీ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్లో భాగం మై హోమ్ సయూక్, మైహోమ్ గ్రూప్ ప్రతిమ గ్రూప్‌ల ఉమ్మడి వెంచర్. హైదరాబాద్ సమీపంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన విల్లా ప్రాజెక్ట్- ప్రిస్టిన్ ఎస్టేట్స్‌ను ప్రతిమ గ్రూప్ అభివృద్ది చేసింది. ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్లో తొలిదశలో మై హోమ్ సయూక్ 25.37 ఎకరాలలో జీ+39 ఫ్లోర్లతో ఉండటంతోపాటు, 82శాతం ఓపెన్ ఏరియాలను అందిస్తుంది. మొత్తం 12 టవర్లు కలిగి ఉండటంతో పాటుగా ఫ్లోర్‌కు 8 ఫ్లాట్స్‌తో ఇది వస్తుంది. వీటిలో 2, 2.5 3బీహెచ్‌కె ప్రీమియం లైఫ్‌స్టైల్ అపార్ట్మెంట్లు 1355 చదరపు అడుగుల నుంచి 2262 చదరపు అడుగుల విస్తీర్ణంలో మై హోమ్ నుంచి సిగ్నేచర్ ఫ్లోర్ ప్లాన్స్‌తో ఉంటాయి. ప్రాజెక్ట్‌లో ప్రధాన ఆకర్షణలు • 7.5 ఎకరాలలో సెంట్రల్ ల్యాండ్‌స్కేప్ • ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి 5 నిమిషాల ప్రయాణం • ప్రతి టవర్‌కూ డబుల్ హైట్ ఎంట్రెన్స్ లాబీ • ఒక లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో క్లబ్ హౌస్ • రాబోతున్న ఇంటర్నేషనల్ స్కూల్, సయూక్ కు పక్కనే • 2 రూఫ్‌టాప్ టెన్నిస్ కోర్టులు • ఏసీ స్విమ్మింగ్ పూల్ ‘సౌకర్యవంతమైన జీవనం, అంతే సౌకర్యవంతంగా ఉండే ప్రాంతాలలో, కమ్యూనిటీలకు అతి చేరువగా ఉండేలా హౌసింగ్ ప్రాజెక్ట్‌లను మూడు దశాబ్దాలకు పైగా అభివృద్ధి చేస్తూ అగ్రగామిగా మై హోమ్ వెలుగొందుతోందని, దానికి కొనసాగింపే మై హోమ్ సయూక్’’ అని మై హోమ్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ రామేశ్వర్ రావు వెల్లడించారు -
భట్టి విక్రమార్కతో ఏకీభవిస్తున్నా: రేవంత్‌రెడ్డి
కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాతే డీఎల్ఎఫ్ భూముల బదలాయింపు జరిగిందన్న భట్టి విక్రమార్క వాదనతో తాను ఏకీభవిస్తున్నట్లు టీడీఎల్పీ ఉపనేత రేవంత్‌రెడ్డి చెప్పారు. అసెంబ్లీలో భూబాగోతాన్ని లేవనెత్తిన తనను అధికారపక్షం మాట్లాడనివ్వలేదని ఆయన అన్నారు. డీఎల్ఎఫ్ నుంచి అర్హతలు లేని మరో కంపెనీకి భూమిని బదలాయించి, దానికి ప్రతిగా డీఎల్ఎఫ్కు ఖరీదైన భూములు ఇచ్చేశారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ నిర్ణయం వల్ల మైహోం కంపెనీ అధినేత రామేశ్వరరావుకు రూ. 300 కోట్ల లబ్ధి చేకూరిందన్నారు. సీఎం కేసీఆర్ విచారణ జరిపిస్తే ఇది కుంభకోణమని తాను నిరూపిస్తానని రేవంత్ సవాలు చేశారు. ఆపరేషన్ బ్లూస్టార్ పేరుతో తన గొంతు నొక్కి, ప్రాణాలు హరించాలని చూస్తే ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. అవినీతి బాగోతం బయటపడుతుందనే అధికారపక్షం మాట్లాడకుండా సభ నుంచి పారిపోయిందని ఎద్దేవా చేశారు. చర్చ ముగిసిపోయిన తర్వాత ఈ వ్యవహారంపై ఫైళ్లను స్పీకర్ వద్ద ఉంచితే ఏం ప్రయోజనం ఉంటుందని ప్రశ్నించారు. ప్రభుత్వం తప్పు చేసిందన్న తమ వాదనను కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క నిరూపించారని రేవంత్ రెడ్డి చెప్పారు.