munikama koti
-
'కోటి మృతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణం'
తిరుపతి: కాంగ్రెస్ పోరుసభలో ప్రత్యేక హోదా కోసం ఆత్మాహుతికి పాల్పడ్డ మునికామ కోటి కుటుంబ సభ్యులను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా శుక్రవారం నివాసానికి వెళ్లి పరామర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కోటిని బలి తీసుకున్నాయని ఈ సందర్భంగా రోజా మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆమె అన్నారు. తన అవినీతిని బయట పెట్టకుండా ఉండటానికి చంద్రబాబు బీజేపీకి లొంగిపోయారని ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. -
రేపు తిరుపతిలో కోటి అంత్యక్రియలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం ఆత్మబలిదానానికి పాల్పడిన మునికామ కోటి(41) అంత్యక్రియలు సోమవారం సాయంత్రం తిరుపతిలో నిర్వహించనున్నారు. కోటి అంత్యక్రియల్లో ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, ఎంపీ చిరంజీవి, సీ రామచంద్రయ్య, ఇతర కాంగ్రెస్ నేతలు, ప్రజా సంఘాల నేతలు పాల్గొననున్నారు. ఈ నెల 11న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుపతికి వెళ్లి కోటి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ తో రేపు ఢిల్లీలో వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో జరిగే ధర్నాలో వైఎస్ జగన్ పాల్గొంటున్నారు. ఢిల్లీ నుంచి వైఎస్ జగన్ నేరుగా తిరుపతికి వెళ్లనున్నారు. ఏపీకి ప్రత్యే హోదా ఇవ్వాలంటూ శనివారం తిరుపతిలో మునికామ కోటి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పటించుకున్న సంగతి తెలిసిందే. చెన్నైలో చికిత్స పొందుతూ ఈ రోజు మధ్యాహ్నం మరణించాడు. -
కోటి మృతికి సోనియా, రాహుల్ సంతాపం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మునికామ కోటి మృతి పట్ల కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు. కోటి కుటుంబ సభ్యులకు వారు సానుభూతి తెలియజేశారు. తిరుపతిలో శనివారం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కోటి.. చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మరణించిన సంగతి తెలిసిందే. కోటితో పాటు గాయపడ్డ శేషాద్రి ఆరోగ్య పరిస్థితిపై వారిద్దరూ ఆరా తీశారు. ప్రస్తుతం శేషాద్రి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి తెలియజేశారు. కోటి అంత్యక్రియల్లో రఘువీరారెడ్డితో పాటు ఎంపీ కె.చిరంజీవి, మాజీ మంత్రి సి.రామచంద్రయ్య పాల్గొననున్నారు. -
మునికామ కోటి మృతి
చెన్నై: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యాయత్నం చేసిన మునికామ కోటి(41) ప్రాణాలు కోల్పోయాడు. చెన్నైలోని కేఎంసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం ఆయన కన్నుమూశాడు. ఈ ఉదయం అతడిని వేలూరిలోని సీఎంసీ ఆస్పత్రి నుంచి కేఎంసీ ఆస్పత్రికి తరలించారు. శరీరం పూర్తిగా కాలిపోవడంతో అతడిని బతికించేందుకు వైద్యులు చేసిన కృషి ఫలించలేదు. మునికామ కోటి మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఆయన మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఏపీకి ప్రత్యే హోదా ఇవ్వాలంటూ శనివారం తిరుపతిలో మునికామ కోటి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకున్నాడు. మొదట అతడిని తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వేలూరు ఆస్పత్రికి తరలించారు. దాదాపు 95 శాతం శరీరం కాలిపోవడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. కోటి ఆరోగ్యం మెరుగుపడాలని కాంగ్రెస్ శ్రేణులు ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా చేసిన ప్రత్యేక పూజలు ఫలించలేదు. కోటి బలిదానంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విపక్షాలు, ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. మొదటినుంచి ఉద్యమకారుడే.. తిరుపతిలో గతంలో జరిగిన సమైక్యాంధ్ర ఉద్యమంలో కోటి చురుకైన పాత్ర పోషించాడు. ఆందోళనలో తన నిరసన గళాన్ని తెలిపారు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయ కమిటీ సభ్యుడిగా పనిచేశారు.ఆత్మహత్యాయత్నానికి ముందు ఇంట్లో ‘ప్రత్యేక హోదాకోసం ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తోంద’ని చెప్పినట్లు కోటి కుటుంబీకులు తెలిపారు. -
'24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేం'
-
'24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేం'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం ఆత్మబలిదానానికి సిద్ధమైన మునికామ కోటి(41) ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. తమిళనాడులోని వేలూరు సీఎంసీ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని వైద్యులు అంటున్నారు. ఈ సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని ఆస్పత్రి డైరెక్టర్ భరద్వాజ తెలిపారు. 50 శాతంపైగా కాలిన గాయాలయిన వారిని సీఎంసీ ఆస్పత్రిలో చేర్చుకోరు. రాజకీయ నాయకుల రికమండేషన్ తో మునికామ కోటిని ఆస్పత్రిలో చేర్చుకుని చికిత్స అందిస్తున్నారు. ఏపీకి ప్రత్యే హోదా ఇవ్వాలంటూ శనివారం తిరుపతిలో మునికామ కోటి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. దాదాపు 95 శాతం శరీరం కాలిపోవడంతో మెరుగైన వైద్యం కోసం నిన్నరాత్రి వేలూరు సీఎంసీ ఆస్పత్రికి తరలించారు.


