కోటి మృతికి సోనియా, రాహుల్ సంతాపం | rahul, sonia condolence to munikama koti | Sakshi
Sakshi News home page

కోటి మృతికి సోనియా, రాహుల్ సంతాపం

Aug 9 2015 5:17 PM | Updated on Oct 22 2018 9:16 PM

కోటి మృతికి సోనియా, రాహుల్ సంతాపం - Sakshi

కోటి మృతికి సోనియా, రాహుల్ సంతాపం

ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మునికామ కోటి మృతి పట్ల కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మునికామ కోటి మృతి పట్ల కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు. కోటి కుటుంబ సభ్యులకు వారు సానుభూతి తెలియజేశారు. తిరుపతిలో శనివారం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కోటి.. చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మరణించిన సంగతి తెలిసిందే.

కోటితో పాటు గాయపడ్డ శేషాద్రి ఆరోగ్య పరిస్థితిపై వారిద్దరూ ఆరా తీశారు. ప్రస్తుతం శేషాద్రి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి తెలియజేశారు. కోటి అంత్యక్రియల్లో రఘువీరారెడ్డితో పాటు ఎంపీ కె.చిరంజీవి, మాజీ మంత్రి సి.రామచంద్రయ్య పాల్గొననున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement