రేపు తిరుపతిలో కోటి అంత్యక్రియలు | koti funerals tommorrow at thirupathi | Sakshi
Sakshi News home page

రేపు తిరుపతిలో కోటి అంత్యక్రియలు

Aug 9 2015 5:37 PM | Updated on Mar 23 2019 9:10 PM

రేపు తిరుపతిలో కోటి అంత్యక్రియలు - Sakshi

రేపు తిరుపతిలో కోటి అంత్యక్రియలు

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం ఆత్మబలిదానానికి పాల్పడిన మునికామ కోటి(41)కి అంత్యక్రియలు సోమవారం సాయంత్రం తిరుపతిలో నిర్వహించనున్నారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం ఆత్మబలిదానానికి పాల్పడిన మునికామ కోటి(41) అంత్యక్రియలు సోమవారం సాయంత్రం తిరుపతిలో నిర్వహించనున్నారు. కోటి అంత్యక్రియల్లో ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, ఎంపీ చిరంజీవి, సీ రామచంద్రయ్య, ఇతర కాంగ్రెస్ నేతలు, ప్రజా సంఘాల నేతలు పాల్గొననున్నారు. ఈ నెల 11న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుపతికి వెళ్లి కోటి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ తో రేపు ఢిల్లీలో వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో జరిగే ధర్నాలో వైఎస్ జగన్ పాల్గొంటున్నారు. ఢిల్లీ నుంచి వైఎస్ జగన్ నేరుగా తిరుపతికి వెళ్లనున్నారు.

ఏపీకి ప్రత్యే హోదా ఇవ్వాలంటూ శనివారం తిరుపతిలో మునికామ కోటి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పటించుకున్న సంగతి తెలిసిందే. చెన్నైలో చికిత్స పొందుతూ ఈ రోజు మధ్యాహ్నం మరణించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement