'24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేం' | Muni Kamakoti health condition serious | Sakshi
Sakshi News home page

'24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేం'

Aug 9 2015 9:42 AM | Updated on Mar 23 2019 9:10 PM

మునికామ కోటి(ఫైల్) - Sakshi

మునికామ కోటి(ఫైల్)

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం ఆత్మబలిదానానికి సిద్ధమైన మునికామ కోటి(41) ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం ఆత్మబలిదానానికి సిద్ధమైన మునికామ కోటి(41) ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. తమిళనాడులోని వేలూరు సీఎంసీ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని వైద్యులు  అంటున్నారు. ఈ సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని ఆస్పత్రి డైరెక్టర్ భరద్వాజ తెలిపారు.

50 శాతంపైగా కాలిన గాయాలయిన వారిని సీఎంసీ ఆస్పత్రిలో చేర్చుకోరు. రాజకీయ నాయకుల రికమండేషన్ తో మునికామ కోటిని ఆస్పత్రిలో చేర్చుకుని చికిత్స అందిస్తున్నారు. ఏపీకి ప్రత్యే హోదా ఇవ్వాలంటూ శనివారం తిరుపతిలో మునికామ కోటి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. దాదాపు 95 శాతం శరీరం కాలిపోవడంతో మెరుగైన వైద్యం కోసం నిన్నరాత్రి వేలూరు సీఎంసీ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement