'కోటి మృతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణం' | ysrcp mla rk roja console the munikama koti family members | Sakshi
Sakshi News home page

'కోటి మృతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణం'

Aug 14 2015 11:03 AM | Updated on May 29 2018 2:33 PM

కాంగ్రెస్ పోరుసభలో ప్రత్యేక హోదా కోసం ఆత్మాహుతికి పాల్పడ్డ మునికామ కోటి కుటుంబ సభ్యులను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా శుక్రవారం నివాసానికి వెళ్లి పరామర్శించారు.

తిరుపతి: కాంగ్రెస్ పోరుసభలో ప్రత్యేక హోదా కోసం ఆత్మాహుతికి పాల్పడ్డ మునికామ కోటి కుటుంబ సభ్యులను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా శుక్రవారం నివాసానికి వెళ్లి పరామర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కోటిని బలి తీసుకున్నాయని ఈ సందర్భంగా రోజా మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆమె అన్నారు. తన అవినీతిని బయట పెట్టకుండా ఉండటానికి చంద్రబాబు బీజేపీకి లొంగిపోయారని ఎమ్మెల్యే రోజా ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement