breaking news
muneer
-
భారత్‌కు కొత్త టెన్షన్!.. పాక్‌కు అండగా అమెరికా భారీ ప్లాన్?
వాషింగ్టన్: భారత్, పాకిస్తాన్ విషయంలో అగ్ర రాజ్యం అమెరికా.. మరోసారి తన వక్రబుద్దిని చాటుకుంది. అమెరికాకు భారత్ మిత్ర దేశం అంటూనే.. వెనుక మాత్రం గోతులు తీసే ప్లాన్ చేస్తోంది. ఓవైపు పాక్ ఉగ్రవాదంపై భారత్ ప్రపంచ దేశాలకు వివరాలను వెల్లడిస్తుంటే.. అమెరికా మాత్రం దాయాదికి మద్దతు పలికింది. పాకిస్తాన్‌పై అమెరికా అధికారి ప్రశంసలు కురిపించడం చర్చనీయాంశంగా మారింది.అమెరికా సెంట్రల్ కమాండ్(సెంట్కామ్) కమాండర్ జనరల్ మైఖేల్ కురిల్లా తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పోరాటంలో పాకిస్తాన్ ఓ అసాధారణ భాగస్వామి అంటూ ప్రశంసించారు. ఐసిస్, ఖొరాసన్‌కు వ్యతిరేకంగా సాగుతున్న ఆపరేషన్‌లో పాక్ పాత్రను ఆయన కొనియాడారు. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ పాత్ర గురించి వివరించారు. అందుకే అమెరికా భారత్‌తోపాటు పాకిస్తాన్‌తో సత్సంబంధాలను కలిగి ఉండాలని నొక్కి చెప్పారు. భారత్‌తో అమెరికా సంబంధం ఉన్నంత మాత్రాన పాకిస్తాన్‌తో సంబంధం ఉండకూడదని తాను అనుకోవడం లేదని ప్యానెల్ సభ్యుల ముందు వెల్లడించారు. తమకు భారత్, పాకిస్తాన్ రెండు దేశాలతోనూ సంబంధాలు అవసరమని చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీశాయి."Pakistan has been a phenomenal counter-terrorism partner for America," argues General Michael Kurilla pic.twitter.com/VOzTy8vVli— Shashank Mattoo (@MattooShashank) June 11, 2025కాగా, పహల్గాం ఉగ్ర దాడి అనంతరం పాకిస్తాన్‌ను ఏకాకిని చేసేందుకు భారత్ ప్రపంచ దేశాల మద్దతును కూడగడుతున్న సమయంలో అమెరికా కమాండర్ నుంచి ఈ వ్యాఖ్యలు రావడం భారత్‌ను ఆగ్రహానికి గురి చేసే అవకాశం ఉంది. ఇది దౌత్యపరమైన భంగపాటు అవునో కాదో చెప్పాలని ప్రధాని మోదీని కాంగ్రెస్ ప్రశ్నించింది. అమెరికా తీరు సరికాదంటూ పలువురు మండిపడుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ అలర్ట్ అయినట్టు తెలుస్తోంది."Ties with India cannot cost ties with Pakistan" General Michael Kurilla commander of United States Central Command.Seems the news about Indian Missiles ripping US’s Fissile materials and Nuclear Warhead at Nur Khan Air Base is proving to be True. pic.twitter.com/Ffp7lVdltS— BRADDY (@braddy_Codie05) June 11, 2025అమెరికా భారీ స్కెచ్..ఈ నెల 14న జరిగే తమ దేశ సైన్యం 250వ వార్షికోత్సవానికి హాజరు కావాలని పాక్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అసిమ్ మునీర్‌కు అమెరికా ఆహ్వానం పంపింది. అదే రోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 79వ పుట్టినరోజు కూడా. ఈ నెల 12న మునీర్ వాషింగ్టన్కు చేరుకుంటారని సీఎన్-న్యూస్ 18 తెలిపింది. ఈ సందర్భంగా ఉగ్రవాదుల నిరోధానికి చర్యలు తీసుకోవాలని అమెరికా పాక్‌ను కోరనుంది. అయితే, అమెరికా ఆర్మీ డేకు పాక్ ఛీఫ్‌ను పిలవడం వెనుక అమెరికా ఉద్దేశమేంటనే చర్చ నడుస్తోంది. మొన్నటి వరకు తమ మద్దతు భారత్‌కే అంటూ చెప్పిన అమెరికా ఇప్పుడు ఇలా ప్లేట్ ఫిరాయించడం వెనుక ఉద్దేశం ఏంటో తెలియడం లేదు. అయితే, దీని వెనుక అగ్రరాజ్యం పెద్ద ప్లాన్ వేసిందని చెబుతున్నారు. దీంతో పాటుగా చైనా, పాక్ మధ్య పెరుగుతున్న ఆర్థిక, సైనిక సంబంధాలను కూడా దెబ్బ తీయాలని అమెరికా భావిస్తున్నట్టు తెలుస్తోంది. -
సింగరేణిని కాపాడుకోవాలి!
కేంద్ర ప్రభుత్వం కోల్ సెక్టార్ నుంచి ఒక లక్ష 75 వేల కోట్లు సంపాదించుకోవాలని నిర్ణయం తీసుకున్న నాటి నుంచి 500 బొగ్గు బ్లాక్‌లను దశల వారీగా వేలం వేస్తూ వస్తున్నది. కార్పొరేట్ల చేతుల్లోకి ఇప్పటికే 140కి పైగా బొగ్గు బ్లాకులు వెళ్లిపోయాయి. గత పార్లమెంట్లో 303 సీట్లు ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయాన్నీ అడ్డుకునే పరిస్థితి విపక్షాలకు లేదు. చర్చకు అవకాశమే లేకుండా ఏకపక్ష నిర్ణయాలను కేంద్రం తీసుకొంది.అది ప్రవేశపెట్టిన బిల్లుకు అప్పుడు తెలంగాణ ఎంపీలు అందరూ మద్దతు పలికారు. ఇందులో బొగ్గు బ్లాక్‌ల వేలంతో పాటు కోల్ ఇండియా, దాని అనుబంధ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, షేర్ల అమ్మకం కీలకంగా పేర్కొనవచ్చు. సింగరేణి సంస్థ కోల్ ఇండియాకు అనుబంధం కాని కారణంగా బతికి పోయింది!ప్రభుత్వ రంగంలో పెట్టుబడుల ఉపసంహరణ, అమ్మకం, పెద్ద ఎత్తున సాగుతున్నది. కోల్ ఇండియా అనుబంధ సంస్థ అయిన బీసీసీఎల్ (భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ )లో 25 శాతం పెట్టుబడి ఉపసహరణకు కేంద్రం గతంలోనే నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కోల్ ఇండియా తన 33 శాతం షేర్లను అమ్మేసింది. కేంద్రం నిర్ణయం కారణంగా మరిన్ని షేర్లు ప్రైవేటుపరం కానున్నాయి. ఇదంతా బీసీసీఎల్‌ను అమ్మేసే కుట్రలో భాగమే అనక తప్పదు!మోదీ మూడో సారి ప్రధాని అయ్యాక తాజాగా దేశంలోని 60 బొగ్గు బ్లాక్‌లకు వేలం వేసే ప్రక్రియ మన తెలంగాణలోనే మొదలు పెట్టారు. గత పార్లమెంట్లో ఉన్న మెజారిటీ ఇప్పుడు బీజేపీకి లేకున్నా, మోదీ తన విధానం మాత్రం మార్చుకోలేదనేది కొత్తగా నిర్వహించిన వేలం వల్ల స్పష్టమవుతోంది. గతంలో రామగుండానికి పీఎం నరేంద్ర మోదీ వచ్చినపుడు సింగరేణిని ప్రైవేట్ పరం చేసే ప్రసక్తి లేదని చెప్పి వెళ్ళారు.ఇప్పుడు అదే మాట మన బొగ్గు శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి చెబుతున్నారు. అప్పుడు బొగ్గు బ్లాక్‌ల కేటాయించమని డిమాండ్ చేసినా ఏమీ సమాధానం చెప్పలేదు! ‘రైల్వేతో నాకు చాలా అనుబంధం ఉంది. నేను ఛాయ్ అమ్మాను! నేను రైల్వేను ప్రైవేట్ పరం చేస్తానని కొందరు ప్రచారం చేస్తున్నారు, నేను అలా చేస్తానా?’ అని చెప్పిన పీఎం తర్వాత చేసిన పని ఏమిటో జగమెరిగిన సత్యం! అంతే కాదు అదే పీఎం మోడీ, ‘ప్రభుత్వ రంగం పుట్టిందే చావడానికి’ అని చెప్పిన వీడియోలు ఉన్నాయి. మరి ఏ మాట నమ్మాలి?కేంద్ర, రాష్ట్రాల వాటాలు ఉన్న ఏకైక సంస్థ సింగరేణి. ఇందులో కేంద్రం వాటా 49 శాతం ఉంది. రాష్ట్ర వాటా 51 శాతం ఉంది. గత 20 ఏండ్లకు పైగా లాభాల్లో నడుస్తూ, 2001– 2002 ఆర్థిక సంవత్సరం నుంచి కార్మికులకు, లాభాల్లో వాటా ఇస్తున్నది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రెండు సంవత్సరాలు మిగులు సర్వీస్ ఉన్న నేషనల్ కోల్ వేజ్ అగ్రిమెంట్ (ఎన్సీడబ్ల్యూఏ) పరిధిలోకి వచ్చే ఉద్యోగులు అనారోగ్యం పాలై దరఖాస్తు చేసుకుంటే ఇన్వాలిడేషన్ చేసి, డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇస్తున్న సంస్థ కూడా సింగరేణే కావడం విశేషం!ఈ నేపథ్యంలో కేంద్రం ప్రైవేటీకరణ పాలసీ ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఇలాంటి విధానాల వల్ల కోల్ ఇండియాలో ఒకప్పుడు 8 లక్షల పైచిలుకు ఉన్న కార్మికుల సంఖ్య 3 లక్షలకూ, సింగరేణిలో 1991లో లక్షకు పైగా ఉన్న కార్మికుల సంఖ్య ఇప్పుడు 43 వేలకూ పడిపోయాయి. కోల్ ఇండియా కూడా మంచి లాభాల్లో ఉంది. అయినా పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ బారి నుంచి తప్పించుకోలేని పరిస్థితి ఉంది! కోల్ బ్లాక్‌లను కేటాయించకుండా ఉంటే సింగరేణి నష్టాల్లో పడుతుంది. అప్పుడు దాన్ని కూడా ప్రైవేటీకరణ చేయవచ్చనేది కేంద్రం యోచన కావచ్చు. అందుకే అది బొగ్గు బ్లాక్‌లను కేటాయించడంలేదని చెప్పవచ్చు.ఈ విషయం మీద మన తెలంగాణకు చెందిన కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రధాని మోదీతో మాట్లాడుతామన్నారు. మరో వైపు ‘మా బ్లాకులు మాకు ఇవ్వండి’ అని మన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లిఖిత పూర్వకంగా కోరారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ మేరకు పీఎం మోదీకి లేఖ రాశారు. ఒక వైపు కార్మిక సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. 2015 లోని బొగ్గు బ్లాక్‌ల వేలం చట్టం లోనే, 17 (ఏ) సెక్షన్ ప్రకారం సింగరేణికి బొగ్గు బ్లాక్‌లను వేలంలో పాల్గొనకుండానే కేటాయించవచ్చు! ఆ దిశలో కేంద్రం ముందుకు పోతుందని ఆశిద్దాం! అందరం కలిసి సింగరేణిని కాపాడుకుందాం! ఛలో ఆజ్ నహీ తో కల్ నహీ! తెలంగాణ గోదావరి తీరంలోని బొగ్గు నిక్షేపాల మీద సింగరేణికి హక్కు ఉన్నది! – ఎమ్.డి. మునీర్, సీనియర్ జర్నలిస్ట్, 9951865223. -
ఉగ్రవాది మునీర్‌కు మహిళ సహకారం?
బంగ్లాదేశ్ నుంచి బీహార్ మీదుగా కోలారు జిల్లాలో, ఆ తరువాత రామనగరలో మకాం వేసి నిఘావర్గాలకు దొరికిపోయిన అనుమానిత ఉగ్రవాది మునీర్ షేక్ ఉదంతం ఎన్నో ప్రశ్నలను సంధిస్తోంది. కర్ణాటకలో ఉగ్రవాదుల స్లీపర్ సెల్స్ విస్తరిస్తున్నాయనే అనుమానాలు మునీర్ అరెస్టుతో బలపడుతున్నాయి. ఈ వ్యవహారం విచారణలో మరిన్ని కోణాలు బయటపడే అవకాశముంది. దొడ్డబళ్లాపురం: రామనగర పట్టణంలో ఆదివారంరాత్రి ఎన్ఐఏ, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు స్థానిక పోలీసుల సహకారంతో అరెస్టుచేసిన అనుమానిత ఉగ్రవాది మునీర్ గురించి విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. మునీర్ బంగ్లాదేశ్ వాసి అని, భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించాడని తెలుస్తోంది. మునీర్‌కు ఆధార్ కార్డు కూడా ఉండడం విశేషం. ఇది బీహార్‌లో తీసుకున్నాడా?, లేక కర్ణాటకలోనా? అన్నది వెల్లడికాలేదు. రామనగరలో ఇల్లు అద్దెకు ఇచ్చే సమయంలో ఇంటి యజమాని రఫీక్‌ఖాన్... మునీర్ నుండి ఆధార్‌కార్డ్ తీసుకున్నాడు, అయితే ఇటీవలే రైలు టికెట్ బుక్ చేయాలని సాకు చెప్పి మునీర్ ఆధార్‌కార్డు వెనక్కు తీసుకున్నాడట. రూ.50వేలు అడ్వాన్స్ అడగ్గా సగమే ఇవ్వడంతో ఇంటి యజమాని మునీర్‌కు అగ్రిమెంట్ చేసి ఇవ్వలేదు. ఖాన్‌కు మునీర్‌ను పరిచయం చేసింది ఒక మహిళని తేలింది. ఇప్పుడు ఆ మహిళ గురించి ఐబీ అధికారులు సీరియస్‌గా విచారణచేస్తున్నారు. మునీర్‌కు ఆమెకు సంబంధమేంటి? అది ఎటువంటి సంబంధం? ఆమెకు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయా? అనే కోణాల్లో తనిఖీ చేస్తున్నారు. మునీర్ కోసం అనేక రోజుల నుండి ఐబీ అధికారులు గాలిస్తున్నారు. చివరకు రామనగరలో తలదాచుకున్నట్టు తేలడంతో దాడి జరిపి అరెస్టు చేశారు. జేఎంబీ, ఐఎంలతో సంబంధాలు బీహార్‌లోని జమాపూర్ జిల్లా షక్రువిటా గ్రామవాసిగా చెప్పుకునే బుర్హాన్ అలియాస్ బంగ్లాదేశ్‌లోని మునీర్ షేక్ జమాతుల్ ముజాహిదీన్ (జేఎంబీ), ఇండియన్ ముజాహిద్దీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థల్లో సభ్యుడు. బీహార్‌లో పోలీస్ కస్టడీలో ఉండగా పోలీసుల పై దాడిచేసి పరారయ్యాడు. బీహార్‌లోని పాట్నా జిల్లా బోధ్ గయాలో 2013లో జరిగిన వరుస పేలుళ్లకు, పశ్చిమ బెంగాల్‌లోని బర్ధమాన్‌లో 2014లో జరిగిన బాంబు పేలుడుకు ఐఈడీ బాంబులు తయారుచేసి ఇచ్చింది మునీర్‌గా తెలిసింది. తొలుత కోలారు జిల్లాలో మకాం బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్‌లోకి వచ్చి బీహార్‌లో మకాం వేశాడు. బోధ్ గయా, బర్ధమాన్ బాంబ్ పేలుళ్ల తరువాత కోలారు జిల్లా మాలూరుకు మకాం మార్చాడు. అక్కడొక ప్రైవేటు కంపెనీలో హెల్పర్‌గా పనిచేసి అనంతరం రెండునెలల క్రితం రామనగరకు వచ్చాడు. మునీర్ చుట్టుపక్కల వారితో మాట్లాడేవాడు కాదు. సైకిల్‌పై ఊరూరూ తిరుగుతూ బట్టలు అమ్మేవాడు. ఉదయం 8 గంటలకు ఇల్లువదిలితే సాయంత్రం తిరిగి వచ్చేవాడు. అతని ఇంటికి ఎవ్వరూ బంధుమిత్రులు వచ్చేవారు కాదని ఇంటి యజమాని రఫీక్ చెబుతున్నాడు. మునీర్ భార్య, 3 ఏళ్ల కొడుకు, ఏడాది వయసున్న కూతురుతో నివసిస్తున్నాడు. బాడుగ ఇళ్ల బ్రోకర్‌గా భావిస్తున్న మహిళతో మునీర్ మొదట ఒక్కడే వచ్చి ఇల్లు చూశాడు. ఫ్యామిలీకి మాత్రమే ఇల్లు ఇస్తామనడంతో భార్యాపిల్లలను తీసుకొచ్చాడు. మునీర్ ఇంట్లో ఐబీ అధికారులు ఇండియా, కర్ణాటక మ్యాప్‌లు, ప్రముఖ పర్యాటక స్థలాల వివరాలు, రెండు ల్యాప్‌టాప్‌లు, జిలెటిన్ బాక్స్ స్వాధీనం చేసుకున్నారు. -
క్రైం సీరియల్ చూసి.. దారుణం!
టీవీలలో వచ్చే క్రైం సీరియళ్లు యువత మీద దారుణమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. హైదరాబాద్ పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన ఓ యువకుడు.. తమ పక్కింట్లో ఉండే బాలుడిని నమాజ్‌కు వెళ్తుండగా కిడ్నాప్ చేసి అతడిని హతమార్చాడు. దాదాపు రెండు వారాల క్రితం జరిగిన ఈ ఘటనలో ఆధారాలు తాజాగా బయటపడ్డాయి. చాంద్రాయణగుట్టకు చెందిన ఉరూజుద్దీన్ అనే బాలుడు ఏప్రిల్ 22వ తేదీ ఉదయం ఇంట్లోంచి వెళ్లి, రాత్రయినా తిరిగి రాలేదు. దాంతో అతడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికంగా విచారించినప్పుడు చివరిసారిగా తాము పక్కింట్లో ఉండే మునీర్‌తో అతడిని చూశామని చెప్పారు. దాంతో అతడిని అదుపులోకి తీసుకోగా.. అతడి కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. తమ రెండు కుటుంబాలు చాలా సన్నిహితంగా ఉంటాయని, అలాంటప్పుడు తమవాడి మీద ఎందుకు అనుమానించి తమను వేధిస్తారని తిరగబడ్డారు. దాంతో పోలీసులు కాస్త నెమ్మదించారు. కానీ ఈలోపు మునీర్ ముంబై పారిపోయేందుకు ప్రయత్నించగా, అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో మళ్లీ విచారించారు. దాంతో అసలు విషయం తెలిసింది. ఆరోజు నమాజ్‌కు వెళ్తున్న ఉరూజుద్దీన్‌ను తానే కిడ్నాప్ చేశానని, అయితే కిడ్నాప్ చేసిన తర్వాత ఏం చేయాలో తెలియక గొంతు నులిమి చంపేశానని అంగీకరించాడు. అతడు పారిపోయేందుకు ప్రయత్నించినా వెంటపడి మరీ తీసుకెళ్లాడు. మృతదేహాన్ని ఓ మురికి కాల్వలో పడేసినట్లు చెప్పాడు. సీసీటీవీ ఫుటేజిలో కూడా ఉరూజుద్దీన్‌ను మునీరే తీసుకెళ్లినట్లు స్పష్టంగా రికార్డయింది. దాంతో పోలీసులు మునీర్‌ను అదుపులోకి తీసుకున్నారు. తాను క్రైం సీరియళ్లు ఎక్కువగా చూస్తానని, అందుకే ఈ ఆలోచన వచ్చిందని పోలీసులకు మునీర్ చెప్పాడు.