breaking news
mullapudi vara
-
బాపు కదిలి వచ్చినట్లనిపించింది!
తెలుగు వారి హృదయాల్లో చెరిగిపోని సంతకం చేసిన మహనీయలు బాపు, రమణ. బాపు దర్శకత్వంతో మాయ చేస్తే, రమణ తన కలంతో పదునైన సంభాషణలు పలికించేవారు. వీరిద్దరి కాంబినేషన్ ఒక అద్భుతం అని చెప్పచ్చు. ఇప్పుడు వారి కుటుంబం నుంచే ఓ సినిమా రాబోతోంది. ఎస్.ఎల్.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ముళ్లపూడి వెంకటరమణ తనయుడు వరా ముళ్లపూడి దర్శకత్వంలో జి. అనిల్‌కుమార్‌రాజు, జి.వంశీకృష్ణ నిర్మిస్తున్న చిత్రం ‘కుందనపు బొమ్మ’. చాందిని చౌదరి కథానాయిక. కీరవాణి సంగీతం అందించారు. ఈ సినిమా ట్రైలర్, ఫస్ట్ లుక్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా కీరవాణి మాట్లాడుతూ -‘‘ఒక అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు ప్రేమిస్తారు. చివరికి ఆ అమ్మాయి ఎవరిని ప్రేమించింది అనేదే కథ’’ అని చెప్పారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ -‘‘బాపు, రమణలు నాకు ఆత్మీయులు. ఈ టైటిల్ వింటుంటే నాకు బాపుగారు కదిలి వచ్చినట్టుంది’’ అని అన్నారు. ‘‘రాఘవేంద్రరావుగారికి 43 కథలు చెప్పాం. ఆయనకు ఏదీ నచ్చలేదు. నేను చెప్పిన 44వ కథ ఇది. పల్లెటూరి నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథా చిత్రం’’ అని వరా ముళ్లపూడి చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: అనురాధ ఉమర్జీ, గౌతమ్ కశ్యప్, కథా విస్తరణ,స్క్రీన్‌ప్లే: కె.కె.వంశీ, శివ తాళ్లూరి, కెమెరా: ఎస్.డి. జాన్. -
దేవుడున్నాడని...!
మనీష్, యామిని జంటగా ఓ చిత్రం రూపొందుతోంది. ముళ్లపూడి వరతో కలిసి వి.వి.వరాంజనేయులు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రం సోమవారం మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి నటి జయలలిత కెమెరా స్విచాన్ చేయగా, నిర్మాత అశోక్‌కుమార్ క్లాప్ ఇచ్చారు. ‘‘దేవుడు ఉన్నాడని కొందరు, లేడని కొందరు వాదిస్తుంటారు. నా అనుభవాలను బట్టి దేవుడున్నాడని నమ్ముతాను. దేవుడి విషయంలో నాకు ఎదురైన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిస్తున్నా. మణిశర్మ ఈ చిత్రానికి స్వరాలందించడం పెద్ద ఎస్సెట్. ఇందులో చక్కని ప్రేమకథ కూడా ఉంటుంది. అరకు, తలకోన ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తాం’’ అని వరాంజనేయులు చెప్పారు. వరాంజనేయులు చక్కని కథ తయారు చేశాడని ముళ్లపూడి వర అన్నారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులు మాట్లాడారు. వి2 క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతోంది.