బాపు కదిలి వచ్చినట్లనిపించింది! | Mullapudi Vara Back with Kundanapu Bomma Movie | Sakshi
Sakshi News home page

బాపు కదిలి వచ్చినట్లనిపించింది!

Apr 26 2015 10:51 PM | Updated on Sep 3 2017 12:56 AM

బాపు కదిలి వచ్చినట్లనిపించింది!

బాపు కదిలి వచ్చినట్లనిపించింది!

తెలుగు వారి హృదయాల్లో చెరిగిపోని సంతకం చేసిన మహనీయలు బాపు, రమణ. బాపు దర్శకత్వంతో

తెలుగు వారి హృదయాల్లో చెరిగిపోని సంతకం చేసిన మహనీయలు బాపు, రమణ. బాపు దర్శకత్వంతో మాయ చేస్తే, రమణ తన కలంతో పదునైన సంభాషణలు పలికించేవారు. వీరిద్దరి కాంబినేషన్ ఒక అద్భుతం అని చెప్పచ్చు. ఇప్పుడు వారి కుటుంబం నుంచే ఓ సినిమా రాబోతోంది. ఎస్.ఎల్.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ముళ్లపూడి వెంకటరమణ తనయుడు వరా ముళ్లపూడి దర్శకత్వంలో జి. అనిల్‌కుమార్‌రాజు, జి.వంశీకృష్ణ నిర్మిస్తున్న చిత్రం ‘కుందనపు బొమ్మ’.
 
 చాందిని చౌదరి కథానాయిక. కీరవాణి సంగీతం అందించారు. ఈ సినిమా ట్రైలర్, ఫస్ట్ లుక్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా కీరవాణి మాట్లాడుతూ -‘‘ఒక అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు ప్రేమిస్తారు. చివరికి ఆ అమ్మాయి ఎవరిని ప్రేమించింది అనేదే కథ’’ అని చెప్పారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ -‘‘బాపు, రమణలు నాకు ఆత్మీయులు. ఈ టైటిల్ వింటుంటే నాకు బాపుగారు కదిలి వచ్చినట్టుంది’’ అని అన్నారు. ‘‘రాఘవేంద్రరావుగారికి 43 కథలు చెప్పాం. ఆయనకు ఏదీ నచ్చలేదు. నేను చెప్పిన 44వ కథ ఇది. పల్లెటూరి నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథా చిత్రం’’ అని వరా ముళ్లపూడి చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: అనురాధ ఉమర్జీ, గౌతమ్ కశ్యప్, కథా విస్తరణ,స్క్రీన్‌ప్లే: కె.కె.వంశీ, శివ తాళ్లూరి, కెమెరా: ఎస్.డి. జాన్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement