breaking news
MPTC & ward member elections
-
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సుప్రీంకోర్టు ఆదేశాలు కచ్చితంగా పాటించాలి
సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘా, వెబ్ క్యాస్టింగ్, అభ్యర్థులకు, పోలింగ్ కేంద్రాలకు తగిన భద్రత ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ ఎన్నికల కమిషన్‌ను కోరింది. అలాగే పోలింగ్ వేళ వైఎస్సార్సీపీ నేతల అక్రమ అరెస్టులు, గృహ నిర్బంధాలు అడ్డుకోవాలని విజ్ఞప్తి చేసింది. దీంతో పాటు మున్సిపల్ ఎన్నికల సీసీటీవీ ఫుటేజ్, బ్యాలెట్ పత్రాల్ని నిబంధనల ప్రకారం భద్రపరచాలని కూడా కోరింది. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఎస్ఈసీకి వేర్వేరు లేఖలు రాశారు. సుప్రీం ఆదేశాలు పాటించాలిఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్ సమయంలో అయినా సుప్రీంకోర్టు ఆదేశాలను కచ్చితంగా అమలు చేసి ప్రతి పోలింగ్ కేంద్రం లోపల, చుట్టుపక్కల సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని, లేదా వీడియో కెమెరాలతో రికార్డు చేయాలని వైఎస్సార్సీపీ ఎస్ఈసీకి రాసిన ఓ లేఖలో కోరింది. ముఖ్యంగా అత్యంత సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ, విద్యుత్ సరఫరా, బ్యాకప్‌తో ప్రత్యక్ష వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేయాలని తెలిపింది. 1న జరిగిన మున్సిపల్ ఎన్నికల సమయంలో నిఘా, భద్రత ఏర్పాట్లలో జరిగిన వైఫల్యాలపై తక్షణ విచారణ జరిపి, బాధ్యులైన అధికారులను గుర్తించి, తీసుకున్న చర్యలతో నివేదిక సమర్పించాలని కోరింది.వైఎస్సార్సీపీ నేతల అక్రమ నిర్బంధాలను అడ్డుకోవాలిఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్‌కు ముందు వైఎస్సార్సీపీ నాయకుల అక్రమ అరెస్టులు, గృహ నిర్బంధాలు, పోలీసుల బెదిరింపులను తక్షణమే అరికట్టాలని ఎస్ఈసీని కోరింది. వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం లింగాల మండలంలో వైఎస్సార్సీపీ వారిని పోలీసులు అరెస్టు చేసి, బైండోవర్, ఇతర కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, వీటిపై స్థానిక ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ప్రశ్నిస్తే వదిలేస్తామని చెప్పి, ఇంకా నిర్బంధంలోనే ఉంచారని తెలిపింది.. కడప జిల్లా వేల్పులలో అక్రమాల్ని అడ్డుకోవాలివైఎస్సార్ కడప జిల్లా వేముల మండలంలోని 156, 157 పోలింగ్ కేంద్రాలు ఉన్న ఎంపీపీ యూపీ పాఠశాల చుట్టూ రాళ్ల కుప్పలు పోయడం, వైఎస్సార్సీపీ మండల పరిశీలకుడు ఎల్.రామలింగారెడ్డికి ప్రాణహాని ఉన్న నేపథ్యంలో ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలని మరో లేఖలో ఎస్ఈసీని వైఎస్సార్సీపీ కోరింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్ రోజున కాకినాడ జిల్లా తొండంగి మండలంలో అధికార పార్టీ వారు బూత్ ఆక్రమణలు, రిగ్గింగ్‌కు పాల్పడే అవకాశం ఉన్నందున అక్కడ తగిన పోలీసు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేసింది.మున్సిపల్ ఎన్నికల సీసీ టీవీ ఫుటేజ్, బ్యాలెట్ పత్రాలు భద్రపరచాలికోర్టుల్లో తాము ఎన్నికల పిటిషన్లు వేసేందుకు వీలుగా అన్ని పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌లు, ఓట్ల లెక్కింపు కేంద్రాల సీసీ టీవీ ఫుటేజిలు, వీడియో, వెబ్‌కాస్టింగ్ రికార్డులను ఒరిజినల్, డిజిటల్ రికార్డులు, బ్యాకప్‌లతో సహా భద్రపరచాలని కోరింది. ఆధారాలు మార్చకుండా, ధ్వంసం చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరింది. కర్నూలు 23వ వార్డులో రీకౌంటింగ్ నిర్వహించాలి దీంతో పాటు కర్నూలు కార్పొరేషన్ 23వ వార్డు ఫలితాల ప్రకటనలో వ్యత్యాసం నేపథ్యంలో ఓట్ల రీకౌంటింగ్‌కు ఆదేశించాలని ఎస్ఈసీని వైఎస్సార్సీపీ కోరింది. -
ఓటెత్తకుండా మళ్లీ దండెత్తిన పోలీస్
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: మున్సిపల్ ఎన్నికల మాదిరిగానే పరిషత్ ఎన్నికల్లోనూ ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) ఆదేశాలతో కొందరు పోలీసులు పేట్రేగిపోతున్నారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటెయ్యకుండా మళ్లీ ఉక్కుపాదం మోపుతున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా జరిపించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన పోలీసులే వెన్నుపోటు పార్టీకి వెన్నుదన్నుగా నిలిచి ప్రతిపక్ష వైస్సార్సీపీ శ్రేణులను కట్టడి చేసే చర్యలకు దిగారు. గురువారం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బుధవారం నుంచి రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ నేతల గృహ నిర్బంధాలు, అక్రమ అరెస్టులు, బెదిరింపులు, నిర్బంధాలను పోలీసులు తీవ్రతరం చేశారు. నామినేషన్ల ముందు నుంచే బైండోవర్లు, నామినేషన్లు అడ్డుకోవడం, ప్రచారం నిలిపి వేయడం, బలవంతపు ఉపసంహరణల వరకు పోలీసుల వ్యవహార శైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో స్వేచ్ఛాయుత ఎన్నికలను నిర్వహించాలని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ పదే పదే విజ్ఞప్తి చేసినా అటు రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎస్ఈసీ), ఇటు పోలీస్ వ్యవస్థ ‘పచ్చ’పాత ధోరణిని ఏ మాత్రం మార్చుకోవడం లేదు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో అదనపు భద్రత, కేంద్ర బలగాలు, వెబ్ కాస్టింగ్, సీసీ టీవీ నిఘా కల్పించాలని వైఎస్సార్సీపీ ప్రత్యేకంగా కోరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రత్యర్థి పార్టీకి పోటీ చేసే అవకాశం లేకుండా చేసి, ఓటు వేయకుండా ప్రజలను అడ్డుకుని అధికార పక్షమే అంతా సెలక్షన్.. ఎలక్షన్ చేసుకునేలా పోలీస్ యంత్రాంగం సహకరిస్తోందనే ఆరోపణలు మిన్నంటుతున్నాయి. అయినా పోలీసుల తీరు షరా మామూలే. అక్రమ అరెస్టులపై సీఐ శాంతిలాల్తో చర్చిస్తున్న ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మున్సి‘పోల్స్’ మాదిరిగానే ఇప్పుడూ పన్నాగం తొలుత జరిగిన మున్సిపల్ ఎన్నికల మాదిరిగానే పరిషత్ ఎన్నికల్లోనూ పోలీస్ మార్కు పచ్చపాతం పెచ్చుమీరింది. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌లో కూడా ప్రతిపక్ష అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లను అడ్డుకున్న పోలీసులు.. ఇప్పుడు పరిషత్ ఎన్నికల్లోనూ ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు, నాయకులకు అడ్డంకులు కల్పించేందుకు రంగంలోకి దిగారు. ఎన్నికలు సజావుగా నిర్వహించే పేరుతో పెద్ద ఎత్తున మోహరించిన పోలీస్ బందోబస్తును ప్రతిపక్ష పార్టీపై నిర్బంధానికి ఉపయోగిస్తున్నారు. డీఐజీ కోయ ప్రవీణ్ ఆదేశాలతో అక్రమ అరెస్టులు పరిషత్ ఎన్నికల నేపథ్యంలో కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ పచ్చ పార్టీ సేవకు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో వైఎస్సార్ కడప జిల్లా లింగాల మండలంలో పలువురు వైఎస్సార్సీపీ నాయకులను బుధవారం నుంచి ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. బైండోవర్ కేసులు, ఇతర అక్రమ కేసులు పెడుతున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థులు, ఏజెంట్లను అడ్డుకుని, పోలింగ్ బూత్‌లను ఆక్రమించి రిగ్గింగ్ చేసుకునేలా పచ్చ గూండాలకు పోలీసులే ముందుండి మార్గాన్ని సుగమం చేస్తున్నారని స్పష్టమవుతోంది. గురజాల మాజీ ఎమ్మెల్యే హౌస్ అరెస్టు పల్నాడు జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ముందు నుంచే పేట్రేగిపోతున్న పోలీసులు పరిషత్ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్సీపీ శ్రేణులపై నిర్బంధాన్ని కొనసాగిస్తున్నారు. గురజాల మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత కాసు మహేష్ రెడ్డిని బుధవారం నరసరావుపేటలో హౌస్ అరెస్టు చేశారు. గురువారం జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు గురజాల వెళ్లకూడదని నిర్బంధించారు. కీలక ఎన్నికల వేళ పోలీసులు ఇలా ఏకపక్షంగా అడ్డుకోవడం సరికాదని మహేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా సరే అనుమతించేది లేదని, ఎన్నికలు ముగిసే వరకు గృహ నిర్బంధంలోనే ఉంచుతామని పోలీసులు మొండికేశారు. గురజాలలో వైఎస్సార్సీపీ నాయకుడు కొమ్మినేని వెంకటేశ్వర్లును సైతం పోలీసులు అక్రమ అరెస్టు చేశారు. నరసరావుపేటలో కాసు మహేష్‌రెడ్డిని నిలువరిస్తున్న పోలీసులు వైఎస్సార్సీపీ ఏజెంట్లు రాకూడదని హెచ్చరిక కర్నూలు జిల్లాలో పలు చోట్ల వైఎస్సార్సీపీ ఏజెంట్లపై పోలీసులే బెదిరింపులకు దిగారు. వైఎస్సార్సీపీ తరఫున ఏజెంట్లు ఎవరూ పోలింగ్ కేంద్రాల్లో కూర్చోవద్దంటూ హుకుం జారీ చేశారు. పోలింగ్ కేంద్రాల్లో వైఎస్సార్సీపీ ఏజెంట్లుగా కూర్చుంటే పీడీ యాక్ట్ పెడతామని బెదిరింపులకు దిగారు. గురువారం ఉదయం పోలింగ్ సమయానికి పోలీస్ స్టేషన్ వద్దకు రావాలని ఆంక్షలు విధించారు. కర్నూలు జిల్లా క్రిష్ణగిరిలో పోలీసుల బెదిరింపులపై మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల ఏకపక్ష వైఖరిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. క్రిష్ణగిరి జెడ్పీటీసీ బరిలో టీడీపీ గుర్తు కూడా లేనప్పటికీ, వైఎస్సార్సీపీ అభ్యర్థికి వ్యతిరేకంగా పోలీసులు పని చేయడం దుర్మార్గమని ఆమె మండిపడ్డారు. వైఎస్సార్ జిల్లాలో రిగ్గింగ్‌కు సిద్ధం మున్సిపల్ ఎన్నికల మాదిరిగానే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ అరాచకాలకు అ«ధికార టీడీపీ తెరలేపింది. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్ జిల్లాలో పెద్ద ఎత్తున రిగ్గింగ్‌కు పాల్పడేందుకు పచ్చమూకలు సిద్ధమయ్యాయి. పులివెందుల నియోజకవర్గంలో లింగాల, పులివెందుల, వేముల, వేంపల్లిలో వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులకు వెన్నుపోటు పార్టీ నేతలు పక్కా పథకం వేశారు. వేముల మండలంలో పోలింగ్ కేంద్రాల వద్ద వైఎస్సార్సీపీ నాయకులు, ఏజెంట్లపై దాడులకు పాల్పడేందుకు రాళ్లు, కర్రలు సిద్ధం చేసుకున్నారు. ఉదయాన్నే పోలింగ్ బూత్‌లను ఆక్రమించుకునేందుకు కిరాయి మూకలను రప్పించి సిద్ధం చేశారు. పులివెందులలో దాడికి టీడీపీ రౌడీలు సిద్ధంచేసిన రాళ్లుకాగా, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా బండారులంకలో ఓటర్ స్లిప్పుల పంపిణీపై రభస జరిగింది. అధికారులు పంపిణీ చేయాల్సిన ఓటర్ స్లిప్పులను టీడీపీ కార్యకర్తలు పంపిణీ చేయడంపై వైఎస్సార్సీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై స్థానిక పంచాయతీ కార్యదర్శి సమర్థించుకోవడంపై వైఎస్సార్సీపీ నేతలు ఎన్నికల అధికారి(ఆర్వో)కి ఫిర్యాదు చేశారు. దువ్వూరు మండలం చల్లబసాయపల్లె ఎంపీటీసీ ఎన్నిక నేపథ్యంలో పుల్లారెడ్డి పేట గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నేత ఇరగంరెడ్డి తిరుపాల్రెడ్డితోపాటు ఇరగంరెడ్డి పద్మనాభరెడ్డి, వీరారెడ్డి, శ్రీనివాసుల రెడ్డి, పోతులూరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లింగాల మండలం కోమన్నూతల గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకులను రూరల్ సీఐ శాంతిలాల్ అదుపులోకి తీసుకోవడంతో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి లింగాల పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. అక్రమ అరెస్టులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోటీ నుంచి తప్పుకోకపోతే ప్రాణాలు దక్కవు.. అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి అరాచకాలు పెచ్చుమీరాయి. మునిసిపల్ ఎన్నికల్లో గూండాగిరి ప్రదర్శించిన ఆయన.. ఇప్పుడు పరిషత్ ఎన్నికల సందర్భంగా శింగనమల నియోజకవర్గంలో అదే రీతిలో తీవ్ర భయాందోళనలు సృష్టిస్తున్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులను నేరుగా బెదిరిస్తున్నారు. గ్రామాల్లో టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టి విధ్వంసాలకు కారణమవుతున్నారు. ఈ క్రమంలో యల్లనూరు, పుట్లూరు మండలాల్లో ఊరూరా తిరుగుతూ.. ‘పోటీ నుంచి తప్పుకోకపోతే ప్రాణాలు దక్కవు.. పోటీలో ఉంటారా? ప్రాణాలతో ఉంటారా?’అంటూ బహిరంగ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పోలింగ్ రోజున ఓటర్లు బయటకు రాకూడదని, తామే వేసుకుంటామని జేసీ వర్గీయులు హెచ్చరిస్తున్నారు. తమ మాట వినకపోతే పోలీసుల ద్వారా అక్రమ కేసులు పెట్టిస్తామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. పోలీసుల బెదిరింపులపై సీఐతో మాట్లాడుత్ను కంగాటి శ్రీదేవి రైల్వేకోడూరు నియోజకవర్గంలో 105 మందికి నోటీసులు తిరుపతి జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో పోలీసులు వైఎస్సార్సీపీ ప్రధాన నాయకులే లక్ష్యంగా నోటీసులు జారీచేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరికీ నోటీసులు ఇవ్వకుండా కేవలం వైఎస్సార్సీపీ నేతలకు మాత్రమే నోటీసులు ఇవ్వడం ఏమిటని వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. రైల్వేకోడూరులో మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులుకు, మాజీ వైస్ ఎంపీపీ రామిరెడ్డి రాజారెడ్డికి, పట్టణ కన్వినర్ సీహెచ్ రమేష్ సహా మొత్తం 40 మందికి నోటీసులు జారీచేశారు. పెనగలూరు మండలంలో రాష్ట్ర మాజీ స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ కొండూరు అజయ్‌రెడ్డి సోదరులకు, ఇతరులకు మొత్తం 25 మందికి నోటీసులు ఇచ్చారు. పుల్లంపేట మండలంలో మాజీ ఎంపీపీ ముద్దా బాబుల్ రెడ్డి వర్గీయులు10 మందికి, ఓబులవారిపల్లి మండలంలో పార్టీ మండల అధ్యక్షుడు వత్తలూరు సాయికిషోర్ రెడ్డి, మరో 30 మందికి నోటీసులు జారీ చేశారు. చిట్వేలి మండలంలో పది మందికి నోటీసులు ఇచ్చారు. వ్యవస్థలు సహకరించక పోటీ నుంచి విరమణ నామినేషన్ వేసినప్పుటి నుంచి వేధింపులు, బెదిరింపులు ఎక్కువైనందున తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు వైఎస్సార్సీపీ మైదుకూరు జెడ్పీటీసీ అభ్యర్థి నేట్లపల్లె శివరాం పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఆయన సెల్ఫీ వీడియో విడుదల చేశారు. పార్టీ ఆదేశాలతో జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసిన తాను ప్రజాస్వామ్య పద్ధతిలో గెలిచి, ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని ఎంతో ఆశపడ్డానని తెలిపారు. అయితే వ్యవస్థలు సహకరించడం లేదని, అధికార పార్టీ.. పోలీసులు కలిసి అప్రజాస్వామ్య పద్ధతిలో గురువారం పోలింగ్ జరుపుకునేందుకు సిద్ధమైందన్నారు. అధికారులు, వ్యవస్థలు సహకరించని ఈ పరిస్థితుల్లో తాను పోటీ నుంచి తప్పుకోవాల్సి వస్తోందని తెలిపారు. అన్ని చోట్లా అరాచకాలు » తిరుపతి జిల్లా పెళ్లకూరు మిట్ట ప్రాంతంలో గురువారం జరగనున్న ప్రాదేశిక ఎన్నికలకు సంబంధించి 35వ పోలింగ్ బూత్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏజెంట్ వెంకయ్య ఏజెంట్ ఫారాలు రిటర్నింగ్ అధికారికి ఇచ్చేందుకు బుధవారం రాత్రి వెళుతుండగా అదే ప్రాంతానికి చెందిన టీడీపీ కార్యకర్త కార్తిక్ ఆ ఫారాలు లాక్కొని చించివేశాడు. » నంద్యాల జిల్లా ముచ్చుమర్రి ఎస్ఐ నరేంద్ర వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను టార్గెట్ చేశారు. బుధవారం ఉదయం పడమర ప్రాతకోట గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు గుజ్జుల స్వాములు, అమీర్‌బాషా, బెస్త కురుమన్న, అలీబాషా, నబిసాహెబ్, రామకృష్ణలను స్టేషన్‌కు పిలుచుకెళ్లారు. సాయంత్రం లక్ష్మాపురానికి చెందిన పలువురిని బైండోవర్ చేశారు. » కర్నూలు జిల్లా కృష్ణగిరి జెడ్పీటీసీకి సంబంధించి వైఎస్సార్సీపీ అభ్యర్థి మాధవరావుతోపాటు మరో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో ఒక స్వతంత్య్ర అభ్యర్థి మర్రి శ్రీరాములును గెలిపించేందుకు టీడీపీ అడ్డదారులు తొక్కుతోంది. పోలీసులను అడ్డుపెట్టుకుని వైఎస్సార్సీపీ నేతలను వేధిస్తున్నారు. ఈ క్రమంలో పలు గ్రామాల నుంచి దాదాపు 40 మందికిపైగా వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు పిలిపించారు. పోలింగ్ రోజు ఉదయమే స్టేషన్‌కు రాకపోతే కేసులు నమోదు చేస్తామని వెల్దుర్తి సీఐ యుగంధర్ హెచ్చరించారు. » అన్నమయ్య జిల్లా కలికిరి మండలంలో గురువారం వైఎస్సార్సీపీ నేతలెవ్వరూ కనిపించకూడదని సీఐ సాయి ప్రసాద్ హుకుం జారీ చేశారు. సీఐ బెదిరింపులపై వైఎస్సార్సీపీ నాయకులు జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అయినా ఎలాంటి చర్యలు లేవు. మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి కుమారుడిపై కత్తులతో దాడిఆళ్లగడ్డ/పట్నంబజారు: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో అధికార పార్టీ పచ్చ రౌడీలు మరోసారి బీభత్సం సృష్టించారు. పురపాలక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఛైర్పర్సన్ అభ్యర్థిగా పోటీ చేసిన షరీఫా బి కుమారుడు, పార్టీ నేత సాధిక్‌పై హత్యాయత్నం చేశారు. పట్టణానికి చెందిన ఏఎన్ఆర్ చికెన్ సెంటర్ నిర్వాహుకుడు హుస్సేన్‌బాషా భార్య షరిఫా బి ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్పర్సన్ స్థానానికి వైఎస్సార్సీపీ తరఫున పోటీలో నిలబడ్డారు. ఇది మనుసులో పెట్టుకున్న టీడీపీ నాయకులు ఎలాగైనా ఆమె కుమారుడిని మట్టుబెట్టాలని కుట్ర పన్నారు. కత్తులతో దాడి చేశారు. సాధిక్‌ను చికిత్స కోసం నంద్యాల వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదైంది. అలాగే, గుంటూరు నగరంలోని నల్లచెరువు ప్రాంతానికి చెందిన వైఎస్సార్సీపీ బీసీ విభాగం నగర అధ్యక్షుడు పల్లపు మహేష్, అతని సోదరి ప్రసన్నలక్ష్మి కార్పొరేటర్లుగా పోటీ చేయడం గిట్టని టీడీపీ వాళ్లు బుధవారం మహేష్ పై విచక్షణరహితంగా రాడ్లతో దాడి చేశారు. -
నేడు ‘పరిషత్’ పోరు
సాక్షి, అమరావతి/ఎమ్మిగనూరు టౌన్: రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు యథాతథంగా కొనసాగుతాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) బుధవారం ప్రకటించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్రపునేఠ పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, మురసు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారని.. కొన్ని ప్రాంతాలు మినహా పోలింగ్ నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు లేవని కలెక్టర్లు నివేదించినట్టు ఎస్ఈసీ వెల్లడించింది. కలెక్టర్ల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తూ ఎక్కడైనా ఎన్నికల నిర్వహణకు ఇబ్బందులు ఎదురైతే క్షేత్రస్థాయి అధికారుల నుంచి వాస్తవ పరిస్థితులపై సమగ్ర నివేదికలు తెప్పించుకుని, వాటి ఆధారంగా తగిన నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేసింది. వర్షాల కారణంగా గుంటూరు జిల్లా పెదనందిపాడు, కాకుమాను, ఫిరంగపురం మండలాల్లో ఎన్నిక వాయిదా వేస్తున్నట్టు ఆ జిల్లా కలెక్టర్లు బుధవారం ఉదయం ప్రకటించినా.. గంటన్నర అనంతరం తిరిగి అక్కడ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఉదయం 7 గంటలకే పోలింగ్ మొదలు ఏకగ్రీవాల అనంతరం 28 జిల్లాల పరిధిలో 582 జెడ్పీటీసీ స్థానాలు, 7,767 ఎంపీటీసీ స్థానాలకు గురువారం ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఎస్ఈసీ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 659 మండలాల్లో జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ కాగా, 77 మండలాల్లో ఎన్నిక ఏకగ్రీవం కావడంతో మిగిలిన 582 మండలాల్లో 2,169 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. 9,821 ఎంపీటీసీ స్థానాలకు గాను 2,051 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కాగా.. మూడుచోట్ల ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. మిగిలిన 7,767 ఎంపీటీసీ స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది. ఆయా ఎంపీటీసీ స్థానాల్లో 18,843 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు కలిపి మొత్తం 20,966 మంది పోటీ పడుతున్నారు. మొత్తంగా 31,460 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేయగా.. 2,61,52,377 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. 16,064 సమస్యాత్మక ప్రాంతాలు.. 15,396 చోట్లే సీసీ కెమెరాలు మొత్తం 31,460 పోలింగ్ కేంద్రాలకు గాను 8,904 సమస్యాత్మక, 7,160 అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించినట్టు ఎన్నికల కమిషన్ పేర్కొంది. 16,064 సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో 15,396 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు ఎస్ఈసీ పేర్కొంది. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన వాటిలోనూ 668 చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకుండా వీడియోగ్రఫీకి పరిమితం చేశారు. మరోవైపు సాధారణ పోలింగ్ కేంద్రాలుగా పేర్కొన్న చోట్ల 6 వేలచోట్ల ల్యాప్‌టాప్‌ల ద్వారా వెబ్‌కాస్టింగ్, మరో 6,507 చోట్ల వీడియోగ్రఫీ, 2,889 చోట్ల ఇతర ఏర్పాట్లు చేసినట్టు వివరించింది. ఎన్నికల నిర్వహణలో 49,121 పోలింగ్ సిబ్బంది, బందోబస్తు కోసం 40,769 మంది పోలీసులు పాల్గొంటారని తెలిపింది. -
ప్రశాంతంగా ఎంపీటీసీ, వార్డు సభ్యుల ఎన్నికలు
జిల్లాలోని పలు ఎంపీటీసీ సభ్యులు, వార్డు సభ్యుల స్థానాలకు గురువారం ఉప ఎన్నికలు నిర్వహించారు. వార్డు సభ్యుల స్థానాలకు పోలైన ఓట్లను వెంటనే లెక్కించి సాయంత్రంలోగా ఫలితాలు వెల్లడించారు. ఇక ఎంపీటీసీ సభ్యుల స్థానాలకు పోలైన ఓట్లను శనివారం లెక్కించనున్నట్లు అధికారులు తెలిపారు. మరిగడిలో 81.86 శాతం పోలింగ్ జనగామ : జనగామ మండలం మరిగడి ఎంపీటీసీ ఉప ఎన్నిక గురువారం జరి గింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కృష్ణ, అసిస్టెంట్ అధికారి హసీ మ్ ఆధ్వర్యం లో పర్యవేక్షించగా సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. ఎన్నికల బరిలో ఉన్న దూడల సిద్ధయ్య(కాంగ్రెస్), మేకల కలింగరాజు (టీఆర్ఎస్), బాల్నె వెంకటరాజు(సీపీఎం), తల్లూరి అశోక్(టీడీపీ) బరిలో ఉండగా, మరిగడిలోని రెండు బూత్‌ల్లో 1,852 ఓట్లకు 1,487(84 శాతం), చౌడారంలో 1,054 ఓట్లకు 892 (80 శాతం) ఓట్లు పోలయ్యాయి. గతంలో మరిగడి ఎన్నికల్లో 90 శా తం పోలింగ్ నమోదు కాగా, ఈసారి 81.86 శాతం మాత్రమే నమోదైంది. మండల పరిషత్ కార్యాలయంలో ఓట్ల లెక్కింపు శనివారం నిర్వహిస్తారు. నారాయణపురంలో 75.68 శాతం.. బచ్చన్నపేట : మండలంలోని నారాయణపురం ఎంపీటీసీ స్థానానికి ఎన్నికలు నిర్వహించగా రిటర్నింగ్ అధికారి సదానందం, ఎన్నికల అధికారి, ఎంపీడీఓ రమేష్ ప్రయవేక్షించారు. నక్కవాని గూడెం, నారాయణపురం గ్రామాల్లో బూత్‌లు ఏర్పాటుచేయగా 1557 మంది ఓటర్లకు 1178 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. జనగామ ఆర్డీవో వెంకట్‌రెడ్డి, తహసిల్థార్ విజయభాస్కర్ పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేయగా జనగామ డీఎస్పీ పద్మనాభరెడ్డి, సీఐ చంద్రశేఖర్ బందోబస్తు నిర్వహించారు. జాకారం సర్పంచ్‌గా సాగర్ ములుగు : జాకారం సర్పంచ్ స్థానానికి గురువారం నిర్వహించిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గండ్రత్ సాగర్ గెలుపొందారు. సర్పంచ్ గండ్రత్ రాజక్క అనారోగ్యంతో మృతి చెందడంతో ఇక్కడ ఉప ఎన్నికలు నిర్వహించగా టీఆర్ఎస్ నుంచి సాగర్‌తో పాటు టీడీపీ నుంచి గొర్రె రఘుపతి, కాంగ్రెస్ నుంచి రాసమల్ల రజినీకాంత్ నిలిచారు. ఈ మేరకు 970 ఓట్లకు 632 ఓట్లు(65శాతం) పోలయ్యాయి. ఈ సందర్భంగా సాగర్‌కు 594 ఓట్లు రాగా, ఆయన తర్వాత రఘుపతికి 17 ఓట్లు వచ్చాయి. దీంతో సాగర్ 577 ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్లు అధికారులు వెల్లడించారు.సీఐ శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటుచేయగా ఎంపీడీఓ విజయ్‌స్వరూప్, ఈఓపీఆర్డీ రమేష్ పరిశీలించారు. కాగా, ప్రస్తుతం సర్పంచ్‌గా గెలుపొందిన సాగర్ వయస్సు 22 ఏళ్లే. గత ఏడాది ఆయన డిగ్రీ పూర్తి చేయగా, తన తల్లి, సర్పంచ్‌గా ఉన్న రాజక్క మృతి చెందడంతో ఆమె స్థానంలో నిలిచి గెలుపొందారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గట్టు మహేందర్ ఆధ్వర్యంలో శ్రీనివాస్‌రెడ్డి, రామస్వామి, బ్రహ్మచారి, చేరాలు, గండ్రత్ దామోదర్ సంబరాలు చేసుకున్నారు. రెండు పంచాయతీల్లో చెరొకటి... కొడకండ్ల : మండలంలోని రెండు గ్రామపంచాయతీల్లో రెండు వార్డు సభ్యులకు గురువారం ఎన్నికలు నిర్వహించారు. ఏడునూతుల 12వ వార్డు ఎన్నికలో టీఆర్ఎస్ బలపర్చిన మాలోత్ రమ్మి కాంగ్రెస్ బలపర్చిన గుగులోత్ అమ్మిపై 70 ఓట్లతో, రంగాపురం ఐదో వార్డు ఎన్నికలో కాంగ్రెస్ బలపర్చిన జక్కుల సంజీవ టీఆర్ఎస్ బలపర్చిన సుందరమ్మపై 7 ఓట్ల తేడాతో విజయం సాధించగా కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకొన్నారు. పాలకుర్తిలో మూడు.. ఒకటి పాలకుర్తి : నియోజకవర్గంలో నాలుగు గ్రామపంచాయతీల్లో నాలుగు వార్డు సభ్యుల స్థానాలకు ఉప ఎన్నిక జరిగాయి. ఈ ఎన్నికల్లో మూడింటిని కాంగ్రెస్, ఒక స్థానాన్ని టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు గెలుచుకున్నారు. పాలకుర్తి మండలం బమ్మెర 6వ వార్డులో కాంగ్రెస్ బలపర్చిన దొంతరబోయిన ఉప్పలయ్య, దేవరుప్పుల మండలం కోలుకొండ 2వ వార్డు సభ్యుడిగా కాంగ్రెస్ బలపర్చిన కౌడగాని కృష్ణమూర్తి, కొడకండ్ల మండలం రంగాపురం గ్రామపంచాయతీ 5వ వార్డు సభ్యుడిగా జక్కుల సంజీవ, ఏడునూతుల గ్రామపంచాయతీ 12వ వార్డు సభ్యులుగా టీఆర్ఎస్ బలపర్చిన మాలోతు రమ్య గెలుపొందినట్లుగా అధికారులు ప్రకటించారు.


