breaking news
Mothkupalli
-
పారదర్శకత.. ఉత్తమ పనితనం
వికారాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డుల్లో వికారాబాద్ జిల్లా కోట్‌పల్లి మండల పరిధిలోని మో త్కుపల్లి గ్రామ పంచాయతీ సుపరిపాలనలో జాతీయ పురస్కారానికి ఎంపికయింది. రికార్డులు పూర్తి స్థాయి లో ఆన్లైన్లో నిర్వహించటం, నిధుల ఖర్చులో పారదర్శకత, ప్రజల ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం లేకుండా చూడటం, తరచూ సమావేశాల ద్వారా గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలను పాలనలో భాగస్వాములను చేయటం, రికార్డుల్లో నమోదైన అంశాలు వాస్తవంలోనూ ప్రతిబింబించటంలాంటి అంశాలు ఈ గ్రామ పంచాయతీ జాతీయ స్థాయిలో అవార్డుకు ఎంపిక కావటంలో కీలక భూమిక వహించాయి. ఈ గ్రామంలో 703 కుటుంబాలు, 2,090 ఓటర్లు, 2,576 మంది జనాభా ఉన్నారు. అవార్డు వరకు తీసుకువెళ్లిన అంశాలివే.. మోత్కుపల్లి గ్రామంలో జరిగిన ప్రగతి, గ్రామంలో తడి చెత్త, పొడి చెత్తను వేరుచేసే పద్ధతి, పారిశుధ్యం, మరుగుదొడ్ల నిర్మాణం, వాటిని వాడటం, మురుగు గుంతలు లేకుండా గ్రామంలో చేపడుతున్న చర్యలు, రోడ్ల పరిశుభ్రత, మురుగు కాల్వల పరిశుభ్రత, పల్లె ప్రకృతి వనాల నిర్వహణ, గ్రామంలో నిర్వహించిన హరితహారం.. అందులో బతికి ఉన్న మొక్కల శాతం, ఇంకుడు గుంతలు, విద్యా, వైద్యం, పౌష్టికాహారం, ఇమ్యునైజేషన్ తదితర అంశాలు కేంద్ర ప్రభుత్వ అధికారులను ఆకర్షించాయి.వీటితో పాటు గ్రామంలో అక్షరాస్యత పెంచేందుకు చేపడుతున్న కార్యక్రమాలను సైతం పరిగణనలోకి తీసుకున్నారు. అలాగే గ్రామంలో ఖర్చు చేసిన నిధులు, పన్నుల వసూలు, గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు, వారికందిస్తున్న పౌష్టికాహారం, ఉపాధి హామీలో వందరోజులు పని చేసిన కుటుంబాలు, లబ్ధి పొందిన కుటుంబాలు.. వీటన్నింటిని ప్రత్యక్షంగా పరిశీలించిన కేంద్ర ఉన్నతాధికారులు గ్రామాన్ని జాతీయ అవార్డు కోసం ఎంపిక చేశారు. మాపై బాధ్యత మరింత పెరిగింది మా గ్రామానికి జాతీయ స్థాయి అవార్డు రావటం సంతోషంగా ఉంది. దీంతో మాపై బాధ్యత మరింత పెరిగింది. గ్రామ అభివృద్ధిలో అధికారులు, ఉద్యోగులు, జీపీ సభ్యులు, ప్రజలు.. ఇలా అందరి సహకారం ఉంది. అవార్డు రావటంలో గత సర్పంచ్, వార్డు సభ్యుల కృషి కూడా ఎంతో ఉంది. అవార్డు ద్వారా వచ్చే నిధులతో గ్రామాన్ని మరింత అభివృద్ది చేస్తాం. – అమృతమ్మ, సర్పంచ్, మోత్కుపల్లి -
కేసీఆర్‌ను కలిసిన మోత్కుపల్లి
యాదాద్రి : టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు శుక్రవారం సీఎం కేసీఆర్‌ను కలిసి తన కుమార్తె నిహారిక వివాహానికి హాజరుకావాలని లగ్నపత్రిక అందజేశారు. తెలుగుదేశం ఆవిర్భావంలో ఒకే పార్టీలో అత్యంత ప్రియమిత్రులుగా ఉన్న మోత్కుపల్లి, కేసీఆర్ సుదీర్ఘ విరామం తర్వాత వివాహ పత్రిక సందర్భంగా కలవడం అత్యంత రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. లగ్నపత్రికతో తన నివాసం ప్రగతిభవన్ కు వచ్చిన చిరకాల మిత్రులు మోత్కుపల్లిని కేసీఆర్ ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ఇంట్లోకి తీసుకెళ్లారు. అక్కడ ఉన్నవారందరినీ బయటకు పంపించి సుమారు గంటన్నరపాటు పలు అంశాలపై ఇరువురూ చర్చించారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఈ ఇద్దరు నేతలు తమ గత స్మృతులను నెమరేసుకున్నారు. ఆమె పెళ్లికి ఖచ్చితంగా వస్తానని సీఎం మోత్కుపల్లికి మాట ఇచ్చారు. అలాగే తన కోరికను మన్నించి యాదాద్రిభువనగిరి జిల్లాను ప్రకటించినందుకు కేసీఆర్‌కు మోత్కుపల్లి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఆలేరు నియోజకవర్గానికి సాగు నీరందించేందుకు మల్లన్నసాగర్లో చేపట్టిన బస్వాపూర్, గంధమల్ల రిజర్వాయర్లు పూర్తచేయాలని కోరినట్లు తెలిసింది. కాగా వీరి కలయికపై రాజకీయంగా చర్చ మొదలైంది. కాగా ఇదే విషయంపై మోత్కుపల్లిని ప్రశ్నించగా తాను తన కుమార్తె వివాహానికి లగ్నపత్రిక అందించడానికి వెళ్లానే తప్ప ఎలాంటి రాజకీయాలు లేవని ఆయన స్పష్టం చేశారు. -
దీక్ష విరమించిన మోత్కుపల్లి!


