breaking news
Mossad
-
ఇంతకీ ఖమేనీ ఎక్కడ?.. ఆ రహస్యం ఇదేనా?
ప్రపంచంలోనే దిగ్గజ నిఘా సంస్థలు ఏవని ఎవరైనా ప్రశ్నిస్తే.. ఠక్కున వచ్చే సమాధానాలు.. ఇజ్రాయెల్‌కు చెందిన మొస్సాద్.. అమెరికాకు చెందిన సీఐఏ..! తమ శత్రువు ప్రపంచంలోని ఏ మూలన దాక్కొన్నా.. లేపేస్తామనే ధీమా ఈ రెండు సంస్థలకు ఉంది. అయితే.. మధ్యప్రాశ్చ్యంలో ఇప్పుడు ఈ రెండు సంస్థల విషయంలో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఏకు మేకై కూర్చున్నాడు. ఈ రెండు నిఘా సంస్థల టెక్నాలజీకి దొరకకుండా జాగ్రత్తపడుతున్న ఖమేనీ.. ఇప్పుడు అటు ట్రంప్.. ఇటు నెతన్యాహుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు. ఇంతకీ ఖమేనీ ఎక్కడున్నాడు? ఆయన విషయంలో మొస్సాద్, సీఐఏ ఎందుకు విఫలమవుతున్నాయి?కంటిమీద కునుకు లేకుండా..అది 2020 నవంబరు 27వ తేదీ.. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సమీపంలో ఇరాన్ అణు సాంకేతికతకు పెద్దదిక్కుగా ఉన్న మోహాసేన్ ఫాఖ్రిజాదేహ్ (Mohsen Fakhrizadeh) కారులో ప్రయాణిస్తున్నారు. మొస్సాద్, సీఐఏ నిఘా సంస్థల టార్గెట్‌గా ఆయన ఉన్నారు. ఆ కారుపై దాడికి ఈ సంస్థలు ఒక్క ఏజెంట్‌ని కూడా నియమించలేదు. కానీ, ఉపగ్రహ చిత్రాల ద్వారా ఆయనను గుర్తించి.. ఏఐ ఆధారిత మెషీన్ గన్ సాయంతో అత్యంత కచ్చితత్వంతో అతణ్ని మట్టుబెట్టాయి. హాలీవుడ్ చిత్రాలను తలపించిన ఈ డిజిటల్ ఆపరేషన్‌తో ప్రపంచదేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. అత్యాధునిక శాటిలైట్లు, ప్రపంచంలోనే నంబర్ వన్ హ్యాకర్లతో ఇజ్రాయెల్, అమెరికాలు అతణ్ని అంతమొందించాయి. అంతటి టెక్నాలజీ ఉన్నా.. ఖమేనీ జాడను కనిపెట్టలేకపోవడం ఇప్పుడు ఈ రెండు నిఘా సంస్థలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.చిన్న ఫోన్ కాల్ మాట్లాడినా..ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీని హతమార్చిన ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ అప్పట్లోనే ఓ భారీ ప్రకటన చేసింది. తమ తదుపరి టార్గెట్ కొత్తగా నియమితులయ్యే సుప్రీం లీడరేనన్నది అందులోని సారాంశం. లెబనాన్ కేంద్రంగా పనిచేస్తున్న హిజ్బుల్లా చీఫ్‌లను, గాజా కేంద్రంగా ఉన్న హమాస్ నేతలను లేపేసిన విధానాన్ని ఈ సందర్భంగా ఉటంకించింది. ఆ తర్వాత మొజ్తబా ఖమేనీ ఇరాన్‌కు కొత్త సుప్రీం లీడర్ అయ్యారు.అయితే.. ఆయనను ఇంతవరకు ఎవరూ బహిరంగంగా చూడలేదు. చివరికి ఇటీవల జరిగిన ఆయన తండ్రి ఆయతుల్లా ఖమేనీ అంత్యక్రియలకు సైతం మొజ్తబా హాజరుకాలేదు. దీంతో.. ఆయనను ట్రేస్ చేయడంలో మొస్సాద్, సీఐఏ చతికిలపడిపోతున్నాయి. ముఖ్యంగా.. మొజ్తబా ఇప్పుడు జీరో డిజిటల్ పాలసీని అందిపుచ్చుకున్నట్లు తెలుస్తోంది. అంటే.. ఎలాంటి డిజిటల్ గాడ్జెట్స్‌ను తన దరిచేరనీయకుండా ఆయన జాగ్రత్తపడుతున్నారు. చిన్న ఫోన్‌కాల్ మాట్లాడినా.. తనను మొస్సాద్ గుర్తింస్తుందని ఆయనకు బాగా తెలుసు. అందుకే.. ఆయన డిజిటల్ ప్రపంచానికి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.మొజ్తబా.. అదే ఫాలో అవుతున్నారా?ఇంకా వివరంగా చెప్పాలంటే.. ఒకప్పుడు అమెరికాను గడగడలాడించిన అల్-ఖాయిదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ అవలంబించిన మోడల్‌ను మొజ్తబా ఫాలో అవుతున్నారు. లాడెన్ చేసిన పొరపాట్లు తన విషయంలో రిపీట్ అవ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. నిజానికి పాకిస్థాన్‌లో తలదాచుకున్న లాడెన్‌ను చేరడానికి.. అతని కమ్యూనికేటర్లను సీఐఏ ట్రాక్ చేసింది. మొజ్తబా విషయానికి వస్తే.. ఆయన కమ్యూనికేటర్లు.. అంటే.. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ అధికారులు ఎవరనే విషయం కూడా బయటి ప్రపంచానికి తెలియదు. కేవలం మొజ్తబా రాసి ఇచ్చే చిన్నచిన్న చీటీలు మాత్రమే అడపాదడపా వెలుగులోకి వస్తున్నాయి.మొజ్తబా ఎక్కడ? ఇంతకీ మొజ్తబా ఇప్పుడు ఎక్కడున్నారు? ఈ ప్రశ్నకు రెండు వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ జరిపిన దాడిలో మొజ్తబా భవనం ధ్వంసమైంది. ఆయన భార్య ఈ దాడిలో మరణించినట్లు వార్తలొచ్చాయి. తీవ్రంగా గాయపడిన మొజ్తబా ప్రస్తుతం ఓ బంకర్లో చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది. ఇక రెండో వాదన విషయానికి వస్తే.. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నుంచి తననుతాను కాపాడుకునేందుకు మొజ్తబా తనకు అత్యంత నమ్మకమైన మిత్రదేశం రష్యాలోని ఓ బంకర్లో తలదాచుకుంటున్నారనే ప్రచారం ఉంది. ప్రస్తుతం మొజ్తబా తెరవెనకే ఉంటూ.. ఇరాన్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. దేశ రక్షణ, విదేశీ విధానాల వంటి కీలక నిర్ణయాలను ఐఆర్జీసీ కమాండర్లు నిర్వర్తిస్తున్నారు.ఇరాన్ మైండ్‌గేమ్ ఆడుతోందా?ఏఐ ఆధారిత టెక్నాలజీ ఎంతగా అందుబాటులోకి వచ్చినా.. అంతరిక్షం నుంచి భూగాళాన్నే జల్లెడ పట్టేలా శాటిలైట్లు ఉన్నా.. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా మాత్రం పాతకాలపు రహస్య పద్ధతులకు జైకొట్టారు. అందుకే.. మొస్సాద్, సీఐఏలకు షాక్‌ల మీద షాక్ ఇస్తున్నారు. అయితే.. మొజ్తబా నిజంగానే బంకర్లలో తలదాచుకుంటున్నారా? లేక ఇరాన్ ఆయన పేరుతో మైండ్‌గేమ్ ఆడుతోందా? అనేది ఆసక్తికరంగా మారింది.-హెచ్.కమలాపతిరావు, సీనియర్ జర్నలిస్ట్ -
ఇరాన్ మాజీ అధ్యక్షుడితో 'మొసాద్' రహస్య డీల్!
ఇరాన్లో ఇజ్రాయెల్ గూఢచార సంస్థ 'మొసాద్' ఓ సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించింది. ప్రస్తుత పాలకులను గద్దె దించి ఆ స్ధానంలో ఇరాన్ మాజీ అధ్యక్షుడు మహ్మూద్ అహ్మదినీజాద్ను కొత్త నాయకుడిగా కూర్చోబెట్టేందుకు మొసాద్ కొన్నేళ్లుగా రహస్య ఆపరేషన్ నడిపినట్లు 'న్యూయార్క్ టైమ్స్' ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. అయితే ఈ ప్లాన్ చివరి నిమిషంలో విఫలమైందని ఎన్టీ తమ కథనంలో పేర్కొంది.కాగా తొలిసారిగా 2024లో హంగేరీ వేదికగా జరిగిన ఒక సదస్సులో అప్పటి మొసాద్ చీఫ్ డేవిడ్ బార్నియా అహ్మదినీజాద్తో కలిపి చర్చలు జరిపినట్లు సమాచారం. అహ్మదినీజాద్ విదేశీ ప్రయాణాలకు, నివాసాలకు సంబంధించిన ఖర్చుల కోసం ఇజ్రాయెల్ భారీగా ఆర్థిక సహాయం అందించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత తమకు అహ్మదీనెజాద్‌తో పరిచయం ఏర్పడిందనే విషయాన్ని మొసాద్ అమెరికా గూఢచారి సంస్థ సిఐఎ (CIA)కి తెలియజేసిందంట.అదేవిధంగా 2025 జూన్‌లో బుడాపెస్ట్‌లో కూడా మరోసారి ఆయన మొసాద్ ఏజెంట్లను కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పర్యటనలో అహ్మదినీజాద్ తన బాడీగార్డులైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కళ్ళు గప్పి మరి మొసాద్ ఏజెంట్లతో సమావేశమైనట్లు ఇరాన్ మీడియాలో కూడా కథనాలు వెలువడుతున్నాయి.సేఫ్ హౌస్ నుండి ఎస్కేప్!ఈ ఏడాది ప్రారంభంలో అమెరికా-ఇజ్రాయెల్ దాడులు ఇరాన్‌పై ప్రారంభమైనప్పుడు ఈ ఆపరేషన్ చివరి దశకు చేరింది. అహ్మదీనెజాద్ ఉంటున్న కాంపౌండ్‌పై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ దాడుల్లో అహ్మదీనెజాద్ చనిపోయాడని ప్రపంచమంతా భావించింది. కానీ, అసలు ట్విస్ట్ ఏంటంటే... మొసాద్ ఏజెంట్లు ఆయనను అక్కడి నుంచి రక్షించి, ఇరాన్ లోపలే ఉన్న ఒక రహస్య 'సేఫ్ హౌస్'కు తరలించారు.అయితే ఇజ్రాయెల్ ప్లాన్ పట్ల అహ్మదీనెజాద్‌కు నమ్మకం కుదరకపోవడంతో, ఆయన కొన్ని రోజులకే ఆ సేఫ్ హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. ఆ తర్వాత ఇటీవల ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల్లో ఆయన అకస్మాత్తుగా ప్రత్యక్షమవడంతో ఇరాన్ వర్గాలు షాక్‌కు గురయ్యాయి. ఇజ్రాయెల్‌తో ఆయనకు ఉన్న సంబంధాల గురించిన పూర్తి వివరాలను ఇరాన్ ఇంటెలిజెన్స్ వర్గాలు తాజాగా కనిపెట్టాయి. దీంతో అహ్మదీనెజాద్‌ను హౌస్ అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. -
రీల్ కాదు రియల్ సీన్..! మొసాద్ దిమ్మతిరిగే ఆపరేషన్
-
ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసిన ఆపరేషన్!
-
Sakshi Podcast : మొస్సాద్ చేసిన రెండు భారీ ఆపరేషన్స్
-
పాక్ సైన్యాధ్యక్షుడి కోసం మొస్సాద్ సీక్రెట్ ఆపరేషన్?!
ఇరాన్-అమెరికా శాంతి చర్చల నేపథ్యంలో.. పాకిస్థాన్ సైన్యాధ్యక్షుడు ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్‌ను హత్య చేయడానికి ఇజ్రాయెల్ ప్లాన్ చేసిందా?.. ఇందుకోసం ఆ దేశపు గూఢచారి సంస్థ మొస్సాద్‌ను ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దించారా?.. ఓ బ్రెజిలియన్ జర్నలిస్టు చేసిన సంచలన ఆరోపణలు ఇప్పుడు అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా.. పాకిస్థాన్‌తో పాటు ఖతార్ దేశాలు మధ్యవర్తిత్వం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియలో రూపొందిన ఒప్పందానికి సైతం "ఇస్లామాబాద్ మెమొరాండం ఆఫ్ అండర్స్టాండింగ్"గా పిలిచారు. ఆపై తదుపరి చర్చలు స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరిగాయి. వీటికి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో పాటు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆ దేశపు సైన్యాధ్యక్షుడు అసీం మునీర్ కూడా హాజరయ్యారు.అయితే.. ఈ నేపథ్యంతో ప్రముఖ రాజకీయ వ్యాఖ్యాత మారియో నాఫల్ నిర్వహించిన పోడ్కాస్ట్లో బ్రెజిలియన్ జర్నలిస్టు, జియోపాలిటికల్ విశ్లేషకుడు పెపే ఎస్కోబార్ సంచలన ఆరోపణలకు దిగాడు. మొస్సాద్(Mossad) సంస్థ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఆదేశాల మేరకు అసీం మునీర్‌తో పాటు పాకిస్థాన్ ప్రతినిధి బృందంపై హత్యాయత్నానికి సిద్ధమైంది. ఈ విషయమై పాకిస్థాన్ మిలిటరీ ఇంటెలిజెన్స్‌కు అత్యంత విశ్వసనీయ సమాచారం అందింది అని పేర్కొన్నాడు. అంతేకాక.. ఈ సమాచారం అందిన వెంటనే పాకిస్థాన్ తన మధ్యవర్తుల ద్వారా ఇజ్రాయెల్‌కు గట్టి హెచ్చరిక పంపిందని ఎస్కోబార్ చెప్పారు. "మా ప్రతినిధి బృందాన్ని తాకితే మిమ్మల్ని ప్రపంచ పటంలో నుంచి చెరిపేస్తాం" అనే సందేశం పాక్ ఇజ్రాయెల్‌కు పంపిందని ఆయన ఆ పాడ్‌కాస్ట్‌లో వెల్లడించారు. మొస్సాద్ అనేది ఇజ్రాయెల్‌కు చెందిన అత్యంత కీలక విదేశీ గూఢచారి సంస్థ. దీని పూర్తి పేరు "ది ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటెలిజెన్స్ అండ్ స్పెషల్ ఆపరేషన్స్". 1949లో స్థాపించబడిన ఈ సంస్థ.. విదేశాల్లో గూఢచర్యం, ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు, రహస్య సమాచార సేకరణ వంటి బాధ్యతలు నిర్వహిస్తుంది. శత్రు దేశాల్లో రహస్య ఆపరేషన్లు నిర్వహించడంలో, ఇజ్రాయెల్‌కు ముప్పుగా భావించే వ్యక్తులను గుర్తించి నిర్వీర్యం చేయడంలో మొస్సాద్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలైన అమెరికా సీఐఏ, బ్రిటన్ ఎంఐ6, రష్యా ఎఫ్ఎస్బీ(గతంలో KGB) వంటి ప్రముఖ గూఢచారి సంస్థల సరసన దీనికి చోటు ఉంది.ఇదిలా ఉండగా, పాకిస్థాన్-ఇజ్రాయెల్ సంబంధాలు ఎప్పటి నుంచో ఉద్రిక్తంగానే ఉన్నాయి. పాకిస్థాన్ ఇప్పటికీ ఇజ్రాయెల్‌ను దేశంగా అధికారికంగా గుర్తించలేదు. గాజా విషయంలోనూ ఇజ్రాయెల్‌పై పాక్ ఎప్పటికప్పుడు విరుచుకుపడుతూ వస్తోంది. ఈ విషయమై ఇటీవల పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కూడా ఇజ్రాయెల్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో పాకిస్థాన్ ‘ఇరాన్-అమెరికా’ చర్చల్లో నిజంగా తటస్థ మధ్యవర్తిగా వ్యవహరించగలదా? అనే సందేహాలు ఇజ్రాయెల్ వర్గాలు వ్యక్తం చేశాయి.అయితే మునీర్ హత్యకు కుట్ర జరిగిందన్న ఆరోపణలపై పాకిస్థాన్ ప్రభుత్వం గానీ, సైన్యం గానీ ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు. అలాగే ఇటు ఇజ్రాయెల్ ప్రభుత్వం కూడా ఈ ఆరోపణలపై స్పందించలేదు. అయితే.. ఎస్కోబార్ చేసిన ఆరోపణలను పాకిస్థాన్‌కు చెందిన పలువురు సీనియర్ జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. పాక్ ప్రముఖ జర్నలిస్టు సయ్యద్ తలత్ హుస్సేన్ సోషల్ మీడియాలో స్పందిస్తూ "ఇందులో ఒక్క ముక్క నిజం కూడా లేదు. అలాంటి ఘటన ఏదీ జరగలేదు" అని స్పష్టం చేశారు. ఒక సీనియర్ భద్రతాధికారి కూడా ఈ కథనాన్ని "వక్రీకృత ప్రచారం"గా అభివర్ణించినట్లు వెల్లడించారు. దీంతో ప్రస్తుతానికి అసీం మునీర్‌పై మొస్సాద్ హత్యాయత్నం జరిగిందన్న ప్రచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో.. కొన్ని వర్గాల్లో మాత్రమే చక్కర్లు కొడుతున్న ఆరోపణగానే ఉంది.


