breaking news
money londering case
-
Vijay Mallya లగ్జరీ విల్లాను కొన్న బాలీవుడ్ జంట ఎవరో తెలుసా?
భారతీయ బ్యాంకులకు వేలకోట్లు ఎగవేసి లండన్‌కు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా (Vijay Mallya) మళ్లీ వార్తల్లో నిలుస్తున్నాడు. ఐపీఎల్ 2025 (IPL2025)లో ఆర్సీబీ (RCB) టైటిల్ గెల్చుకున్న తరువాత మాల్యా హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాడు. 2008లో ఆర్సీబీ జట్టును స్థాపించిన ఇన్నాళ్లకు ట్రోఫీని గెల్చుకోవడం మాల్యాకు నిజంగా సంతోషకరమైన క్షణమే. అందుకే జట్టుపై ప్రశంసలు కురిపించాడు. 18 ఏళ్ల తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు టైటిల్ గెలవడం, సోషల్ మీడియా వేదికగా విజయ్ మాల్యా పోస్ట్ తరువాత నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. ముఖ్యంగా గోవాలోని విజయ్ మాల్యా కింగ్‌ఫిషర్ విల్లాని ఎవరు కొన్నారు? అనేది చర్చ నీయాంశంగా మారింది. పదండి ఆ వివరాలు తెలుసుకుందాం.ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా ఆర్సీబీతోపాటు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ వ్యవస్థాపకుడు. గోవాలోని ఐజయ్ మాల్యా కింగ్‌ఫిషర్ విల్లా విలాసాలకు పెట్టింది పేరు. ఈ విల్లాలో విలాసవంతమైన పార్టీలను నిర్వహించేవాడు. గ్లామర్ ప్రపంచంలోని ప్రముఖులు హాజరయ్యేవారు. ఉత్తర గోవాలోని ఉన్నత స్థాయి కాండోలిమ్ బీచ్ గ్రామంలో 12,350 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ విలాసవంతమైన ఇంటిలో కృత్రిమ చెరువులు, ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్స్, ఓపెన్-ఎయిర్ డ్యాన్స్ ఫ్లోర్లు, పచ్చని తోటలు లాంటి హంగులెన్నో ఉన్నాయి.మాల్యా వేలకోట్ల ఏగవేత కేసులో 2016లో, దర్యాప్తు ప్రారంభమైనప్పుడు, బ్యాంకుల రుణాల చెల్లింపు ప్రక్రియలో భాగంగా దీన్ని బ్యాంకుల కన్సార్షియం వేలానికి పెట్టింది. ఖరీదైన కింగ్ ఫిషర్ విల్లాను ఎస్బీఐ బ్యాంకు ఎన్నిసార్లు వేలానికి పెట్టినా ఎవ్వరూ కొనడానికి ముందుకు రాలేదు. . ఆన్లైన్ ఆక్షన్‌లో ఎవ్వరూ దీనిని సొంతం చేసుకోవడానికి ముందుకు రాలేదు. ఎట్టకేలకు 2017లో ఈ విల్లాను బాలీవుడ్ దంపతులు సచిన్ జోషి ,ఊర్వశి శర్మ రూ. 73.01 కోట్లకు కొనుగోలు చేశారు. తరువాత ఈ విల్లా పేరును కింగ్స్ మాన్షన్‌గా మార్చాడుచదవండి: రూ. 5 కోట్ల ఎఫ్డీలు కొట్టేసింది..మునిగింది : ఐసీఐసీఐ అధికారి నిర్వాకంకింగ్ఫిషర్ విల్లా- కింగ్స్మాన్షన్విజయ్ మాల్యా లాగే, సచిన్ జోషి కూడామద్యం తయారీ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు, దీని ఉత్పత్తులలో 'కింగ్స్ బీర్' కూడా ఉంది. కింగ్స్ బీర్ బ్రాండ్ కనెక్షన్ కారణంగా ఈ పేరు పెట్టినట్టు గతంలో ఒక సందర్బంలో వెల్లడించాడు సచిన్.చదవండి: Food Crisis In Gaza: రూ. 5ల బిస్కట్ ధర రూ. 2400, కప్పు కాఫీ రూ.1800..ఎక్కడ?ఎవరీ సచిన్ జోషి ప్రముఖ వ్యాపారవేత్త జగదీష్ మోహన్ లాల్ జోషి కుమారుడు సచిన్ జోషి. తండ్రి స్థాపించిన జేఎంజే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌కి అధిపతివున్నాడు. సచిన్ కేవలం వ్యాపారవేత్త మాత్రమేకాదు హీరో కూడా. క్రీడలంటే ఆసక్తి. 2002లో 'మౌనమేలనోయి..' అనే సినిమాతో టాలీవుడ్ ద్వారా నటుడిగా సినీపరిశ్రమకి పరిచయమైన సచిన్ 2011లో అజాన్ చిత్రంతో హిందీ చలనచిత్ర రంగ ప్రవేశం చేశాడు. ముంబై మిర్రర్, జాక్‌పాట్ చిత్రాలతోపాటు తెలుగు చిత్రాలలో కూడా నటించినా పెద్దగా కలిసి రాలేదు. 2021లో మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసింది. ఈ మాజీ నటి ఊర్వశి శర్మను వివాహం చేసుకున్నారు.వీరికి ఇద్దరు పిల్లలు. -
రేపే కేజ్రీవాల్ బెయిల్ తీర్పు
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో అరెస్టై.. తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్‌పై సుప్రీం కోర్టు రేపు(శుక్రవారం) తీర్పు వెల్లడించనుంది. సీబీఐ కేసులో బెయిల్ ఇవ్వాలని అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఇప్పటికే విచారణ పూర్తి చేసింది. రేపు బెయిల్ మంజూరు అయితే అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి విడుదల కానున్నారు. సెప్టెంబర్ 5వ తేదీన చేపట్టిన విచారణలో ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్వల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం బెయిల్ తీర్పును రిజర్వ్ చేసి రేపు (సెప్టెంబర్ 10)న వెల్లడిస్తామని పేర్కొంది.చదవండి: కేజ్రీవాల్ బెయిల్‌పై సుప్రీంలో వాడీవేడి వాదనలు -
రాణా అయ్యుబ్‌కు ఈడీ షాక్.. మనీలాండరింగ్‌పై ఛార్జ్‌షీట్
లక్నో: ప్రముఖ జర్నలిస్ట్ రాణా అయ్యుబ్‌పై మనీలాండరింగ్ కేసు నమోదు చేశారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు. ఛారిటీ పేరుతో ప్రజల నుంచి నిధులు సేకరించి ఆమె మోసానికి పాల్పడినట్లు అభియోగాలు మోపారు. 2021లో ఉత్తర్‌ప్రదేశ్‌లో నమోదైన ఓ ఎఫ్ఐఆర్ ఆధారంగా గాజియాబాద్ కోర్టులో బుధవారం ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. కెట్టో అనే ఆన్లైన్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫాం ద్వారా మూడు క్యాంపెయిన్లను నిర్వహించి రాణా అయ్యుబ్ కోట్ల రూపాయాలు వసూలు చేశారని ఈడీ ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. మురికివాడల్లోని నివాసితులు, రైతుల కోసం మొదటిసారి 2020 ఏప్రిల్-మే మధ్యకాలంలో, అస్సాం, బిహార్, మహాష్ట్ర రిలీఫ్ పేరుతో రెండోసారి 2020 జూన్-సెప్టెంబర్ మధ్యకాలంలో, కోవిడ్ సాయం కోసం 2021 మే-జూన్ మధ్యకాలంలో మూడోసారి రాణా అయ్యుబ్ విరాళాలు సేకరించినట్లు పేర్కొంది. ఈ మూడు క్యాంపెయిన్ల ద్వారా రాణా అయ్యుబ్ మొత్తం రూ.2.69కోట్లు వసూలు చేశారని, అందులో రూ.80.5 లక్షలు విదేశాల నుంచి అందాయని ఈడీ అధికారులు వెల్లడించారు. అయితే ఐటీ శాఖ విదేశీ విరాళాలపై విచారణకు ఆదేశించగానే ఆ డబ్బునంతా రాణా అయ్యుబ్ తిరిగి దాతలకే పంపారని వివరించారు. ఈ.2.69 కోట్లను ఆమె అక్రమంగానే సేకరించారని పేర్కొన్నారు. విరాళాల రూపంలో సేకరించిన నిధులలో రూ.50లక్షలు రాణా అయ్యుబ్ తండ్రి, సోదరి ఖాతాలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆమె వాటిని తన ఖాతాలోకి మళ్లించింది. రూ.29లక్షలు మాత్రం ఛారిటీ కోసం ఉపయోగించినట్లు ఈడీ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రాణా అయ్యుబ్‌కు చెందిన రూ.1.77కోట్లను ఈడీ అటాచ్ చేసింది. అందులో రూ.50లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ కూడా ఉంది. చదవండి: జమ్ములో వివాదాస్పద ఉత్తర్వుల ఉపసంహరణ -
సోనియా నోటి వెంట రాహుల్ సమాధానాలు!
సాక్షి,న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని మూడు రోజులు విచారించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అయితే అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆమె రాహుల్ గాంధీ చెప్పిన సమాధానాలనే చెప్పినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. విచారణలో భాగంగా మొదటి రెండు రోజులు సోనియాను అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్(ఏజేఎల్), యంగ్ ఇండియా లావాదేవీలకు సంబంధించిన ప్రశ్నలనే అధికారులు అడిగినట్లు తెలుస్తోంది. అయితే ఆ లావాదేవీలన్నింటినీ కాంగ్రెస్ దివంగత నేత మోతీలాల్ వోరానే చూసుకున్నట్లు సోనియా బదులిచ్చారని సమాచారం. కాంగ్రెస్ పార్టీకి అత్యధిక కాలం కోశాధికారిగా పనిచేసిన మోతీలాల్ వోరా 2020లో కన్నుముశారు. అంతకుమందు రాహుల్ గాంధీ కూడా ఈడీ విచారణలో ఇదే సమాధానం చెప్పినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, పవన్ కుమార్ బన్సాల్ కూడా ఈడీ విచారణలో ఇదే సమాధానం చెప్పారని తెలిపాయి. అలాగే యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించి ఈడీ అధికారులు గతంలో రాహుల్‌ను ప్రశ్నించగా.. అధి లాభాపేక్ష లేని సంస్థ అని దాని నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని ఆయన సమాధానం చెప్పినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. ఇప్పుడు సోనియా గాంధీ నోటి వెంట కూడా ఇవే సమాధానాలు వచ్చినట్లు పేర్కొన్నాయి. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో రాహుల్ గాంధీని జూన్‌లో 50 గంటలపాటు ప్రశ్నించారు ఈడీ అధికారులు. ఇప్పుడు సోనియా గాంధీని మూడు రోజుల పాటు 10 గంటలకుపైగా విచారించారు. ఈమె కూడా జూన్‌లోనే విచారణకు హాజరుకావాల్సి ఉన్నప్పటికి కరోనా కారణంగా అధికారులను సమయం కోరడంతో వారు అంగీకరించారు. చదవండి: శివసేన నుంచి మరో సీఎం వస్తారు.. బీజేపీ మాట తప్పడం వల్లే ఎంవీఏ పుట్టింది -
మద్రాస్ హైకోర్టులో మారన్ సోదరులకు ఎదురుదెబ్బ
చెన్నై: ఎయిర్‌సెల్-మాక్సిస్ ఒప్పందానికి సంబంధించిన మనీల్యాండరింగ్ కేసులో తమ ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ) అటాచ్ చేయడాన్ని సవాలు చేస్తూ కళానిధి మారన్‌కు చెందిన సన్ టీవీ, కల్ కమ్యూనికేషన్లు వేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. పిటిషన్‌ను విచారించనని, ఈ కేసును సుప్రీం కోర్టు పర్యవేక్షిస్తోంది కనుక అక్కడికే వెళ్లాలని జస్టిస్ సత్యనారాయణన్ బుధవారం చెప్పారు. టెలికం మాజీ మంత్రి దయానిధి మారన్, ఆయన సోదరుడు కళానిధి , ఇతర కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్న రూ. 742 కోట్ల ఆస్తులను తాత్కాలికంగా జప్తు(అటాచ్మెంట్) చేస్తూ ఈడీ మార్చిలో ఇచ్చిన ఉత్తర్వును పిటిషనర్లు సవాలు చేశారు. దయానిధికి చెందిన సన్ డెరైక్ట్ టీవీ, సౌత్ ఏసియా ఎఫ్ఎం లిమిటెట్ కంపెనీల్లోకి పెట్టుబడుల ముసుగులో రూ. 742 కోట్ల ముడుపులు వచ్చాయని సీబీఐ ఆరోపించడం తెలిసిందే.