Vijay Mallya లగ్జరీ విల్లాను కొన్న బాలీవుడ్‌ జంట ఎవరో తెలుసా? | Vijay Mallya Kingfisher Villa In Goa Owned By This Bollywood Couple | Sakshi
Sakshi News home page

మాల్యా లగ్జరీ విల్లాను దక్కించుకున్న బాలీవుడ్‌ జంట ఎవరో తెలుసా?

Jun 6 2025 5:22 PM | Updated on Jun 6 2025 5:40 PM

Vijay Mallya Kingfisher Villa In Goa Owned By This Bollywood Couple

భారతీయ బ్యాంకులకు  వేలకోట్లు ఎగవేసి లండన్‌కు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్‌  మాల్యా (Vijay Mallya) మళ్లీ వార్తల్లో నిలుస్తున్నాడు. ఐపీఎల్‌ 2025 (IPL2025)లో ఆర్‌సీబీ (RCB)  టైటిల్‌ గెల్చుకున్న తరువాత మాల్యా  హాట్‌ టాపిక్‌గా నిలుస్తున్నాడు. 2008లో ఆర్‌సీబీ జట్టును స్థాపించిన ఇన్నాళ్లకు  ట్రోఫీని గెల్చుకోవడం మాల్యాకు  నిజంగా సంతోషకరమైన క్షణమే. అందుకే జట్టుపై ప్రశంసలు కురిపించాడు. 18  ఏళ్ల తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు టైటిల్ గెలవడం, సోషల్ మీడియా వేదికగా విజయ్ మాల్యా పోస్ట్ తరువాత నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. 

ముఖ్యంగా గోవాలోని విజయ్‌ మాల్యా కింగ్‌ఫిషర్‌  విల్లాని  ఎవరు కొన్నారు?  అనేది చర్చ నీయాంశంగా మారింది. పదండి ఆ వివరాలు తెలుసుకుందాం.

ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా  ఆర్‌సీబీతోపాటు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ వ్యవస్థాపకుడు. గోవాలోని ఐజయ్ మాల్యా కింగ్‌ఫిషర్ విల్లా విలాసాలకు పెట్టింది పేరు. ఈ విల్లాలో విలాసవంతమైన పార్టీలను నిర్వహించేవాడు. గ్లామర్ ప్రపంచంలోని ప్రముఖులు హాజరయ్యేవారు. ఉత్తర గోవాలోని ఉన్నత స్థాయి కాండోలిమ్ బీచ్ గ్రామంలో 12,350 చదరపు అడుగుల విస్తీర్ణంలో  ఉన్న ఈ విలాసవంతమైన  ఇంటిలో కృత్రిమ చెరువులు, ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్స్, ఓపెన్-ఎయిర్ డ్యాన్స్ ఫ్లోర్లు, పచ్చని తోటలు లాంటి హంగులెన్నో ఉన్నాయి.

మాల్యా వేలకోట్ల ఏగవేత కేసులో 2016లో, దర్యాప్తు ప్రారంభమైనప్పుడు, బ్యాంకుల రుణాల చెల్లింపు  ప్రక్రియలో భాగంగా దీన్ని బ్యాంకుల కన్సార్షియం వేలానికి పెట్టింది.  ఖరీదైన కింగ్ ఫిషర్ విల్లాను ఎస్బీఐ బ్యాంకు ఎన్నిసార్లు వేలానికి పెట్టినా ఎవ్వరూ కొనడానికి ముందుకు రాలేదు. . ఆన్‌లైన్ ఆక్షన్‌లో ఎవ్వరూ దీనిని సొంతం చేసుకోవడానికి ముందుకు రాలేదు. ఎట్టకేలకు  2017లో ఈ  విల్లాను బాలీవుడ్ దంపతులు సచిన్ జోషి ,ఊర్వశి శర్మ రూ. 73.01 కోట్లకు కొనుగోలు చేశారు.  తరువాత  ఈ విల్లా పేరును కింగ్స్ మాన్షన్‌గా మార్చాడు

చదవండి: రూ. 5 కోట్ల ఎఫ్‌డీలు కొట్టేసింది..మునిగింది : ఐసీఐసీఐ అధికారి నిర్వాకం

కింగ్‌ఫిషర్ విల్లా- కింగ్స్‌మాన్షన్‌
విజయ్ మాల్యా లాగే, సచిన్ జోషి కూడామద్యం తయారీ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు, దీని ఉత్పత్తులలో 'కింగ్స్ బీర్' కూడా ఉంది. కింగ్స్ బీర్ బ్రాండ్ కనెక్షన్‌ కారణంగా ఈ పేరు పెట్టినట్టు గతంలో ఒక సందర్బంలో వెల్లడించాడు సచిన్‌.

చదవండి: Food Crisis In Gaza: రూ. 5ల బిస్కట్‌ ధర రూ. 2400, కప్పు కాఫీ రూ.1800..ఎక్కడ?

ఎవరీ సచిన్ జోషి 
ప్రముఖ వ్యాపారవేత్త  జగదీష్ మోహన్ లాల్ జోషి కుమారుడు  సచిన్‌ జోషి. తండ్రి స్థాపించిన  జేఎంజే గ్రూప్ ఆఫ్  ఇండస్ట్రీస్‌కి అధిపతివున్నాడు. సచిన్‌ కేవలం వ్యాపారవేత్త మాత్రమేకాదు హీరో కూడా. క్రీడలంటే ఆసక్తి. 2002లో 'మౌనమేలనోయి..' అనే సినిమాతో టాలీవుడ్ ద్వారా నటుడిగా సినీపరిశ్రమకి పరిచయమైన సచిన్‌ 2011లో అజాన్ చిత్రంతో హిందీ చలనచిత్ర రంగ ప్రవేశం చేశాడు. ముంబై మిర్రర్, జాక్‌పాట్ చిత్రాలతోపాటు  తెలుగు చిత్రాలలో కూడా నటించినా పెద్దగా కలిసి రాలేదు. 2021లో మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసింది. ఈ మాజీ నటి ఊర్వశి శర్మను వివాహం చేసుకున్నారు.వీరికి ఇద్దరు పిల్లలు. 

Advertisement
 
Advertisement
Advertisement