breaking news
mohan nayak
-
దేవికా నం.1.. మోహన్ నం.2
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన ఆర్ అండ్ బీ ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) జరుప్ల మోహన్ నాయక్ స్థిరచరాస్తుల డాక్యుమెంట్ విలువ రూ.17.94 కోట్లుగా తేలింది. దీంతో ఏసీబీ చరిత్రలోనే రెండో అతిపెద్ద ‘అవినీతి అనకొండ’గా మోహన్ నాయక్ రికార్డులకెక్కారు. ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) మాజీ డైరెక్టర్ దేవికారాణి ఇప్పటికీ మొదటి స్థానంలో ఉన్నారు. థర్డ్ శివబాలకృష్ణ..ఫోర్త్ కిషన్ ఈఎస్ఐ మందుల సరఫరా కుంభకోణంలో 2019లో అరెస్టు అయిన దేవికారాణి నుంచి ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న మొత్తం ఆస్తుల విలువ అధికారిక లెక్కల ప్రకారం రూ.25,70,84,461గా తేలగా.. మోహన్ నాయక్ రూ.17,94,62,617తో రెండో స్థానంలో ఉన్నారు. ఈ ఆస్తుల బహిరంగ మార్కెట్ విలువ పది నుంచి ఇరవై రెట్లు అధికంగా ఉంటుంది. 2024 జనవరిలో చిక్కిన హెచ్ఎండీఏ ప్లానింగ్ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ రూ.13.3 కోట్లతో మూడో స్థానంలో, మహబూబ్‌నగర్ మాజీ డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ కిషన్ రూ.12.72 కోట్లతో నాలుగో స్థానంలో ఉన్నారు. ‘లంచాల’కోసం ఏడాదికి 30 లక్షలు ఎవరైనా బాధితులు ఓ అధికారి లంచం డిమాండ్ చేస్తున్నట్లు ఫిర్యాదు చేస్తే..రహస్య కెమెరాలు, వీడియో రికార్డింగ్ పరికరాలను బాధితుడికి అమర్చి అధికారి వద్దకు పంపి రికార్డు చేయిస్తారు. డిమాండ్ చేసిన మొత్తంలో కొంత ఇన్స్టాల్మెంట్గా ఇస్తానంటూ చెప్పిస్తారు. ఆ మొత్తాన్ని ఫిర్యాదుదారుడే సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఆ మొత్తం అందుకుంటున్న అధికారిని అప్పటికే మాటు వేసి ఉండే ఏసీబీ బృందాలు పట్టుకుంటాయి. డబ్బును సీజ్ చేసి కోర్టుకు సమరి్పస్తారు. ఆ మొత్తం కేసు తేలేవరకు కోర్టు అ«దీనంలోనే ఉంటుంది. అయితే ఈలోగానే నిర్ణీత సమయంలో డబ్బును ఫిర్యాదుదారుడికి ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది. దీనికోసం ఏడాదికి రూ.30 లక్షల చొప్పున ఏసీబీకి కేటాయిస్తుంది. వాస్తవానికి ‘రెడ్’కాదు ‘పింక్’ లంచగొండుల్ని ఏసీబీ ట్రాప్ చేస్తే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారని అంటారు. అయితే వాస్తవానికి ఇది ‘పింక్’హ్యాండెడ్‌గా పట్టుకోవడం. ఫిర్యాదుదారుడు తీసుకువచ్చిన మొత్తానికి ఏసీబీ అధికారులు ఫినాఫ్తలీన్ అనే రసాయన పొడిని పూస్తారు. లంచం తీసుకునే అధికారి లేదా ఆయన సూచించిన వ్యక్తి ఆ నోట్ల కట్టలు కచ్చితంగా చేత్తో పట్టుకుని ఉండాలి. అలా ముట్టుకున్నప్పుడు ఈ రసాయనం అంటుకుంటుంది. తర్వాత దాడి చేసి పట్టుకునే ఏసీబీ అధికారులు సదరు మొత్తాన్ని స్వాదీనం చేసుకోవడంతో పాటు ఆ అధికారి చేతుల్ని సోడియం బైకార్పొనేట్ ద్రావణంలో ముంచేలా చేస్తారు. అప్పుడు ఆ ద్రావణం పింక్ రంగులోకి మారుతుంది. (ఈ ప్రక్రియ రెడ్‌హ్యాండెడ్‌గా వాడుకలోకి వచ్చింది) తద్వారా లంచం తీసుకున్నట్టుగా నిర్ధారిస్తారు. దీన్ని వీడియో రికార్డింగ్ చేశాక అధికారులు న్యాయస్థానానికి సమర్పిస్తారు. గణనీయంగా పెరిగిన కేసులు.. ఏసీబీ అధికారులు మొత్తం 4 రకాలైన ఆపరేషన్లు చేపడతారు. లంచం తీసుకునే వాళ్లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడం (ట్రాప్), ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉండటం (అసెట్స్) వ్యవహారాలే మనకు ఎక్కువగా తెలుసు. వీటిని రిజిస్టర్డ్ కేస్ ట్రాప్ (ఆర్సీటీ), రిజిస్టర్డ్ కేస్ అసెట్స్ (ఆర్సీఏ) అంటారు. అలాగే చెక్‌పోస్టులు, కార్యాలయాలతో పాటు ఇతర ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు (ఎస్సీగా పిలిచే సర్ప్రైజ్ చెక్స్) ద్వారా గుర్తించే అవినీతిపై రిజిస్టర్డ్ కేస్ అదర్స్ (ఆర్సీఓ) నమోదు చేస్తారు. కాగా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది (మంగళవారం వరకు) ఈ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిందని అధికారులు చెప్తున్నారు. ఇలావుండగా మోహన్ నాయక్‌ను అధికారులు బుధవారం ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్‌కు ఆదేశించారు. అయితే తదుపరి విచారణ కోసం మోహన్ నాయక్ కస్టడీ కోరుతూ అధికారులు పిటిషన్ దాఖలు చేయనున్నారు. -
నిష్పక్షపాతంగా విచారించండి
సాక్షి, బెంగళూరు: పాత్రికేయురాలు గౌరి లంకేశ్ హత్య కేసులో నిందితుడు మోహన్ నాయక్ బెయిల్ పిటిషన్‌పై ఎలాంటి ప్రభావాలకు లోనుకాకుండా పరిష్కరించాలని కర్ణాటక రాష్ట్ర హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. గౌరి లంకేశ్ సోదరి కవితా లంకేశ్ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా నిందితుడు మోహన్ నాయక్‌పై కేసు కొట్టివేతను నిష్పక్షపాతంగా విచారించాలని సూచించింది. సంఘటిత నేరాల నియంత్రణ చట్టం ప్రకారం మోహన్ నాయక్‌పై దాఖలైన కేసును కర్ణాటక హైకోర్టు ఏప్రిల్ 22న రద్దు చేసింది. దీన్ని ప్రశ్నిస్తూ కవితా లంకేశ్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ మంజూరు చేయాని మోహన్ నాయక్ కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరోవైపు పిటిషనర్ కవిత లంకేశ్ ఎస్ఎల్పీ (స్పెషల్ లీవ్ పిటిషన్) దాఖలు చేయడంతో పాటు బెయిల్ రద్దు చేస్తూ మధ్యంతర ఆదేశాలివ్వాలని కోరగా దీనిపై కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని తెలపాలని ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 15కు వాయిదా వేసింది. కాగా, 2017 సెప్టెంబర్ 5న గౌరి లంకేశ్ బెంగళూరు రాజరాజేశ్వరి నగరలోని తన నివాసంలో దండుగుల కాల్పుల్లో మృతి చెందిన విషయం తెలిసిందే. -
ఆరిన ఆశాకిరణం
ముస్తాబాద్, న్యూస్‌లైన్: మారుమూల గిరిజన తండాకు చెందిన ఆ యువకుడు ఉన్నత విద్యాభ్యాసం చేస్తూ.. ఉద్యోగావకాశాల కోసం ప్రయత్నిస్తున్నాడు. ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో అవకాశం రావడంతో ఇంటర్వ్యూకు హాజరయ్యేందుకు స్నేహితుడితో కలిసి బైక్‌పై బయల్దేరాడు. కల సాకారం అవుతున్న వేళ.. లారీ రూపంలో ఎదురొచ్చిన వృుత్యువు యువకిశోరాన్ని బలిగొన్నది. ముస్తాబాద్ మండలం సేవాలాల్‌తండాకు చెందిన భూక్య మోహన్‌నాయక్(23) హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదివారం వృుతి చెందాడు. గ్రామ సర్పంచ్ భూక్య మంగ్యానాయక్ కుమారుడైన మోహన్‌నాయక్ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. చిన్ననాటి నుంచి చదువులో ముందుంటూ.. ఉన్నతోద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇటీవల ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగావకాశం రావడంతో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. వరంగల్ జిల్లా నెక్కొండకు చెందిన బి.రాజేశ్(23) ఓయూలో తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. వీరిద్దరు స్నేహితులు మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో ఆదివారం ఉదయం 9గంటలకు జరగనున్న ఇంటర్వ్యూ కోసం బైక్‌పై బయల్దేరారు. 8.45గంటలకు కొంపల్లి ఫ్లైఓవర్ సమీపంలోని ఎస్ఎన్ఆర్ గార్డెన్ ముందు నుంచి వెళ్తున్న వీరిని మేడ్చల్ నుంచి ఎదురుగా వచ్చిన రెడీమిక్స్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో మోహన్‌కుమార్ అక్కడికక్కడే వృుతి చెందాడు. రాజేశ్‌కు తీవ్రగాయాలు కావడంతో పేట్ బషీరాబాద్‌లోని ఆర్ఆర్ ఆస్పత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేసిన తర్వాత కుటుంబసభ్యులు మోహన్‌కుమార్ వృుతదేహాన్ని సాయంత్రం తండాకు తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. మోహన్‌కుమార్‌కు ఇద్దరు సోదరులున్నారు. పెద్దన్న సిద్దిపేట ఏరియా ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేస్తుండగా, రెండో అన్న మండలంలోని చీకోడులో ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్నారు.


