breaking news
Mohan Naik
-
రూ. 200 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రోడ్లు, భవనాల శాఖ (ఆర్అండ్బీ)లో భారీ అవినీతి అనకొండ ఏసీబీ అధికారులకు చిక్కింది. ఆ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ జరుప్ల మోహన్ నాయక్‌పై అవినీతి నిరోధక శాఖ మంగళవారం ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని చట్టబద్ధ ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో ఏసీబీ జాయింట్ డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్ నేతృత్వంలో 16 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.మియాపూర్‌లోని ఆయన నివాసం, ఎర్రమంజిల్‌లోని కార్యాలయం, నిజామాబాద్ సహా పలు ప్రాంతాల్లోని బంధువులు, సన్నిహితులు, బినామీల ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల విలువ రూ.17,94,62,617 అని ఏసీబీ ఓ ప్రకటనలో వివరాలు వెల్లడించింది. అయితే ఇది ప్రాథమిక అంచనా మాత్రమేనని, బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ.200 కోట్ల వరకు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(1)(బి), 13(2) కింద ఆయనపై కేసు నమోదు చేశారు. భూములు, ఫ్లాట్లు, విల్లాలు.. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ముల్లంగి గ్రామంలో 19.38 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. అధికారిక విలువ ప్రకారం దీని ధర రూ.82.89 లక్షలు. కొంపల్లిలో 3, గచ్చి»ౌలిలో 4 కలిపి మొత్తం 7 ఫ్లాట్లు గుర్తించారు. వీటి అంచనా విలువ రూ.7.34 కోట్లు. మియాపూర్‌లో ట్రిప్లెక్స్ విల్లా విలువ రూ.2.50 కోట్లు, కూకట్‌పల్లిలో కొత్తగా నిర్మించిన ఇంటి విలువ రూ.62.14 లక్షలుగా పేర్కొన్నారు. నిజామాబాద్‌లో నిర్మిత విల్లా కొనుగోలుకు రూ.1 కోటి అడ్వాన్స్ చెల్లించినట్లు అధికారులు గుర్తించారు. అలాగే సోదాల్లో రూ.55 లక్షల నగదు, బ్యాంకు ఖాతాల్లో రూ.1.44 కోట్ల నిల్వలు గుర్తించారు.సుమారు 2.5 కిలోల బంగారు ఆభరణాలు, గోల్డ్ బిస్కెట్లు స్వా«దీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.2 కోట్లు. అలాగే 6 కిలోల వెండి ఆభరణాలు, రూ.1.26 కోట్ల గృహోపకరణాలు, 9 మొబైళ్లు, 4 ల్యాప్‌టాప్‌లు సహా రూ.11.25 లక్షల ఎలక్ట్రానిక్ పరికరాలు, రూ.25 లక్షల విలువైన రెండు వాహనాలు గుర్తించారు. రూ.4.44 లక్షల విలువైన 22 ఫారిన్ లిక్కర్ బాటిళ్లను కూడా సీజ్ చేసి ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు. దీనిపై ఎక్సైజ్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నేడు కూడా సోదాలు? సోదాల అనంతరం మోహన్ నాయక్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్‌లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. బుధవారం వైద్య పరీక్షల తర్వాత ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరచనున్నారు. కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది. సోదాలు బుధవారం కూడా కొనసాగే అవకాశముందని ఏసీబీ వర్గాలు తెలిపాయి. ఆర్‌అండ్‌బీలో కలకలం భారీ ప్రాజెక్టులు, టెండర్లు, నిర్మాణ పనులకు సంబంధించిన నిర్ణయాధికార స్థానంలో ఉన్న ఆర్అండ్బీ ఉన్నతాధికారిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు కావడం శాఖలో కలకలం రేపింది. బినామీ ఆస్తులు, పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీలపై లోతైన విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.వందల కోట్ల అవినీతిలో అక్రమార్కులు రాష్ట్రంలో ఉన్నతాధికారుల అవినీతి వ్యవహారాలు వరుసగా బయటపడుతున్నాయి. ఏకంగా వందల కోట్లలో అవినీతి కార్యకలాపాలు ఏసీబీ దాడుల్లో వెలుగుచూస్తున్నాయి. తనిఖీల్లో నగదు, బంగారం, వెండి ఆభరణాలు, బ్యాంకు లాకర్లు, భూములు, ప్లాట్లు, ఫ్లాట్ల పత్రాలు పెద్ద ఎత్తున బయటపడటం రాష్ట్రంలో అవినీతి ఏ స్థాయికి చేరిందో చాటుతోంది. ఈఎన్సీలు, అదనపు కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, తహశీల్దార్లు, అదనపు ఎస్పీలు, మునిసిపల్ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ విభాగంలో డైరెక్టర్ స్థాయి అధికారులు సైతం భారీ అక్రమాస్తుల కేసుల్లో చిక్కుతున్నారు.హెచ్ఎండీఏ డైరెక్టర్‌గా పనిచేసిన శివ బాలకృష్ణ వద్ద బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం దాదాపు రూ.200 కోట్లకుపైగా ఆస్తులు ఉన్నట్లు అప్పట్లో అంచనా వేశారు. నీటిపారుదల శాఖలో కాలేశ్వరం ప్రాజెక్టు గజ్వేల్ ఈఎన్సీ హరిరామ్, మాజీ ఈఎన్సీ మురళీధర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ పేర్లు కూడా అవినీతి ఆరోపణల నేపథ్యంలో తెరపైకి వచ్చాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలో అదనపు కలెక్టర్‌గా పనిచేసిన అధికారి, ఫోన్ ట్యాపింగ్ కేసులో సస్పెండ్ అయిన నాయిని భుజంగరావు, జలమండలిలో ఇటీవల పట్టుబడిన ఉన్నతాధికారి, మేడ్చల్ మల్కాజ్గిరి డిప్యూటీ కలెక్టర్ మర్రి వంశీమోహన్ ఆస్తులు పదుల కోట్లలో ఉంటే.. కొందరి ఆస్తులు ఏకంగా వందల కోట్లు దాటుతున్నాయి. -
నోటికాడి పంటనీటిపాలు
6795 ఎకరాల్లో పత్తి... 1584 ఎకరాల్లో వరి =వర్షం ధాటికి దెబ్బతిన్న పంటలు... నేలకూలిన నివాస గృహాలు = ఏజెన్సీలో ఉధృతంగా ప్రవహిస్తున్న జంపన్నవాగు... రాకపోకలకు అంతరాయం =వరంగల్‌లో ఇళ్లలోకి నీళ్లు... రోడ్లు, భవనాల శాఖకు రూ.20 కోట్ల నష్టం =జాతీయ విపత్తుల నివారణ శాఖకు నష్టం అంచనా నివేదించిన కలెక్టర్ వరంగల్, న్యూస్‌లైన్ : వరుస వానలు జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. ప్రధాన పంటలన్నీ వర్షం ధాటికి దెబ్బతిన్నాయి. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో 6795 ఎకరాల్లో పత్తి, 1584 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్టు కలెక్టర్ ప్రకటించారు. ఇప్పటి వరకు ప్రాథమికంగా వేసిన నష్టం అంచనాను జాతీయ విపత్తుల నివారణ కమిషనర్, రెవెన్యూ విభాగానికి పంపించినట్టు తెలిపారు. క్షేత్రస్థాయిలో సర్వే జరుగుతున్నదని, త్వరలోనే పూర్తిస్థాయి నివేదిక పంపిస్తామన్నారు. పది నివాస గృహాలు నేలమట్టం కాగా, 23 ఇళ్లు దెబ్బతిన్నాయని, మరో 109 ఇళ్లు పాక్షికంగా ధ్వంసమైనట్లు జిల్లా యంత్రాంగం గుర్తించింది.ఏజెన్సీలోని జంపన్నవాగు ఉధృతంగా ప్రవహిస్తుం డడంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించారుు. వరంగల్ కార్పొరేషన్ పరిధిలోని పలు కాలనీలు జలమయమయ్యూయి. చిన్న వడ్డేపల్లి చెరువు, కాశిబుగ్గ, వివేకానంద కాలనీ, శాంతినగర్, పద్మనగర్, ఎంహెచ్ నగర్, సుందరయ్య నగర్, దేశాయిపేట, సమ్మయ్యనగర్, నయీంనగర్, గోపాల్పూర్ ప్రాంతాల్లోని పలు ఇళ్లలోకి వర్షం నీరు చేరింది. ఈనెల 22 నుంచి వరుసగా వర్షం కురుస్తోంది. 23న 11.7 మి.మీ, 24న 23.3 మి.మీ, 25న 28.6 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. శుక్రవారం అత్యధికంగా గీసుగొండ మండలంలో 92 మి.మీ. వర్షం కురిసింది. అదే విధంగా సంగెంలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొత్తం 51 మండలాల్లో వర్షం కురిసింది. కాగా, కురవిలో పంట నష్టపరిహారం చెల్లించాలంటూ రైతులు ధర్నా చేశారు. పంట నష్టం అధికంగా ఇక్కడే.. జనగామ, నర్మెట్ట, మద్దూరు, చేర్యాల, బచ్చన్నపేట, పరకాల, ఆత్మకూర్, గీసుగొండ, సంగెం, డోర్నకల్, ములుగు, మంగపేట, ఏటూర్‌నాగారం, వర్ధన్నపేట, నర్సంపేట, దుగ్గొండి ఖానాపురం, నల్లబెల్లి నెక్కొండ, చెన్నారావుపేట మండలాల్లో పంటలకు అధికంగా నష్టం వాటిల్లింది. ములుగులో 100 ఎకరాల్లో మిర్చి పంటకు వర్షాలతో తెగుళ్లు సోకినట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. తెగుళ్లతో మిర్చి దిగుబడి తగ్గే అవకాశమున్నట్లు భావిస్తున్నారు. ఇక భూపాలపల్లి సింగరేణి ఓపెన్‌కాస్ట్‌లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. 99 రోడ్లు ధ్వంసం ఆర్అండ్బీ పరిధిలోని వరంగల్, మహబూబాబాద్ డివిజన్లో 99 రోడ్లు ధ్వంసమైనట్లు అధికారులు గుర్తించారు. వీటిని శాశ్వతంగా మరమ్మతు చేసేందుకు రూ.20 కోట్లు అవసరమని, తాత్కాలిక మరమ్మతులకు రూ.2.50 కోట్లు అవసరమని ప్రభుత్వానికి నివేదించినట్లు ఎస్ఈ మోహన్ నాయక్ చెప్పారు. వర్షపాతం ఇలా.. జిల్లా వ్యాప్తంగా సగటు వర్షపాతం 28.6 మి.మీగా నమోదైంది. చేర్యాలలో 19.6, మద్దూరులో 25.2, నర్మెట్ట 46.6, బచ్చన్నపేట 20.2, జనగామ 28.4, లింగాలఘణపూర్ 28, రఘునాథపల్లి 34.8, స్టేషన్‌ఘన్‌పూర్ 38.2, ధర్మసాగర్ 42.2, హసన్‌పర్తి 38.2, హన్మకొండ 41.2, వర్థన్నపేట 35.2, జఫర్గడ్ 38.2, పాలకుర్తి 46.2, దేవరుప్పుల 52.2, కొడకండ్ల 30.2, రాయపర్తి 22.4, తొర్రూర్ 17.4, నెల్లికుదురు 8.4, నర్సింహులపేట 12.8, మరిపెడ 9.2, డోర్నకల్ 5.4, కురవి 3.6, మహబూబాబాద్ 5.6, కేసముద్రం 12.2, నెక్కొండ 5.6, గూడూర్ 9.8, కొత్తగూడ 12.2, ఖానాపూర్ 12.2, నర్సంపేట 22.8, చెన్నారావుపేట 10.2, పర్వతగిరి 20.2, సంగెం 62.4, నల్లబెల్లి 12.6, దుగ్గొండి 14.2, గీసుకొండ 92.0 ఆత్మకూరు 32.4, శాయంపేట 42.0, పరకాల 61.4, రేగొండ 24.0, మొగుళ్లపల్లి 54.6, చిట్యాల 59.2, భూపాలపల్లి 32.6, ములుగు ఘన్పూర్ 25, ములుగు 14.8, వెంకటాపూర్ 51.6, గోవిందరావుపేట 8.0, తాడ్వాయి 25.2, ఏటూరునాగారం 27.2, మంగపేట 12.8, వరంగల్‌లో 46.2 మి.మీ వర్షపాతం నమోదైంది.


