breaking news
modern lifestyle
-
మళ్లీ వచ్చేశాయ్.. ఏ చీరకాకాసు.. తళతళల కాసులు!!
కంచిపట్టుచీరకు కనకపు కాసు, సిల్క్ కుర్తాకు సిల్వర్ కాసు, వెస్ట్రన్ వేర్‌కు ఆక్సిడైజ్డ్ కాసు లోహమేదైనా... ధరించే దుస్తులు ఏవైనా పండగ రోజున కాసుల పేరు మెడ నిండుగా.. కనుల పండుగలా కమనీయంగా కట్టడి చేస్తుంది. ఎంపిక మీదే సుమా అన్నట్టుగా ఆకట్టుకుంటుంది. బంగారు కాసుల పేరు బామ్మలనాటి డిజైన్ అయినా నేటికి తన హుందాతనాన్ని, లక్ష్మీ కళను తరతరాలకు అందిస్తూనే ఉంది. ఏ వేడుకకైనా నిండుతనాన్ని తీసుకువస్తుంది. ఆధునిక యువతికి వేషధారణకు తగినట్టు సిల్వర్ కాయిన్లు రకరకాల డిజైన్లలో కనువిందుచేస్తున్నాయి. కొన్ని అఫ్గాన్స్టైల్, మరికొన్ని బొహేమియన్ స్టైల్... అంటూ విదేశీ కాసులు కూడా వినూత్నమైన హారాలుగా ఆకట్టుకుంటున్నాయి. చదవండి: Mysteries Temple: అందుకే రాత్రి పూట ఆ దేవాలయంలోకి వెళ్లరు..! కాసులు సిల్క్ దారాలతో జత కలుస్తున్నాయి, పూసలతో దోస్తీ కడుతున్నాయి. లోహానికి తగిన ధరల్లో వేల రూపాయల నుంచి వందల రూపాయల్లో ఆభరణాల మార్కెట్, ఆన్లైన్ షాపింగ్‌లో రెడీమేడ్ కాసులు లభిస్తున్నాయి. నూరు కాసులతో ఓ హారం లేదంటే నాలుగు కాసులతో సరిపెట్టుకునే హారమైనా అందమైన డిజైన్లతో నేడు మరింత కళగా కనులకు విందు చేస్తున్నాయి. ఆభరణాల జాబితాలో ఎప్పటికీ నిలిచి ఉండే కాసు హారాలు ఈ దీపావళి పండగకు కొత్త కళను నింపనున్నాయి. చదవండి: Viral Video: అరె.. ఏం చేస్తున్నావ్.. ఛీ! డ్రైనేజీ వాటర్‌తోనా.. -
ఆరోగ్యానికి పారాహుషార్!
మనం కాస్త పరాకును వదిలి అప్రమత్తగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. మనం మన ఉదాసీనతను వీడి జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చేసింది. ఎందుకంటే ఆధునిక జీవనశైలి వల్ల వస్తున్న వ్యాధులు దేశాన్ని చుట్టుముట్టబోతున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని నివారించేందుకు అవసరమైన చర్యలను ప్రజలకు తెలియజెప్పే సంకల్పాన్ని తీసుకుంది ‘సాక్షి’. ఇందుకోసం ఈ నెల 8, 9 తేదీల్లో హైటెక్స్ ‘సాక్షి వెల్నెస్ ఎక్స్పో’ పేరిట భారీ ప్రదర్శనను, అవగాహన కార్యక్రమాలను నిర్వహించనుంది. ఈ సందర్భంగా సాక్షి మీ ముందుకు తెస్తున్న మరణమృందంగ ఘంటికా రావాల శబ్దాలివి. ఇవి మిమ్మల్ని అప్రమత్తం చేయడం కోసం మాత్రమే. అవగాహన పెంచుకొని రాబోయే ముప్పును మనమంతా ఎదుర్కోవడం కోసమే. ఆనాడది అంతు చిక్కని కాలం! ఒకప్పుడు అది అంటురోగాల కాలం! యాంటీబయాటిక్స్ కనిపెట్టని కాలంలో అంటువ్యాధులంటే అంతుచిక్కని వ్యాధులే!! మశూచీ, ప్లేగు, కలరా లాంటి వ్యాధులు అతి వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించేవి. ఇలా ముట్టుకున్న వెంటనే అంటుకునే సాంక్రమిక వ్యాధులు యాంటీబయాటిక్స్ కనిపెట్టాక అదుపులోకి వచ్చాయి. అంటే మనం పురోగమించాం. అన్ని రకాలుగా! ఎన్నో చిరుతిండ్లు... కానీ పోషకాల్లేవు. ఎన్నో సుఖాలు... కానీ శారీరక శ్రమ లేదు. ఎన్నో వినోదాలు... కంటి నిండా నిద్ర లేదు. ప్రస్తుతం జీవనశైలి వ్యాధుల తీవ్రదశ కొనసాగుతోంది. అందుకే వీటి గురించి అవగాహన పొంది, నివారణ కోసం ఉద్దేశించిన కథనమిది... ఆధునిక జీవనశైలి... అనారోగ్య కారణం ఆధునిక జీవనశైలితో వచ్చిన మార్పులు అనేక అనారోగ్యాలను తెచ్చిపెడుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చెబుతున్న మాట ఇది. ఈ అనారోగ్యాలు ప్రమాదకరమైన వేగంతో విస్తరిస్తూ పోతున్నాయి. ప్రస్తరిస్తూ పెరుగుతున్నాయి. పెచ్చరిల్లుతున్నాయి. కునారిల్లజేస్తున్నాయి. కూలిపోయేలా, జీవితాన్ని కోల్పోయేలా చేస్తున్నాయి. ఆధునిక జీవనశైలి వల్ల వస్తున్న వ్యాధులివే... డయాబెటిస్ (మధుమేహం) హైపర్‌టెన్షన్ (అధిక రక్తపోటు) స్థూలకాయం థైరాయిడ్ సమస్యలు ఎముకలు పెళుసుబారి పుట్టుక్కున విరిగేలా చేసే ఆస్టియోపోరోసిస్ పెద్దపేగు, ఊపిరితిత్తులు... మొదలైన అన్ని రకాల క్యాన్సర్లు సీఓపీడీ వంటి ఊపిరితిత్తుల వ్యాధులు సంతానలేమి విటమిన్ డి లోపాలు, దాని వల్ల వ్యాధినిరోధకశక్తి లోపించి వచ్చే అనేక రకాల వ్యాధులు విటమిన్ బి12 లోపాలు గుండెజబ్బులు. ఎందుకిలా జీవనశైలి వ్యాధులు తీవ్రతరమవుతున్నాయి? డెబ్బయిల తర్వాత మన జీవనశైలిలో వచ్చిన వేగవంతమైన మార్పులతో ఈ వ్యాధుల తీవ్రత మరింత పెరుగుతోంది. వ్యాధుల తీవ్రత పెరగడానికి దోహదపడుతున్న ఆధునిక మార్పులివే... నగరీకరణ : మంచి చదువులు, మంచి ఉపాధి అవకాశాల కోసం ప్రజలు పల్లెలు వదిలి నగరాలకు రావడం పెరిగింది. అంతేకాదు... మునుపటితో పోలిస్తే పల్లెల్లోనూ నగరీకరణ పోకడలు పెరిగాయి. దాంతో పట్టణల్లోనే కాదు... మునుపటితో పోలిస్తే పల్లెల్లోనూ కాలుష్యం పెరగడం, ఆకుపచ్చదనం తగ్గడం, ఆటలాడటానికి అనువైన స్థలాల లేమి వంటివి పెరిగాయి. ఇవన్నీ అనారోగ్యానికి దోహదం చేసే అంశాలే. ఆహారపు అలవాట్లు : మనం తినే ఆహారంలో పాశ్చాత్య పోకడలు పెరిగిపోయాయి. ఇందులో పోషకాల కంటే రుచి కోసం కొవ్వు, క్యాలరీలే ఎక్కువ. ఇక ఈ నవీనకాలంలోని వ్యయసామర్థ్యాలను పెంచుకోవడం కోసం భర్తా, భార్య... ఇద్దరూ సంపాదిస్తున్నారు. దాంతో మంచి పోషకాహారాలను ఇంట్లోనే తయారు చేసుకునే సమయం లేక ఏదో సమయానికి ఎంతో కొంత కడుపులో పడేలా చూసుకుంటున్నారు. అంతే తప్ప... ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం లేదు. శారీరక శ్రమ లేకుండా ఎప్పుడూ కూర్చొని ఉండే జీవనశైలి : ఇటీవల అందుబాటులోకి వచ్చిన చాలా రకాల ఉపాధి అవకాశాలు దాదాపుగా శారీరక శ్రమ లేకుండా కూర్చొని చేసేవే ఎక్కువగా ఉంటున్నాయి. ఉదాహరణకు ఐటీ ఉద్యోగాల వంటి వాటిల్లో 10 - 12 గంటలు కూర్చొనే ఉండాల్సినవే. రైతులు, పొలాల్లో పనిచేసే వారు మినహా మిగతావారంతా దాదాపుగా ఎక్కువసేపు కూర్చొనే పనిచేస్తుంటారు. వాహన సౌకర్యాలు : గతంలో మన తండ్రులు, తాతలు నడుస్తూనో లేదా సైకిల్ మీదో కార్యాలయాలకు వెళ్లేవారు. కానీ ఇటీవల శరీర శ్రమకు ఏమాత్రం ఆస్కారం లేని వాహన సౌకర్యాలే ఎక్కువ. నడవడానికి అవకాశం దాదాపు లేదు. ఇక ఇంట్లో ఉన్నా సరే... గతంలో ఉన్న కార్యకలాపాలు కాస్త ఒంటికి పనిచెప్పేవిగా ఉండేవి. కానీ ఇటీవల ఇంట్లో మనం వ్యవహరించే తీరుతెన్నుల్లోనూ మార్పు వచ్చింది. పని పేరిట ల్యాప్‌టాప్ మీద, వినోదం పేరిట టీవీ స్క్రీన్ మీద నిలిపి, శరీరాన్ని ఏ సోఫా మీద వదిలేస్తున్నాం. పైగా ఇదే సమయంలో ఏదో నములుతూ ఉండిపోతున్నాం.ఈ ఆధునిక అవలక్షణాలన్నింటితోనూ వ్యాధులకు అనువైన స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నాం... ఆ అనువైన ఆవాసమే - మన శరీరం! ఒత్తిడితో చిత్తుచిత్తుగా ఓటమి : ఇటీవల దాదాపు ప్రతి ఒక్కరి జీవితంలో అనివార్యమైన స్థానాన్ని ఆక్రమించుకుంది ‘ఒత్తిడి’. అది పని ఒత్తిడి కావచ్చు. ఇంట్లోని ‘డొమెస్టిక్ ఒత్తిడి’ కావచ్చు. వీధిలో ‘సామాజిక ఒత్తిడి’ కావచ్చు. ఇలా ఒత్తిడి బారిన పడని మనిషి లేడంటే అతిశయోక్తి కాదు. పైగా పనిగంటలూ మారిపోయాయి. దాంతో అనాదిగా మనిషి విశ్రాంతి కోసం ప్రకృతి నిర్దేశించిన సమయం సైతం ఒత్తిడిని కలిగించి అనేక శారీరక, మానసిక రుగ్మతలకు తావిస్తోంది.వేళకు తినకపోవడం, ఏది పడితే అది తినడం, వేళలు తప్పి పనిచేయడం, వేళలు తప్పి నిద్రపోవడం లాంటి అన్ని అంశాలూ కలగలసిపోయి, కలగాపులగమై మనిషిని వ్యాధులకు గురిచేస్తున్నాయి. జీవనశైలి వ్యాధులతో జీవితంపై ఎంత భారం...? ఎంత బరువు? ఊబకాయంతో బతుకు బరువు! ఆధునిక జీవనశైలి వల్ల మన జీవితం అన్ని విధాలా ఎంత భారమవుతోందో గ్రహించడానికి ఒక్క స్థూలకాయ సమస్యే చాలు. ఒక్క ఒళ్లు బరువైపోతే జీవితంలోని ఎన్నో అంశాలు బరువైపోయినట్లే! ప్రపంచవ్యాప్తంగా స్థూలకాయుల సంఖ్య 1980 నుంచి 2014 నాటికి రెట్టింపు అయ్యింది. పద్ధెనిమిదేళ్లు దాటిన వారిలో ప్రస్తుతం 11 శాతం మంది పురుషులుంటే మహిళల్లో 18 శాతం మంది ఊబకాయులే.2013 నాటి లెక్కల ప్రకారం ప్రపంచంలో ఐదేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లల్లో నాలుగు కోట్ల ఇరవై లక్షలమంది పసిపిల్లలంతా ఊబకాయులే. ఇలా పిల్లల్లో ఊబకాయం సమస్య ఇంతగా పెచ్చరిల్లుతుంటే తొలిలెక్కల్లో 34 ఏళ్ల వ్యవధిలోనే స్థూలకాయుల సంఖ్య రెట్టింపైనప్పుడు 2013 నాటి లెక్కల ప్రకారం వీళ్లంతా తమ ఒంటినే పెద్దబరువుగా పరిగణిస్తూ బతుకును ఈడుస్తూ ఉంటారు. ఇప్పుడు కాస్త మంచి ఆహారం అందుబాటులో ఉన్న దేశాలలో, ధనిక దేశాలతో పాటు మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సైతం మూడో వంతు మంది చిన్నారులు చాలా భారంగా తమ బతుకులను ఈడుస్తూ జీవించబోతున్నారు. చేదుగా అనిపించినా ఇది భవిష్యత్తు నిజం. గడగడలాడించే డయాబెటిస్ గణాంకాలు : డయాబెటిస్ ప్రపంచాన్ని ఎంతగా గడగడలాడిస్తుందో చెప్పడానికి మాటలక్కర్లేదు. ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ ఒకరో, ఇద్దరో డయాబెటిస్ పేషెంట్లు ఉండనే ఉంటారు. డయాబెటిస్ సభ్యులు లేని కుటుంబమే భారత్‌లో లేదంటే అది అతిశయోక్తేమీ కాదు. గణాంకాల్లో చెప్పాలంటే... 2000 నాటికి మన దేశంలో 62 లక్షల మంది డయాబెటిస్ రోగులు ఉండేవారని అంచనా. ఇవాళ్టికి ఆ సంఖ్య 3.17 కోట్లకు చేరి, ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. (2.08 కోట్లతో రెండో స్థానంలో చైనా, 1.77 కోట్ల మందితో యూఎస్ మూడోస్థానంలో ఉన్నాయి). అయితే కేవలం 15 ఏళ్ల వ్యవధిలోనే పాశ్చాత్యదేశాలను అధిగమించేలా మన దగ్గరి రోగుల సంఖ్య ఇంత తీవ్రంగా పెరిగిందంటే మనం ఏ మేరకు అనారోగ్యకరమైన పరిస్థితుల్లో ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు... ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం 2030 నాటికి ఆ సంఖ్య 36.6 కోట్లకు చేరుతుందని అంచనా. అంటే ఇప్పుడున్న జనాభాలో మూడో వంతు డయాబెటిస్ రోగులు ఉంటారంటే వణుకు పుట్టడం లేదూ! పైన పేర్కొన్న అనారోగ్య పరిస్థితులన్నీ భారత్‌లో ఈ వ్యాధి ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోవడానికి దోహదం చేస్తోంది. కేవలం గతంలో పెద్దల్లో ఎక్కువగా కనిపించే వ్యాధి, ఇప్పుడు టైప్-1 రూపంలో పిల్లల్లోనూ కనిపిస్తోంది.ఇక డయాబెటిస్‌కు దగ్గర్లో (బార్డర్‌లైన్‌లో) ఉన్న రోగుల సంఖ్యకు లెక్కేలేదు. ఒక నిర్దిష్టమైన అంచనా కూడా లేదు. అయితే ఇంతగా వణికించే పరిస్థితులున్నా ఈ బార్డర్‌లైన్ రోగులకు ఇంకా ఆరోగ్యస్పృహ లేక, ఆహార నియమాలు, లేక వాకింగ్ వంటి పరిమిత వ్యాయామాలపై దృష్టి లేకుండా విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. కేవలం నడక, వేళకు సరైన భోజన నియమాలు అనే చిన్న జాగ్రత్తతో ఇందులో ఎంతోమంది తమ డయాబెటిస్‌ను చాలావరకు నివారించుకోవచ్చు. లేదా వీలైనంత ఆలస్యం చేయవచ్చు. పోటెత్తుతున్న రక్తపోటు రోగుల సంఖ్య రక్తపోటు వ్యాధికి సెలైంట్కిల్లర్ అని పేరు. చాపకింద నీరులా వచ్చే ఈ వ్యాధి కొందరిలో మూత్రపిండాలూ, కాలేయం, చివరికి మెదడు దెబ్బతిని పక్షవాతం అనే రోగాలను తెచ్చిపెట్టేంత వరకూ దీని ఉనికే తెలియదు. ఆరోగ్యస్పృహ లేకపోవడం, ఆరోగ్యవిషయాలపై అవగాహన లేకపోవడంతో మన దేశంలోని చాలామందిలో దీని ఉనికి తెలిసేనాటికీ జరగాల్సిన నష్టం జరిగిపోతుంటుంది. కొందరు గుండెపోటుతోనో, మరికొందరు మతిమరపుతోనో, ఇంకొందరు మూత్రపిండాలు శాశ్వతంగా దెబ్బతిని డయాలసిస్ చేయిస్తూనో లేక అంధత్వంతోనో బతుకీడుస్తుంటారు. లేదా కొందరు చనిపోతూ ఉంటారు. ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా రక్తపోటు పెరుగుతోంది. పద్దెనిమిదేళ్లు దాటిన చాలామందిలో ఇది మామూలుగా ఉండాల్సిన 120/80 చోట 140/90 ఉంటోంది. 2014 నాటికి మన దేశంలో 22 శాతం మందిలో రక్తపోటు పెరిగిపోయి బాధపడుతున్నారంటే దీని తీవ్రత ఎంతో, అది చేయబోయే నష్టం ఏ మేరకు ఉండబోతుందో ఊహించుకోవచ్చు. చిన్న చిన్న జాగ్రత్తలతోనే దీన్ని చాలావరకు అరికట్టవచ్చు. ఆహారంలో ఉప్పు తగ్గించుకోవడం, తాజాపండ్లు, ఆకుపచ్చటి ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువగా తీసుకోవడం, స్థూలకాయం ఉంటే తగ్గించుకోవడం, పొగతాగే అలవాటు, మద్యం మానేయడం చేస్తే చాలు, రక్తపోటుతో వచ్చే అనర్థాలు చాలావరకు నివారించవచ్చు. ఆరోగ్యంగా బతకవచ్చు. కానీ అనివార్యంగా పెరుగుతున్న ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు దీని పెరుగుదలకు దోహదం చేస్తున్నాయి. క్యాన్సర్లు : ఎవరైతే పొగాకు వినియోగాన్ని తొందరగా మానుతున్నారో, వారికి పొగాకు కారణంగా వచ్చే క్యాన్సర్ నుంచి తప్పించుకోగలుగుతున్నారు. బ్యాలెన్స్డ్ పబ్లిక్ హెల్త్ స్ట్రాటెజీ... యువతరం మాత్రమే కాక పెద్దవారు సైతం పొగతాగడం మానేయడంవల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సర్ నుంచి బయటపడగలుగుతున్నారని తెలిపింది. అదేవిధంగా కిడ్నీ, మూత్రాశయ, ఓరల్ కావిటీ, ఇసోఫేగస్, ఉదరం, ప్యాంక్రియాస్ క్యాన్సర్లను కూడా నివారించవచ్చునని తేలింది. పొగతాగే అలవాటు ఉన్నవారు 50 సంవత్సరాల వయసు లోపే ఆ వ్యసనాన్ని విడిచిపెడితే వారి జీవితకాలం కొద్దిగా పెరుగుతుంది. అలాగే 30 సంవత్సరాల లోపు విడిచిపెడితే వారి జీవితకాలం మరికాస్త పెరుగుతుంది. అసలు ఆ అలవాటే లేనివారు ఎక్కువకాలం జీవించే అవకాశం ఉంది. అత్యధికంగా ధూమపానం చేసేవారిలో, స్త్రీపురుష భేదం లేకుండా 75 సంవత్సరాల వయసున్న వారు 16 శాతం మంది, 50 లోపు వారు 6 శాతం, 30 లోపు వారు 2 శాతం మందికి క్యాన్సర్ ప్రమాదం పొంచి ఉంది. అలవాటును ఎంత త్వరగా మానితే అంత ఎక్కువకాలం జీవించడానికి అవకాశం ఉంది. నివారించలేని జన్యుపరమైన క్యాన్సర్ల వంటివి కేవలం 10 నుంచి 15 శాతం వరకు ఉండగా 80 నుంచి 85 శాతం వరకు క్యాన్సర్లను మన జీవన శైలిని సక్రమంగా మార్చుకుంటే అవి మన దరిదాపుల్లోకి రాకుండా జాగ్రత్తపడవచ్చు. జీవనశైలి వ్యాధులతో చిన్నవయసులోనే మృతులు 2012లో దాదాపు 5.60 కోట్ల మృతులు అకాలంగా యువతలో సంభవించినవే. ఇందులో 3.8 కోట్లు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (సాంక్రమిక వ్యాధులు కాని, జీవనశైలి వ్యాధులు)తో చనిపోయారు. అందులో గుండెజబ్బులు, క్యాన్సర్లు, శ్వాసకోశవ్యాధులు వంటివాటితో చనిపోయినవారు ఎక్కువ. ఇక వీరిలో 2.8 కోట్లు మనలాంటి మధ్యతరహా ఆదాయవర్గాలకు చెందిన అభివృద్ధి చెందుతున్న దేశాలవారు లేదా అల్పాదాయ దేశాలకు చెందినవారు. మిగతా కోటి మంది అన్ని అభివృద్ధి చెందిన దేశాలూ కలుపుకొని మృతిచెందినవారు. అంటే మృత్యువు ఇక్కడ ఎంత విచ్చలవిడిగా నాట్యమాడుతుందో ఇట్టే అర్థమవుతుంది. ఇవే గణాంకాలను ప్రాతిపదికగా ఇలా జీవనశైలిలో మృతిచెందేవారిలో గుండెపోటుతో చనిపోయే వారు 46.2 శాతం, క్యాన్సర్లతో చనిపోయేవారు 21.7 శాతం, శ్వాసకోశవ్యాధుల (ఆస్తమా, సీఓపీడీ)తో మృతిచెందే వారు 10.7 శాతం, డయాబెటిస్తో చనిపోయే వారు 1.5 శాతం. గుండెజబ్బులు, క్యాన్సర్లు, శ్వాసకోశవ్యాధులు, డయాబెటిస్... ఈ నాలుగింటి వాటాయే... మొత్తం జీవనశైలితో చనిపోయే వారిలో 80.1 శాతాన్ని ఆక్రమిస్తోంది.పైన పేర్కొన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మన సంపూర్ణ ఆరోగ్యం చాలాకాలం బాగుంటుందనడంలో సందేహం లేదు. హెచ్చరిక... డెబ్బయిలలో వచ్చిన మార్పులు ఎనభైలలో మరింత వేగవంతమయ్యాయి. అంతే తొంభైలు, 2000 నాటికి వీటి వల్ల వచ్చే విపత్కర ఫలితాలు మొదలయ్యాయి. రోగభారంతో పాటు ఇవి ఆర్ధికభారాన్నీ మోపబోతున్నాయి. - 2030 నాటికి జీవనశైలిలో వచ్చే వ్యాధుల కారణంగా ప్రజలు పెట్టే ఖర్చు అక్షరాలా రూ. 222 లక్షల కోట్లు పైమాటే. ఒకనాడు 60, 70 ఏళ్లకు కనిపించే చక్కెర వ్యాధి... ఇప్పుడు పాతిక, ముప్పయ్యేళ్లకే కనిపిస్తోంది. ఇక 2030 నాటికి భారత్‌లో చక్కెర వ్యాధిగ్రస్తుల సంఖ్య 15 కోట్లకు చేరనుందని అంచనా. 2010 నాటి లెక్కలతో పోల్చి చూస్తే ఈ సంఖ్య రెండున్నర రెట్లు! ఒకనాడు 50, 60 ల తర్వాత మొదలయ్యే రక్తపోటు... ఇప్పుడు పైలాపచ్చీస్ వయసులోని ఉడుకురక్తానికి చేటు తెచ్చిపెడుతోంది. 2030 నాటికి దేశంలో హైబీపీతో బాధపడేవారి సంఖ్య 23 కోట్లకు పైమాటే.ఆధునిక భారతం రోగగ్రస్తం కాబోతున్న తరుణంలో రాబోయే తరాలన్నీ ఆరోగ్యంగా ఉండాలనే మంచి సంకల్పాన్ని తీసుకోవలసిన అవసరం ఉంది. జీవనశైలి వ్యాధులతో పోరాటమెలా... గతంలో రాజ్యమేలిన సాంక్రమిక వ్యాధుల తర్వాత ఇప్పుడు వాటి స్థానాన్ని ఆక్రమించిన నాన్‌కమ్యూనికబుల్ డిసీజ్ (ఎన్సీడీ)లు... అంటే జీవనశైలి వల్ల వచ్చే వ్యాధులతో పోరాటం చాలా సులభం.వ్యాధి వచ్చాక క్రమం తప్పకుండా డాక్టర్ ఫాలోఅప్‌లో ఉంటూ, వారు చెప్పిన సూచనలు పాటిస్తూ, చికిత్స తీసుకుంటూ ఉండటం. దీర్ఘకాలిక వ్యాధుల విషయంలో ఇది తప్పనిసరి.వీటిలో చాలావరకు ఆసుపత్రిలో ఉండి చికిత్స తీసుకోవాల్సిన అవసరమున్నవి. కాబట్టి వీటిభారం సామాన్యులపై చాలా ఎక్కువ. కేవలం ఆర్థికభారం మాత్రమే కాదు... పనిగంటలు వృథా కావడం, చాలా విలువైన మానవవనరులు నష్టం కావడం లాంటి చాలా అనర్థాలు వీటితో వస్తున్నాయి. కాబట్టి అందుకే వ్యాధి రాకముందే నివారించుకోవడం చాలా అవసరం. అందులో భాగంగా... ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే చాలు. మన ఆరోగ్యానికి అదెంతో మేలు. అవేమిటంటే... వేళకు తప్పకుండా భోజనం చేయడం.భోజనంలో పోషకాలు ఎక్కువగా, క్యాలరీలు తక్కువగా ఉండేలా చూసుకోవడం.భోజనంలో కొవ్వులు, నూనెలు, ఉప్పు చాలా పరిమితంగా తీసుకోవడం. సూక్ష్మపోషకాలు అవసరానికి తగినంతగా ఉండేలా చూసుకోవడం. తక్కువ మోతాదులో ఎక్కువసార్లు తింటుండటం, వారంలో కనీసం మూడు నాలుగు రోజులు ఆరోగ్యకమైన ప్రోటీన్ ఉండే చేపలు తీసుకుంటూ ఉండటం. బరువును అదుపులో పెట్టుకోవడం. ఎత్తుకు తగినంత బరువే ఉండేలా జాగ్రత్త పడటం.{Mమం తప్పకుండా వారంలో కనీసం 150 గంటల పాటు తేలికపాటి వ్యాయామాలు అంటే నడక, స్లో జాగింగ్ వంటివి చేస్తూ శరీరానికి తగినంత, ఆరోగ్యకరమైన శ్రమ కలిగించడం. పొగతాగడం, మద్యం తాగడాన్ని పూర్తిగా మానేయడం. ఇలాంటి చర్యలతోనే మున్ముందు రాబోతున్న ముప్పును నివారించగలం. -
ఈనాటి రోగాలు... ఏనాటివో!
పరిశోధన ఆధునిక జీవనశైలి, అలవాట్ల వల్ల రకరకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని మనం తరచుగా అంటుంటాంగానీ, అసలు ఈ జీవనశైలి లేని కాలంలో కూడా ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న గుండెకు సంబంధించిన రుగ్మతలు ఉన్నాయని తాజా పరిశోధన ఒకటి చెబుతోంది. కొంతకాలం క్రితం కొన్ని ఈజిప్ట్ మమ్మీలను సీటీ స్కాన్ చేసి పరిశోధించారు. ఇప్పుడు ఏవైతే గుండెకు సంబంధించిన రుగ్మతలు ఎదుర్కొంటున్నామో, ఆ రకమైనవే కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈజిప్షియన్లు ఎదుర్కొన్నారని పరిశోధనలో బయటపడింది. అయితే ఇది కేవలం ఈజిప్షియన్లకే పరిమితమా? ఇతరులలో కూడా ఉందా? అనే కోణంలో భిన్న సాంస్కృతిక నేపథ్యాలు ఉన్న అయిదు రకాల మమ్మీలను ఇటీవల పరిశోధనకు ఎంచుకున్నారు. పరిశోధన తరువాత తెలిసిన విషయం ఏమిటంటే, ఈజిప్షియన్లతో పోల్చితే మిగిలిన వారు భిన్నంగా ఏమీ లేరని. మంటలతో పుల్లలు అంటించి అప్పటి మనుషులు పొగ పీల్చేవారు. ఈ విషయంలో మహిళలు ముందు ఉండేవారు. అందుకే గుండెకు సంబంధించిన రుగ్మతలు వారిలో ఎక్కువగా కనిపించాయి. ‘‘స్థూలకాయం అనేది నిన్న మొన్నటి సమస్యలాగే మాట్లాడుతుంటాం. నిజానికి ప్రాచీన మానవుల్లో ఆ రోజుల్లోనే ఇది కనిపిస్తుంది’’ అంటున్నారు క్యాలిఫోర్నియాలోని లాంగ్ బీచ్ మెమోరియల్ మెడికల్ డెరైక్టర్ డా.జార్జ్ థామస్. ‘‘రోగలక్షణాలు ఒకటే అయినప్పటికీ రోగానికి దారి తీసే ప్రధాన కారణాలు మాత్రం వేరు వేరుగా ఉన్నాయి’’ అనేది ఆయన విశ్లేషణ. మనతో పోల్చితే ఆనాటి ఈజిప్షియన్లు చురుగ్గా ఉండేవారు, శ్రమించే తత్వం కూడా వారికి ఎక్కువగానే ఉండేది. పిజ్జాలు, మందు, సుఖసాధనాలు లేని ఆకాలంలో ఈనాటి వ్యాధులు ఎలా వచ్చాయి? ఈ సందేహానికి పరిశోధకులు ఇలా చెబుతున్నారు... ‘‘అపరిశుభ్రత, పారిశుధ్యం లోపించడం, కలుషిత నీరు, జంతువులకు దగ్గరగా నివసించడం మొదలైన కారణాలు రిస్క్ ఫ్యాక్టర్లుగా ఉండి ఉంటాయి’’.