breaking news
Modern dress
-
పొరుగింటి మీనాక్షమ్మను చూశారా!
మీనాక్షమ్మ అయినా, మాషల్ అల్–జలౌద్ అయినా ఇద్దరూ మన సిస్టర్సే.మీనాక్షి ఇండియాలో ఉంటున్నా, మాషల్ సౌదీలో ఉంటున్నా..వారిని వెంటాడే వివక్ష కూడా ఒకటే. ఎవరికి నచ్చినట్లు వాళ్లు ఉండే స్వేచ్ఛఇక్కడి మహిళకు, అక్కడి మహిళకు, అసలెక్కడి మహిళకైనా లేదు.ఆ ‘లేకపోవడాన్ని’ సౌదీలో ఇప్పుడు మాషల్ అనే మహిళ, మనహల్ అల్–ఒతైబీ అనే యువతి బ్రేక్ చేస్తున్నారు! ప్రపంచదేశాల్లోని ఆంక్షల పంజరాలలో ఉన్నసాటి సిస్టర్స్‌కి ‘బ్రేక్ ద రూల్’ అంటూ ఇన్స్పిరేషన్ ఇస్తున్నారు. ఓ మహిళ ఆధునిక వస్త్రాలు ధరించి ఠీవీగా నడుస్తోంది. హై హీల్స్ వేసుకున్న ఆమె అడుగుల శబ్దం అంతకంతకూ పెరుగుతోంది. ఇంతలో ఆమె పక్కగా నడుస్తున్న మహిళల బృందంలో గుసగుసలు మొదలయ్యాయి. అందరూ ఆమెను వింతగా చూస్తున్నారు. ఇంతలో ఆ గుంపు నుంచి బయటికి వచ్చిన ఓ మహిళ.. ఆతృత పట్టలేక... ఆధునిక వేషధారణలో ఉన్న సదరు మహిళ దగ్గరికి పరిగెత్తుకు వచ్చింది. ‘‘ఏమ్మా నువ్వేమైనా సెలబ్రిటీవా?’’ అని అడిగింది. ‘‘ఊహూ..’’ అని ఆమె సమాధానం.‘‘మరి మోడల్‌వా?’’ మరో ప్రశ్న.‘‘అబ్బే అదేం లేదండీ’’.‘‘మరి అలా అయితే ఈ డ్రెస్ వేసుకుని ఎందుకు బయటకు వచ్చావు?’’‘‘అదేంటండీ... ఇది నా ఇష్టం కదా. నాకు నచ్చినట్లుగా ఉంటా.. ఇందులో తప్పేముంది?’’.. ఈసారి ఎదురు ప్రశ్నించింది ఆ ఆధునిక మహిళ’. ఏం సమాధానం చెప్పాలో అర్థంకాక అక్కడి నుంచి మెల్లగా జారుకుంది.. ప్రశ్నలు సంధించిన ఆ మహిళ. ఎందుకైనా మంచిది : సౌదీలో తన కచ్చేరీని రద్దు చేసుకున్న పాశ్చాత్య పాప్ గాయని నిక్కీ మినాజ్ ఈ ఇద్దరు వ్యక్తుల్లో ఆధునిక వస్త్రాలు ధరించి మహిళ పేరు మాషల్ అల్–జలౌద్ (33). సౌదీ అరేబియాకు చెందిన హ్యూమన్ రీసోర్సెస్ ప్రొఫెషనల్ ఆమె. అబయ, హిజాబ్ ధరించకపోతే తనను ఉద్యోగం నుంచి తొలగిస్తామని హెచ్చరిస్తున్నా సరే ఆమె తన వైఖరి మార్చుకోలేదు. తనే కాదు, తన లాంటి ఎంతో మంది ఆ దేశపు నవ యుగపు మహిళలు గత కొంతకాలంగా అబయా (ముస్లిం మహిళలు ధరించే సంప్రదాయ ముసుగు) లేకుండానే బయటికి వస్తున్నారు. అనాదిగా వస్తున్న రాచరికపు సంప్రదాయాలు, కట్టుబాట్లకు అలవాటు పడిన వారి నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు ఓపికగా సమాధానమిస్తూనే.. వారిని కూడా చైతన్యవంతం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. కట్టుబాట్లకు మారుపేరైన ఎడారి దేశం సౌదీలో గత కొంతకాలంగా ఆహ్వానించదగ్గ మార్పులు చోటుచేసుకుంటున్నాయనే మాట బలంగా వినిపిస్తోంది. ‘సౌదీ అరేబియా విజన్– 2030’ కార్యక్రమంలో భాగంగా సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్.. లింగ వివక్షను తొలగించే దిశగా, మహిళల పట్ల సానుకూల వైఖరి ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. ఆయన ఆదేశాల మేరకు... సౌదీ ప్రభుత్వం.. మహిళలకు డ్రైవింగ్ చేసే అవకాశాన్ని కల్పించడం, పరుగు పందాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేపడుతోంది. కో– పైలట్లు, ఫ్లైట్ అటెండెంట్లుగా మహిళలకు అవకాశమిస్తున్నట్లుగా పలు సౌదీ ఎయిర్‌లైన్స్ ప్రకటించాయి. అంతేకాదు సాయంకాలపు బులెటిన్ చదివేందుకు కూడా మహిళా జర్నలిస్టులకు సౌదీ కేంద్రంగా పనిచేసే కొన్ని సంస్థలు అవకాశం కల్పిస్తున్నాయి. అయితే ఇదంతా నిజంగా నిబంధనల సడలింపులో భాగమేనా అని ప్రశ్నిస్తే మాత్రం భిన్న సమాధానాలు వినిపిస్తున్నాయి. ఏమైతే అదైంది : సంప్రదాయవాదుల హిట్‌లిస్ట్‌లో ఉన్న మనహల్ అల్–ఒతైబీ నాపై దాడి జరగడం ఖాయం కేవలం ఆంక్షలు సడలించినంత మాత్రాన పౌరుల్లో మార్పు రావడం లేదని, సంప్రదాయవాదుల ఆలోచనా విధానంలో మార్పు వచ్చినపుడు మాత్రమే తమకు నిజమైన స్వేచ్ఛ లభిస్తుందనీ అంటోంది పాతికేళ్ల యువతి మనహల్ అల్– ఒతైబీ. ‘‘నాలుగు నెలలుగా అబయా ధరించకుండానే రియాద్‌లో సంచరిస్తున్నా. ఎటువంటి ఆంక్షలు లేకుండా.. నాకు సౌకర్యవంతంగా ఉన్న దుస్తులు ధరిస్తున్నా. నాకు ఇష్టంలేని పనులు చేయమని ఆదేశించే హక్కు ఎవరికీ లేదు. అయితే అబయా ధరించకుండా ఉండే విషయమై ఎటువంటి స్పష్టమైన చట్టాలు లేవు. కాబట్టి నేను రిస్క్ చేస్తున్నట్లే. ఏదో ఒకరోజు ఎవరో ఒకరు నాపై దాడి చేయవచ్చు కూడా అని ఆందోళన వ్యక్తం చేశారు అల్–ఒతైబీ. జూలైలో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి ట్విట్టర్లో ఆమె ఓ వీడియో షేర్ చేశారు. ‘‘అబయా ధరించని కారణంగా ఓ మాల్ నిర్వాహకులు నన్ను లోపలికి అనుమతించలేదు. నాతో వాగ్వాదానికి దిగారు. అబయా ధరించే విషయంలో నిబంధనలు సులభతరం చేసే అవకాశం ఉందంటూ గతేడాది వ్యాఖ్యలు చేసిన సౌదీ రాజు సల్మాన్ వీడియో క్లిప్‌ను వాళ్లకు చూపించాను. మహిళలు సౌకర్యవంతంగా, హుందాగా ఉండే దుస్తులు ధరిస్తే తనకేమీ ఇబ్బంది లేదని ఆయన చెప్పిన మాటలు విన్న తర్వాత కూడా వాళ్లలో ఏ మార్పూ లేదు’’ అని ఆ వీడియోలో వెల్లడించారు అల్–ఒతైబీ. అయితే ఇదంతా అబద్ధం, కేవలం ప్రచారం పొందేందుకే మనహల్ ఇలా చేసిందని ఆ మాల్ నిర్వాహకులు కొట్టిపడేశారు. కన్సర్ట్ రద్దు చేసుకున్న మినాజ్ సామాజిక, ఆర్థిక సంస్కరణలు చేపట్టాలని భావించిన సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్... 35 ఏళ్ల సుదీర్ఘ నిషేధం తర్వాత గతేడాది ఏప్రిల్‌లో మొదటి సినిమా థియేటర్‌ను ప్రారంభించేందుకు అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. సౌదీ ప్రేక్షకులతో పాటు మరికొంత మంది విదేశీ ప్రేక్షకులను థియేటర్లోకి అనుమతించిన నిర్వాహకులు.. దేశ ఆధునిక సాంస్కృతిక చరిత్రకు నాంది పలికామని ప్రకటన చేశారు. ఇందుకు కొనసాగింపు అన్నట్లు టాప్ మ్యుజిషియన్లు సైతం తమ దేశంలో ప్రదర్శన ఇచ్చేందుకు సౌదీ అనుమతించింది. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ర్యాపర్‌గా గుర్తింపు పొందిన బోల్డ్ లేడీ నిక్కీ మినాజ్‌తో కన్సర్ట్ నిర్వహించేందుకు సన్నాహకాలు జరుగుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే అంతలోనే మినాజ్ తన సౌదీ కన్సర్ట్ను రద్దు చేసుకున్నారని, మానవహక్కుల ఉల్లంఘనలో సౌదీకి ఉన్న రికార్డు చూసిన తర్వాతే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారనే మరో వార్త వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో జలౌద్, ఒతైబీ వంటి యువతులు అబయా ధరించకుండా పెద్ద రిస్కే తీసుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.– సుష్మారెడ్డి యాళ్ల, సాక్షి వెబ్‌డెస్క్ -
లెహంగులు
ఫ్యాషన్ ఆధునిక డ్రెస్సులెన్ని ఉన్నా పండగ వాతావరణాన్ని తేవాలంటే మగువల మనసు మనదైన సంప్రదాయ హంగుల మీదకే మళ్లుతుంది. అప్పుడు అందమైన లెహంగా మదిలో తళుక్కున మెరుస్తుంది. గ్రాండ్‌గా కనిపించాలని దానికి మరిన్ని హంగులు అద్దేవారికోసం వెతుకులాట మొదలవుతుంది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఇటీవల కాలంలో సినీతారల లెహంగాల హంగులు చూపుతిప్పుకోనివ్వడం లేదు. మనీష్ మల్హోత్రా, సబ్యసాచి, రితుకుమార్, అంజుమోడి.. వంటి ప్రసిద్ధ డిజైనర్లు సైతం పోటీపడుతున్న లెహంగా డిజైన్లు లెక్కకు మించి ఉన్నాయి. అంతకుమించిన వైభవమూ ప్రతియేటా జరిగే ఫ్యాషన్ షోలలో మనం చూస్తూనే ఉన్నాం. పండగ లెహంగా! దసరా నవరాత్రులు త్వరలో మొదలవబోతున్నాయి. గార్బాడ్యాన్సులలో వెలిగిపోవడానికి అమ్మాయిలు వెతికే డ్రెస్ లెహంగా చోళీనే. ఆ తర్వాత వచ్చే పండగలో దీపకాంతులతో పోటీపడటానికి ఫ్లోర్ లెంగ్త్ అనార్కలీ లెహంగాలూ ఉన్నాయి. పెళ్లికి లెహంగా! పండగల వెంటనే పెళ్లిళ్ల సీజనూ మొదలవబోతోంది. సంగీత్, రిసెప్షన్.. వంటి వేడుకలలోనూ హెలైట్గా నిలిచేవీ లెహంగాలే. వీటిలో ఇప్పుడు ఫ్లోర్‌లెంగ్త్ అనార్కలీ లెహంగాలూ చోటు చేసుకున్నాయి. రంగుల కలబోత... లెహంగా గ్రాండ్‌గా కనిపించాలంటే దానికి తగిన కలర్ కాంబినేషన్స్ సరిచూసుకోవడం తప్పనిసరి. దీంతో పాటు స్వరోస్కి, జరీ మెరపులు, బీడ్స్, కుందన్ తళుకులు తప్పనిసరి. దీంతోపాటు పెద్ద పెద్ద అంచులూ లెహంగాకు ఓ కొత్త రూపుకడతాయి. మంచి నాణ్యమైన గాగ్రా తయారీ కోసం రాసిల్క్, బెనారస్, పట్టు.. వీటితో పాటు నెటెడ్ మెటీరియల్‌నూ జత చేస్తే చూడచక్కని లెహంగా రూపుకడుతుంది. - ఎన్.ఆర్ -
నేను సింగిల్‌గానే ఉన్నాను
గ్లామర్ కోసమని ప్రత్యేక గణాన్ని నియమించుకున్న నటిని చూశారా? నటి రెజీనా అందంగా కనిపించడం కోసమే కొందరు సహాయకున్ని నియమించుకున్నారట. అయినా అందాలారబోసే అవకాశాలు రావడం లేదని వాపోతున్నారు. తమిళంలో కేడి బిల్లా కిల్లాడి రంగా లాంటి కొన్ని చిత్రాల్లో హీరోయిన్గా మెరిసిన రెజీనా ఆ తరువాత ఇక్కడ అవకాశాలు అడుగంటడంతో దుకాణం బంద్ చేసి తెలుగు చిత్ర పరిశ్రమలో మకాం పెట్టింది. అక్కడ తొలుత ఆశాజనకంగానే ఉన్నా ప్రస్తుతం అవకాశాలు అంతంత మాత్రంగానే వస్తున్నాయి. దీంతో అందాలారబోతకు సిద్ధమైందట. దీని గురించి రెజీనా తెలుపుతూ పక్కింటి అమ్మాయిలా ఉన్నావంటూ చీరకట్టు పాత్రలకే పరిమితం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అలాంటి పాత్రలు పోషించి బోర్ కొట్టేస్తోంది. మోడ్రన్ డ్రస్సు దూరం అన్నట్లు మాట్లాడుకుంటున్నారని అంది. నిజానికి తనకు గ్లామరస్ పాత్రలన్నా అలాంటి దుస్తులన్నా చాలా ఇష్టం. ఇంటిలో షర్టు, జీన్స్ దుస్తులే ధరిస్తాను. మొదటి నుంచి గ్లామర్‌గా నటిస్తే గ్లామర్ హీరోయిన్గా పేరు వచ్చేదంటున్నారని అంది. పాత్రకు తగ్గట్టుగానే నటించాలి కదా! పాత్రకు సంబంధం లేకండా గ్లామరస్ దుస్తులు ధరిస్తానని చెప్పగలనా? అంటోంది. లంగా ఓణి ఇమేజ్ నుంచి బయటపడటానికి ఇటీవల తాను పాల్గొనే సినీ కార్యక్రమాల్లో గ్లామరస్ దుస్తులనే ధరిస్తున్నాను. ఇందుకోసం ప్రత్యేకంగా మేకప్‌మన్‌లను నియమించుకున్నానని చెప్పింది. ఇకపోతే కథా పాత్రలు గాని, దుస్తుల ఎంపికల్లో గాని తుది నిర్ణయం తనదేనని తెలిపింది. ఎవరినైనా ప్రేమించారా? అని అడుగుతున్నారని నిజం చెప్పాలంటే తాను తొమ్మిదవ తరగతి చదువుతున్న పక్కింటి కుర్రాడి ప్రేమలో పడ్డానని ఆ ప్రేమ కొన్నేళ్లు వరకు సాగిందని చెప్పింది. ఈ విషయం గురించి దాచాల్సిన అవసరం లేదు. అయితే అతను తనను విడిచి విదేశాలకు పారిపోయాడని ప్రస్తుతం తాను సింగిల్‌గానే ఉంటున్నట్లు రెజీనా చెప్పింది.