breaking news
mobile van
-
‘ఆధార్’ మొబైల్ వ్యాన్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: సీనియర్ సిటిజన్స్, వైద్యపరంగా కదలలేని స్థితిలో ఉన్నవారికి ఆధార్ నమోదు, అప్డేషన్ సేవలు అందిం చేందుకు ఆధార్ మొబైల్ వ్యాన్‌ను ప్రవేశపె డుతున్నట్లు యూఐడీఏఐ ప్రాంతీయ ఉప సంచాలకులు ఎంవీఎస్ రామిరెడ్డి ప్రకటించారు. బుధవారం ఆధార్ ప్రాంతీయ కార్యాలయమైన మైహోం వద్ద సీఎస్సీ ఈ–గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ నిర్వహించే ఆధార్ ఆన్ వీల్స్ మొబైల్ వ్యాన్‌ను ఆయన జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. జీహెచ్ఎంసీ పరిధిలో సీనియర్ సిటిజన్లు, వైద్యపరంగా కదలలేని స్థితిలో ఉన్నవారికి ఈ వ్యాన్ సేవలు అందిస్తుందన్నారు. త్వరలో విజయ వాడ, విశాఖలో కూడా ఈ సేవలు విస్తరించనున్న ట్లు చెప్పారు. 040–23119266కు కాల్ చేసి నమోదు చేసుకోవచ్చన్నారు. ఆధార్ నమోదు ఉచితమని, మార్పులు, చేర్పులు, సవరణలకు మాత్రం ఆపరేటర్‌కు రూ.25 చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. -
మొబైల్ వ్యాన్‌లో రైలు టిక్కెట్ల విక్రయం
సీతానగరం (తాడేపల్లి రూరల్): పుష్కరాల సందర్భంగా కృష్ణా తీరానికి విచ్చేస్తున్న భక్తులకు సౌకర్యవంతంగా రైల్వేశాఖ మొబైల్ వాహనంలో టికెట్ల విక్రయాలు చేపట్టింది. సీతానగరం పుష్కరఘాట్ సమీపంలోని ఉండవల్లి నాలుగురోడ్ల కూడలి సెంటర్లో వ్యాన్ ఏర్పాటు చేసి ప్రయాణికులకు రైల్వే టిక్కెట్లు అమ్ముతున్నారు. ఈ వ్యాన్ వద్ద టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులు సమీపంలోని కృష్ణా కెనాల్, విజయవాడ జంక్షన్, మంగళగిరి రైల్వేస్టేషన్ల ద్వారా ప్రయాణాలు చేసేందుకు అనుకూలంగా ఉంటుంది. రైల్వేస్టేషన్‌కు వెళ్లి క్యూలో నిలబడి టిక్కెట్లు తీసుకునే అవసరం లేకుండా సౌకర్యవంతంగా ఉందని పలువురు తెలిపారు.