breaking news
MLA dhulipalla Narendra Kumar
-
నేను టీడీపీ ఎమ్మెల్యే రైట్ హ్యాండ్‌ని..!
సాక్షి, గుంటూరు: టీడీపీ జెండా పట్టుకుంటే చాలు.. ఎంతటి మోసం, అన్యాయం, అక్రమమైనా చేయొచ్చనే భావనతో పొన్నూరులో పచ్చ పార్టీ కార్యకర్తలు చెలరేగిపోతున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌కు కుడి భుజం(రైట్ హ్యాండ్) అని చెబుతూ తిరిగే తన భర్త నిత్యం చిత్రహింసలకు గురి చేస్తున్నాడని ఓ మహిళ వాపోయింది. ఇప్పటికే జిల్లా ఎస్పీ కార్యాలయ ఆవరణలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మూడు సార్లు, స్థానిక పొన్నూరు పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట ఫ్లెక్సీ చేత పట్టుకుని నిరసన వ్యక్తం చేసింది. అనంతరం బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ... పొన్నూరు మండలం అలూరు గ్రామానికి చెందిన తనకు సుమారు ఎనిమిదేళ్ల క్రితం పౌల్రాజుతో ప్రేమ వివాహమైందని చెప్పారు. భర్త పంచాయితీ పనులకెళ్తూ, ప్రస్తుతం పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌కు కుడి భుజమని చెబుతున్నాడని పేర్కొన్నారు. కట్నకానుకల కింద పాండ్రపాడులోని రెండెకరాల పొలం, పది తులాల బంగారం తమవారు ఇచ్చారని పేర్కొన్నారు. ఆరేళ్ల క్రితం కొంత పొలాన్ని రూ.19 లక్షలకు విక్రయించి రాజకీయాల్లో తిరిగి ఖర్చు చేశాడని తెలిపారు. మరో ఎకరం విక్రయించేందుకు అంగీకరించకుంటే కాపురానికి రానివ్వ బోనని, తనను, తన బిడ్డను చంపుతానని బెదిరిస్తున్నాడని ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. ఎవరికై నా దీనిపై ఫిర్యాదు చేసినా చంపేస్తానని, తర్వాత స్టేషన్లో లొంగిపోతానని భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పేరు చెప్పి తీవ్రంగా బెదిరించేవాడని కన్నీరు మున్నీరయ్యారు. గత నెల 11వ తేదీన మరణాయుధంతో దాడికి పాల్పడగా, అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డానని తెలిపారు. భర్త వద్దనే తమ కుమార్తె కూడా ఉందని పేర్కొన్నారు. తనకు కుమార్తెను అప్పగించాలని వేడుకున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి భర్త, అతని కుటుంబ సభ్యుల నుంచి తనను, తన వారిని కాపాడి న్యాయం చేయాలని కోరారు.ఆస్తుల కోసమే తనను పెళ్లి చేసుకున్నట్లు భర్త పలుమార్లు చెప్పాడని బాధితురాలు వివరించారు. తక్కువ కులం దానినంటూ నోటికొచ్చినట్లు ధూషించేవాడని వాపోయారు. చిత్రహింసలకు గురిచేయడంతోపాటు, తన కుటుంబ సభ్యులను ఇంటికి రానిచ్చేవాడు కాదని ఆవేదన వ్యక్తం చేశారు. వారితో మాట్లాడటానికి కూడా అంగీకరించేవాడు కాదని వాపోయారు. స్నేహితులతో కలిసి నిత్యం మద్యం తాగొచ్చి, వివాహేతర సంబంధాలు ఉన్నాయంటూ వేధించేవాడని తెలిపారు. -
ప్రోగ్రెస్ రిపోర్ట్ ధూళిపాళ్ల నరేంద్ర
-
'రన్' సినిమా ఆడియో విడుదల
-
ఆ ‘పోరంబోకు’తో నాకేంటి సంబంధం
అసెంబ్లీలో ఎమ్మెల్యే ధూళిపాళ్ల సాక్షి, హైదరాబాద్: రాజధాని దురాక్రమణ పేరిట సాక్షి పత్రిక, చానల్ తనపై అసత్య వార్తలు ప్రచారం చేస్తోందని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ధ్వజమెత్తారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం అసెంబ్లీలో చర్చను ప్రారంభిస్తూ ఆయన ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్సీపీపై, సాక్షి పత్రిక, చానల్‌పై దాడి చేశారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి తన సొంత రాష్ట్రంపై విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. రాజధాని శంకుస్థాపన ఆహ్వానాన్ని స్వీకరించేందుకు సైతం జగన్మోహన్రెడ్డి తిరస్కరించారన్నారు. వాగు పోరంబోకును తాను కాజేసినట్టు సాక్షి పత్రిక పెద్ద కథనాన్ని రాసిందని, వాస్తవానికి ఆ వాగుకు తనకు ఏమాత్రం సంబంధం లేదన్నారు. వాగుకు 1993లో కాంగ్రెస్ ప్రభుత్వమే పట్టాలు ఇచ్చిందన్నారు. అప్పటికి తాను చాలా పిల్లవాడినని చెప్పారు. సర్వే నెంబర్లు 270/బీ6 లో 81 సెంట్లు, 274/బీ7లో 96 సెంట్లు, 274/బీ6లో 81 సెంట్లు, 273/బీలో 1.31 ఎకరాలకు పట్టాలున్నాయని, 2009లో ఈ 3.89 ఎకరాలను దేవరపు సాంబశివరావు కొన్నారని, దీంతో తనకేమి సంబంధమో చెప్పాలన్నారు. ఈ వ్యవహారమై పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు.