breaking news
Mirpur Odi
-
ఓడిపోవడం బాధగా ఉంది: ధోని
మిర్పూర్: బంగ్లాదేశ్ పేస్ బౌలర్లు కారణంగానే తాము ఓడిపోయామని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేర్కొన్నాడు. స్లో వికెట్ పిచ్ పై పరిస్థితులను బంగ్లా పేసర్లు సమర్థవంతంగా ఉపయోగించుకున్నారని విశ్లేషించాడు. తమ బౌలర్లతో పోల్చుకుంటే బంగ్లా బౌలర్లు వైవిధ్యం కనబరిచారని మెచ్చుకున్నాడు. బంగ్లాదేశ్ తో గురువారం జరిగిన తొలి వన్డేలో భారత్ 79 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఓడిపోవడం బాధ కలిగించిందని మ్యాచ్ ముగిసిన తర్వాత ధోని వ్యాఖ్యానించాడు. అయితే జరిపోయిన దాని గురించి తలుచుకంటూ కూర్చోమని చెప్పాడు. మ్యాచ్ జరిగిన రోజున ఎలా ఆడామన్నదే ప్రాధానమన్నాడు. ఈరోజు తమకంటే బంగ్లాదేశ్ బాగా ఆడిందని చెప్పాడు. 300 పైచిలుకు టార్గెట్ ను చేరుకోవాలంటే కచ్చితంగా మంచి భాగస్వామ్యం అవసరమని అభిప్రాయపడ్డాడు. మిడిల్ ఆర్డర్ భారీ భాగస్వామ్యం నమోదైవుంటే లక్ష్యాన్ని ఛేదించడం సులువు అవుతుందని ధోని చెప్పాడు. -
మీర్పూర్ వన్డేలో భారత్ మెరుపు విజయం
-
4.4 ఓవర్లు.. 4 పరుగులు.. 6 వికెట్లు
మిర్పూర్: స్టువార్ట్ బిన్నీ రికార్డ్ బౌలింగ్ తో బంగ్లాదేశ్తో జరిగిన రెండో వన్డేలో భారత్ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ ను 2-0తో గెల్చుకుంది. రైనా సేన నిర్దేశించిన 106 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 17.4 ఓవర్లలో 58 పరుగులకు ఆలౌటయింది. వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ ను 41 ఓవర్లకు కుదించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 25.3 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌటయింది. రైనా 27 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. స్వల్ప లక్ష్యాన్ని చేరుకునేందుకు బరిలోకి దిగిన బంగ్లాకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. మొహిత్ శర్మ, స్టువార్ట్ బిన్నీ ధాటికి బంగ్లా బ్యాట్స్మెన్ నిలబడలేకపోయారు. ముఖ్యంగా బిన్నీ తన పదునైన బౌలింగ్ తో అత్యుత్తమ గణంకాలు నమోదు చేశాడు. అంతేకాకుండా తక్కువ పరుగులిచ్చి ఎక్కువ వికెట్లు తీసిన భారతీయ బౌలర్ గా రికార్డు సృష్టించాడు. స్టువార్ట్ బిన్నీ 4.4 ఓవర్లలో 4 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. మొహిత్ శర్మ 4 వికెట్లు నేలకూల్చాడు. బంగ్లా ఆటగాళ్లలో మిథున్ అలీ(26), ముష్ఫికర్ రహీం(11) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. నలుగురు డకౌటయ్యారు. స్టువార్ట్ బిన్నీ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అందుకున్నాడు.