breaking news
Minor fire breaks
-
షారుఖ్ నివాసంలో అగ్నిప్రమాదం
-
షారుఖ్ నివాసంలో అగ్నిప్రమాదం
బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూఖ్ ఖాన్ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఎవ్వరూ గాయపడలేదు. ముంబై బాంద్రాలోని మన్నత్ నాలుగో ఫ్లోర్లో ఈ ఘటన జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్ల బాత్రూంలోని ఎగ్జాస్ట్ ఫ్యాన్ నుంచి మంటలు వచ్చాయని షారూఖ్ సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలను ఆర్పివేశాయి. తమ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను సాధ్యమైనంత త్వరగా అదుపులోకి తీసుకువచ్చినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు చెప్పారు. బంగ్లాలోని అలారం మోగటంతో భద్రత సిబ్బంది వెంటనే అప్రమత్తమై తమకు సమాచారం అందించారని చెప్పారు. కాగా ప్రమాదం జరిగిన సమయంలో షారూఖ్ ఇంట్లో లేరు.