breaking news
Minneapolis
-
ఇంటికి చేరుకున్న లియామ్
వాషింగ్టన్: అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు నిర్బంధంలోకి తీసుకున్న అయిదేళ్ల లియామ్ కొనెజో రమోస్, తండ్రితోపాటు మినియాపొలిస్‌లోని సొంతింటికి చేరుకున్నాడు. వారిద్దరినీ వెంటనే విడుదల చేయాలంటూ టెక్సాస్ డిస్ట్రిక్ట్ ఫెడరల్ కోర్టు జడ్జి ఫ్రెడ్ బియెరీ ఆదేశించిన మరునాడే ఈ పరిణామం చోటుచేసుకుంది. కుమారుడితోపాటు తండ్రిని శనివారం రాత్రి డిటెన్షన్ సెంటర్ నుంచి తీసుకువచ్చి, ఆదివారం వారి ఇంటి వద్ద వదిలిపెట్టానని టెక్సాస్ డెమోక్రాట్ జోక్విన్ కాస్ట్రో తెలిపారు. వీరి విడుదలను మిన్నెసొటా కాంగ్రెస్ సభ్యురాలు ఇల్హామ్ ఒమర్ స్వాగతించారు. ఆడ్రియన్ అలెగ్జాండర్ కొనెజో రమోస్, అతడి కుమారుడు లియామ్‌ను పది రోజుల తర్వాత ఆదివారం విడిచిపెట్టిన విషయాన్ని హోమ్‌లాండ్ సెక్యూరిటీ అసిస్టెంట్ సెక్రటరీ ట్రిసియా మెక్లాఘ్లిన్ ధ్రువీకరించారు. ‘ఈ కేసులోని వాస్తవాల్లో ఎటువంటి మార్పు లేదు. ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్(ఐసీఈ) ఒక చిన్నారిని లక్ష్యంగా చేసుకోలేదు, అరెస్టు చేయలేదు’అని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. ‘ఇమిగ్రేషన్ వ్యవస్థలో చట్టబద్ధతను, విచక్షణను పునరుద్ధరించడానికి ట్రంప్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ దేశంలో ఉండే హక్కు లేని విదేశీయుల అరెస్ట్, నిర్బంధం, బహిష్కరణ కోసం మా పోరాటం కొనసాగుతుంది’అని పేర్కొన్నారు. డి్రస్టిక్ట్ కోర్టు జడ్జి ఆదేశాలపై అప్పీలుకు వెళతామని డిప్యూటీ అటార్నీ జనరల్ టాడ్ బ్రాంచె చెప్పారు. ఇమిగ్రేషన్ చట్టాలు, నిబంధనలు సాధారణ క్రిమినల్ ప్రక్రియ కంటే చాలా భిన్నంగా ఉంటాయన్నారు. జనవరి 20వ తేదీన లియామ్‌ను, అతడిని తండ్రిని అదుపులోకి తీసుకున్న అధికారులు అక్కడి 1,300 కిలోమీటర్ల దూరంలో డిల్లే డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు. ఈక్వెడార్‌కు చెందిన లియామ్ కుటుంబానికి అమెరికాలో ఉండేందుకు అవసరమైన ఎలాంటి అనుమతిపత్రాలు లేవని ఇమిగ్రేషన్ అధికారులు అంటున్నారు. ఆ రోజున తాము అరెస్ట్ చేసేందుకు యత్నించగా బాలుడిని కారులో వదలి ఆడ్రియన్ పరారయ్యాడని చెప్పారు. దీంతో, లియామ్‌ను స్కూలు బ్యాగుతో సహా ఇమిగ్రేషన్ అధికారులు తమ కారు వద్దకు తీసుకెళ్తున్నప్పటి ఫొటో సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది. ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై జనం దుమ్మెత్తిపోశారు. -
పసివాడిని వదిలేయండి!
టెక్సాస్: అమెరికాలో ఇమిగ్రేషన్ అధికారులు వారం క్రితం అదుపులోకి తీసుకున్న అయిదేళ్ల బాలుడు లియామ్ రమోస్, అతడి తండ్రి ఆడ్రియన్ల కథ సుఖాంతమైంది. తండ్రి, కొడుకులను వెంటనే వదిలేయాలని టెక్సాస్ డిస్ట్రిక్ట్ ఫెడరల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మినియాపొలిస్‌లో జనవరి 24వ తేదీన స్కూలు నుంచి తండ్రితోపాటు కారులో వస్తున్న లియామ్‌ను ఇమిగ్రేషన్ అధికారులు అడ్డగించడం, వారిద్దరినీ అక్కడికి 1,300 కిలోమీటర్ల దూరంలోని టెక్సాస్ డిటెన్షన్ ఫెసిలిటీకి తరలించారు. బిక్కమొహం వేసిన లియామ్ భుజాలకున్న బ్యాగ్‌ను ఇమిగ్రేషన్ అధికారి వెనుక నుంచి పట్టుకుని, అతడిని కారు వద్దకు తీసుకెళ్తున్న ఫొటో దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. చిన్నారులను నిర్బంధంలోకి తీసుకోవడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. వారిని వెంటనే విడుదల చేయాలన్న డిమాండ్లు వచ్చాయి. ఈ కేసుపై విచారణ చేపట్టిన జడ్జి ఫ్రెడ్ బియరీ అధికారులు, ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. లియామ్ కుటుంబం ఇమిగ్రేషన్ కేసు కోర్టు పరిధిలో ఉన్నందున మంగళవారం లోగా ఇద్దరినీ విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈక్వెడార్‌కు చెందిన లియామ్ తండ్రిని దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వ్యక్తిగా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం పేర్కొంటుండగా, అతడు చట్టబద్ధంగానే వచ్చాడని లాయర్లు తెలిపారు. లియామ్ కుటుంబం 2024 డిసెంబర్లో టెక్సాస్‌లో అధికారుల ఎదుట హాజరై ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకుందని చెప్పారు. వారికి ఈక్వెడార్తోపాటు అమెరికాలోనూ ఎలాంటి నేర చరిత్ర లేదని స్పష్టం చేశారు.చరిత్ర ప్రతిధ్వనిస్తోందిజడ్జి ఫ్రెడ్ బియరీ ఏమన్నారంటే.. ప్రభుత్వం నిర్ణయాలు అమెరికా రాజ్యాంగ స్ఫూర్తికి, మూల సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. అమెరికా చారిత్రక స్వాతంత్య్ర ప్రకటనపై ఈ ప్రభుత్వం అజ్ఞానంతో ఉందంటూ వ్యాఖ్యానించారు. అధికార దాహం కలిగిన అప్పటి ఇంగ్లండ్ రాజుకు వ్యతిరేకంగా థామస్ జెఫర్సన్ చేసిన వ్యాఖ్యలను ఉటంకించారు. అప్పటి రాజరిక పాలనలోని పరిస్థితులే నేడు కూడా కన్పిస్తున్నాయన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న బహిష్కరణ విధానాల వల్ల పిల్లలు ఎంతో మానసిక వేదనను ఎదుర్కొంటున్నారు. రోజువారీ బహిష్కరణ కోటాలను చేరుకునేందుకు అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ‘సరైన ఆలోచన లేకుండా, అసమర్థతతో ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యల ఫలితమిది. పిల్లలు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నా సరే, ఆగడం లేదు’అని అన్నారు. ‘ప్రభుత్వ యంత్రాంగం తనకు తానుగా జారీ చేసుకునే పరిపాలనాపరమైన వారెంట్లకు సరైన కారణం ఉండటం లేదు. దీనినే కోళ్ల గూడుకు నక్కను కాపలా పెట్టడం అంటారు’అని ఆయన తీర్పులో రాశారు. అమెరికాలోని క్లిష్టమైన వలస చట్టాల వల్ల లియామ్, అతని తండ్రి చివరికి బహిష్కరణను ఎదుర్కోవాల్సి రావచ్చు అని పేర్కొన్న బియరీ.. అయితే, ఇది మరింత క్రమబద్ధమైన, మానవీయమైన విధానం ద్వారా జరగాలని అభిప్రాయపడ్డారు. ‘రెండు వారాల వ్యవధిలో ఇమిగ్రేషన్ అధికారులు తీసుకెళ్లిన నాలుగో చిన్నారి లియామ్’అని కొలంబియా హైట్స్ పబ్లిక్ స్కూల్స్ ఒక ప్రకటనలో తెలిపింది.లియామ్‌ను ఎరవేశారు..తండ్రి ఆడ్రియన్ నుంచి లియామ్‌ను వేరు చేసిన ఇమిగ్రేషన్ అధికారులు అతడిని ఎరగా వేసి, అతడి తల్లిని కూడా నిర్బంధంలోకి తీసుకోవాలని చూశారని కుటుంబసభ్యులు ఆరోపించారు. గర్భవతిగా ఉన్న ఆమెతోపాటు ఇంట్లో మరో చిన్నారి కూడా ఉందని చెప్పారు. అధికారుల భయంతోనే కుమారుడిని, భర్తను అధికారులు తీసుకెళ్తున్న దృశ్యాలను కిటికీలో నుంచి చూస్తూ నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయిందన్నారు. ఈ ఆరోపణలను ఇమిగ్రేషన్ అధికారులు తోసిపుచ్చారు. చిన్నారని వదిలేసి, అతడి తండ్రి పారిపోయేందుకు ప్రయత్నించాడని పేర్కొన్నారు. దీంతో, లియామ్‌ను తల్లికి అప్పగించేందుకే ఇంటి వద్దకు వెళ్లామని, ఎవరూ బయటకు రాకపోవడంతో చిన్నారి బాధ్యతను తామే తీసుకున్నామన్నారు. వెంటనే అతడిని హోటల్‌కు తీసుకెళ్లి, ఆహారం పెట్టామన్నారు. తండ్రి కోరిక మేరకే ఇద్దరినీ తీసుకెళ్లామని చెప్పారు. -
మిన్నెపొలిస్‌లో ‘వలస’ల రగడ
మిన్నెపొలిస్: ట్రంప్ సర్కారు వలసల అణచివేత చర్యలపై అమెరికాలో మిన్నెసోటా రాష్ట్రంలోని మిన్నెపొలిస్ అట్టుడుకుతోంది. వలసల వ్యతిరేక, అనుకూల వర్గాల నడుమ ఘర్షణలు తారస్థాయిలో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు జాతీయ భద్రతా దళాలు సిద్ధంగా ఉన్నాయని గవర్నర్ కార్యాలయం తెలిపింది. వలసల అణచివేతపై నిరసనల్లో భాగంగా శనివారం మిన్నియాపోలీస్ డౌన్టౌన్లో నిరసన కారులు పెద్ద సంఖ్యలో చేరారు. వారికి వలసలపై అణచివేతకు అనుకూల ఆందోళనకారులు తారసపడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. ఒకరిపై ఒకరు స్నో బాల్స్, ఇతర నీటి బెలూన్లను విసురుకున్నారు. ముసుగులు ధరించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇళ్ల నుంచి, కార్ల నుంచి ప్రజలను బయటకు లాగడమే కాక.. దూకుడుగా వ్యవహరిస్తున్నారని నిరసనకారులు విమర్శించారు. తక్కువగా ఉన్న అనుకూల సమూహాన్ని తరిమికొట్టిన నిరసనకారులు, అనుకూల ఆందోళనకారుల్లో ఒకరైన జేక్లాంగ్ను పట్టుకుని దాడిచేశారు. గతేడాది జనవరి 6న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్షమాభిక్ష ప్రసాదించిన వారిలో జేక్ ఉన్నారు. ఆయన బేస్‌బాల్ బ్యాట్‌తో అధికారిపై దాడి చేయడం సహా పలు నేరాలకు పాల్పడినట్లు అభియోగాలున్నాయి. క్షమాభిక్షతో బయటికి వచి్చన జేక్.. ఫ్లోరిడాలోని యూఎస్ సెనేట్‌కు పోటీ చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. మిన్నెపొలిస్, సెయింట్ పాల్ జంట నగరాల్లో వలసలపై అణచివేత చర్యల్లో భాగంగా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఇటీవల 2వేల మందికి పైగా ఫెడరల్ అధికారులను తరలించింది. ఇమ్మిగ్రేషన్ అమలును వేగవంతం చేసింది. నాటి నుంచి ప్రతిరోజూ నిరసనలు జరుగుతున్నాయి. ట్విన్ సిటీస్‌లో జరుగుతున్న ఇమ్మిగ్రేషన్ ఆపరేషన్‌లో ఇటీవల ఒక మహిళ మరణించింది. అమెరికా పౌరురాలైన ఆమెను జనవరి 7న జరిగిన ఘర్షణలో ఇమ్మిగ్రేషన్ అధికారులు కాల్పి చంపారు. దీంతో శనివారం అధికారులు శాంతియుతంగా నిరసనకారులపై ఎలాంటి నిర్బంధం, టియర్‌గ్యాస్‌ను కూడా ప్రయోగించలేదు. మిన్నెసోటా స్టేట్ ప్రజల ప్రాణాలు, ఆస్తులు కాపాడటానికే కాదు, శాంతియుతంగా సమావేశమయ్యే ప్రజల హక్కులకు మద్దతు ఇచ్చేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని డెమోక్రటిక్ గవర్నర్ టిమ్ వాల్జ్ తెలిపారు. అయితే, దేశంలో ఉండటానికి హక్కు లేని అక్రమ వలసదారుల అరెస్టు, నిర్బంధం బహిష్కరణ కోసం తాము పోరాడుతూనే ఉంటామని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ అసిస్టెంట్ సెక్రటరీ ట్రిసియా మెక్ లాఫ్లిన్ అన్నారు. -
మహిళను కాల్చి చంపిన ఇమ్మిగ్రేషన్ ఏజెంట్, వీడియో వైరల్
అమెరికాలో వలసదారులపై జరుగుతున్న దాడుల్లో భాగంగా ఇమ్మిగ్రేషన్ ఏజెంట్ దారుణానికి ఒడిగట్టాడు. ఒక మహిళను కాల్చి చంపిన ఘటన కలకలం రేపింది. మిన్నియాపాలిస్లో బుధవారం ఈ విషాదం చోటు చేసుకుంది. దీంతో వందలాది మంది ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బుధవారంమిన్నెసోటాలోని మిన్నియాపాలిస్లో ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) ఇమ్మిగ్రేషన్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ ఆపరేషన్‌కు వ్యతిరేకంగా నిరసనకారులు ఉద్యమానికి దిగారు. నినాదాలు చేశారు. పరిస్థితి అదుపు తప్పిన క్రమంలో ఇమ్మిగ్రేషన్ ఏజెంట్, కారులో కూర్చున్న మహిళ తలపై కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో రెనీ గుడ్ (37) అనే మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీంతో వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది.Ice agent shoots woman who tried to flee 😳 pic.twitter.com/fJ1X2XDMhC— RTN (@RTNToronto) January 7, 2026 ఇమ్మిగ్రేషన్ అమలు సమయంలో అధికారులను అడ్డుకోడంతో కాల్పులు జరిపినట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది. ఘర్షణ సమయంలో మహిళపై కాల్పులు జరిగాయని DHS ప్రతినిధి ట్రిసియా మెక్లాఫ్లిన్ తెలిపారు. అల్లర్లకు, రెనీ గుడ్‌కు ఎలాంటి సంబంధం లేదని బాధితురాలి తల్లి డోనా గాంగర్ విచారం వ్యక్తం చేసింది. తన కుమార్తె ఎంతో దయగల, గొప్ప మనిషి, ప్రజలంటే ప్రేమగల ఆమెను అన్యాయంగా కాల్చి చంపారని తల్లి వాపోయింది. అమెరికాలో పెరుగుతున్న గన్ కల్చర్, హింస సర్వసాధారణంగా మారింది అని చెప్పడానికి మరో స్పష్టమైన ఉదాహరణ అని విశ్వవిద్యాలయ అధ్యక్షుడు బ్రియాన్ హెంఫిల్ వ్యాఖ్యానించారు. వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం నిరంకుశ వైఖరికి ఇది నిదర్శనం అంటూ ఆగ్రహం పెల్లుబుకింది. వందలాది మంది నిరసనలకు దిగారు. మిన్నియాపాలిస్ నగర కౌన్సిల్‌లోని మెజారిటీ సభ్యులు రెనీ మరణానికి కారణమైన ఏజెంట్‌ను అరెస్టు చేసి, విచారించాలని డిమాండ్ చేస్తున్నారు. ICE తమ నగరాన్ని విడిచి పెట్టాలంటున్నారు. అధికారుల భిన్నవాదనలుఈ సంఘటనల గురించి ఫెడరల్ , స్థానిక అధికారులు చాలా భిన్నవాదనలు వినిపిస్తున్నారు. కారును ఆపి బయటికి రావాలని ఆదేశాలను బేఖాతరు చేయడంతో పాటు, ఉద్దేశపూర్వకంగా ఏజెంట్‌పై ఎదురుదాడికి దిగి, ICE అధికారిని ఢీకొట్టడానికి ప్రయత్నించినందున మహిళను కాల్చి చంపామని అంటున్నారు. ఈ ఘటనపై FBI దర్యాప్తు జరుగుతోంది2020లో ఓల్డ్ డొమినియన్ విశ్వవిద్యాలయం నుండి ఇంగ్లీషులో పట్టభద్రురాలైంది గుడ్. ఆమె కవయిత్రి కూడా. ప్రస్తుతం రెనీ నికోల్ గుడ్ తన భాగస్వామితో మిన్నియాపాలిస్లో నివసిస్తోంది.కాగా ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత వలసదారుల ఆంక్షలు, దాడుల్లో చనిపోయిన వారి సంఖ్య ఐదుకి చేరింది.ఇదీ చదవండి: బాలికపై సామూహిక అత్యాచారం : యూట్యూబర్ అరెస్ట్, పరారీలో ఎస్ఐ -
అమెరికా స్కూలులో కాల్పులు.. ఇద్దరు చిన్నారులు మృతి 17 మందికి గాయాలు
మిన్నియాపొలిస్: అమెరికాలోని మిన్నియాపొలిస్ నగరంలోని ఓ స్కూలులో బుధవారం ఉదయం ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో 17 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో 14 మంది చిన్నారులే కావడం గమనార్హం. అనంతరం ఆగంతకుడు తనను తాను కాల్చుకుని చనిపోయాడు. గాయపడిన 6–15 ఏళ్ల మధ్య చిన్నారులకు ప్రాణాపాయం లేదని అధికారులు తెలిపారు. అనన్సియేషన్ కాథలిక్ చర్చిలో కాల్పులకు పాల్పడిన వ్యక్తిని 23 ఏళ్ల రాబిన్ వెస్ట్‌మన్‌గా గుర్తించారు. అతడికి ఎలాంటి నేరచర్రిత లేదని అధికారులు వివరించారు. తుపాకీపై ‘న్యూక్ ఇండియా’ మిన్నియాపొలిస్ కేథలిక్ చర్చి స్కూలులో హంతకుడు కాల్పులకు వాడిన ఒక తుపాకీపై ‘న్యూక్ ఇండియా’అని రాసుంది. వెస్ట్‌మన్ తన వద్ద ఉన్న ఆయుధాలను చూపుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. అతడి చేతిలో ఉన్న తుపాకీల్లో ఒక దానిపై న్యూక్ ఇండియా అనీ, మరో దానిపై మాషా అల్లా అనీ, ‘ మరో గన్‌పై ఇజ్రాయెల్ ఓడిపోవాల్సిందే’ అని రాసి ఉంది. -
మిన్నియాపాలిస్ ఘటన: భారత్, ట్రంప్ పేర్లు రాసుకుని..
మిన్నియాపాలిస్ ఘటనలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. కాల్పుల తర్వాత రాబిన్ వెస్ట్‌మన్ (Robin Westman) తనంతట తాను కాల్చుకుని చనిపోయాడు. ఏ ఉద్దేశంతో కాల్పులు జరిపాడు అనే విషయంపై స్పష్టమైన ప్రకటన చేయలేదు. అయితే అతని గురించి విచారించిన అధికారులకు విస్తుపోయే విషయాలు తెలుస్తున్నాయి. అమెరికా కాలమానం ప్రకారం.. బుధవారం ఉదయం మిన్నసోటా స్టేట్ మిన్నియాపాలిస్ నగరంలోని ఓ స్కూల్ వద్ద ప్రార్థనల్లో పాల్గొంటున్న విద్యార్థులపై దుండగుడు విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. కాల్పుల కోసం రైఫిల్, షాట్‌గన్, పిస్టల్.. ఉపయోగించాడు. ఆ వెంటనే తనను తాను కాల్చేసుకున్నాడు. ఈ ఘటనలో 8, 10 ఏళ్ల వయస్సు గల ఇద్దరు పిల్లలు మృతి చెందగా.. 17 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 14 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే.. దుండగుడి ఆయుధాలపై 'న్యూక్ ఇండియా', ‘కిల్ ట్రంప్’ లాంటి భయానక సందేశాలు రాసి ఉన్నాయి.రాబిన్ వెస్ట్‌మన్.. 2020లో రాబర్ట్ నుండి రాబిన్‌గా పేరు మార్చుకుని మహిళగా గుర్తింపు పొందినట్లు లీగల్ డాక్యుమెంట్లు ఉన్నాయి. అయితే ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్.. నిందితుడు పురుషుడేనని ధృవీకరించారు. కానీ దర్యాప్తు అధికారులు మాత్రం ట్రాన్స్‌జెండర్‌గానే విచారణను కొనసాగిస్తున్నారు. ఇక కాల్పులకు ముందు రాబిన్ డబ్ల్యూ అనే యూట్యూబ్ ఛానెల్లో రెండు వీడియోలు పోస్ట్ చేశారు. అందులో ఆయుధాలు, మ్యాగజైన్లు కనిపించాయి. వాటిపై.. కిల్ డొనాల్డ్ ట్రంప్ నౌ Kill Donald Trump Now, న్యూక్(న్యూక్లియర్ వార్) ఇండియాNuke India, ఇజ్రాయెల్ మస్ట్ ఫాల్Israel must fall, బర్న్ ఇజ్రాయెల్Burn Israel, వేర్ ఈజ్ గాడ్Where is your God?, ఫర్ ది చిల్ట్రన్ For the children అని రాసి ఉంది. అంతేకాదు.. గతంలో కాల్పుల ఘటనలకు పాల్పడిన పలువురు దుండగుల పేర్లు కూడా రాసుకుని చూపించాడు. వాటితో పాటు సిరిలిక్ Cyrillic(రష్యా, బల్గేరియా, సెర్బియా, ఉక్రెయిన్, కజకస్తాన్, కిర్గిజ్ వంటి దేశాల్లో అధికారిక లిపి)లో రాసిన సందేశాలు కనిపించాయి. ఒక వీడియోలో.. ఇది నా కోసం. అవసరమైతే ఉపయోగిస్తాను అని రాబర్ట్ చెబుతున్న దృశ్యం ఉండగా.. మరో దాంట్లో రెండు జర్నల్స్ కనిపిచాయి. అవి కూడా సిరిలిక్ లిపిలోనే ఉన్నాయి. యూట్యూబ్ నుంచి ఆ వీడియోలను డిలీట్ చేయించిన అధికారులు.. ఈ సందేశాలను ఎందుకు రాసుకున్నాడనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కాల్పుల ఘటనను విద్వేషపూరిత దాడిగా ఎఫ్‌బీఐ భావిస్తోంది. కేథలిక్స్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడమే అతని ధ్యేయంగా కనిపిస్తోందని, దీనిని దేశీయ ఉగ్రవాదంగా పరిగణిస్తూ దర్యాప్తు చేస్తున్నామని దర్యాప్తు సంస్థ చెబుతోంది. ఎలాంటి నేర చరిత్ర లేని వెస్ట్‌మన్.. అధికారికంగానే తుపాకులను కొనుగోలు చేసినట్లు తేలింది. అతని కుటుంబం ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం.యూఎస్ హోంల్యాండ్ సెక్రటరీ క్రిస్ట్రీ నోయెమ్ ఘటనపై స్పందించారు. ఈ స్థాయి హింస ఊహించలేనిది. ఆయుధాలపై అతను రాసిన రాతలను బట్టి మానసికంగా తీవ్రంగా బాధపడుతున్నాడని అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. ఈ ఘటన అమెరికాలో స్కూల్ భద్రతపై తీవ్ర ఆందోళనను కలిగిస్తోందని.. దుండగుడి మానసిక స్థితి, ఆన్లైన్ ప్రేరణలు, ఆయుధాల కొనుగోలు వంటి అంశాలపై విచారణ కొనసాగుతోందని తెలిపారు. మిన్నియాపాలిస్ పోలీస్ చీఫ్ బ్రియాన్ ఒహరా స్పందిస్తూ.. ఇది అమాయక పిల్లలపై ఉద్దేశపూర్వకంగా జరిపిన దాడి.. అమానుషం అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల పట్ల గౌరవ సూచికంగా జాతీయ జెండాను సగం ఎగరేయాలని ఆదేశించారు. ఇక.. తాజా ఘటన ఈ ఏడాది విద్యాసంస్థలపై జరిగిన 146వ స్కూల్ కాల్పుల ఘటన కావడం గమనార్హం.


