breaking news
Minister Geetareddy
-
హైదరాబాద్‌తో పది జిల్లాలే ఆమోదనీయం:గీతారెడ్డి
-
హైదరాబాద్‌తో పది జిల్లాలే ఆమోదనీయం:గీతారెడ్డి
హైదరాబాద్: హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాలతో కూడిన తెలంగాణనే తమకు ఆమోదనీయం అని మంత్రి గీతారెడ్డి స్పష్టం చేశారు. ఇతర ప్రతిపాదనలే ఏవీ తమకు ఆమోదనీయం కావని చెప్పారు. తన నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం ముగిసిన తరువాత ఆమె విలేకరులతో మాట్లాడారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు త్వరగా పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. అవసరమైతే ఢిల్లీకి వెళ్లి హైకమాండ్ పెద్దలను కలుస్తామని చెప్పారు.సోనియా గాంధీ మాట ఇస్తే వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని చెప్పారు. తెలంగాణ తెచ్చింది, ఇచ్చింది కాంగ్రెస్ అని ప్రజల్లోకి తీసుకెళ్తామని మంత్రి చెప్పారు. హైకమాండ్ నిర్ణయాన్ని వ్యతిరేకించకుండా సీమాంధ్ర నేతలు విభజనకు సహకరించాలన్నారు. సీమాంధ్ర ప్రజలతో సంయమనంగానే వ్యవహరిస్తున్నామని చెప్పారు. అధిష్టానం సీడబ్ల్యూసీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని కోరుతున్నట్లు తెలిపారు. ప్రజలకు ఆహారభద్రత కల్పించిన సోనియాకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.