breaking news
Mini fishing harbour
-
బియ్యపుతిప్పలో మినీ ఫిషింగ్ హార్బర్
ఏలూరు (టూటౌన్) : జిల్లాలోని బియ్యపుతిప్పలో రూ.12 కోట్ల వ్యయంతో మినీ ఫిషింగ్ హార్బర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని మత్స్యశాఖ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ చెప్పారు. కలెక్టరేట్లో మంగళవారం హైదరాబాద్ నుంచి మత్స్యశాఖ డెప్యూటీ డెరైక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్పరెన్స్‌లో ఆయన సమీక్షించారు. అలాగే జిల్లాలోని ఏలూరు, ఆకివీడులో రూ.రెండు కోట్ల వ్యయంతో ఆక్వా ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో మత్స్యపరిశ్రమ బాగా అభివృద్ధి చెందుతోందని, కోట్లాది రూపాయల మత్స్య ఉత్పత్తులను ఇక్కడ్నించి ఏటా ఇతర ప్రాంతాలకు ఎగుమతులు జరుగుతున్న దృష్ట్యా ఆ ప్రాంతంలో రైతులకు సరైన సలహాలు, సూచనలు అందించే ఉద్దేశంతో ఈ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో మత్స్య ఉత్పత్తులను పెద్దఎత్తున పెంచడానికి ఆయా జిల్లాలలో సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ప్రవీణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లా మత ్స్య ఉత్పత్తుల అభివృద్ధికి మంజూరు చేసిన నిధులు సకాలంలో ఖర్చు చేయకపోతే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సముద్ర తీర మత్స్యకారుల సంక్షేమం కోసం అనేక ఉపకరణాలు అందించాలని ఆదేశించామని, వైర్లెస్ సెట్లు, లైఫ్ జాకెట్లు ఉపకరణాలను తక్షణమే మత్స్యకారులకు అందించాలని సూచించారు. మత్స్యశాఖ డీడీ లాల్ మహ్మద్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రప్రథమంగా చేపల చెరువుల అనుమతులకు కలెక్టర్ కె.భాస్కర్ ఆన్లైన్లో అనుమతులు ఇవ్వడానికి ప్రత్యేక సాఫ్ట్వేర్ ఏర్పాటు చేసి మీసేవలో రైతులు దరఖాస్తు చేసుకునే సౌకర్యాన్ని కల్పించారన్నారు. ఈ నెల 27వ తేదీ ఉదయం 10 గంటలకు జడ్పీ సమావేశ మందిరంలో మండల, డివిజన్, జిల్లా స్ధాయి చేపల చెరువుల అనుమతుల కమిటీ సభ్యులకు శిక్షణ ఏర్పాటు చేశారని ఆయన చెప్పారు. సమావేశంలో మత్స్యశాఖ అభివృద్ధి అధికారులు స్టీవెన్‌రాయ్, శ్రీనివాసనాయక్, తిరుపతయ్య, వెంకటేశ్వరరావు, ప్రతిభ, రమణారావు, లక్ష్మణరావు పాల్గొన్నారు. -
జువ్వలదిన్నెలో మినీ ఫిషింగ్ హార్బర్
బిట్రగుంట : బోగోలు మండలం జువ్వలదిన్నె సమీపంలో భారీ వ్యయంతో మినీ ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి అధికారులు మంగళవారం స్థల పరిశీలన జరిపారు. చి ప్పలేరు కాలువ సముద్రంలో కలిసే ముఖద్వారం వద్ద హార్బర్ నిర్మాణానికి స్థలం అనుకూలంగా ఉన్నట్టు గుర్తించారు. కేంద్ర మత్స్యశాఖ సాంకేతిక సంస్థ డెరైక్టర్ వెంకటేష్ ప్రసాద్, డిప్యూటీ డెరైక్టర్ కృష్ణమూర్తి, మత్స్యశాఖ జిల్లా సంయుక్త సంచాలకుడు బలరాం తదితర అధికారులు బకింగ్హోమ్ కెనాల్ మీదు గా జలమార్గంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి అవసరమైన ప్రాంతాలను పరిశీలించారు. అలిచెర్ల బం గారుపాళెం నుంచి బకింగ్హోమ్ కెనాల్ మీదుగా ఫైబర్ బోట్లలో అధికారులు చిప్పలేరు కాలువ స ముద్రంలో కలిసే ప్రాంతానికి చేరుకున్నారు. సముద్ర ముఖద్వారం, పడవల రాకపోకలకు సంబంధిం చిన మార్గాలు పరిశీలించి జువ్వల దిన్నె వద్ద హార్బర్ నిర్మాణానికి అనుకూలంగా ఉన్నట్టు గుర్తించా రు. ఈ సందర్భంగా వెంకటేష్ ప్ర సాద్ మాట్లాడుతూ జువ్వలదిన్నె వద్ద సుమారు 25 ఎకరాల్లో రూ.100 కోట్లకు పైచిలుకు వ్య యంతో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి అనుకూలంగా ఉందన్నారు. ప్ర స్తుతం స్థల పరిశీలన పూర్తయిం దని, వాటర్ రిసోర్స్, ఎకనామికల్, శాండ్, పర్యావరణ తదితర ప రిశీలనలు పూర్తయిన తరువాత పూ ర్తి స్థాయి నివేదిక సిద్ధమవుతుందని వివరించారు. మినీ ఫిషింగ్ హార్బర్లో పడవల రాకపోకలకు వీలు గా జలమార్గం, స్లోప్ ఆర్డర్, మత్స్య సంపద భద్రపరుచుకునేందుకు కో ల్డ్ స్టోరేజీలు, వలలు బాగు చేసుకు నేందుకు, మోటార్లు భద్ర పరుచుకునేందుకు అవసరమైన నిర్మాణా లు ఉంటాయని తెలిపారు. ఆయన వెంట తహశీల్దార్ జయప్రకాష్, కావలి ఎఫ్‌డీవో ప్రసాద్, వీఆర్వో పార్థసారథి తదితరులు ఉన్నారు.