breaking news
Milakath
-
‘‘గుంట నక్కల్లా వ్యవహరించడం వైఎస్సార్సీపీకి తెలియదు’’
సాక్షి,గుంటూరు:మాజీ ఎంపి నందిగాం సురేష్(Nandigam Suresh) అక్రమ కేసుల్లో అరెస్టై నాలుగు నెలలు అవుతోందని, ఆధారాలు లేకుండా సురేష్‌పై కేసులు పెట్టారని వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishnareddy) అన్నారు. మంగళవారం(డిసెంబర్ 24) గుంటూరు జైలులో సురేష్‌ను పరామర్శించిన తర్వాత సజ్జల మీడియాతో మాట్లాడారు.‘ఈ రోజు టీడీపీ వ్యవహరించినట్లు మేము వ్యవహరించి ఉంటే ఈ కేసులు అప్పుడే తీసేసుకునేవాళ్ళం. మా పాలనలో చట్టం తన పని తాను చేసుకుని వెళ్ళింది. కోర్టుల్లో ఉన్న లొసుగులను ఉపయోగించి జైల్లో ఉంచుతున్నారు. జైల్లో మాజీ ఎంపీకి కనీస సదుపాయాలు కల్పించడం లేదు. వాటర్ బాటిల్ కూడా అనుమతించడం లేదు. నేరుగా సీఎం కొడుకే ఫోన్ చేసి సురేష్‌ను ఎలా ఉంచాలి?అనేది చెబుతున్నారు... ఇవన్నీ కూడా మౌనంగానే భరిస్తున్నాం. వైఎస్సార్సీపిని లేకుండా చేయాలని కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన మహిళలను అరెస్ట్ చేస్తున్నారు. గతంలో ముప్పై ఏళ్ళ క్రితం నక్సలైట్లను అరెస్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టిన వారిని అరెస్ట్ చేస్తున్నారు. వేధించడం అంటే ఎలా ఉండాలో మాకు నేర్పుతున్నారు. ప్రజలు ఇచ్చిన అధికారం ప్రజల కోసమే ఉపయోగించాలి.కూటమి ప్రభుత్వం కక్ష తీర్చుకోవడంలో కొత్తకొత్త పద్దతులు ఉపయోగిస్తున్నారు. గుంట నక్కల్లా వ్యవహరించడం వైఎస్సార్సీపీకి తెలియదు. మీ కంటే బలంగా కొట్టగలిగే శక్తి వైఎస్సార్సీపీకి ఉంది. నాలుగేళ్ళలో మేము అధికారంలోకి వస్తే మా వాళ్ళు చెప్పినా కూడా వినే పరిస్థితి ఉండదు’అని సజ్జల హెచ్చరించారు. -
ఆర్టీసీ ఖజానాకు కన్నం
- బస్టాండ్లలోని దుకాణాల కేటాయింపులో హస్తలాఘవం - కొత్త దుకాణాలు రాకుండా తెరవెనక చక్రం తిప్పుతున్న అధికారులు - పాత దుకాణదారులతో మిలాఖత్ ఫలితం - రూ.కోట్లు నష్టపోతున్న రవాణా సంస్థ సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీది అంతులేని నష్టాల కథ. తీరని వ్యథ. ఖజానాకు గండి కొడుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదన్నది సామాన్యుల బాధ. ఓవైపు అప్పులు.. వాటిపై కొండలా పేరుకుపోతున్న వడ్డీలు.. మరోవైపు రికార్డుస్థాయి నష్టాలు... ఇలాంటి తరుణంలో ఎవరైనా ఏం చేస్తారు..? రూపా యి ఆదాయం వచ్చే మార్గం కనిపించినా వదిలిపెట్టకుండా వినియోగించుకుంటారు. కానీ రూ.కోట్లు వచ్చే మార్గాన్ని ఆర్టీసీ అధికారులు మూసేసి సంస్థ ఖజానాను దెబ్బతీస్తున్నారు. బస్టాండ్లలో దుకాణాల అద్దె ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఆర్థిక వనరు. చాలా ప్రాం తాల్లో కొత్త దుకాణాల కేటాయింపు, బస్టాండ్ ఆవరణలోని ఖాళీ స్థలాలను అద్దెకివ్వటం వంటివి జరుగుతున్నాయి. వీటిని టెండర్ల ద్వారా కేటాయించాల్సి ఉంటుంది. ఇటీవల బస్టాండ్లలోని ఖాళీ స్థలాల్లో సైకిల్స్టాండ్లు, చిన్నచిన్న బడ్డీకొట్లకు ఆర్టీసీ టెండర్లు పిలి చింది. వాటిని సంబంధీకులకు అప్పగించకుండా కొందరు అధికారులు పాత దుకాణదారులతో మిలాఖత్ అయ్యారు. నల్లగొండ జిల్లాలోని ఏడు ముఖ్యమైన బస్టాండ్లలో 45 దుకాణాలకు సరిపడా ఖాళీస్థలాన్ని గుర్తించి జనవరిలో టెండర్లు పిలవగా 87 మంది పాల్గొన్నారు. ఎక్కువ మొత్తాన్ని కోట్ చేసిన 45 మందిని అధికారులు గుర్తించారు. ఈ దుకాణాల ద్వారా సాలీనా ఆర్టీసీ ఖజానాకు రూ.1.20 కోట్లు సమకూరుతుంది. టెండర్లు దక్కించుకున్నవారికి స్థలాలను కేటాయించేం దుకు నల్లగొండ జిల్లా ఆర్టీసీ అధికారులు హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయ అనుమతి కోరారు. 2 నెలలు దాటుతున్నా అతీగతీలేదు. ఇప్పటికే దుకాణాలు నడుపుతున్న కొందరు వ్యాపారులు కొత్తవారు రాకుండా తెరవెనక ఒత్తిడి ప్రారంభించారు. దాని ఫలి తంగానే అనుమతి రాకుండా కొందరు ఉన్నతాధికారులు అడ్డుపడుతున్నట్టు తెలిసింది. చివరికి ఆ టెండర్లనే రద్దు చేయించే యత్నం లో ఉన్నట్టు తెలుస్తోంది. నల్లగొండతోపాటు మరికొన్ని జిల్లాల్లోని బస్టాండ్లలోనూ ఇదే తంతు నడుస్తున్నట్టు సమాచారం. కొన్నిచోట్ల అధికారులు డిమాండ్ లేదనే పేరుతో టెం డర్లూ పిలవటం లేదు. దీన్ని సమీక్షించకపోవటంతో ఆర్టీసీ రూ.కోట్లలో నష్టపోతోంది. అడ్డగోలు వ్యవహారం ఇలా.. బస్టాండ్లలో దుకాణాల కేటాయింపునకు స్పష్టమైన విధివిధానాలున్నాయి. పళ్లు, పళ్లరసాలమ్మేందుకు కేటాయించే దుకాణంలో వేరే వస్తువులు అమ్మకూడదు. కానీ ఒక పేరుతో అద్దెకు దుకాణం తీసుకుని అందులో యథేచ్ఛగా వేరే వస్తువులను కూడా విక్రయిస్తున్నారు. ఒకే దుకాణంలో మూడు, నాలుగు దుకాణాలకు సరిపడా ఇతర రకాల వస్తువులు విక్రయిస్తున్నారు. దీంతో ఇతర వస్తువులకు ఉద్దేశించిన దుకాణాలు ఖాళీగా ఉండి ఆర్టీసీకి భారీ నష్టం వాటిల్లుతోంది. కొంతకాలంగా ప్రభుత్వం ఆర్టీసీని విస్మరించటాన్ని ఆసరా చేసుకుంటున్న అవినీతి అధికారులు సంస్థ ఆదాయాన్ని తమ జేబుల్లోకి మళ్లిస్తున్నారు.