breaking news
mila sandhya
-
ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య
నకిరేకల్ : ఉరేసుకుని ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నకిరేకల్‌లో సోమవారం జరిగింది. వివరాలు... పట్టణంలోని గుడిపాటి ఫంక్షన్‌హాల్ పక్క వీధిలో మీలా సంధ్య (43) తన భర్త దేవేంద్ర ప్రసాద్‌తో కలిసి జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలకు వివాహం చేశారు. మూడు రోజుల క్రితం తిరుపతి పుణ్య క్షేత్రానికి వెళ్లి ఆదివారం ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో భర్త, చిన్న కుమార్తె ఉన్న సమయంలో సంధ్య గదిలోకి వెళ్లి లోపల గడియ వేసుకుని ఉరివేసుకుంది. కాసేపటికి భర్త తలుపును తెరిచేసరికి అప్పటికే మృతిచెందింది. దీంతో భర్త దేవేంద్ర ప్రసాద్‌తో పా టు కుమార్తె కూడా దుఖః సాగరంలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ నర్సింహారావు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
గృహిణి ఆత్మహత్య
నల్లగొండ: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ గృహిణి ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో సోమవారం చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన మీలా సంధ్య(42) ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.