breaking news
migrations to usa
-
అమెరికాలో భారతీయం!
అమెరికా అంటేనే వలస దేశం. వివిధ దేశాల నుంచి వచ్చిన వారితో నిండిపోయిన దేశం. కొత్తగా వలస వస్తున్న వారు తగ్గిపోయారు కానీ అమెరికా జనాభాలో ఇతర దేశాల వాళ్ల సంఖ్య పెరుగుతోంది. అందులో మన దేశానిదే అగ్రభాగం. అగ్రరాజ్యానికి వచ్చి అక్కడే స్థిరనివాసం ఏర్పరచుకుని సంతానాన్ని పెంచుకోవడంతో విదేశీ జనాభా పెరుగుతోంది. అమెరికాకు చెందిన థింక్ ట్యాంక్ ది సెంటర్ ఫర్ ఇమ్మిగ్రేషన్ స్టడీస్ (సీఈఎస్) అంచనాల ప్రకారం అమెరికాలో గత తొమ్మిదేళ్లలో భారతీయుల సంఖ్య ఏకంగా 49 శాతం పెరిగింది. అమెరికన్ కమ్యూనిటీ సర్వే (ఏసీఎస్) 2018, జూలై 1 నాటికి అమెరికా జనాభా, అందులో విదేశీ ప్రజలు ఎంత మంది ఉన్నారు వంటి వివరాలతో ఒక నివేదిక రూపొందించింది. దీని ప్రకారం అమెరికా జనాభా 32.7 కోట్లు ఉంటే, వారిలో 4.47 కోట్ల మంది విదేశీయులే. అంటే మొత్తం జనాభాలో 13.7 శాతం విదేశీయులన్న మాట. 2010లో 4 కోట్ల మంది విదేశీయులు ఉంటే, ఎనిమిదేళ్లలో వారి సంఖ్య 11.8% అధికమైంది. భారతీయుల జనాభా 2010లో 18 లక్షలు 2018లో 27 లక్షలు పెరుగుదల 49% ► 1990 నుంచి చూస్తే మొత్తంగా భారతీయుల సంఖ్య పెరిగింది 500% ► 2018 జూలై ఒకటి నాటికి అమెరికాలో భారతీయులు 27 లక్షల మంది వరకు ఉన్నారు. అంతకు ముందు ఏడాది 26.1 లక్షల మంది ఉన్నారు. కేవలం ఒక్క ఏడాదిలోనే 1.5% పెరుగుదల కనిపించింది. చైనా జనాభా 2010లో 22 లక్షలు 2018లో 29 లక్షలు పెరుగుదల 32% -
భారత్ నుంచి అమెరికాకు పెరుగుతున్న వలసలు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇతర దేశాల నుంచి వస్తున్న ప్రజల వలసలే ప్రధాన సమస్యగా మారింది. ముఖ్యంగా అధ్యక్షపదవికి రిపబ్లికన్ల తరఫున పోటీచేస్తున్న డోనాల్డ్ ట్రంప్ ప్రచారమంతా ఈ సమస్య చుట్టే తిరుగుతోంది. పొరుగున్న మెక్సికో నుంచి పెరుగుతున్న వలసలను నియంత్రిస్తానని ఆయన చెబుతున్నారు. వాస్తవానికి మెక్సికో నుంచి వలసలు గతంతో పోలిస్తే బాగా తగ్గాయి. ఇప్పుడు అగ్రస్థానంలో భారత దేశమే ఉందని, మెక్సికో కనీసం రెండో స్థానంలో కూడా లేదని, చైనా తర్వాతనే మెక్సికో ఉందని 'వాల్‌స్ట్రీట్ జర్నల్' తాజా విశ్లేషణలు చెబుతున్నాయి. 2012 నుంచి 2014 వరకు అందుబాటులో ఉన్న వలసల గణాంకాలను మాత్రమే పరిగణనలోకి తీసుకొని ఈ విశ్లేషణలు చేసింది. వలసల్లో అక్రమ వలసలు, చట్టబద్ధంగా వచ్చిన వలసలు ఉన్నాయి. ఇతర దేశాల సంతతికి చెందినవారిని కాకుండా ఇతర దేశాల్లో పుట్టి అమెరికాకు వచ్చి స్థిరపడిన వారినే వలసల గణాంకాల్లోకి తీసుకున్నారు. భారత్ నుంచి మెక్సికో కన్నా భారీగా వలసలు పెరిగాయంటే దానర్థం అమెరికాలో ప్రస్తుతం మెక్సికోలకన్నా భారతీయులు ఎక్కువగా ఉన్నారన్న అర్థం కాదు. మెక్సికోలో పుట్టి అమెరికాలో స్థిరపడినవారి సంఖ్య 1.10 కోట్లు కాగా, భారత్‌లో పుట్టి అమెరికాలో స్థిరపడినవారి సంఖ్య 22 లక్షలు. ఇతర దేశాల్లో పుట్టి అమెరికాలో వచ్చి స్థిరపడిన మొత్తం వలస ప్రజల్లో మెక్సికన్ల సంఖ్య 27.9 శాతం కాగా, భారతీయుల సంఖ్య 5.2 శాతం. 2012 నుంచి అమెరికాకు వలసవచ్చే మెక్సికన్ల, చైనీయుల సంఖ్య బాగా పడిపోయినా, భారతీయుల సంఖ్య మాత్రం పెరగుతూనే వస్తోంది. మెక్సికోలో, చైనాలో ఉద్యోగావకాశాలు పెరగడమే అమెరికాకు ఆయా దేశాల నుంచి వలసలు తగ్గడానికి కారణమని సామాజిక శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ఇంజనీర్లు, ఐటీ ప్రొఫెషనర్లకు ఇప్పటికీ అమెరికాలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండటంతో భారతీయులు అమెరికాకు క్యూ కడుతున్నారు.