breaking news
migrants missing
-
పడవ మునిగి 97 మంది గల్లంతు
-
పడవ మునిగి 97 మంది గల్లంతు
ట్రిపోలి: లిబియా రాజధాని ట్రిపోలి సమీపంలో సముద్రంలో పడవ మునిగిపోవడంతో 97 మంది శరణార్థులు గల్లంతయ్యారు. ఈ పడవలో మొత్తం 120 మంది ఉన్నారు. లిబియా కోస్ట్ గార్డ్ సిబ్బంది వెంటనే రంగంలోకి 23 మందిని రక్షించారు. మిగిలిన వారి జాఢ తెలియ రావడం లేదు. గల్లంతైన వారిలో 15 మంది మహిళలు, పిల్లలు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. శరణార్థులు ఎక్కువగా లిబియా నుంచి సముద్ర మార్గం ద్వారా యూరప్ బయల్దేరివెళ్తారు. గత మూడేళ్లలో లక్షా 50 వేల మంది వలస వెళ్లారు. కాగా సామర్థ్యానికి మించి పడవల్లో ప్రయాణించడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.