breaking news
microgravity atmosphere
-
శుభాంశు బిజీబిజీ
న్యూఢిల్లీ: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కు చేరుకున్న భారత వ్యోమగామి శుభాంశు శుక్లా తన విధుల్లో బిజీగా మారారు. ఒకరోజు విశ్రాంతి తర్వాత తన ‘ఐఎస్ఎస్ పదోరోజు’పనుల్లో భాగంగా సూక్ష్మ గురుత్వాకర్షణ స్థితిలో మనిషి ఎముకల సాంద్రత ఎలా ఉంటుంది? అనే అంశంపై ఆయన పరిశోధనలు మొదలుపెట్టారు. భారరహిత స్థితిలో ఎముకలో కణాల పుట్టుక, అభివృద్ధి, వాపు అంశాలపైనా శుక్లా శోధన సాగించారు. దీర్ఘకాలంపాటు ఖగోళయానం చేస్తే రేడియోధార్మీకత కారణంగా వ్యోమగాముల కణాల్లో డీఎన్ఏ నిచ్చెనలు దెబ్బతింటే అవి మళ్లీ మరమ్మతులు చేసుకోవాలంటే భూమి గురుత్వాకర్షణ అవసరం. కానీ ఐఎస్ఎస్లో అత్యంత స్వల్పస్థాయిలో గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. అలాంటప్పుడు రేడియేషన్ ప్రభావ స్థాయిలు ఎలా ఉంటాయనే దానిపై శుక్లా అధ్యయనం మొదలెట్టారు. నీటి ఎలుగుబంటి(టార్డీగ్రేడ్)తోపాటు శైవలాలు శూన్యస్థితిలో ఎలా పెరగగలవు? అనే అంశంపై ప్రయోగంచేశారు. వాటర్బేర్ల ఉనికి, పునరుజ్జీవం, పునరుత్పత్తి విధానాల్లో మార్పులను ఆయన గమనించారు. ఈ సూక్ష్మజీవాలు భవిష్యత్తులో సుస్థిర జీవనానికి, ఆహారం, ఇంధనంతోపాటు పీల్చేగాలికి ఊపిరులూదొచ్చు. అయితే తొలుత భారరహిత స్థితిలో ఈ అతిసూక్ష్మజీవాలు ఎలా మనుగడ సాగిస్తాయో తెల్సుకోవాల్సి ఉంది’’అని యాగ్జియం స్పేస్ సంస్థ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ‘‘శుక్లాతోపాటు యాగ్జియం బృంద సభ్యులు ఎముక శూన్యంలో ఎలా పెళుసుబారుతుంది? భూమి మీదకు రాగానే ఎలా పూర్వస్థితిని చేరుకుంటుంది? అనే దానిపైనా ప్రయోగంచేశారు. ఆస్టియోపోరోసిస్ వంటి ఎముక సంబంధ వ్యాధులకు మరింత మెరుగైన చికిత్సావిధానాల అభివృద్ధికి తాజా ప్రయోగాలు దోహదపడతాయి’’అని యాగ్జియం స్పేస్ తెలిపింది. శూన్య స్థితిలో అస్థిపంజరంలోని కండరాలు ఎందుకు సూక్ష్మస్థాయిలో స్థానభ్రంశం చెందుతాయనే అంశంపైనా శుక్లా పరిశోధన చేశారు. చాలా రోజులపాటు అంతరిక్షయాత్రల్లో భాగంగా ఐఎస్ఎస్లో గడిపే వ్యోమగాములను కండరాల క్షీణత పట్టిపీడిస్తుంది. దీనికి కణస్థాయిలో పరిష్కారం కనుగొనేందుకు శుక్లా ప్రయత్నించారు. -
నింగీ నేలా ఏకమయ్యేలా...
అంతరిక్షంలోకి వెళ్లి దాని లోతులు తెలుసుకోవాలనే తపన ఉన్నవారు శారీరకంగా, మానసికంగా ఎంతో బలంగా ఉండాలి. కఠోర శిక్షణ పూర్తి చేయాలి. వ్యోమగాముల పొడవు కనీసం 147 సెంటీ మీటర్లు (4 అడుగుల 8 అంగుళాలు) ఉండాలి. కంటిచూపు బాగుండాలి. రక్తపోటు ఉండకూడదు. విద్యాధికులై ఉండాలి. వయసుకి ఎలాంటి పరిమితి లేకపోయినప్పటికీ సాధారణంగా 25 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారికే శిక్షణ ఇస్తారు. భూ కక్ష్యను దాటి పైకి వెళ్లే కొద్దీ వ్యోమగాములు ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యమైనది భారరహిత స్థితి. వ్యోమగాముల్ని తీసుకువెళ్లే ఉపగ్రహం భూమి దాటి పైకి వెళ్తున్న కొద్దీ శరీరం బరువు తగ్గిపోతుంది. ఆ సమయంలో గురుత్వాకర్షణ శక్తికి సంబంధించిన ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. రేడియేషన్ అధికంగా ఉండటంతో శారీరకంగా ప్రభావం పడుతుంది. ఎక్కువ మందిలో మోషన్ సిక్నెస్, రక్త ప్రసరణలో తేడాలు కనిపిస్తాయి. సరైన శిక్షణ ఇవ్వకపోతే వ్యోమగాములు స్పృహ కోల్పోయే అవకాశం ఉంది. మైక్రో గ్రావిటీ, మానవ సంచారం లేకుండా ఒంటరిగా ఉండటం, శూన్యంలో ప్రయాణం వంటివి వ్యోమగాముల్ని మానసికంగా దెబ్బ తీయకుండా ఈ శిక్షణ ఇస్తారు. అంతరిక్షంలో ఉండే వాతావరణాన్ని భూమిపై కృత్రిమంగా నెలకొల్పిన సిమ్యులేటర్లలో కఠోర శిక్షణ ఇస్తారు. వాతావరణంలో ఉన్న ఒత్తిడి కంటే ఆరు రెట్లు అధికమైన ఒత్తిడి ఈ సిమ్యులేటర్లలో ఉంటుంది. వీటిలో శిక్షణ తీసుకుంటే భార రహిత స్థితిని సమర్థవంతంగా ఎదుర్కోవడం, రోజువారీ కార్యకలాపాల నిర్వహణ, వాతావరణంలో త్వరత్వరగా వచ్చే మార్పుల్ని తట్టుకునే శారీరక సామర్థ్యం, అంతరిక్ష వాతావరణంలో శరీరంపై పడే దుష్ప్రభావాలను తగ్గించుకునే సామర్థ్యం వంటివి పెరుగుతాయి. అన్నింటికి మించి శరీరం తలకిందులుగా ఉన్నప్పుడు అన్ని పనుల్ని చక్కబెట్టే సామర్థ్యం, స్పేస్ వాక్ వంటి వాటిల్లో శిక్షణ ఉంటుంది. అత్యంత ఇరుకుగా ఉండే కాప్సూ్యల్లో ప్రయాణం కూడా అత్యంత క్లిష్టమైనదే. ఇవే కాకుండా స్పేస్‌క్రాఫ్ట్ నిర్వహణపై కూడా శిక్షణ ఇస్తారు. మిషన్‌లో వచ్చే సాంకేతిక లోపాల్ని సరిదిద్దడం, ఉపగ్రహ ప్రయాణం ఏ దిశగా వెళుతోందో గమనిస్తూ ఉండటం, అత్యవసర పరిస్థితుల్ని ఎదుర్కొనే సామర్థ్యం వంటివాటిలో శిక్షణ ఇస్తారు. ఇక హైడ్రోల్యాబ్స్లో నీళ్లల్లో భారరహిత స్థితిలో ఉండటంపై శిక్షణ కూడా ఉంటుంది. -
అంతరిక్ష కేంద్రంలో మొక్కలు పెంచేస్తున్నారు..
సాక్షి, హైదరాబాద్: ఆధునిక సాంకేతిక రంగంలో ఎప్పటికప్పుడు అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ మానవుడు తన మనుగడను భూమి నుంచి అంతరిక్షంలోకి తీసుకుపోతున్నాడు. మానవుడు తలచుకోవాలేగానీ నేల, నీరు లేకుండా కూడా మొక్కలు పెంచవచ్చని నిరూపించాడు. తాజాగా అంతరిక్ష స్పేస్ స్టేషన్లో సంవత్సరాలుగా ఉంటున్న వ్యోమగాములు అక్కడ ఏకంగా మొక్కలు పెరగడానికి అనుకూల వాతావరణం కల్పించి ఆకుపచ్చని మొక్కలను పెంచేస్తున్నారు. అంతరిక్షంలోని మైక్రోగ్రావిటీ వాతావరణంలో నాసాకు చెందిన వ్యోమగామి స్కాట్ కెల్లీతోపాటు 44 మంది వ్యోమగాములు మొట్టమొదటి సారిగా ఈ మొక్కలను పెంచారు. వీటి నుంచి వచ్చే ఆహార పదార్థాలను తినడానికి ప్రత్యేక పద్ధతిలో శుభ్రపరిచి తింటారు. అంతేకాకుండా అక్కడ పండిన వాటిని మరిన్న పరిశోధనల కోసం భూమిపైకి కూడా పంపించనున్నారు. నాసా ప్రారంభించిన వెజ్-01 కార్యక్రమంలో భాగంగా అంతరిక్షంలో మొక్కల పెంపకంపై పరిశోధనలు చేస్తున్నారు. ఇది పూర్తిగా విజయవంతమైతే అంతరిక్షంలో వ్యోమగాములు టమాటా, రెడ్బెర్రీస్ లాంటి తాజా వాటిని తినొచ్చు.