breaking news
Micro biology
-
జీవక్రియలను ప్రభావితం చేసే మైక్రోబయోమ్!
మన కడుపు, పేగుల్లో ఉండే సూక్ష్మజీవుల ప్రపంచం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని ఇటీవలి కాలంలో జరిగిన పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఎలా జరుగుతోందన్న విషయం మాత్రం అంతగా తెలియలేదు. బోస్టన్ చిల్డ్రన్ హాస్పిటల్స్ శాస్త్రవేత్తల పరిశోధనల కారణంగా ఈ లోటు కూడా భర్తీ అయింది. రోగ నిరోధక వ్యవస్థను ప్రభావితం చేయడం ద్వారా పేగుల్లోని మంచి బ్యాక్టీరియా జీవక్రియలు జరిగే పద్ధతిలో మార్పులు చేయగలదని పౌలా వాట్నిక్ అనే శాస్త్రవేత్త చెబుతున్నారు. ఈగలపై తాము పరిశోధనలు చేశామని, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ను అడ్డుకునే రోగనిరోధక వ్యవస్థకు ఇంకో ముఖ్యమైన పని కూడా ఉన్నట్లు ఇందులో తెలిసిందని పౌలా అంటున్నారు. పేగుల్లోని కణాలు ఈ వ్యవస్థ సాయంతో జీవక్రియల్లో మార్పులు చేయడం ద్వారా మంచి బ్యాక్టీరియాను కాపాడుకుంటాయని వివరించారు. పేగుల్లో బ్యాక్టీరియా లేకపోయినా, జీవక్రియల్లో మార్పులు జరక్కపోయినా ఈగల్లో కొన్ని కొవ్వు కణాలు ఏర్పడటం చూశామని చెప్పారు. ఇది మానవుల్లో కనిపించే ఫ్యాటీలివర్ వ్యాధికి సమానమని అన్నారు. -
చైతన్యంతోనే రుగ్మతలు దూరం
విద్యారణ్యపురి : ప్రజల్లో చైతన్యం కలిగించడం ద్వారా సామాజిక రుగ్మతలు దూరం కావడమే కాకుండా వ్యాధులు ప్రబలకుండా రక్షించొచ్చని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. కలుషిత నీరు, ఆహారం తీసుకోవడం ద్వారా ఇప్పటికీ ఎందరో వ్యాధులు బారిన పడుతున్నారని తెలిపారు. ఈ మేరకు సంబంధిత అధికారులు సామాజిక బాధ్యతగా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.హన్మకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైక్రో బయాలజీ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జాతీయ స్థాయి వర్క్‌షాప్ సోమవారం ప్రారంభమైంది. ‘మెడికల్ డయాగ్నస్టిక్ అండ్ మైక్రో బయాలజికల్ అనాలిస్ ఆఫ్ పోటబుల్ అండ్ న్యూట్రిషన్ ఫుడ్’ అంశంపై నిర్వహిస్తున్న ఈ వర్క్‌షాప్ మరో రెండు రోజుల పాటు కొనసాగుతుంది. వర్క్‌షాప్‌ను డిప్యూటీ సీఎం రాజయ్య ప్రారంభించి మాట్లాడారు. మైక్రో బయాలజిస్టులే కీలకం ప్రజల్లో అవగాహన లేకపోవడం, నిపుణులైన సిబ్బంది కొరత కారణంగా వ్యాధి ఒకటైతే పరీక్ష, మందులు మరో రకంగా ఉంటున్నాయని డిప్యూటీ రాజయ్య ఆందోళన వ్యక్తం చేశారు. దీని నివారణకు నిపుణులైన మైక్రో బయాలజిస్టుల పాత్ర కీలకమన్నారు. కేడీసీ విద్యార్థులు వర్క్‌షాప్ లక్ష్యాన్ని అవగాహన చేసుకుని తమ గ్రామ ప్రజల్లో కలుషిత, ఆహారం వల్ల సంభవించే వ్యాధులు, వాటి నివారణపై అవగాహన కల్పించాలని కోరారు. తాను కూడా ఇక్కడి జూనియర్ కళాశాలలో చదువుకున్నానని రాజయ్య గుర్తు చేసుకున్నారు. అలాగే, ప్రస్తుతం ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నా ఇందులో ఆరోగ్య సమస్య ప్రధానమైనదని డిప్యూటీ సీఎం రాజయ్య అన్నారు. పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రతపై నిర్లక్ష్యంగా ఉండడం వల్ల అనేక వ్యాధులు సంక్రమిస్తాయన్నారు. గ్రామీణ, పట్టణ స్థాయిలో పారిశుద్ధ విభాగం అధికారులు, సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేస్తే 60నుంచి 70 శాతం వ్యాధుల నివారణ సాధ్యమవుతుందన్నారు. అంతేకాకుండా ప్రతీ ఒక్కరు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించి వ్యాధుల నిర్మూలనలో పాలుపంచుకోవాలని డిప్యూటీ సీఎం కోరారు. ఉన్నత విద్య కళాశాలల ఆర్జేడీ డాక్టర్ బి.దర్జన్ మాట్లాడుతూ మైక్రోబయాలజీ కోర్సుకు ఎందో ప్రాధాన్యమున్నా.. సరైన ఫ్యాకల్టీ లేక చాలా కళాశాలల్లో కోర్సు ఎత్తివేస్తున్నారన్నారు. వర్కషాప్లో హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిస్ట్యూట్ అండ్ న్యూట్రిషన్ సీనియర్ సైంటిస్టు సుదర్శన్‌రావు కీలకోపన్యాసం చేస్తూ ఆహారం, నీరు కలుషితం కాకుండా తీసుకోవాల్సిన అవసరముందన్నారు. ఇంకా కేడీసీ ప్రిన్సిపాల్ ఆర్.మార్తమ్మ, కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ ఎస్ఎం.రెడ్డి, వర్క్‌షాప్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.సదాశివరెడ్డి, డాక్టర్ ఎన్వీఎన్చారి మాట్లాడిన ఈ కార్యక్రమంలో డాక్టర్ సోమిరెడ్డి, వినోలియా మిల్కా, హిమబిందు, వాసం శ్రీనివాస్, సత్యనారాయణరావు, విష్ణుచరణ్, విక్టర్ సంజీవయ్య పాల్గొన్నారు. కాగా, తొలుత డిప్యూటీ సీఎం ఎన్సీసీ కేడెట్ల నుంచి గౌరవ వందన స్వీకరించగా, చివర్లో డిప్యూటీ సీఎం, సైంటిస్ట్ సుదర్శన్‌రావును నిర్వాహకులు సన్మానించారు. -
సమాజ సేవకు.. మైక్రో బయాలజిస్ట్
అప్‌కమింగ్ కెరీర్: సూక్ష్మ జీవశాస్త్రం(మైక్రో బయాలజీ)... మహా సముద్రం లాంటి జీవశాస్త్రంలో ఒక భాగం. మనిషి కంటికి కనిపించని అతి సూక్ష్మ జీవుల అధ్యయనమే.. సూక్ష్మ జీవశాస్త్రం. భూగోళంపై లెక్కలేనన్ని సూక్ష్మజీవులు ఆవాసం ఏర్పరచుకున్నాయి. వాటిలో మనిషికి శత్రువులు, మిత్రులు.. ఉపయోగపడేవి, అప కారం చేసేవి.. రెండూ ఉన్నాయి. శత్రు జీవు లను నిర్మూలించాలి. మిత్ర జీవులను కాపా డుకోవాలి. వాటిని అనుకూలంగా మార్చు కొని, జీవితాన్ని మరింత సుఖవంతంగా మార్చుకోవాలి. పర్యావరణాన్ని పరిరక్షించు కోవాలి. ఇవన్నీ చేసేవారే.. మైక్రో బయాల జిస్ట్‌లు. మంచి వేతనంతోపాటు పరిశోధనల ద్వారా సమాజానికి సేవ చేసేందుకు అవకాశం కల్పించే కెరీర్.. మైక్రో బయాలజిస్ట్. ఐటీ ఇంజనీర్లకంటే అధిక వేతనాలు మైక్రో బయాలజీలో అగ్రికల్చరల్, సాయిల్, మెడికల్, ఎన్విరాన్మెంటల్, ఇండస్ట్రియల్, ఫుడ్ మైక్రోబయాలజీ తదితర ఉప విభాగాలు ఉన్నాయి. ప్రస్తుతం దేశ విదేశాల్లో మైక్రో బయాలజిస్ట్‌లకు ఎన్నో అవకాశాలు లభిస్తున్నాయి. పర్యావరణం, మెడిసిన్, పబ్లిక్ హెల్త్, పేపర్, టెక్స్టైల్, లెదర్, ఆహారం.. తదితర పరిశ్రమల్లో వీరికి డిమాండ్ పెరుగు తోంది. పరిశోధనల్లో మంచి అనుభవం సంపా దించి, నైపుణ్యాలు పెంచుకున్న మైక్రో బయాల జిస్ట్‌లకు ఐటీ ఇంజనీర్ల కంటే అధిక వేతనాలు అందుతున్నాయని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. అవకాశాలు పుష్కలం మైక్రో బయాలజీ కోర్సును పూర్తిచేస్తే.. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, హెల్త్‌కేర్ సెంటర్లు, ఆసుపత్రుల్లో ఉద్యోగావకాశాలు దక్కించుకోవచ్చు. ఫుడ్ క్వాలిటీ ఆఫీసర్, పొల్యూషన్ కంట్రోలర్, ప్రొడక్ట్ ఇంజనీర్, ఫుడ్ టెక్నాలజిస్ట్, ఇండస్ట్రియల్ మైక్రో బయాలజిస్ట్, పాథాలజీ ల్యాబ్‌ల్లో సైంటిస్ట్, పేటెంట్ అటార్నీ, బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్, ల్యాబ్ టెక్నీషియన్.. తదితర కొలువులు అందుబాటులో ఉన్నాయి. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎస్ఐఆర్), డిపార్టుమెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిపార్టుమెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ లాంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో అవకాశాలు లభిస్తున్నాయి. విశ్వవిద్యాలయాల్లో ఫ్యాకల్టీగా, పరిశోధకులుగానూ స్థిరపడొచ్చు. కొన్ని ప్రభుత్వ సంస్థలు మైక్రో బయాలజీలో పరిశోధనలు చేపట్టేందుకు యువ సైంటిస్ట్‌ల కోసం ఫాస్ట్‌ట్రాక్ ప్రాజెక్ట్‌లను ప్రవేశపెడుతున్నాయి. ప్రత్యేకంగా నిధులు అందజేస్తూ ప్రోత్సహిస్తున్నాయి. అర్హతలు: సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్ పూర్తిచేసిన తర్వాత మైక్రో బయాలజీలో గ్రాడ్యుయేషన్ చదవొచ్చు. ఎంఎస్సీ, పీహెచ్డీ కూడా పూర్తిచేస్తే ఉద్యోగార్హతలు పెరుగుతాయి. వేతనాలు మైక్రోబయాలజీలో గ్రాడ్యుయేషన్/పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారికి ప్రారంభంలో నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనం లభిస్తుంది. నైపుణ్యాలు పెంచుకుంటే కార్పొరేట్ సంస్థల్లో ఏడాదికి రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు భారీ వేతన ప్యాకేజీ పొందొచ్చు. మైక్రో బయాలజీ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు ఉస్మానియా యూనివర్సిటీ వెబ్సైట్: www.osmania.ac.in ఆంధ్రా యూనివర్సిటీ వెబ్సైట్: www.andhrauniversity.edu.in యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వెబ్సైట్: www.uohyd.ac.in నాగార్జునా విశ్వవిద్యాలయం వెబ్సైట్: www.nagarjunauniversity.ac.in యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ వెబ్సైట్: www.du.ac.in మైక్రోబయోటెక్నాలజీతో ఆల్‌రౌండ్ ప్రతిభ ‘‘గత 15-20 ఏళ్లుగా రీసెర్స్, టెక్నాలజీ పరంగా ప్రాచుర్యంలోకి వచ్చింది మైక్రో బయోటెక్నాలజీ. కోర్సులో ఇంటర్ డిసిప్లినరీ సబ్జెక్టులు ఉండటంతో విద్యార్థులు ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరిచే అవకాశం ఉంది. దక్షిణాదిన మొదటిసారి ఈ కోర్సును ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే ప్రవేశపెట్టారు. డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఇతర ప్రాంతాలకు విస్తరించింది. విజయవంతంగా కోర్సు పూర్తిచేస్తే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో బోధన, పరిశోధనలకు అవకాశాలున్నాయి. ప్రతిభ గలవారికి ప్రభుత్వ సంస్థల్లో పరిశోధనలతోపాటు ఫెలోషిప్‌లు అందుతున్నాయి. ఆరేళ్ల వ్యవధిలో రూ.8 వేల నుంచి రూ.20 వేల వరకూ ఫెలోషిప్ లభిస్తుంది. పీహెచ్డీ పూర్తిచేసి సమర్థత నిరూపించుకోగలిగితే ప్రారంభ వేతనమే రూ.40 వేల వరకూ లభిస్తుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి పలు దేశాల పరిశోధన సంస్థలు ఆహ్వానం పలుకుతున్నాయి’’. - డాక్టర్ ఎం.గోపాల్‌రెడ్డి, ప్రొఫెసర్ మైక్రోబయాలజీ విభాగం, ఓయూ -
ఇష్టపడి చదివా.. 'ఎయిమ్స్' టాపరయ్యా!