breaking news
Michael Leask
-
SCO Vs NZ: అదరగొట్టిన లీస్క్.. కానీ పాపం చాప్మన్ విజృంభణతో.. ఏకైక వన్డేలోనూ..
Scotland vs New Zealand, Only ODI: టీ20 సిరీస్‌లో స్కాట్లాండ్ను క్లీన్‌స్వీప్ చేసిన న్యూజిలాండ్ ఏకైక వన్డే మ్యాచ్‌లోనూ జయభేరి మోగించింది. మార్క్ చాప్మన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో ఏడు వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టుపై గెలుపొందింది. కాగా రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్, ఒక వన్డే మ్యాచ్ ఆడేందుకు కివీస్ స్కాట్లాండ్ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా మిచెల్ సాంట్నర్ సారథ్యంలోని న్యూజిలాండ్ టీ20 సిరీస్‌లో వరుసగా 68, 102 పరుగులతో స్కాట్లాండ్పై ఘన విజయం నమోదు చేసింది. ఈ క్రమంలో ఏకైక వన్డేలోనూ గెలుపొంది స్కాట్లాండ్ టూర్‌ను విజయంతో పరిపూర్ణం చేసుకుంది. మ్యాచ్ సాగిందిలా! ఎడిన్బర్గ్ వేదికగా ఆదివారం ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన ఆతిథ్య స్కాట్లాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. వికెట్ కీపర్ బ్యాటర్ మ్యాథ్యూ క్రాస్ 53 పరుగులతో రాణించగా.. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన మైఖేల్ లీస్క్ 85 పరుగుల(55 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లు)తో అదరగొట్టాడు. 50 for @leasky29 💪#FollowScotland 🏴 pic.twitter.com/nUiVFL2z3Q — Cricket Scotland (@CricketScotland) July 31, 2022 మిగిలిన వాళ్లలో ఒకరిద్దరు మినహా మిగతావారు ఫర్వాలేదనిపించారు. దీంతో 49.4 ఓవర్లలో 306 పరుగులు చేసి స్కాట్లాండ్ ఆలౌట్ అయింది. కివీస్ బౌలర్లలో జాకోబ్ డఫీ 3, ఫెర్గూసన్ 2, టిక్నర్ ఒకటి, బ్రాస్‌వెల్ 3 వికెట్లు తీయగా.. డారిల్ మిచెల్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అందరూ ఆడేసుకున్నారు! ఇక లక్ష్య ఛేదనకు దిగిన కివీస్‌కు ఓపెనర్లు మార్టిన్ గప్టిల్ (47), ఫిన్ అలెన్(50) శుభారంభం అందించారు. వన్‌డౌన్ బ్యాటర్ క్లీవర్ 32 పరుగులు చేసి పెవిలియన్ చేరగా.. నాలుగో స్థానంలో బరిలోకి దిగిన మార్క్ చాప్మన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. WICKET ⚡️ Leasky gets Guptill LBW 👊@BLACKCAPS 128/2 after 23 #FollowScotland 🏴 pic.twitter.com/Bpe4GnIEMm — Cricket Scotland (@CricketScotland) July 31, 2022 75 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 101 పరుగులతో అజేయంగా నిలిచాడు. డారిల్ మిచెల్ సైతం 74 పరుగులు(నాటౌట్) చేశాడు. దీంతో 45.5 ఓవర్లకే లక్ష్యం ఛేదించిన న్యూజిలాండ్ ఘన విజయం అందుకుంది. మార్క్ చాప్మన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. స్కాట్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ వన్డే: ►టాస్: స్కాట్లాండ్- బ్యాటింగ్ ►స్కాట్లాండ్ స్కోరు: 306 (49.4) ►న్యూజిలాండ్ స్కోరు: 307/3 (45.5) ►విజేత: 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ గెలుపు ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మార్క్ చాప్మన్ చదవండి: ENG VS SA 3rd T20: బట్లర్ సేనకు చుక్కలు చూపించిన షంషి.. మరో సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్ IND VS WI 2nd T20: టీమిండియా ఆధిపత్యం కొనసాగేనా.. ? రెండో టీ20లో విండీస్‌తో ఢీకి రెడీ అయిన రోహిత్ సేన -
వన్డేల్లో సరికొత్త రికార్డు.. 6 సిక్సర్లతో ఫాస్టెస్ట్ ఫిఫ్టి నమోదు
Michael Leask: ఐసీసీ అసోసియేట్ దేశాల క్రికెట్లో సరికొత్త రికార్డు నమోదైంది. వన్డే ప్రపంచకప్ 2023 అర్హత పోటీల్లో భాగంగా స్కాట్లాండ్, పపువా న్యూ గినియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్ ఆటగాడు మైఖేల్ లీస్క్ 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి ఐసీసీ అసోసియేట్ దేశాలకు వన్డే క్రికెట్లో వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో 6 సిక్సర్లు బాదిన లీస్క్.. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి 2 పరుగులు సాధించి ఈ ఘనతను సాధించాడు. Final ball of the innings, and two needed for the fastest Associate ODI fifty 💥Scotland's Michael Leask gets it done in 18 balls 👏Catch all the @cricketworldcup League 2 action live and FREE on https://t.co/CPDKNxoJ9v 📺 pic.twitter.com/qLmRaJTnNg— ICC (@ICC) April 14, 2022 లీస్క్ ఏడో స్థానంలో బరిలోకి దిగి ఈ ఫీట్‌ను సాధించడం విశేషం. లీస్క్ సాధించిన రికార్డును ఐసీసీ తమ అధికారిక ట్విటర్లో పేర్కొంది. కాగా, అంతర్జాతీయ వన్డేల్లో వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డు దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు, మిస్టర్ డిగ్రీస్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ పేరిట ఉంది. ఏబీడీ 2015లో వెస్టిండీస్‌పై కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. ఏడేళ్లు పూర్తైనా నేటికీ ఆ రికార్డు ఏబీడి పేరిటే పదిలంగా ఉంది. ఇదిలా ఉంటే, పపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్ 123 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేయగా, ఛేదనలో స్కాటిష్ బౌలర్ గావిన్ మెయిన్ (5/52), హమ్జా తాహిర్ (3/27)ల ధాటికి పపువా న్యూ గినియా 36.2 ఓవర్లలో 164 పరుగులకే చాపచుట్టేసింది. పపువా న్యూ గినియా ఇన్నింగ్స్‌లో టోనీ ఉరా (47) టాప్ స్కోరర్‌గా నిలువగా.. స్కాట్లాండ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ కొయెట్జర్ (74), బెర్రింగ్టన్ (56), లీస్క్ (50 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. చదవండి: Odean Smith: ఓ మ్యాచ్‌లో విలన్‌గా, రెండు మ్యాచ్‌ల్లో హీరోగా..!