breaking news
metal detector
-
చైనాలో గోల్డ్ రష్..!
బీజింగ్: ఒకటీరెండూ కాదు..ఏకంగా 20 కిలోల బంగారం, వెండి నగలు...బంగారం, డబ్బు నిండుగా ఉన్న ఇనుప బీరువా..! చైనాలోని ఓ ఊళ్లో జనం వీటిని సొంతం చేసుకునేందుకు తెగ వెతుకుతున్నారు. కొందరు బురద మట్టిని తవ్వి మరీ చూస్తున్నారు. మరికొందరైతే ఏకంగా మెటల్ డిటెక్టర్లను పట్టుకుని తిరుగుతున్నారు. ఇదంతా నిధీ నిక్షేపాల కోసం మాత్రం కాదు..వరదల్లో కొట్టుకుపోయిన సొత్తు కోసం సాగుతున్న ఎడతెగని అన్వేషణ..! ఏం జరిగిందంటే..జూలై 25వ తేదీన షాంగ్జి ప్రావిన్స్‌లోని వుక్వి కౌంటీలో భారీ వర్షాలతో అనూహ్యంగా వరదలు వచ్చాయి. కొన్ని నిమిషాల వ్యవధిలోనే మీటరు ఎత్తున వరద ఉప్పొంగి పట్టణాన్ని ముంచెత్తింది. ఆ వరద లావోఫెంగ్ జియాంగ్ దుకాణంలోకి కూడా ప్రవేశించింది. అధికార యంత్రాంగం వరద హెచ్చరికలతో ఆ రాత్రంగా జాగారం చేసిన దుకాణం సిబ్బంది, ఉదయం పూట యథా ప్రకారం దుకాణం తెరిచేందుకు ఉద్యుక్తులవుతున్నారు. బంగారం, ఇతర విలువైన సామగ్రిని సురక్షితంగా భద్రపర్చడం మర్చిపోయారు. సరిగ్గా ఆ సమయంలో ఎవరూ ఊహించని విధంగా ఒక్కసారిగా వేగంగా వరద ప్రవాహం దుకాణంలోకి చేరింది. తేరుకునేలోపే నగలున్న ట్రేలు, కాబిన్లను ఊడ్చిపెట్టుకుపోయింది. నగదు, నగలతోపాటు ఒక ఐరన్ సేఫ్ సైతం వరదతో పాటు మాయమైంది. బంగారం గొలుసులు, ఉంగరాలు, గాజులు, బ్రాస్లెట్లు, వజ్రపు ఉంగరాలు, వెండి ఆభరణాలు, పచ్చలు పోయిన వాటిల్లో ఉన్నాయి. ఐరన్ సేఫ్‌లో పెద్ద మొత్తంలో నగదుతోపాటు, కరిగించిన బంగారం, కొత్త బంగారు వస్తువులు ఉన్నాయి. వెరసి దుకాణదారుకు వాటిల్లిన నష్టం మార్కెట్ ధర ప్రకారం రూ.12 కోట్లని అంచనా. ఈ సొత్తు కోసం దుకాణం యజమాని కుటుంబంతోపాటు సిబ్బంది రెండు రోజులుగా కాళ్లకు బలపం కట్టుకుని మరీ ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. పోయిన వాటిలో సుమారు కిలో బంగారు ఆభరణాలు దొరికినట్లు అధికారులు చెబుతున్నారు. వరదల కారణంగా పట్టణంలో కరెంటు సరఫరా నిలిచిపోయింది. దీంతో, సీసీటీవీ ఫుటేజీ వ్యవస్థ దెబ్బతింది. దీనివల్ల వరద సమయంలో దుకాణంలో ఏం జరిగిందో తెలుసుకునేందుకు సరైన ఆధారమంటూ లేకుండా పోయింది. ఎవరైనా ఈ వస్తువులను తీసుకెళ్లారా? లేక వరదలోనే కొట్టుకుపోయాయా అనేది నిర్థారించడం సైతం కష్టంగా మారింది. తమ నగల దుకాణానికి సంబంధించిన విలువైన వస్తువులను ఎవరైనా ఉద్దేశ పూర్వకంగా తీసుకున్నట్లు తెలిస్తే చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తామని యజమాని హెచ్చరిస్తున్నారు. దుకాణంలోని వస్తువులు వరదల్లో కొట్టుకుపోయినట్లు సమాచారం తెలుసుకున్న స్థానికులు సైతం గాలింపు మొదలుపెట్టారు. వరదలకు కొట్టుకు పోయి న బురద, మట్టిని తవ్వి మరీ చూస్తున్నారు. కొందరు మెటల్ డిటెక్టర్లతోనూ వెదుకుతున్నారు. ఈ గోల్డ్ రష్కు సంబంధించిన వీడియోలు ఆన్లైన్లో ప్రత్యక్షమవుతున్నాయి. అయితే, స్థానికులెవరూ దొరికిన వస్తువులను తమకివ్వలేదని దుకాణం యజమాని చెబుతున్నారు. అలా ఎవరైనా తీసుకుపోయినట్లు తెలిస్తే సమాచారమివ్వాలని స్థానికులను కోరుతున్నారు. తెచ్చిన వారికి ఆ వస్తువు విలువను బట్టి బహుమతులను సైతం ఇస్తామని ఆశచూపుతున్నారు.బీజింగ్‌లో వర్షాలు, వరదల్లో 44 మంది మృతి చైనా రాజధాని బీజింగ్‌ను భారీ వర్షాలు, వరదలు కకావికలం చేశాయి. శనివారం కురిసిన కుండపోత వానలు, వరదల్లో కనీసం 44 మంది చనిపోగా, 9 మంది గల్లంతయ్యారు. గత నాలుగు రోజులుగా బీజింగ్ సహాయక, రక్షణ కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో మరోసారి భీకరంగా వాన కురియడంతో రహదారులు తెగిపోవడంతోపాటు, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వరద ప్రభావిత ప్రాంతాల్లోని జనాన్ని సురక్షిత ప్రాంతాలకు యంత్రాంగం తరలిస్తోంది. బీజింగ్‌లో ఉత్తరాన ఉన్న పర్వతప్రాంత మియున్, యాంగ్వింగ్ జిల్లాల్లో అత్యధిక నష్టం వాటిల్లిందని అధికార వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. -
కొండల్ని కొల్లగొడుతున్నారు!
సాక్షి, చోడవరం : మండలంలో అక్రమ మెటల్ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో ఎవరికి తోచిన స్థాయిలో వారు కొండలను తవ్వేస్తున్నారు. అడ్డుకున్నవారికి మామూళ్లు ఇస్తూ..గోవాడ, అడ్డూరు, గంధవరం, బెన్నవోలు, ఖండిపల్లి, దుడ్డుపాలెం, అంభేరుపురం గ్రామాల పరిధిలోని కొండల్లో అక్రమ మెటల్ క్వారీలు నిర్వహిస్తున్నారు. అడ్డుకున్నవారికి మామూళ్లు ఇస్తూ దోచుకున్నవారికి దోచుకున్నంతగా ఈ కొండలను కొల్లగొడుతున్నారు. వాస్తవానికి ఎర్ర మెటల్ తవ్వకాలు, రవాణా చేయాలంటే ముందుగా రెవెన్యూ, గనులశాఖల అనుమతి తప్పనిసరి. కాని చోడవరం మండలంలో మాత్రం అవేమీ లేవు. స్థానిక టీడీపీ నేతల కనుసన్నల్లో.. స్థానిక అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో ఎవరికి తోచినంత వారు తవ్వేసుకొని తరలించుకుపోతున్నారు. గోవాడ–భోగాపురం గ్రామ మధ్య ఉన్న కొండపై అడుగడుగునా ఈ అక్రమ మెటల్ తవ్వకాలు జరుగుతున్నాయి. ఖండిపల్లి, భోగాపురం, దుడ్డుపాలెం, అడ్డూరు క్వారీల్లో పొక్లెయిన్, జేసీబీ యంత్రాల సాయంతో ఎక్కడికక్కడ కొండను తవ్వేసి లారీలు, ట్రాక్టర్లపై తరలించుకుపోతున్నారు. రాత్రి సమయాల్లో ఎక్కువగా ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి. వీటికి స్థానిక అధికారపార్టీ నాయకుల సహకారం కూడా ఉందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ సర్పంచ్ల అనుచరులే.. ఖండిపల్లి, దుడ్డపాలెం గ్రామాల్లో అధికారపార్టీ సర్పంచ్ల అనుచరులే నేరుగా కొండను తవ్వేసి మెటల్‌ను అమ్మేస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. రియల్ఎస్టేట్ వ్యాపారులతో కుమ్మక్కై ఈ దందా నడుస్తున్నట్టు తెలిసింది. గంధవరం, అడ్డూరు గ్రామాల్లో రియల్టర్లు పక్కనే ఉన్న కొండల నుంచి ఎర్ర మెటల్, మట్టిని తవ్వేసి భూములను ఎత్తుచేసి ప్లాట్లు విక్రయిస్తున్నారు. వీఆర్వోలపై విమర్శలు.. స్థానిక గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వోలు) సహకారంతోనే ఇదంతా జరుగుతోందని ఆరోపణలు ఉన్నాయి. పర్యవేక్షించాల్సిన మండల రెవెన్యూ అధికారులు అధికారపార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గడంతో అక్రమ క్వారీలు ఎక్కడికక్కడ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. దీనిపై మైనింగ్ శాఖ అధికారులు కూడా పట్టించుకోకపోవడంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా అనుమతి లేకుండా కొండలను తవ్వేయడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం రాకపోగా పర్యావరణాన్ని పరిరక్షించే కొండలు, పచ్చదనం కూడా నాశనమయ్యే ప్రమాదం ఏర్పడింది. దీనిపై మైన్స్, రెవిన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. చర్యలు తీసుకుంటాం గ్రావెల్ క్వారీలకు మండలంలో ఎటువంటి అనుమతులు లేవు. అక్రమంగా తవ్వకాలు జరిపే వారిపై చర్యలు తీసుకుంటాం. తవ్వకాల నిరోధించేందుకు ఆయా గ్రామాల వీఆర్వోలతో తనిఖీ బృందం ఏర్పాటుచేస్తాం. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటాం. – కేవీఎస్ రవి, తహసీల్దార్, చోడవరం -
మెటల్ డిటెక్టర్
షాపింగ్ మాళ్లు మొదలుకొని ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లు, సినిమాహాళ్లు ఇలా ఎక్కడికెళ్లినా కనిపించేవి మెటల్ డిటెక్టర్లు. జేబుల్లో ఎలాంటి లోహమున్నా సరే... డిటెక్టర్ దగ్గరగా వెళ్లే చాలు... అది కుయ్‌కుయ్ మని అరిచేస్తుంది? ఒంటిపై ఉండే లోహపు ఆనవాలును ఆ పరికరం ఎలా గుర్తిస్తుంది? అని మనలో చాలామంది అనుకునే ఉంటాం. ఇదిగో సమాధానం. ఏ మెటల్ డిటెక్టర్లోనైనా ట్రాన్స్మిటర్, రిసీవర్ కాయిల్స్ అని రెండు తీగచుట్టలు ఉంటాయి. ట్రాన్స్మిటర్ కాయిల్ గుండా విద్యుత్తు ప్రవహించినప్పుడు తీగచుట్ట పరిసరాల్లో ఒక అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. మన శరీరంపై లేదా బ్యాగుల్లో ఉండే లోహం ఈ అయస్కాంత క్షేత్రానికి స్పందిస్తుంది. ఎడ్డీ కరెంట్స్ ప్రవాహం వల్ల ఆ లోహపు వస్తువు చుట్టూ మరో బలహీనమైన క్షేత్రం ఏర్పడుతుంది. ఈ క్షేత్రాన్ని రిసీవర్ కాయిల్ గుర్తిస్తుంది. ప్రసారమైన అయస్కాంత క్షేత్రం తీవ్రతకు, అందుకున్న దానికి మధ్య ఉండే తేడా అధారంగా మెటల్ డిటెక్టర్ కూతపెడుతుందన్నమాట. 1881లో అమెరికా అధ్యక్షుడు జేమ్స్ గార్ఫీల్డ్ హత్యకు గురైనప్పుడు అతడి శరీరంలో ఉన్న బుల్లెట్‌ను గుర్తించేందుకు అలెగ్జాండర్ గ్రాహం బెల్ (టెలిఫోన్ ఆవిష్కర్త) తొలిసారి మెటల్ డిటెక్టర్‌ను వాడినట్లు చరిత్ర చెబుతుంది. చిత్రమైన విషయం ఏమిటంటే... 1930 ప్రాంతంలో ఫిషర్ అనే శాస్త్రవేత్త ఈ మెటల్ డిటెక్టర్ టెక్నాలజీని ప్రయాణ మార్గాన్ని, దిశను తెలిపే సాధనంగా ఉపయోగించారు. అయితే రాళ్లు ఇతర అడ్డంకులు ఉన్నచోట ఈ పరికరం సరిగా పనిచేయకపోవడాన్ని గుర్తించిన ఫిషర్ ఆ పరికరంతో లోహపు ఆనవాళ్లను గుర్తించవచ్చునని తెలుసుకున్నారు. అప్పటి నుంచి మెటల్ డిటెక్టర్‌గా వాడటం మొదలుపెట్టారు. హౌ ఇట్ వర్క్స్ -
రైల్వే స్టేషన్లలో భద్రత డొల్ల
అనుమానాస్పద వ్యక్తులకు రాచమార్గాలు చెన్నై ఘటనతో కదిలిన యంత్రాంగం.. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లలో తనిఖీలు సాక్షి,సిటీబ్యూరో/నాంపల్లి, న్యూస్‌లైన్: సరిగ్గా ఏడు నెలల క్రితం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఓ సైకో కత్తితో అమ్మాయి గొంతు కోసి ప్రాణం తీశాడు. అంతుకుముందు ఇదే స్టేషన్లో మందమర్రికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి రైలు నుంచి కాలు జారి కింద పడిపోయాడు. 45 నిమిషాలకు పైగా రక్తస్రావమైనా ఒక్క పోలీసూ అటువైపు తొంగి చూడలేదు. ఒక్క సికింద్రాబాద్‌లోనే కాదు.. కాచిగూడ, నాంపల్లి స్టేషన్లలోనూ తరచుగా చోరీలు, పోకిరీల వేధింపులు వంటివి జరుగుతునే ఉన్నాయి. ఓ పిచ్చివాడు కత్తి పట్టుకొని స్టేషన్ లోపలికి ప్రవేశించి ఓ చిన్నారిని బలి తీసుకున్నాక పది రోజులు మాత్రం యంత్రాంగం భద్రతను పెంచింది. తాజాగా చెన్నై సెంట్రల్ స్టేషన్లో జరిగిన బాంబు పేలుళ్లతో గురువారం ఇక్కడి అధికార యంత్రాంగం తనిఖీలు చేపట్టింది. తర్వాత షరా మామూలే అన్నట్టు రైల్వే అధికారులు వ్యవహరిస్తారు. నగరంలోని మూడు రైల్వేస్టేషన్లలో భద్రత డొల్లతనాన్ని చెప్పేందుకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.. సికింద్రాబాద్ స్టేషన్‌లోని ప్రయాణికుల కౌంటర్ల వద్ద ఒక ద్వారానికి మెటల్ డిటెక్టర్ ఉంది. కానీ అక్కడ ఎలాంటి తనిఖీలు ఉండవు. ప్రయాణికులు మెటల్ డిటెక్టర్ లేని మరో ద్వారం నుంచే రాకపోకలు సాగిస్తారు. రేతిఫైల్ బస్టేషన్ వైపు ఉన్న మరో ద్వారం నుంచి యథేచ్ఛగా రాకపోకలు సాగిస్తారు. రైల్వే ఎస్పీ కార్యాలయం వద్ద కూడా ఎలాంటి తనిఖీలు లేకుండా ఎవరన్నా లోపలికి వెళ్లవచ్చు. నాంపల్లి రైల్వే స్టేషన్లో అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే భద్రత చర్యలు చేపడతారు. స్టేషన్ లోనికి ప్రవేశించడానికి అనేక అడ్డదారులు ఉన్నాయి. పబ్లిక్‌గార్డెన్ అడ్డాపై ఉండే పోకిరీలు నాంపల్లి రైల్వే స్టేషన్ యార్డులోకి వచ్చి స్నానాలు చేస్తుంటారు. యార్డులో ఉంచిన కోచ్‌ల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంటారు. వీరిని అదుపు చేసేవారు ఉండరు. ఈ స్టేషన్‌లోనికి ప్రధాన ద్వారాల నుంచి సైతం ప్లాట్ఫారం టికెట్టు కూడా లేకుండా వచ్చి వెళ్తారు. వేసవి కావడంతో చాలామంది ప్లాట్ఫారాలపైనే నిద్రపోతున్నారు. స్టేషన్లో సీసీ కెమెరాలు అలంకార ప్రాయంగానే ఉన్నాయి. బోగీల్లోకి ప్రైవేట్ వ్యక్తులు ప్రవేశించరాదనే నిబంధనలు ఉన్నప్పటికీ నాంపల్లి రైల్వే పోలీసుల పర్యవేక్షణ లేమితో ఇతరులు లోనికి వచ్చి పోతుంటారు. రైల్వే క్వార్టర్స్ నుంచి స్టేషన్‌లోనికి మరో దారి ఉంది. ఈ దారి నుంచి బయట వ్యక్తులు రాకపోకలు సాగిస్తారు. మజ్దూర్ యూనియన్ కార్యాలయం నుంచి ఒకటి, జీఆర్పీ కార్యాలయం నుంచి మరొకటి అడ్డదారులు ఉన్నాయి. పబ్లిక్‌గార్డెన్స్ ఫుట్ఓవర్ బ్రిడ్జి నుంచి ఉన్న పిట్టగోడ దూకి చాలా మంది స్టేషన్‌లోనికి వస్తుంటారు. రిజర్వేషన్ కార్యాలయం ఎదురుగా ఉన్న పార్శిల్ కార్యాలయం నుంచి, ఎంఎంటీఎస్ టికెట్ కౌంటర్ పక్కన ఉన్న దారులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఏటీఎం సెంటర్ పక్కన ఉన్న చిన్న పాటి సందు నుంచి లోనికి వెళ్లేందుకు మార్గం ఉంది.