breaking news
meruga nagrjuna
-
‘ఇసుక, మట్టి అంతా మింగేశారు’
సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేశారని వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాలుగున్నరేళ్లలో లక్షా యాభై వేల కోట్లు అప్పు చేశారని ఆరోపించారు. ఇసుక, మట్టి, బడ్జెట్ అంతా మింగేశారని విమర్శించారు. ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్య శ్రీని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఆర్టీసీ, కరెంట్ ఛార్జీలను విపరీతంగా పెంచారన్నారు. నక్కా అనంద్ బాబు దళిత ద్రోహి ఆరోపించారు. అసైన్డ్ భూములు ప్రభుత్వం లాక్కుంటుంటే నక్కా ఎమైపోయారని ప్రశ్నించారు. నక్కా ఆనంద్ బాబు బహిరంగ లేఖపై చర్చకు తాము సిద్ధమని పేర్కొన్నారు. -
చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేశారు
-
ఆ నిందితులను బహిష్కరించాలి
గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రిషికేశ్వరి మృతి కారణమైన వారిని వెంటనే కాలేజీ నుంచి బహిష్కరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మేరుగ నాగార్జున, లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్ చేశారు. రిషికేశ్వరి మృతిపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లేదంటే తాము ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమాత్రం సమంజసం కాదని హితవు పలికారు.