breaking news
merit candidate
-
డీఎస్సీ... ఇక నో ఆప్షన్!
కర్నూలు జిల్లాకు చెందిన ఎం.నాగజ్యోతికి డీఈడీ, బీఎస్సీ, బీఈడీ అర్హత ఉండడంతో డీఎస్సీలో ఎస్జీటీతోపాటు స్కూల్ అసిస్టెంట్ (మ్యాథ్స్), టీజీటీ (మ్యాథ్స్) పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. డీఎస్సీలో ఆమె ఎస్జీటీతోపాటు స్కూల్ అసిస్టెంట్ (మ్యాథ్స్) పోస్టుకు ఎంపికయ్యారు. కానీ, పరీక్షలకు ముందే తొలి ప్రాధాన్యం ఎస్జీటీకే ఇవ్వడంతో ఆమె ఉన్నతమైన స్కూల్ అసిస్టెంట్ పోస్టును కోల్పోవాల్సి వస్తోంది. కర్నూలు పట్టణానికి చెందిన కురువ నటరాజ్ డీఎడ్, బీఈడీ చేశారు. ప్రస్తుత డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ పోస్టుతోపాటు ఎస్జీటీ పోస్టుకు ఎంపికయ్యారు. ఆయన కూడా మెరిట్ లిస్టులో ఉన్నప్పటికీ పోస్టుల ప్రాధాన్యంలో మొదట ఎస్జీటీకి ఇవ్వడంతో స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు అవకాశం లేకుండాపోయింది. చిత్తూరు జిల్లాకు చెందిన పి.అనిత డీఎడ్, బీఎస్సీ, బీఈడీ పూర్తిచేశారు. ఆమె డీఎస్సీలో ఎస్జీటీ విభాగంలో జిల్లాస్థాయి 89వ ర్యాంకు, స్కూల్ అసిస్టెంట్ (బయాలజీ)లో 10వ ర్యాంకు పొందారు. కానీ, పోస్టుల ప్రయారిటీలో మొదట ఎస్జీటీకే ఆప్షన్ ఇవ్వడంతో స్కూల్ అసిస్టెంట్ పోస్టును కోల్పోనున్నారు. సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025లో అత్యుత్తమ మార్కులు సాధించినవారి ఆనందాన్ని... కూటమి సర్కారు తెచ్చిన ‘ముందస్తు ఆప్షన్ నిబంధన’ ఆవిరి చేస్తోంది. పరీక్షలకు ముందే పోస్టుల ప్రాధాన్యత ఎంపిక చేసుకోవాలని చెప్పడం... అధికారులు ఇప్పుడు అదే ‘ఫైనల్’ అని ప్రకటించడంతో మెరిట్ అభ్యర్థులకు శాపంగా మారింది. పరీక్ష పాసై మెరిట్ లిస్టులో ఉండి రెండు, మూడు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ముందుగానే ప్రాధాన్యత క్రమంలో మొదటి ఆప్షన్‌గా పెట్టిన సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) ఉద్యోగాన్ని మాత్రమే తీసుకోవాల్సి వస్తోంది. ఇలా రాష్ట్రంలో 10వేల మందికి పైగా రెండు నుంచి నాలుగు ఉద్యోగాలు సాధించినా... ప్రాధాన్యత క్రమంలో మొదట ఇచ్చిన ఎస్జీటీ పోస్టుకే పరిమితమయ్యే పరిస్థితి తలెత్తింది. చేజారిపోతున్న ‘ఉన్నత’ అవకాశం ఎన్నడూ లేనివిధంగా డీఎస్సీ–2025 నోటిఫికేషన్లో మాత్రమే అభ్యర్థులు దరఖాస్తు దశలోనే పోస్టుల ప్రాధాన్యత క్రమం కూడా తెలియజేయాలని నిబంధన పెట్టారు. అభ్యర్థులు ఎన్ని పోస్టులకు ఎంపికైనా, మొదటి ప్రాధాన్యతగా పేర్కొన్న ఉద్యోగాన్ని మాత్రమే తీసుకోవాల్సి వస్తుందని, మిగిలిన పోస్టులు బ్లాక్ అవుతాయని అధికారులు ప్రకటించారు. ఎడిట్‌కు అవకాశం ఇవ్వని విద్యాశాఖ తెలియక పోస్టుల ప్రాధాన్యత క్రమం తప్పుగా ఇచ్చామని, ఎడిట్ అవకాశం కల్పించాలని పరీక్షకు ముందే డీఎస్సీ నిర్వాహక అధికారులను కలిసి విజ్ఞప్తి చేసినా పరిగణనలోకి తీసుకోలేదని అభ్యర్థులు వాపోతున్నారు. పోస్టుల ప్రాధాన్యత ఎడిట్ అవకాశం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు. అభ్యర్థులకు జీవితాంతం వేదనే...» స్కూల్ అసిస్టెంట్, టీజీటీ పోస్టులు వచ్చే అవకాశం ఉన్నా ప్రభుత్వం పెట్టిన ముందస్తు ఆప్షన్ నిబంధన వల్ల ఎస్జీటీలో చేరినవారు తీవ్రంగా నష్టపోతారు. » ఎస్జీటీ పోస్టులో చేరినవారు 10 నుంచి 15 సంవత్సరాల సర్వీసు పూర్తయినా స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి వస్తుందన్న గ్యారెంటీ లేదు. » అదే టీజీటీ పోస్టులో చేరితే ఐదేళ్లలో పీజీటీ, మరో పదేళ్లలో ప్రిన్సిపాల్ అయ్యే అవకాశం ఉంటుంది. » ప్రభుత్వం పెట్టిన ఒక్క నిబంధనతో ఇప్పుడు మెరిట్లో ముందున్న దాదాపు 10వేల మంది అభ్యర్థులు జీవితాంతం కుమిలిపోయే పరిస్థితి ఏర్పడింది. -
హైకోర్టు తీర్పు మేరకు ఉద్యోగాలివ్వండి
యాదగిరిగుట్ట: 2008లో డీఎస్సీకి హాజరై ఉద్యోగాల కోసం 13 ఏళ్ళుగా ఎదురు చూస్తున్నామని డీఎస్సీ 2008 బీఈడీ మెరిట్ క్యాండిడేట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉమామహేశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన అభ్యర్ధులకు ఉద్యోగా లు ఇచ్చి న్యాయం చేస్తామని సీఎం కేసీఆర్ గతంలో వరంగల్‌లో జరిగిన సభలో హామీ ఇచ్చారని గుర్తుచేశారు. హైకోర్టు తమకు అనుకూలంగా తీర్పు వెలువరించినా ప్రభుత్వం సాను కూలంగా నిర్ణయం ప్రకటించకపోవడం బాధాకరమన్నారు. ప్ర భుత్వం తమను ఆదుకోవాలని కోరుతూ 2008 డీఎస్సీ అభ్య ర్థులు యాదగిరిగుట్ట పట్టణంలో శుక్రవారం ప్రదర్శన, మానవ హారం నిర్వహించారు. అనంతరం మోకా ళ్ళపై యాదాద్రీశుడి ఆలయ మెట్లు ఎక్కి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఉమా మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం హైకోర్టు తీర్పు ను అనుసరించి డీఎస్సీ–2008లో నష్టపోయిన అభ్యర్థులకు శాశ్వత ఉద్యోగాలు ఇచ్చేలా ప్రతి పాదనలు సిద్ధం చేసిందన్నా రు. ఇప్పటికైనా కేసీఆర్ స్పందించాలని విజ్ఞప్తి చేశారు. మానవహారం నిర్వహిస్తున్న డీఎస్సీ అభ్యర్థులు -
వారిచ్చిందే మెరిట్
రాష్ట్రంలోని ఓ టాప్ ఇంజనీరింగ్ కాలేజీ.. మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీలో మెరిట్‌ను ప్రాతిపదికగా తీసుకోలేదు. అడ్డగోలుగా డొనేషన్లు వసూలు చేసి, తక్కువ ర్యాంకు వచ్చిన విద్యార్థులకు సీట్లు కేటాయించింది. ఎలాంటి ర్యాంకు లేని వారికి ఇచ్చేసింది. ఈ వ్యవహారంలో ఒక్కో సీటును భారీ మొత్తానికి అమ్ముకున్నట్లు ఆరోపణలున్నాయి. మరో పేరున్న కాలేజీ ముందుగానే సీట్లు అమ్మేసుకుంది. బీటెక్ కంప్యూటర్ సైన్స్ సీట్లను రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల చొప్పున అమ్ముకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ కాలేజీ యాజమాన్యం తక్కువ ర్యాంకు రాని విద్యార్థులకు కూడా సీట్లు కేటాయించింది. ఇటీవల ఉన్నత విద్యా మండలి చేపట్టిన 2018–19 ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కోటా సీట్ల ర్యాటిఫికేషన్లలో ఈ అంశాలు బయటపడ్డాయి. అందులో మెరిట్ కనిపించకపోవడంతో వాటిపై ఓ అధికారి ప్రశ్నిస్తే ‘మాకు వచ్చిన దరఖాస్తులు అవే. అదే మెరిట్.. ఆమోదం కోసం పంపిన ఆ జాబితాలో ఉన్న విద్యార్థులే దరఖాస్తు చేశారు. వారికే సీట్లను కేటాయించాం’అని సదరు యాజమాన్యాలు తెగేసి చెప్పాయి. సాక్షి, హైదరాబాద్: కాస్త పేరుండి.. యాజమాన్య కోటా సీట్లను అమ్ముకున్న యాజమాన్యాలన్నింటిదీ అదే తీరు. అయినా ఉన్నత విద్యా మండలికి పట్టట్లేదు. యాజమన్యాలు ఇచ్చిందే మెరిట్‌గా భావించి ఆ ప్రవేశాలకు ఆమోదముద్ర (ర్యాటిఫై) వేస్తోంది. తమ ముందు ఆన్లైన్ దరఖాస్తుల విధానం వంటి ప్రత్యామ్నాయాలు ఉన్నా చూసీ చూడనట్లు వ్యవహరిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. కొందరు సిబ్బంది ర్యాటిఫికేషన్లలో వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తమకు ఉన్న అధికారాలను కూడా మండలి పక్కన పడేసి మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీని యాజమాన్యాల ఇష్టారాజ్యానికి వదిలేసిందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దరఖాస్తు చేసిన విద్యార్థుల సంఖ్య ఎక్కడ? రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో యాజమాన్య కోటా సీట్ల కోసం ఎంత మంది దరఖాస్తు చేశారన్నవిషయం ఎవరికీ తెలియదు. యాజమాన్యాలు ఎందరి నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నాయో.. ఎన్ని సీట్లను అమ్ముకుంటున్నాయో అంతా గోప్యమే. యాజమాన్య కోటా సీట్ల భర్తీలో పారదర్శకత పాటించాలని హైకోర్టు స్పష్టం చేసినా ఆ దిశగా ఉన్నత విద్యా మండలి ఎలాంటి చర్యలు చేపట్టట్లేదు. దాన్ని ఆసరాగా చేసుకున్న కొన్ని టాప్ కాలేజీ యాజమాన్యాలు 2017–18 ప్రవేశాల్లో భారీ దందాకు తెరతీశాయి. 2018–19 విద్యా సంవత్సరం ప్రవేశాల్లోనూ అదే దందాను కొనసాగించాయి. రేట్లు పెంచి మరీ కాలేజీని, కోర్సును బట్టి ఒక్కో సీటుకు రూ.4 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు వసూళ్లకు పాల్పడినట్లు తెలిసింది. కిందటేడాది మెరిట్ కాదు కదా జేఈఈ ర్యాంకు లేని వారికి, ఎంసెట్ రాయని వారికి సీట్లను కేటాయించిన కొన్ని టాప్ కాలేజీ యాజమాన్యాలు దాదాపు 500 సీట్లను అమ్ముకొని మెరిట్ ఉన్న విద్యార్థులకు అన్యాయం చేశాయి. ఆ టాప్ కాలేజీల్లోని యాజమాన్య కోటా సీట్ల కోసం ఎంత మంది విద్యార్థుల నుంచి దరఖాస్తులు వచ్చాయన్న విషయాన్ని కూడా ఉన్నత విద్యామండలి అడగట్లేదు. విద్యార్థుల నుంచి వచ్చిన దరఖాస్తులు, వారి ర్యాంకులు తెలిస్తేనే.. యాజమాన్య కోటాలో మేనేజ్మెంట్స్ ఏ ర్యాంకుల వారికి సీట్లను కేటాయించారు.. మెరిట్‌ను అనుసరించారా.. లేదా.. అని తెలిసేది. కానీ అవేవీ పట్టించుకోకుండానే, యాజమాన్యాలను అడక్కుండానే వారు చేపట్టిన పవేశాలను ర్యాటిఫై చేస్తుండటంలో ఆంతర్యమేంటన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలేం చెబుతున్నాయి.. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లోని మొత్తం సీట్లలో 70 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో, 30 శాతం సీట్లను మేనేజ్మెంట్ కోటాలో భర్తీ చేస్తారు. ఈ విద్యా సంవత్సరంలో 92,184 సీట్ల భర్తీకి యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇచ్చాయి. అందులో మైనారిటీ కాలేజీలు, కాలేజీల కన్సార్షియం ద్వారా సొంతంగా భర్తీ చేసుకునే సీట్లు పోగా, 87,900 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అందులో 70 శాతం కన్వీనర్ కోటాలో 61,511 (యూనివర్సిటీ కాలేజీల్లోని 3055 సీట్లు కాకుండా) సీట్లను భర్తీ చేశారు. మిగతా 30 శాతం సీట్లను (26,389) యాజమాన్యాలు భర్తీ చేశాయి. అయితే ఇందులో 15 శాతం సీట్లను జేఈఈ మెయిన్ ర్యాంకుల ఆధారంగా భర్తీ చేయాలి. మిగిలిన 15 శాతాన్ని ఎన్ఆర్ఐలకు, వారు స్పాన్సర్ చేసిన వారికి ఇవ్వాలి. మొదటి 15 శాతం సీట్లను మాత్రం మెరిట్ ఆధారంగానే ఇవ్వాలి. దరఖాస్తు చేసిన వారిలో జేఈఈ మెయిన్ ర్యాంకర్లు లేకుంటే ఎంసెట్ ర్యాంకర్లకు, వారూ లేకుంటే ఇంటర్ మార్కుల ఆధారంగా ఇవ్వాలి. కానీ మంచి ర్యాంకులు రాకపోయినా, ఎంసెట్ ర్యాంకు కూడా లేకపోయినా కొన్ని టాప్ కాలేజీలు సీట్లను కేటాయించాయి. ఆన్లైన్లో దరఖాస్తు విధానం ఉన్నా.. ప్రభుత్వ ఆదేశాల మేరకు యాజమాన్య కోటా సీట్ల భర్తీలో పారదర్శకత పాటించాలి. కాలేజీకి వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్లో పొందుపరచాలి. వీలైతే ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలోనే వెబ్ పోర్టల్ ద్వారా దరఖాస్తులు స్వీకరించాలి. వాటిని ఆయా కాలేజీలకు పంపి మెరిట్ ఉన్న వారికి సీట్లు వచ్చేలా చూడాలి. ఆఫ్‌లైన్‌లో, ఆన్లైన్లో కాలేజీలకు వచ్చిన దరఖాస్తులను కూడా పరిశీలించాలి. కానీ ఆ దిశగా ఉన్నత విద్యా మండలి చర్యలు చేపట్టిన దాఖలాల్లేవు. సాధారణంగా టాప్ కాలేజీల్లో మొదటి 5 వేలలోపు ఎంసెట్ ర్యాంకు ఉన్న విద్యార్థులకు కన్వీనర్ కోటాలో సీట్లు లభిస్తాయి. ఇక మేనేజ్మెంట్ కోటాలో మాత్రం జేఈఈ ర్యాంకులు ఉన్న వారికి మొదటి ప్రాధాన్యం ఉంటుంది. ఆ తర్వాత ఎంసెట్ ర్యాంకర్లకు సీట్లను కేటాయించాలి. అయితే ఎంసెట్ టాప్ 10 వేల ర్యాంకు వరకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తోంది. కానీ ఆ ర్యాంకు కలిగిన విద్యార్థులకు మేనేజ్మెంట్ కోటాలో సీట్లు లభించడం తక్కువే. అదీ కాలేజీలు అడిగే డొనేషన్లు చెల్లించిన వారికే సీట్లు కేటాయిస్తారు తప్ప ఇతర మెరిట్ విద్యార్థులకు ఇవ్వరని ఓ ఉన్నతాధికారి పేర్కొనడం గమనార్హం. -
ఇదేమి న్యాయం..!
నిజామాబాద్ నాగారం న్యూస్‌లైన్ : విద్యుత్ సబ్‌స్టేషన్ ఆపరేటర్ల ఎంపికలో ఆరోపణలు వచ్చినట్లుగానే... మెరిట్ అభ్యర్థులకు కాల్ లెటర్లు రాకపోగా, అనర్హులకే ఉద్యోగాలు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదీ ఎన్పీడీసీఎల్లో జరుగుతున్న అక్రమాల తంతు! మొదటి విడతలో ఆపరేటర్ల పోస్టులకు సంబంధించి అభ్యర్థులకు స్తంభం ఎక్కే పరీక్షలను బుధవారం జిల్లా కేంద్రంలోని పవర్‌హౌజ్‌లో నిర్వహించారు. నిజామాబాద్, కామారెడ్డి, బాన్సువాడ డివిజన్లకు సంబంధించిన సబ్స్టేషన్లలో ఖాళీగా ఉన్న పోస్టుల భ ర్తీకి అభ్యర్థులు హాజరయ్యారు. గురువారం నాడు ఆర్మూర్ డివిజన్‌కు సంబంధించిన అభ్యర్థులకు పరీక్షలు జరుగనున్నాయి. ఇదిలా ఉండగా ఆర్మూర్ డివిజన్‌కు చెందిన సీహెచ్ కొండూరు గ్రామంలోని బీసీ-డి కేటగిరికి చెందిన అభ్యర్థి తనకు ఎక్కువ మార్కులు వచ్చినప్పటికీ కాల్ లెటర్ రాలేదనీ, తనకంటే తక్కువ అర్హతలు ఉన్న అభ్యర్థికి కాల్‌లెటర్ వచ్చినట్లు వాపోయాడు. బాధితుడు ఈ విషయాన్ని ఆర్మూర్ డివిజన్లోని సంబంధిత అధికారులను విన్నవించిన ఫలితం దక్కలేదని ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే తన పేరును పత్రికలో ప్రచురించ వద్దని వేడుకున్నాడు. భవిష్యత్తులో అధికారులు కొర్రీలు పెట్టవచ్చని ఆందోళన వ్యక్తం చేశాడు. ఇదేవిధంగా తనకు అన్యాయం జరిగిందని నిజామాబాద్ మండలం ఆమ్రాబాద్‌కు చెందిన ఎస్టీ అభ్యర్థి ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. తనకంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి కాల్‌లెటర్ వచ్చిందన్నారు. ట్రాన్స్‌కో అధికారులు అభ్యర్థుల మార్కుల వివరాలను నోటీస్ బోర్డుపై ప్రదర్శించక పోవడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.