breaking news
mentally fit
-
Telangana: మతిస్థిమితం లేని మహిళకు మరణశిక్షా?
సాక్షి, హైదరాబాద్: మతిస్థిమితం లేని వ్యక్తికి చట్టప్రకారం మరణశిక్ష విధించడం సాధ్యంకాదని హైకోర్టు స్పష్టం చేసింది. తాను చేస్తున్నది తప్పు, చట్టవిరుద్ధమని గ్రహించలేని స్థితిలో చేసిన నేరానికి శిక్ష విధించలేమని అభిప్రాయపడింది. 2021లో తన సొంత బిడ్డను నరబలి ఇచ్చిన బానోత్ భారతికి సూర్యాపేట కోర్టు విధించిన మరణశిక్షను ఉన్నత న్యాయస్థానం శుక్రవారం రద్దు చేసింది. చిన్నారి మరణానికి దారితీసిన చర్య భౌతికంగా నిందితురాలి కారణంగానే జరిగినప్పటికీ ఘటన సమయంలో ఆమె తీవ్ర మానసిక అనారోగ్యంతో బాధపడుతోందని హైకోర్టు పేర్కొంది. దీంతో ఆమెకు భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 84 కింద రక్షణ వర్తిస్తుందని చెప్పింది. అప్పీలుదారురాలైన నిందితురాలే నేరానికి పాల్పడినప్పటికీ అది చట్టం దృష్టిలో నేరం కాదని.. నిర్దో షిగా విడుదల చేసేందుకు ఆమె అర్హురాలని తేలి్చచెప్పింది. సెషన్స్ కోర్టు గతేడాది ఏప్రిల్‌లో మరణశిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పు చట్ట ప్రకారం చెల్లదంటూ రద్దు చేసింది. అప్పీల్‌ను అనుమతిస్తూ బాధితురాలిని చంచల్‌గూడ జైలు నుంచి ఎర్రగడ్డ మానసిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలని చంచల్‌గూడ జైలు సూపరింటిండెంట్‌ను ఆదేశించింది. గత ఏప్రిల్‌లో మరణశిక్ష..: సూర్యాపేట జిల్లా మోతే మండలం మేకలపాటి తండాలో 2021 ఏప్రిల్ 15న భారతి అనే మహిళ తన ఇంట్లో ప్రత్యేక పూజలు చేస్తూ ఏడు నెలల తన కన్నబిడ్డ గొంతు, నాలుక కోసింది. తీవ్ర రక్తస్రావం కావడంతో బిడ్డ మృతిచెందింది. దేవుళ్లకు నరబలి ఇచ్చి తన సర్పదోషాన్ని పోగొట్టుకున్నట్లు భారతి కుటుంబ సభ్యులకు చెప్పింది. ఈ కేసులో భారతిని అరెస్టు చేసిన పోలీసులు సూర్యాపేట కోర్టులో హాజరుపరచగా వాదనల అనంతరం గతేడాది ఏప్రిల్‌లో కోర్టు ఆమెకు మరణశిక్ష విధించింది. ఈ తీర్పును ఆమె హైకోర్టులో సవాల్ చేసింది. -
మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదం చేస్తాయి
హైదరాబాద్: క్రీడలు శారీరక దేహ దారుడ్యానికే కాకుండా మానసికంగా ఉల్లాసంగా ఉండటానికి కూడా ఎంతో దోహదం చేస్తాయని సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ అన్నారు. ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ 2025 జాతీయ సదస్సు హెచ్ఐసీసీలో నిర్వహించిన సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీలను ఆయన బ్రిటిష్ ఇండియన్ సైకియాట్రిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీదేవి మహాలింగప్పతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన నిత్యం జీవితంలోని ఎన్నో టెన్షన్స్ను, పని ఒత్తిడిని తగ్గించుకోవాలంటే ఖచ్చితంగా క్రీడలు ఆడాల్సిందేనని అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీల్లో సౌత్ జోన్ సభ్యులు విజేతలుగా నిలిచారు. వారికి థమన్ ట్రోఫీని అందజేశారు. ఈ కార్యక్రమంలో నటుడు అశ్విన్ బాబు, ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ పి. కిషన్, సెక్రటరీ డాక్టర్ ఉమా శంకర్, కోశాధికారి డాక్టర్ జార్జ్ రెడ్డి, డాక్టర్ విశాల్ ఆకుల, న్యూరో సైకియాట్రిస్ట్ డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఐయామ్ మెంటల్లీ ఫిట్, పరీక్షలు వద్దు
కోల్‌కతా: కోర్టు ధిక్కార ఆరోపణలు ఎదుర్కొంటున్న కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీఎస్.కర్ణన్ గురువారం వైద్య పరీక్షలకు నిరాకరించారు. తన మానసిక స్థితి బాగానే ఉందని, తాను మంచిగానే ఉన్నానని ఆయన అన్నారు. కాగా కర్ణన్ మానసిక పరిస్థితిపై నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశాలతో నలుగురు సభ్యుల వైద్య బృందం గురువారం ఉదయం జస్టిస్ కర్ణన్ నివాసానికి వెళ్లింది. అయితే ఆయన మాత్రం వైద్య పరీక్షలను తిరస్కరించారు. ఒక జడ్జిని చులకన చేయటంతోపాటు వేధించేలా సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయని కర్ణన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇటువంటి వైద్య పరీక్షలను చేపట్టే సమయంలో సంరక్షకుల సమ్మతిని తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉందని, అయితే తన కుటుంబ సభ్యులెవరూ అందుబాటులో లేరని, వారి సమ్మతిని తీసుకునే వీలులేనందున తనకు ఏ విధమైన వైద్య పరీక్షలు చేయడానికి వీల్లేదని వైద్యులకు స్పష్టం చేశారు. ఒకవేళ బలవంతంగా తనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తే అది చట్టవిరుద్దమని కర్ణన్ పేర్కొన్నారు. కోల్‌కతా ప్రభుత్వ ఆస్పత్రిలోని వైద్య బృందంతో జస్టిస్ కర్ణన్ మానసిక స్థితిని అంచనా వేసి నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి ఈ నెల 8వ తేదీలోగా న్యాయస్థానానికి నివేదిక సమర్పించాలని సూచించింది. వైద్య బృందానికి అవసరమైన సాయం అందించేందుకు పోలీసు అధికారుల బృందాన్ని కూడా వెంట పంపాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ కేహార్ ఆధ్వర్యంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఆదేశాలిచ్చింది. కాగా దేశవ్యాప్తంగా కొందరు న్యాయవాదులు, న్యాయమూర్తులు అవినీతిపరులంటూ జస్టిస్ కర్ణన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై సర్వోన్నత న్యాయస్థానం మార్చిలో విచారణ చేపట్టగా.. కర్ణన్ హాజరు కాలేదు. దీంతో ఆయనపై కోర్టు ధిక్కార కేసు నమోదైంది. అయితే దీనికి కూడా కర్ణన్ స్పందించలేదు సరికదా.. ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికే సమన్లు జారీ చేసి మరోసారి వార్తల్లోకెక్కారు.


