breaking news
Mehdi
-
నిమిషా ప్రియకు ఉరిశిక్ష ఆగేనా?
సనా: అరబ్ దేశం యెమెన్‌లో మాజీ వ్యాపార భాగస్వామిని హత్య చేసిన కేసులో ఉరిశిక్ష పడిన భారతీయ నర్సు నిమిషా ప్రియను కాపాడేందుకు ప్రయత్నాలు ఉపందుకున్నాయి. ఆమెకు ఈ నెల 16న ఉరిశిక్ష అమలు చేయాలని యెమెన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఇప్పటికే జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ‘సేవ్ నిమిషా ప్రియ కౌన్సిల్’పేరిట స్వచ్ఛంద, సామాజిక కార్యకర్తలు ఆమెను ఉరిశిక్ష నుంచి తప్పించడానికి ఉద్యమిస్తున్నారు. ప్రజల మద్దతు కూడగడుతున్నారు. హత్యకు గురైన మెహదీ కుటుంబం క్షమాభిక్ష ప్రసాదిస్తే శిక్ష నుంచి ఆమె బయటపడే అవకాశం ఉంది. బాధిత కుటుంబానికి బ్లడ్‌మనీ కింద చెల్లించడానికి నిమిషా ప్రియ బంధువులు, మిత్రులు, మద్దతుదారులు రూ.7,35,000 సేకరించారు. మెహదీ కుటుంబం స్పందన కోసం ఎదురు చూస్తున్నామని ‘సేవ్ నిమిషా ప్రియ కౌన్సిల్’సభ్యుడు, సామాజిక కార్యకర్త బాబు జాన్ చెప్పారు. ఆమెను ఎలాగైనా రక్షించాలన్నదే తశ ఆశయమని అన్నారు. ఇప్పటికైనా క్షమాభిక్ష ప్రసాదించాలని, ఒక మహిళ ప్రాణాలు కాపాడాలని మెహదీ కుటుంబాన్ని కోరారు. నిమిషా ప్రియకు మద్దతు ప్రకటిస్తూ సోషల్ మీడియాలో చాలామంది పోస్టులు చేస్తున్నారు. ఉరిశిక్ష నుంచి బయటపడి ఆమె క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. నర్సుకు ఎందుకు ఉరిశిక్ష? కేరళ రాష్ట్రం పాలక్కాడ్ జిల్లాలోని కొల్లెంగోడ్‌కు చెందిన నిమిషా ప్రియ నర్సింగ్ విద్య అభ్యసించింది. మెరుగైన జీవితం కోసం 2008లో యెమెన్ చేరుకుంది. వేర్వేరు ఆసుపత్రుల్లో పని చేసింది. కొంత అనుభవం గడించిన తర్వాత సొంతంగా ఆసుపత్రి నిర్వహించాలన్న ఆలోచనతో 2014లో తలాల్ అబ్దో మెహదీ అనే యెమెన్ పౌరుడిని వ్యాపార భాగస్వామిగా చేర్చుకుంది. సొంత క్లినిక్ ఏర్పాటు చేసింది. యెమెన్ చట్టాల ప్రకారం.. విదేశీయులు వ్యాపారం చేయాలంటే స్థానికులు అందులో తప్పనిసరిగా భాగస్వామిగా ఉండాలి. కొంతకాలం తర్వాత నిమిషా ప్రియ, మెహదీ మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆమె ఫిర్యాదు మేరకు 2016లో మెహదీని పోలీసులు అరెస్టు చేశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఆమెను బెదిరింపులకు గురిచేశాడు. ఆమె పాస్‌పోర్టు లాక్కున్నాడు. చంపేస్తానని పలుమార్లు హెచ్చరించాడు. 2017లో మెహదీ నీళ్ల ట్యాంక్‌లో శవమై కనిపించాడు. అతడి శరీరం ముక్కలు ముక్కలుగా నరికేసి ఉంది. విషపు ఇంజెక్షన్లు ఇచ్చిన మెహదీని హత్య చేసినట్లు నిమిషా ప్రియాపై పోలీసులు అభియోగాలు మోపారు. అరెస్టు చేసి యెమెన్ రాజధాని సనా సిటీలోని సెంట్రల్ జైలుకు తరలించారు. 2018లో ట్రయల్ కోర్టు ఆమెను దోషిగా తేల్చింది. ఉరిశిక్ష ఖరారు చేసింది. సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ సైతం 2023 నవంబర్‌లో ట్రయల్ కోర్టు తీర్పును సమరి్థంచింది. హౌతీ తిరుగుబాలుదారులు ఆమెకు ఉరిశిక్ష అమలు చేసేందుకు ఈ ఏడాది జనవరిలో అనుమతి ఇచ్చారు. యెమెన్‌లో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. తమ పౌరుడిని హత్య చేస్తే కోర్టులు మరణశిక్ష విధిస్తాయి. శిక్ష తప్పే మార్గం ఉందా? బాధిత కుటుంబ సభ్యులు బ్లడ్‌మనీ(నష్టపరిహారం కింద నగదు) స్వీకరించి, క్షమాభిక్ష ప్రసాదిస్తే నిమిషా ప్రియకు ఉరిశిక్ష తప్పుతుంది. బ్లడ్‌మనీ ఎంత అనేది బాధిత కుటుంబమే నిర్ణయాల్సి ఉంటుంది. నిమిషా ప్రియ తల్లి కేరళలో ఉంటున్నారు. పనిమనిషిగా జీవనం సాగిస్తున్నారు. తన బిడ్డ ప్రాణాలు కాపాడుకొనేందుకు ఆమె ఇప్పటికే తన ఇల్లు అమ్మేశారు. మెహదీ కుటుంబాన్ని ఒప్పించేందుకు నిమిషా ప్రియ మద్దతుదారులు ప్రయత్నిస్తున్నారు. ఆమెకు ఉరిశిక్ష తప్పించేలా భారత ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలని కోరుతూ సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్ బుధవారం విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌కు లేఖ రాశారు. సనా సిటీ ప్రస్తుతం హౌతీ తిరుగుబాటుదారుల ఆ«దీనంలో ఉంది. వీరికి ఇరాన్ అండగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇరాన్‌ను ఒప్పించి హౌతీ తిరుగుబాటుదారులపై ఒత్తిడి పెంచితే ఉరిశిక్ష ఆగిపోయే అవకాశం ఉందని విదేశాంగ నిపుణులు సూచిస్తున్నారు. -
‘లింక్’ తేలుస్తాం
మెహ్దీ ల్యాప్‌టాప్‌లో ఉన్న వివరాలను సేకరిస్తున్నాం : పోలీస్ కమిషనర్ ఎంఎన్ రెడ్డి బెంగళూరు : ఐఎస్ఐఎస్ సంస్థ తరఫున ప్రచోదిత ట్వీట్లు నిర్వహిస్తున్న ఆరోపణలపై అరెస్ట్ అయిన మెహ్ది నుంచి సమాచారాన్ని సేకరించేందుకు గాను విచారణను వేగవంతం చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ ఎంఎన్ రెడ్డి వెల్లడించారు. మెహ్ది నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్‌లో ఉన్న సమాచారాన్ని తెలుసుకునే దిశగా ప్రయత్నాలు ప్రారంభించామన్నారు. ఇందుకు గాను ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను సైతం వినియోగిస్తున్నట్లు చెప్పారు. మంగళవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మెహ్ది ల్యాప్‌టాప్‌లో ఉన్న సమాచారాన్ని తెలుసుకున్న అనంతరం మెహ్దికి ఉగ్రవాదులతో నేరుగా సంబంధాలున్నాయా లేదా అనే అంశంపై స్పష్టత వస్తుందని తెలిపారు. మెహ్ది పోలీస్ కస్టడీ ఈనెల 18తో ముగియనుందని, అనంతరం అతన్ని కోర్టులో హాజరుపరుస్తామని పేర్కొన్నారు. అవసరమైతే మరికొన్ని రోజులు మెహ్దిని తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరుతామన్నారు. ట్విట్టర్ ద్వారా మెహ్ది ఎవరెవరితో సంబంధాలు కలిగి ఉన్నాడనే విషయమై ట్విట్టర్ సంస్థ వద్ద పూర్తి సమాచారం ఉందని, తాము నోటీసులు ఇచ్చిన తర్వాత సంస్థ ప్రతినిధులు తమకు అనుకూలంగా స్పందిస్తున్నారని వెల్లడించారు. ఇక మెహ్దిని స్వయంగా కమిషనర్ ఎంఎన్ రెడ్డి, జాయింట్ పోలీస్ కమిషనర్ హేమంత్ నింబాళ్కర్లే స్వయంగా విచారణ జరుపుతున్నట్లు సమాచారం. నగరంలోని ఓ రహస్య ప్రదేశంలో మెహ్దీ విచారణ కొనసాగుతోందని తెలుస్తోంది.