breaking news
Meghwal
-
జమిలి ఎన్నికల బిల్లు... రేపే లోక్‌సభ ముందుకు
న్యూఢిల్లీ: ఒకే దేశం–ఒకే ఎన్నిక విధానానికి సంబంధించిన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం ముహూర్తం ఖరారు చేసింది. జమిలి ఎన్నికలకు సంబంధించిన రెండు బిల్లులను సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. 129వ రాజ్యాంగ సవరణ, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లులను కేంద్ర న్యాయ శాఖ మంత్రి మేఘ్వాల్ సభ ముందు ఉంచనున్నారు. లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరిపేందుకు ఉద్దేశించిన ఈ బిల్లులకు కేంద్ర కేబినెట్ గురువారం ఆమోద ముద్ర వేయడం తెలిసిందే. -
భర్తల ఆయురారోగ్యాల కోసం ఇంకా జల్లెడ నుంచి చంద్రుడిని చూస్తారా?
జైపూర్: కర్వాచౌత్ నాడు భారతీయ మహిళలు జల్లెడ ద్వారా చంద్రుడిని చూసి తమ భర్తల ఆయురారోగ్యాల కోసం ప్రార్థనలు నిర్వహించడం దురదృష్టకరమని రాజస్తాన్ మంత్రి గోవింద్ రామ్ మేఘవాల్ చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రేపాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో మహిళలు సైన్స్ ప్రపంచంలో బతుకుతూ ఉంటే, మన దేశంలో జల్లెడ ద్వారా చంద్రుడిని చూస్తూ భర్త ఆయుష్షు కోసం పూజలు చేస్తున్నారని మరి ఆ భర్తలు భార్యల కోసం జల్లెడలోంచి ఎప్పుడూ చంద్రుడిని చూడలేదని వ్యాఖ్యానించారు. మంత్రి వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఎందరో భారతీయ మహిళలు విమాన పైలెట్లుగా ఉన్నారని, కల్పనా చావ్లా వంటి వారు అంతరిక్షంలోకి వెళ్లారని బీజేపీ ఎమ్మెల్యే రామ్‌లాల్ శర్మ గుర్తు చేశారు. -
పెళ్లి ఘనంగా నిర్వహించాడని...అమానుషం
భోపాల్: మధ్యప్రదేశ్ లో మరో అమానుషం చోటు చేసుకుంది. సుమారు 500మందికి దాహార్తిని తీర్చే మంచినీళ్ల బావిలో దుండగులు కిరోసిన్ కుమ్మరించారు. దీనికి గల కారణాలను ఆరాతీస్తే.. కుల, వర్ణ వివక్షపై అసహ్యం కలగ మానదు. గ్రామానికి చెందిన ఒక దళితుడు తన కుమార్తెకు మేళ తాళాలతో ఘనంగా వివాహం చేశాడన్న అక్కసుతో ఆధిపత్య కులానికి చెందిన గ్రామస్తులు ఈ ఘాతుకానికి తెగబడ్డారు. దళితులు ఉపయోగించే మంచినీటి బావిలో కిరోసిన్ కలిపారు. మధ్యప్రదేశ్‌లోని మాదా గ్రామంలో ఈ దుశ్చర్య చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...మధ్యప్రదేశ్ లోని మాదా లో దళితుడైన మేఘ్వాల్ (47) తన కుమార్తె మమత వివాహం ఘనంగా జరిపించాలని అనుకున్నాడు. దీనికోసం భారీ ఏర్పాట్లు చేసుకున్నాడు. అయితే ఈ ఆలోచనే ఆధిపత్య కులాలకు ఆగ్రహం తెప్పించింది. బ్యాండ్ మేళం పెట్టవద్దని హుకుం జారీ చేశారు. తమ ఆదేశాలు ధిక్కరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అక్కడితో ఆగలేదు "కట్టుబాట్లు" ఉల్లంఘిస్తే తన కుటుంబానికి సాధారణ బావి నుంచి నీటిని తోడుకోవడానికి వీల్లేదని, స్థానిక ఆలయంలోకి ప్రవేశించకుండా నిరోధించబడతారని గట్టిగా హెచ్చరించారు. అయినా మేఘావాల్ లెక్కచేయలేదు. ఏప్రిల్ 23 బ్యాండ్ బాజాలు, గ్రామంలో ఊరేగింపుతో అట్టహాసంగా ఈ శుభకార్యాన్ని ముగించాడు. ముఖ్యంగా బ్యాండ్ పార్టీతో పూర్తిస్థాయి ఊరేగింపుతో వరుడు పెళ్లి వేదికకు తరలి వచ్చాడు. అదీ ఆధిపత్య కులాలకు మాత్రమే పరిమితమైన ప్రధాన రహదారి గుండా. రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పూర్తి ఆమోదంతో, రైఫిల్స్, బాటన్లు, టియర్ గ్యాస్ లాంటి ముందు జాగ్రత్త చర్యలతో పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య శాంతి యుతంగా జరిగింది. ఇదే గ్రామంలోని ఆధిపత్య కుల పెద్దలకు త్రీవ ఆగ్రహం కలిగింది. రెండు రోజులు ప్రశాంతంగా ఉన్నా.. ఆ తర్వాత ఆవేశంతో రగిలిపోయారు. ప్రతీకార చర్యకు దిగారు. గ్రామంలో దళితులంతా తాగేందుకు వినియోగించే మంచినీటి బావిలో కిరోసిన్ ను కలిపారు. ఇది గమనించిన దళితుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఆ నీటిని పరిశీలించిన అధికారులు...బావిలో నీటిని మోటారుతో తోడించి, వినియోగానికి అవసరమైన విధంగా బావిని శుభ్రం చేయించారు. దీంతో గత ఆరు రోజులుగా, గ్రామంలోని దళిత మహిళలు 2 కి.మీ.ల దూరంలో ఉన్న నదినుంచి నీటినిని మోసుకుంటూ ఇబ్బందులు పడుతున్నారు. అయితే కావాలనే కిరోసిన్ పోసినట్టుగా భావిస్తున్నామని సీనియర్ దుర్విజయ్ సింగ్ వెల్లడించారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా హ్యాండ్ పంప్ వేయిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.