భర్తల ఆయురారోగ్యాల కోసం ఇంకా జల్లెడ నుంచి చంద్రుడిని చూస్తారా? | Indian Women See Moon Through Sieve | Sakshi
Sakshi News home page

భర్తల ఆయురారోగ్యాల కోసం ఇంకా జల్లెడ నుంచి చంద్రుడిని చూస్తారా?

Aug 22 2022 6:36 AM | Updated on Aug 22 2022 7:15 AM

Indian Women See Moon Through Sieve - Sakshi

జైపూర్‌: కర్వాచౌత్‌ నాడు భారతీయ మహిళలు జల్లెడ ద్వారా చంద్రుడిని చూసి తమ భర్తల ఆయురారోగ్యాల కోసం ప్రార్థనలు నిర్వహించడం దురదృష్టకరమని రాజస్తాన్‌ మంత్రి గోవింద్‌ రామ్‌ మేఘవాల్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రేపాయి.

అభివృద్ధి చెందిన దేశాల్లో మహిళలు సైన్స్‌ ప్రపంచంలో బతుకుతూ ఉంటే, మన దేశంలో జల్లెడ ద్వారా చంద్రుడిని చూస్తూ భర్త ఆయుష్షు కోసం పూజలు చేస్తున్నారని మరి ఆ భర్తలు భార్యల కోసం జల్లెడలోంచి ఎప్పుడూ చంద్రుడిని చూడలేదని వ్యాఖ్యానించారు. మంత్రి వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఎందరో భారతీయ మహిళలు విమాన పైలెట్లుగా ఉన్నారని, కల్పనా చావ్లా వంటి వారు అంతరిక్షంలోకి వెళ్లారని బీజేపీ ఎమ్మెల్యే రామ్‌లాల్‌ శర్మ  గుర్తు చేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement