ప్లేఆఫ్‌ బెర్త్‌ లక్ష్యంగా... | Billie Jean King Cup starts from 7th | Sakshi
Sakshi News home page

ప్లేఆఫ్‌ బెర్త్‌ లక్ష్యంగా...

Apr 4 2026 4:16 AM | Updated on Apr 4 2026 4:16 AM

Billie Jean King Cup starts from 7th

భారత మహిళల టెన్నిస్‌ టీమ్‌ కసరత్తు 

7 నుంచి బిల్లీ జీన్‌ కింగ్‌ కప్‌

న్యూఢిల్లీ: రోజుల వ్యవధిలోనే జరిగే బిల్లీ జీన్‌ కింగ్‌ కప్‌ ఆసియా ఓసియానియా గ్రూప్‌–1 టోర్నమెంట్‌లో సత్తా చాటేందుకు భారత మహిళల టెన్నిస్‌ జట్టు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఢిల్లీకి చేరుకున్న జట్టు సభ్యులంతా తుది కసరత్తుల్లో చెమటోడ్చుతున్నారు. పురుషుల టీమ్‌ టెన్నిస్‌లో జరిగే డేవిస్‌ కప్‌లాగే మహిళల విభాగంలో యేటా ఈ బిల్లీ జీన్‌ కింగ్‌ కప్‌ జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ నెల 7 నుంచి 11 వరకు ఢిల్లీలోని డీఎల్‌టీఏ కాంప్లెక్స్‌లో  ఆసియా ఓసియానియా గ్రూప్‌–1 టోర్నీని నిర్వహిస్తారు. 

ఐదు రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్‌లో ఆతిథ్య భారత్‌ సహా ఆరు జట్లు బరిలో ఉన్నాయి. ఇండోనేసియా, కొరియా, మంగోలియా, న్యూజిలాండ్, థాయ్‌లాండ్‌లు మిగతా జట్లు కాగా... తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నవంబర్‌లో జరిగే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి. చిట్టచివరి రెండు జట్లు మాత్రం వచ్చే ఏడాది జరిగే ఆసియా–ఓసియానియా గ్రూప్‌–2కు దిగజారుతాయి.  కీలకమైన ఈ టోర్నీకి ముందు జట్టు సన్నద్ధతపై కెప్టెన్‌ విశాల్‌ ఉప్పల్‌ మాట్లాడుతూ భారత అమ్మాయిల జట్టు మరోసారి ప్లే–ఆఫ్స్‌ బెర్తు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. 

హార్డ్‌కోర్టుల్ని ఆకళింపు చేసుకునేందుకే కాస్త ముందుగా వచ్చామని... రాగానే కసరత్తు మొదలుపెట్టామని చెప్పాడు. జట్టు అనుభవజు్ఞలు, యువ క్రీడాకారిణిలతో సమతుల్యంగా ఉందన్నాడు. వరుసగా ఈ ఏడాది కూడా ప్లే ఆఫ్స్‌ బెర్తు సాధించే సత్తా ఈ జట్టుకు ఉందన్నాడు. భారత జట్టులో ఇద్దరు తెలంగాణ ప్లేయర్లు శ్రీవల్లి రష్మిక, సహజ యామలపల్లి ఉన్నారు. వీరితో పాటు రుతుజా బోసలే, అంకిత రైనా, వైదేహి, కొత్త ప్లేయర్‌ వైష్ణవి ఆడ్కర్‌ మిగతా సభ్యులు. భారత మూడో ర్యాంకర్‌ వైదేహి మాట్లాడుతూ ప్రస్తుత టోర్నీలో పటిష్టమైన జట్టే బరిలోకి దిగుతోందని చెప్పింది.

 ప్రతీ జట్టుపై విజయం సాధించేందుకు మా వంతు కృషి చేస్తామని తెలిపింది. గత 2025–26 సీజన్‌లో నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకున్న సహజ మాట్లాడుతూ ‘ఎదురయ్యే ప్రతీ ప్రత్యరి్థని దీటుగా ఎదుర్కొంటాం. గతేడాది ప్లేఆఫ్స్‌ అనుభవం కూడా గడించాం. ఇప్పడు కూడా స్ఫూర్తిదాయక పోరాటం కనబరిచేందుకు సిద్ధంగా ఉన్నాం. టెన్నిస్‌ వ్యక్తిగత ఈవెంట్‌ అయినా... ఇక్కడ మాత్రం జట్టుగా ఆడుతున్నాం. మా అందరిలోనూ ఇప్పుడు నా అనే కంటే మా మ్యాచ్‌లనే సమష్టి భావనే ఉంది’ అని పేర్కొంది. ఆశించిన ఫలితాలు సాధిస్తామనే ధీమాను శ్రీవల్లి రషి్మక వ్యక్తం చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement