breaking news
mayor chamber
-
మేయర్ చాంబర్ ఎదుట ఉద్రిక్తత
హైదరాబాద్: నగరంలో నరక ప్రాయంగా మారిన రహదారుల సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని మేయర్ చాంబర్ ముందు ధర్నా నిర్వహించారు. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున మేయర్ చాంబర్ ఎదుట బైఠాయించారు. ఈ క్రమంలో కార్యకర్తలు ఒక్కసారిగా చాంబార్లోకి చొచ్చుకెళ్లడానికి యత్నించారు. అప్రమత్తమైన పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
మేయర్ ఛాంబర్ లో అగ్ని ప్రమాదం
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ భవనంలోని మేయర్ ఛాంబర్ లో అగ్ని ప్రమాదం సంభవించి విపరీతంగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో భవనంలోని వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. మేయర్ కొంకణి లక్ష్మీనారాయణ ఛాంబర్ లో ఉన్న ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగాయని కార్యాలయ సిబ్బంది తెలియజేశారు. అయితే ఈ ప్రమాదం వల్ల ఆస్తినష్టం ఎంత సంభవించిందన్న విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు.