భారత్‌తో రెండో టెస్టు.. న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ
క్రైస్ట్‌చర్చి వేదికగా శుక్రవారం (నవంబర్ 27) నుంచి మొదలుకానున్న రెండో టెస్టు కోసం న్యూజిలాండ్ జట్టులో చిన్న మార్పు చేసింది. బ్లెయిర్ టిక్నర్ గాయంతో దూరమవ్వడంతో అతడి స్థానంలో మాట్ ఫిషర్‌ను జట్టులోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో కివీస్ తన అప్డేట్ స్క్వాడ్‌ను ప్రకటించింది. అయితే తొలి టెస్టు సమయానికే కండరాల నొప్పితో బాధపడుతుండడంతో బ్లెయిర్ టిక్నర్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. తాజాగా గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో జట్టు నుంచి విడుదల చేస్తున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటన విడుదల చేసింది.తొలి టెస్టు ప్రారంభానికి ముందే ప్రాక్టీస్ సమయంలో బ్లెయిర్ టిక్నర్ కుడి కండరాల నొప్పితో బాధపడ్డాడు. తొలి టెస్టుకు దూరమైనప్పటికీ, టిక్నర్ను రెండో టెస్టులో ఆడించాలనుకున్నారు. కానీ అనూహ్యంగా గాయం తీవ్రత పెరగడంతో టెస్టు జట్టు నుంచి విడుదల చేసి, అతడి స్థానంలో మాట్ ఫిషర్‌ను ఆడించాలని నిర్ణయించినట్లు కివీస్ బోర్డు తెలిపింది. అంతకముందు వన్డే సిరీస్ సమయంలోనూ రెండో వన్డే మ్యాచ్‌లో అన్షుల్ కాంబోజ్ విసిరిన బంతి హెల్మెట్‌కు బలంగా తాకడంతో టిక్నర్ కంకషన్‌కు గురయ్యాడు. అప్పుడు కూడా బ్లెయిర్ టిక్నర్ స్థానంలో మాట్ ఫిషర్ ఎంపికయ్యాడు. తాజాగా రెండో టెస్టుకు ముందు టిక్నర్ గాయంతో దూరమవ్వడంతో మాట్ ఫిషర్‌కు మరోసారి అవకాశం రావడం యాదృశ్చికమనే చెప్పొచ్చు.ఇక టీమిండియాతో జరిగిన వన్డే సిరీస్‌కు టిక్నర్ స్థానంలో వచ్చిన మాట్ ఫిషర్ తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. మూడు మ్యాచ్‌లు కలిపి 4.56 ఎకానమీ రేటుతో ఆరు వికెట్లు పడగొట్టాడు. ఇక 2025 ఆగస్టులో జింబాబ్వేతో జరిగిన టెస్టులో తొలిసారి ఆడిన మాట్ ఫిషర్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్‌గా 16 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన మాట్ ఫిషర్ 60 వికెట్లు తీశాడు.రెండో టెస్టుకు కివీస్ జట్టు:టామ్ లాథమ్ (కెప్టెన్), టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, మాట్ ఫిషర్, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్, మాట్ హెన్రీ, కైల్ జామిసన్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, నాథన్ స్మిత్, విల్ యంగ్ఇదీ చదవండి: Aaryavir Sehwag: ‘నాన్న కాదు.. ఆయనే నా ఫేవరెట్ క్రికెటర్’యూఏఈతో మ్యాచ్.. గెలిస్తేనే సెమీస్‌కు తిలక్ సేన