breaking news
Matt Damon
-
క్రిస్టోఫర్ నోలన్ 'ద ఒడిస్సీ'.. ఎందుకు చూడాలి?
ఒడిస్సీ.. ఒడిస్సీ.. ఒడిస్సీ.. ప్రపంచవ్యాప్తంగా గత కొన్నిరోజుల నుంచి డిస్కషన్ అంతా ఈ సినిమా గురించే. హాలీవుడ్‌లోనే పలు అద్భుతాలు తీసిన దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ ఇది. ద డార్క్ నైట్, ఇంటర్ స్టెల్లార్, ఇన్సెప్షన్, టెనెట్ లాంటి మైండ్ బెండింగ్ సైన్స్ ఫిక్షన్ చిత్రాలతో మెప్పించిన నోలన్.. కెరీర్లోనే తొలిసారి పురాణాల ఆధారంగా 'ద ఒడిస్సీ' తీశాడు. మరి ఈ చిత్రానికి ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఎందుకు చూడాలి?(ఇదీ చదవండి: సెన్సేషనల్ సినిమా 'అబ్సెషన్' తెలుగు రివ్యూ)2004లో వచ్చిన 'ట్రాయ్' సినిమా గురించి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. డబ్బింగ్ రూపంలోనూ చూసే ఉంటారు. తొలుత దీనికి దర్శకుడిగా క్రిస్టోఫర్ నోలన్నే అనుకున్నారు. కానీ 'బ్యాట్ మ్యాన్' అవకాశం రావడంతో నోలన్ అటువైపు వెళ్లాడు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత అదే ట్రాయ్ గుర్రం నేపథ్యం చిన్న భాగమైన 'ద ఒడిస్సీ' తీశాడు.మన దేశంలో పురాణాలు, ఇతిహాసాలు ఉన్నట్లే గ్రీకు పురాణాలు కూడా ఎంతో ఫేమస్. దీని ఆధారంగా ఇప్పటికే హాలీవుడ్లో పలు సినిమాలు వచ్చాయి. అయితే ఫిజిక్స్, టైమ్ ట్రావెల్, సైన్స్ ఫిక్షన్ కథలతో ఆటాడుకునే క్రిస్టోఫర్ నోలన్.. గ్రీకు మైథాలజీలో భాగమైన ఒడిసియస్ రాజు గురించి సినిమాని తీస్తాడని ఎవరూ ఊహించలేదు. ఎప్పుడైతే 'ద ఒడిస్సీ' ప్రకటన వచ్చిందో మూవీపై మంచి హైప్ వచ్చింది.ఓవైపు షూటింగ్ జరుగుతున్నప్పటికీ ఏడాది క్రితమే 'ద ఒడిస్సీ' మూవీ టికెట్స్ ఆన్లైన్లో పెడితే నిమిషాల్లో అవి అమ్ముడైపోయాయి. అది నోలన్‌కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్. ముందే చెప్పినట్లు జూలై 17న అంటే ఈ శుక్రవారమే థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు.ఈ సినిమా మొత్తాన్ని క్రిస్టోఫర్ నోలన్.. గ్రీస్, స్కాట్లాండ్, ఐస్ ల్యాండ్ లాంటి తొమ్మిది దేశాల్లోని లైవ్ లొకేషన్స్‌లో ఐమ్యాక్స్ కెమెరాతో షూటింగ్ చేశాడు. ఈ కెమెరాకి ఓ స్పెషాలిటీ ఉంది. వేరే ఏ కెమెరాలకు అయినా లెంగ్త్ విషయంలో ఎక్కువ, తక్కువ నిడివితో షూటింగ్ చేసుకోవచ్చు. కానీ ఐమ్యాక్స్ కెమెరాలో మూడు నిమిషాల సీన్ మాత్రమే క్యాప్చర్ చేయడానికి కుదురుతుంది.(ఇదీ చదవండి: అమ్మకానికి 'ఐమాక్స్'?)నోలన్ తనకు 16 ఏళ్లున్నప్పుడు ఐమ్యాక్స్ కెమెరాలో ఓ సినిమా తీయాలని అనుకున్నాడు. అది ఇన్నాళ్లకు అంటే 55 ఏళ్ల వయసులో నెరవేరింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా 40 ఐమ్యాక్స్ స్క్రీన్స్ మాత్రమే ఉన్నాయి. నోలన్ 'ద ఒడిస్సీ' చిత్రాన్ని ఎలా తీశాడు? ఏం చూపించాలనుకున్నాడు? అనేది వీటిలో మాత్రమే కరెక్ట్‌గా కనబడుతుంది. మిగిలిన వాటిలో సినిమా విజువల్స్ పైన, కింద, మూలల్లో కట్ అయ్యే అవకాశముంటుంది.The difference between IMAX 70mm and the regular screen #TheOdyssey pic.twitter.com/nVkgqGPHrU— OTT Trackers (@OTT_Trackers) July 15, 2026 సాధారణంగా హాలీవుడ్ సినిమాలని మన దేశంలో పెద్దగా ప్రమోట్ చేయరు. కానీ నోలన్, తన టీమ్‌తో కలిసి కొన్నిరోజుల క్రితం భారతదేశంలో ల్యాండ్ అయ్యాడు. ముంబైలో జరిగిన ప్రీమియర్ పాల్గొన్నాడు. భరద్వాజ్ రంగన్, అనుపమ్ చోప్రా లాంటి ఫిల్మ్ అనలిస్ట్‌లకు నోలన్ ఇంటర్వ్యూలు ఇవ్వడం అందరికీ ఆశ్చర్యపరిచింది. మన దేశ మార్కెట్‌పై ఇంతలా నోలన్ దృష్టిపెట్టడం ఆసక్తికర విషయం.(ఇదీ చదవండి: చిన్న రోబో అడిగిన ప్రశ్న.. ఏఐ జమానాలోనూ జవాబు లేదు!)'ద ఒడిస్సీ' కథ విషయానికొస్తే.. ఇథికా అనే రాజ్యానికి చెందిన ఒడిసియస్ అనే రాజు చాలా బలవంతుడు, తెలివైనవాడు. తన రాజ్యాన్ని వదిలి పదేళ్ల పాటు పోరాడి ఓ యుద్ధాన్ని గెలుస్తాడు. వెంటనే తిరిగి తన రాజ్యానికి వెళ్లిపోయి భార్య పెనలోపి, కొడుకు టెలీమాకస్ని కలవాలనుకుంటాడు. కానీ విధి ఇతడికి సహకరించదు. సముద్రదేవుడు, గాలి దేవుడు, అగ్ని దేవుడు, ఇలా చాలామంది ఒడిసియస్ రాజుపై పగబడతారు. ఒంటి కన్ను రాక్షసుడు, మంత్రగత్తెలు తదితరుల కారణంగా పదేళ్లు పాటు రకరకాల రాజ్యాల్లో తిరుగుతూ చిట్టచివరికి ముసలివాడైన ఓ బిచ్చగాడిలా తన రాజ్యంలో అడుగుపెడతాడు. స్వయంవరంలో గెలిచి మళ్లీ తన భార్య పెనలోపిని దక్కించుకుంటాడు.ఎమోషన్స్, విజువల్స్ ఎఫెక్ట్స్, అడ్వెంచర్, సర్వైవల్ డ్రామాగా తీసిన ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. 'ద ఒడిస్సీ'పై హైప్ ఉన్నప్పటికీ నెగిటివిటీ కూడా కొంత ఏర్పడింది. ట్రైలర్‌కి యూట్యూబ్‌లో డిస్ లైక్స్ లాంటివి వచ్చాయి. ఇలా ప్లస్సులు, మైనస్సులు ఉన్నప్పటికీ మూవీ లవర్స్ మాత్రం ఒక్కసారైనా 'ద ఒడిస్సీ'ని చూడాల్సిందే అని ఫిక్సయ్యారు. మరి ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో ఏంటో? తెలుగులోనూ ఇది రిలీజ్ అవుతుండటం విశేషం.(ఇదీ చదవండి: ది ఒడిస్సీ క్రేజ్.. ఒక్కో టికెట్ ధర అన్ని వేలా?) -
మూవీ రివ్యూ: జేసన్ బోర్న్
టైటిల్: జేసన్ బోర్న్ జానర్: థ్రిల్లర్ నటీనటులు: మాట్ డామన్, టామీ లీ జోన్స్, అలీసియా వికాండర్, జూలియా స్టిల్లర్స్ తదితరులు. దర్శకుడు: పాల్ గ్రీన్ గ్రాస్ ఆధారం: రాబర్ట్ లూలమ్ నవలలోని జేసన్ బోర్న్ పాత్ర సంగీతం: జాన్ పావెల్, డేవిడ్ బుక్లే సినిమాటోగ్రఫీ: బారీ అక్రాయిడ్ డిస్ట్రిబ్యూటర్స్: యూనివర్సల్ పిక్చర్స్ నిడివి: 2 గంటల 3 నిమిషాలు విడుదల: ఆగస్టు 5 (ఇండియాలో) హాలీవుడ్ లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోల్లో ఒకడైన మాట్ డామన్.. గత ఏడాది సైన్స్ ఫిక్షన్ సినిమా 'ది మార్షియన్'తో బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టాడు. 108 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో రూపొందిన 'ది మార్షియన్' ఏకంగా 630 మిలియన్ డాలర్ల కలెక్షన్లు సాధించిన సంగతి తెలిసిందే. దీంతో అతని తర్వాతి సినిమా 'జేసన్ బోర్న్'పై క్రేజ్ క్రేజీగా పెరిగింది. అమెరికన్ రచయిత రాబర్ట్ లూలమ్ నలవలల్లోని సీఐఏ గూఢచారి పాత్ర 'జేసన్ బోర్న్'ను ఆధారం చేసుకుని రూపొందించిన ది బోర్న్ ఐడెంటిటీ(2002), ది బోర్న్ సుప్రిమసీ(2004), ది బోర్న్ అల్టిమేటం(2007), ది బోర్న్ లెగసీ(2012) లలో ఒక్క లెగసీ తప్ప మిగతా మూడింటిలోనూ మాట్ డామనే హీరో. ఇక దర్శకుడు పాల్ గ్రీన్ గ్రాస్.. ఇంతకు ముందు బోర్న్ సుప్రిమసీ, బోర్న్ అల్టిమేటంలను తెరకెక్కించాడు. సినిమాపై అంచనాలు పెరగడానికి వీళ్లిద్దరి కాంబినేషన్ కూడా ఓ కారణం! మరి, ఈ సిరీస్ లో దాదాపు పదేళ్ల తర్వాత 'జేసన్ బోర్న్'గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాట్ డామన్ ఊహించిన స్థాయిలో అలరించాడా? బోర్న్ కే సొంతమైన అదోరకం యాక్షన్ సీన్లను పండించాడా? మొత్తంగా హిట్ కొట్టాడా? ఫట్ మనిపించాడా? కథేంటి? బోర్న్ అల్టిమేటం సినిమాకు డైరెక్ట్ సీక్వెల్ అయిన 'జేసన్ బోర్న్'.. 'ఇప్పుడు నాకు అంతా తెలిసిపోయింది' అనే డైలాగ్ తో స్టార్ట్ అవుతుంది. అంటే, తానొక మాజీ సీఐఏ రహస్య గూఢచారినని, సంస్థ ఆదేశాలను అనుసరించి ఎంతోమందిని కిరాతకంగా చపిన వ్యక్తినని హీరో అర్థం చేసుకుంటాడు. ఆ హత్యోదంతాలకు దూరంగా ఎక్కడో గ్రీస్ లో ఇల్లీగల్ ఫైటింగ్స్ చేస్తూ కాలం గడుపుతుంటాడు. అయితే జేసన్ అంతలా పశ్చాత్తాప పడాల్సిన అవసరం లేదని, సీఐఏ డైరెక్టర్ తలపెట్టిన కుట్రలో అతనెలా పావులా మారాడో ఆధారాలతో సహా జేసన్ కు వివరిస్తుంది స్నేహితురాలు నిక్కీ(జూలియా స్టిల్లర్స్). అందుకోసం ఆమె సీఐఏ సర్వర్ ను హ్యాక్ చేస్తుంది. దీంతో నిక్కీ, జేసన్ ల ఉనికి సీఐఏకి తెలిసిపోతుంది. అంతే, వీళ్లిద్దరినీ అంతం చేసేందుకు అధికారిక, రహస్య బలగాలను రంగంలోకి దింపుతాడు సీఐఏ డైరెక్టర్ రాబర్ట్ డేవి(టామీ లీ జోన్స్). తన తండ్రి ఉగ్రవాదుల చేతుల్లో బలైపోయాడని ఇన్నాళ్లూ నమ్మిన జేసన్ బోర్న్.. కాదూ, సీఐఏనే చంపించిందన్న సంగతి తెలుసుకుని దిగ్భ్రాంతికి లోనవుతాడు. వెంటనే తేరుకుని సీఐఏ అంతుచూసేందుకు బయలుదేరుతాడు. సీఐఏ సైబర్ ఆపరేషన్స్ హెడ్ హెయిథర్ లీ(అలీసియా వికాండర్) మొదట్లో డైరెక్టర్ కు సహకరించినా, తర్వాతతర్వాత అతను తప్పుడు మార్గంలో వెళుతున్నాడని గ్రహించి జేసన్ బోర్న్ కు సహకరిస్తూఉంటుంది. 'డీప్ డ్రీమ్' అనే సోషల్ మీడియా దిగ్గజ కంపెనీ కొత్తగా రూపొందించిన అప్లికేషన్ల సాయంతో వ్యక్తిగత జీవితంలోకి చొరబడటమే కాకుండా, అందిరిపైనా నిఘా పెట్టే వీలుంటుంది. ఆ మేరకు సమాచారాన్ని దొంగిలించి, తమకు ఇవ్వాల్సిందిగా సీఐఏ డైరెక్టర్.. 'డీప్ డ్రీమ్' కంపెనీ సీఈవోను ఒత్తిడిచేస్తాడు. అందుకు అంగీకరించన యువ సీఈవో.. కన్వెన్షన్ ఏర్పాటుచేసి సీఐఏ డైరెక్టర్ కుట్రలను బట్టబయలు చేయాలనుకుంటాడు. కానీ ఈలోపే ఆ అతణ్ని ఫినిష్ చేసేందుకు రంగం సిద్ధం అవుతుంది. సరిగ్గా అదేసమయానికి జేస్ బోర్న్ ఎంటరై.. సీఐఏ డైరెక్టర్ కుట్రను భగ్నం చేస్తాడు. నాటకీయ ఫైట్ లో హెయిథర్ లీ.. రాబ్ట్ డేవిని చంపేసి, బోర్న్ ను తప్పిస్తుంది. తద్వారా జేసన్ బోర్న్ ని మళ్లీ సీఐఏలో చేర్చుకోవాలన్నది ఆమె పథకం. కానీ, ఆమె ప్రపోజల్ ను చాకచక్యంగా తిరస్కరించి తనదారిన తాను వెళ్లిపోతాడు జేస్ బోర్న్. ఎలా ఉంది? బోర్న్ 'ఐడెంటినీ' లెక్కకట్టేటప్పుడు పాత సినిమాల ప్రస్తావన తప్పదు. ఆ విధంగా సిరీస్ లో వచ్చిన మొదటి నాలుగు సినిమాలతో పోల్చుకుంటే 'జేసన్ బోర్న్'లో నాటకీయత లోపించింది. అలాగని అదిరిపోయే యాక్షన్ సీన్లు కూడా లేవు. తాను ఎవరో తెలుసుకున్నాక జేసన్ బోర్న్ ఏం చెయ్యాలి? ఎవరిమీద్ తిరగబడాలి? అనే పాయింట్ ను ప్రెజెంట్ చేయడానికి దర్శకుడు చాలా కష్టపడ్డాడు. తండ్రి హత్యకు ప్రతీకారం అందులో భాగమే. 'జేసన్ బోర్న్' క్యారెక్టర్ ను ఇకముందు ఎన్ని మలుపులు తిప్పినా వర్క్ అవుట్ కాదని, అందుకే ఆ క్యారెక్టర్ ను చేయబోనని మాట్ డామన్ స్వయంగా(2007లో) మీడియాకు చెప్పాడు. అతని అంచనా వందశాతం సరైందేనని 'జేసన్ బోర్న్' చూస్తే అర్థం అవుతుంది. అదీగాక బెర్రీ అక్రాయిడ్ సినిమాటోగ్రఫీ ప్రేక్షకులకు కఠిన పరీక్ష. సీన్లో ఏం జరుగుతుందో అర్థంకాకముందే ఫ్రేమ్ లు మార్చుతూ, జూమ్ లు లాగుతూ కన్ఫ్యూజ్ చేస్తాడు. ఒకవేళ థియేటర్ లో 'జేస్ బోర్న్' చూడాలనుకుంటే గనుక 2డీయే సజెస్టబుల్. 120 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో తెరకెక్కి జులై 11న యూకేలో, జులై 29న యూఎస్ లో విడుదలైన 'జేసన్ బోర్న్' ఇప్పటివరకు కేవలం 131 మిలియన్ డాలర్ల్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. -
సెప్టెంబర్ 5న జాసన్బర్నీ
హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం జాసన్బర్నీ ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ ఐదో తేదీన తెరపైకి రానుంది. ఆంగ్లంతో పాటు తమిళం,తెలుగు, హిందీ భాషల్లో 3డీ, 2డీ ఫార్మెట్లలో ప్రేక్షకలను థ్రిల్ చేయడానికి భారీ ఎత్తున రానందని చిత్ర నిర్మాణ సంస్థ యూనివర్సల్ యూనిట్ పేర్కొన్నారు. మాట్ డమన్ నటించిన తాజా చిత్రం ఇది. జాసన్ బర్నీ నటుడు మాట్ డమన్ నటించిన నాలుగవ సీక్వెల్ ఇది. ఇంతకు ముందు ఆయన నటించిన మూడు చిత్రాలు సంచలన విజయం సాధించాయి. అయితే దాదాపు దశాబ్దం తరువాత మాట్ డమన్ నటించిన చిత్రం జాసన్ బర్నీ. ఆయనతో పాటు జూలియాస్టైల్స్,అలిసియ వెకేందర్, విన్సెంట్ కాస్సెల్, లామి లీజాన్స్ ముఖ్యపాత్రలను పోషించిన ఆ చిత్రానికి పాల్గ్రీన్ గ్రస్ దర్శకత్వం వహించారు. ఆయన క్రిష్టోఫర్ రేస్‌తో కలిసి ఈ చిత్ర కథను తయారు చేశారు. ఇందులో చిత్ర దర్శకుడు, కథానాయకుడు నిర్మాణంలో భాగస్వామ్యం కావడం విశేషం. ప్రాంక్మర్షల్, జెఫ్రీ వెయినర్, పాల్ గ్రీన్గ్రస్, మట్డమన్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. రాబర్ట్ రుద్లమ్ను బేస్ చేసుకుని తయారు చేసిన కథతో తెరకెక్కించిన బ్రహ్మాండ చిత్రం జాసన్ బర్నీ అని చిత్ర వర్గాలు తెలిపారు. -
రెండు వారాలకు మించి ఉండలేను
లాస్ ఏంజెల్స్: కుటుంబాన్నివదిలి దూరంగా ఉండటానికి కొంతమంది ఇష్టపడరు. కొందరు ఇంటిమీద బెంగతో హోం సిక్ అవుతారు కూడా. ఇక చిన్నపిల్లల పరిస్థితి చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ హీరోలు సైతం ఇంటిపై బెంగ పెట్టుకుంటారట. హాలీవుడ్ హీరో మాట్ డమోన్ తన కుటుంబాన్ని వదిలి రెండు వారాలకు మించి ఉండలేనని అంటున్నారు. ఒక టీవీ షోలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ఎక్కడ షూటింగ్ లో ఉన్నా రెండు వారాలకొకసారి ఇంటికి వెళ్లాల్సిందేనన్నారు. సినిమా ఒప్పుకోగానే తన భార్య లూసియానా బారోస్ తో చర్చిస్తానని చెప్పాడు. రెండు వారాలకు మించి షూటింగ్ కోసం వేరేచోట ఉండాల్సి వస్తే తన భార్య, పిల్లలను తీసుకెళ్తానని తెలిపాడు. ఇది ఒక్కోసారి తమ కుటుంబానికి హాలిడే ట్రిప్ లాగా ఉంటుందని అన్నాడు. గతేడాది చైనా పర్యటనకు ఆరు నెలలు తమ కుటుంబంతో కలిసి వెళ్లినట్టు తెలిపాడు. -
టాయిలెట్ నీటితో హాలీవుడ్ స్టార్ ఐస్ బకెట్ ఛాలెంజ్!
ఐస్ బకెట్ చాలెంజ్ ఫీవర్ ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం కొనసాగుతోంది. అయితే ఐస్ బకెట్ చాలెంజ్ పేరుతో మంచినీటిని వృధా చేస్తున్నారంటూ హాలీవుడ్ నటుడు, ది బార్న్ ఐడెంటిటీ హీరో మాట్ డేమన్ నిరసన వ్యక్తం చేస్తూ కొత్త పద్దతిని ఎంచుకున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది మంచినీరు, తాగునీరు లేక ఇబ్బందులకు గురవుతున్నారని, అనేక పేద దేశాల్లో మంచి నీరు చాలా విలువైన వస్తువుగా మారిందని.. అలాంటి నీటిని వృధా చేస్తున్నారంటూ.. టాయిలెట్ నీటి ద్వారా ఐస్ బకెట్ ఛాలెంజ్ విసిరారు. మంచినీటిపై అవగాహన కల్పించేందుకు ఈ పద్దతిని ఎన్నుకున్నట్టు ఆయన తెలిపారు. ఈ హాలీవుడ్ నటుడు తన ఫౌండేషన్ ద్వారా మంచినీటి వినియోగంపై ప్రపంచవ్యాప్తంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఒకవేళ ఐస్ బకెట్ ఛాలెంజ్ ను మంచినీటితో చేస్తే ప్రతికూల సంకేతాలను తాను పంపినట్టు అవుతుందని.. తాగునీరుపై అవగాహన కలిగించేందుకు మాత్రమే తాను ఈ రూపంలో ఛాలెంజ్ విసిరానని తెలిపారు. పలు టాయిలెట్ల నుంచి సేకరించిన నీటిని తనపై కుమ్మరించుకుని ఐస్ బకెట్ ఛాలెంజ్ ను తన సహచర నటుడు జార్జ్ క్లూనీ, సంగీత దర్శకుడు బానో, అమెరికన్ ఫుట్ బాలర్ టామ్ బ్రాడీలకు సవాల్ విసిరాడు.


