breaking news
Matt
-
కార్పొరేట్ ట్యాక్స్ కోతపై స్పష్టత కావాలి
ప్రీ-బడ్జెట్ సమావేశాల్లో పరిశ్రమవర్గాల వినతి న్యూఢిల్లీ: రాబోయే బడ్జెట్లో కార్పొరేట్ ట్యాక్స్ రేటును 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించే అంశానికి సంబంధించి స్పష్టమైన ప్రణాళికను ప్రకటించాలని పరిశ్రమవర్గాలు ప్రభుత్వాన్ని కోరాయి. ప్రోత్సాహకాల ఉపసంహరణ అనేది... కార్పొరేట్ ట్యాక్స్ రేటు తగ్గింపుతో పాటు కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్) తొలగింపునకు అనుగుణంగా జరగాలని పేర్కొన్నాయి. బడ్జెట్ ముందస్తు సమావేశాల్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ సందర్భంగా పరిశ్రమల సమాఖ్యలు సీఐఐ, ఫిక్కీ ఈ మేరకు తమ వినతులు సమర్పించాయి. ప్రోత్సాహకాలు, మినహాయింపుల ఉపసంహరణ ప్రతిపాదనకు తమ మద్దతు ఉంటుందని సీఐఐ ప్రెసిడెంట్ సుమీత్ మజుందార్ చెప్పారు. వీటిని తగ్గించిన తర్వాత మ్యాట్‌ను దశలవారీగా ఎత్తివేయాలని కోరినట్లు ఫిక్కీ ప్రెసిడెంట్ హర్షవర్ధన్ నోతియా తెలిపారు. ఇక వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్టీ) అమలులో ప్రభుత్వానికి తమ పూర్తి మద్దతుంటుందని వారు పేర్కొన్నారు. ప్రారంభ దశలోని స్టార్టప్‌లకు పన్నులపరమైన బాదరబందీ ఉండకుండా చూడాలని తాము సూచించినట్లు ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్ చంద్రశేఖర్ తెలిపారు. వ్యాపారాలకు అనుకూల పరిస్థితులను కల్పించడంతో పాటు పన్నుల విధానాన్ని కూడా మెరుగుపర్చేందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరినట్లు అసోచాం ప్రెసిడెంట్ సునీల్ కనోడియా వివరించారు. ఎగుమతులకు సర్వీస్ ట్యాక్స్ నుంచి మినహాయింపునివ్వాలని విజ్ఞప్తి చేసినట్లు ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ ఎస్సీ రాల్హన్ తెలిపారు. -
సతీ సావిత్రి@ అమెరికా
పెళ్లైన ఆరు నెలలకే మ్యాట్‌కి యాక్సిడెంట్ అయింది. కోమాలోకి వెళ్లిపోయాడు. భార్య డేనియలి ముందు డాక్టర్లు ఒకే ఒక్క ఆప్షన్ ఉంచారు. ఆయనకు ఆక్సిజన్, ఆహారం అందించే ట్యూబులను పీకేయ్. కథ ముగుస్తుంది. నువ్వు కొత్త జీవితం ప్రారంభించు అన్నారు. డేనియలి ఇంకో ఆప్షన్‌ను ఎంచుకుంది. ట్యూబులతో సహా భర్త మ్యాట్‌ను ఇంటికి తెచ్చుకుంది. కంటికి రెప్పలా కాపాడుకుంది. అనుక్షణం తోడు నిలిచింది. మూడు నెలల తరవాత ఓ రోజు మ్యాట్ కళ్లు తెరిచాడు. ఐ యామ్ ట్రయింగ్ అన్నాడు. డేనియలి ఆనందానికి అంతే లేదు. అయితే అది అంతలోనే అవిరైపోయింది. మ్యాట్‌కి ఏమీ గుర్తులేవు. ఓ పసిపిల్లాడు అయిపోయాడు. తండ్రి చనిపోయింది, తన పెళ్లైందీ కూడా మర్చిపోయాడు. డేనియలి ఓర్పు వీడలేదు. నెమ్మది నెమ్మదిగా అతని చేయి పట్టి నడిపించింది. ఫిజియో థెరపీ చేయించింది. యోగ క్లాసులకు తీసుకెళ్లింది. మరో మూడు నెలలకు మ్యాట్ మెమరీ తిరిగి వచ్చింది. ఇప్పుడు మ్యాట్, డేనియలీలు ఆనందంగా కాలం గడుపుతున్నారు. ట్యూబులు పీకేయ్ అన్న డాక్టర్లు ముఖం దాచుకున్నారు. ఎవరన్నారు సావిత్రీ సత్యవంతుల కథ అబద్ధమని? వాళ్లు మ్యాట్ డేనియలీగా పేరు మార్చుకున్నారు అంతే!! నెట్‌ఇంట్లో ‘రఘువరన్ బి టెక్’ సినిమా చూశారా? ఉన్నట్టుండి హీరో పనిచేసే కన్స్ట్రక్షన్ కంపెనీకి ఇంజినీర్ల్లు అవసరమౌతారు. అప్పుడు హీరో ధనుష్ ఏం చేశాడు? బజరంగీ భాయిజాన్ సినిమా చూశారా? ఇండియాలో తప్పిపోయిన పాప గురించి పాకిస్తానీ విలేఖరి చాంద్ నవాబ్ (నవాజుద్దీన్ సిద్దిఖీ) తెచ్చిన వార్తను మీడియా ఛానెళ్లు పక్కన పెట్టేస్తే అతనేం చేశాడు? ధనుష్ ఫేస్బుక్లో తన అవసరాన్ని పోస్ట్ చేస్తాడు. వేలవేల మంది ఇంజినీర్లు దొరుకుతారు. చాంద్ నవాబ్ యూట్యూబ్‌లో వార్తను పోస్ట్ చేస్తాడు. వేల వేల మంది చూస్తారు. ఇండియా పాకిస్తాన్లను ఆ ఒక్క యూట్యూబ్ పోస్ట్ ఒక్క తాటిమీదకు తెస్తుంది. సోషల్ మీడియాల సత్తా, సత్తువ ఏమిటో ఈ తాజా సినిమా కథలు చెబుతున్నాయి. సోషల్ మీడియా.. కావాలంటే ఉద్యమంగా మారుతుంది. కాదంటే నిరసన రూపెత్తుతుంది. కూడదంటే ఆలోచనల్ని మారుస్తుంది. కలవం అంటే దూరమైన వాళ్లను కలుపుతుంది. ఇంకా సందేహం ఉందా... అయితే ఈ కింది కథలు కబుర్లు చదవండి. మీకే తెలుస్తుంది. అబ్బాయిల అట్లాస బ్రాడ్వేలో కాంచనమాలా... రాక్సీలో నార్మా షేరర్... అంటూ దశాబ్దాల కింద శ్రీశ్రీ చెన్నపట్నం రొమాంటిక్ సినీ జాగ్రఫీని ఇలా సూక్ష్మంలో మోక్షంగా వివరించేశాడు. గో జూమో అనే ఇలాంటి ఇంటర్ నెట్ కోణంగి సైట్ ఒకటి ఢిల్లీ నగరం మ్యాపును అబ్బాయిల కన్నులతో చూసింది. గీసింది. దాంతో ఓ ఫన్నీ మ్యాప్ తయారైంది. అది పార్లమెంటులూ, కేజ్రీవాల్‌ల ఢిల్లీ కాదు. అమ్మాయిలకు లైను వేసే అబ్బాయిల దృష్టిలో ఢిల్లీ షహర్. ఉదాహరణకి లక్ష్మీ నగర్ అంటే భవిష్యత్ సీఏలు ఉంటారట. నార్త్ క్యాంపస్ అంటే ఢిల్లీ యూనివర్సిటీ అమ్మాయిలుంటారట. జీకె అంటే డబ్బున్న అమ్మాయిలు ఉంటారట. సాకేత్ అంటే ఆ డబ్బున్న అమ్మాయిలు షాపింగ్ చేసే చోటు అట. చాందనీ చౌక్ అంటే కొత్త ఐఫోన్లు దొరికే చోటు అట. ఇలాంటి మ్యాపునే మన హైదరాబాద్ అబ్బాయిలు తయారు చేస్తే ఎలా ఉంంది? అమీర్ పేట్ ఫ్యూచర్ అమెరికన్ సిటిజన్లు, బంజారా హిల్స్... మాల్సే మాల్స్, మారేడ్ పల్లి ఆర్మీ అమ్మాయిల అడ్డా. మాదాపూర్ టెకీ అమ్మాయిల రాజధాని... ఇలా ఉంటుందేమో కదూ....http://www.buzzfeed.com/andreborges/someone-made-a-hilariously-spot-on-map-of-delhi-and-people-a#.xnXA6183P కోళ్లను వదిలి కసి తీర్చుకున్నాడు ఇండియాలో మేధావులకు కోపం వస్తే ఏం చేస్తారు? ఇప్పటి ప్రభుత్వంపై కోపాన్ని అప్పటి ప్రభుత్వాలు ఇచ్చిన అవార్డులను తిరిగి ఇచ్చేయడం ద్వారా చూపిస్తారు. కొందరు అవార్డులు ఇచ్చినట్టు నటిస్తారు, పత్రికలకెక్కి పలవరిస్తారు. హడావిడి అయిపోయాక అవార్డులను గప్ చుప్ గా పెట్టెలో దాచేకుంటారు. అదే లిథువేనియాలో వేరేలా జరిగింది. ఒక ఆర్టిస్టుకి కోపం వచ్చింది. ఎవరి మీద? రష్యా దేశాధినేత పుతిన్ పైన. ఆయన వద్ద వాపస్ ఇచ్చేందుకు అవార్డేమీ లేదు. అందుకే భలే ఐడియా ఒకటి వేశాడు. బ్రెడ్ పొడితో పుతిన్ బొమ్మ వేశాడు. ఆ బొమ్మపైకి కొన్ని కోళ్లను వదిలేశాడు. కోళ్లు కాళ్లతో కెలికి, ముక్కుల్తో గుచ్చి, బ్రెడ్ పౌడర్‌ను భోంచేసేశాయి. క్షణాల్లో పుతిన్ గారి బొమ్మ మొత్తం రూపు మారిపోయింది. బాణామతి చేసేవారు బొమ్మని పిన్నుల్తో గుచ్చి మనిషిని బాధపెట్టినట్టు మన ఆర్ట్టిస్టు కూడా పుతిన్‌ను కోళ్లకు, కొక్కిరాయిలకు వేసేసిన ఆనందాన్ని పొందేశాడు. తన ఘనకార్యాన్ని ఫేస్బుక్లో పోస్టు చేసి స్వేచ్ఛా ప్రపంచం కోసమే ఈ శిక్షను వేశానహో అని ప్రకటించేశాడు. ఆ చిత్ర విచిత్ర శిక్ష గురించి చూడాలంటే ఈ క్రింది సైట్ క్లిక్ చేస్తే చాలు.http://www.boredpanda.com/chickens-eat-bread-portrait-jolita-vaitkute/ ఫేస్... బుక్ చేస్తుందా? ఇది ఫేస్బుక్ కి నిజంగా అంత శక్తి ఉందో లేదో తెలియచెప్పేస్తుంది. జెన్నీ స్టాక్ అనే మెరైన్ ఫొటోగ్రాఫర్ డొమినిక్ రిపబ్లిక్లో గగన సీమలో పోటీపడి కమ్ముకొస్తున్న మంచు మబ్బులను చూస్తూ తన్మయత్వంలో తేలిపోతున్న నవ వధూవరుల ఫొటోలను క్లిక్‌మనిపించింది. ఆ ఫొటోలు వాళ్లకిద్దామంటే వాళ్ల ఊరు, పేరు, చిరునామా తెలియదు. కానీ ముచ్చటైన ఆ ఫొటోలను వారికి అందించాలన్న కోరిక ఆమెకు రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఇప్పుడామె ఆ ఫొటోలను ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. అంతే కాదు... ‘‘వారెవరో, ఎక్కడివారో కూడా నాకు తెలియదు. జంటను చూస్తే ముచ్చటేసింది. వారి అనుమతితోనే ఫొటోలు తీశాను. ప్లీజ్ ... వారెవరో ఏమో కానీ ఈ ఫొటోలను వారికి చేర్చండి’’ అంటూ పోస్ట్ కూడా పెట్టింది. వాళ్లను ఎవరైనా గుర్తిస్తే దయచేసి వారి కాంటాక్ట్‌ను తనకు అందజేయాల్సిందిగా ఆమె కోరుతోంది. ‘లండన్‌లోని లాంక్షైర్లో నివసిస్తున్న నేను మెరైన్ ఫొటోగ్రాఫర్‌ని. నా ఫేస్బుక్ పేజీని సులభంగానే గుర్తించవచ్చు’ అంటోంది ఆమె. ఫేస్బుక్ కే నిజంగా సత్తా ఉంటే... ఆమె ఆ నవ వధూవరులతో కలిపేయాలి. కలిపేస్తుందా లేదా... అన్నది, సస్పెన్స్ వీడేది ఫేస్బుక్ పేజీలోనేనండోయ్...http://www.sakshi.com/news/international/marine-underwater-photographer-search-newly-wed-couple-291965?pfrom=home-top-story కిస్సుల సెన్సార్‌పై కస్సుబుస్సులు ట్విట్టరాచార్యుల వారికి ఎందుకు కోపం వస్తుందో తెలియదు. ఎన్నో సినిమాల్లో ఎన్నెన్నో కత్తెరలు వేశారు. కనీసం పట్టించుకోలేదు. ఎన్నో సీన్లు పరపర కోసిపారేశారు. కోపం రాలేదు. కొన్ని సినిమాలు విడుదల కాకుండానే బ్యాన్ చేశారు. కిమ్మనలేదు. కానీ జేమ్స్ బాండ్ గారి ముద్దుల్లో మూడు సెకన్ల కోత పెట్టేసరికి ట్విట్టరాచార్యులకు ఎక్కడలేని కోపం వచ్చింది. శృంగారంపై శృంఖలాలేమిటని విజృంభించి సోషల్ మీడియా మొగసాల కెక్కి మరీ నిప్పులు కక్కేశారు. అంతేకాదు. తమదైన శైలిలో వ్యంగ్యాలు విసిరారు. బాండ్‌కు మూడు నామాలు పెట్టి.. ఫొటోలు షేర్ చేశారు. భారతీయ బాండ్ అయితే ఇలా ఉండాలని ఓ కామెంట్ పాస్ చేశారు. బాండ్ గర్ల్ భారతీయ నటి అయితే ఎలాంటి దుస్తులు వేసుకుంటుందో... చిత్రవిచిత్రమైన ఫొటోలతో సరదా వ్యాఖ్యలు జోడించారు. బాండ్ భారతీయుడైతే ఆయుధాలుగా త్రిశూలం ఉండాలని మరీ వ్యాఖ్యానించేశారు. ట్విట్టర్లో జేమ్స్ బాండ్ డైలాగ్‌లతో పోటీపడి మరీ వన్ లైనర్లను (ఏకవాక్య వ్యాఖ్యలు) పుట్టించేశారు. కత్తుల్లాంటి కామెంట్లు, కొరడాల్లాంటి వన్లైనర్లు ఇప్పుడు ఇంటర్ నెట్టంతా వీర విహారం చ్తేన్నాయి. సంస్కారి జేమ్స్‌బాండ్ పేరిట ఈ హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు ట్విట్టర్లో హల్చల్ చేస్తోంది. http://www.sakshi.com/news/movies/sanskari-james-bond-is-viral-now-on-twitter-291907?p from=home-top-story, http://www.buzzfeed.com/sahilrizwan/double-no-seven#.ce3ovNZnM -
విదేశీ కంపెనీలకు ‘మ్యాట్’ ఊరట!
భారత్‌లో శాశ్వత కేంద్రం లేని విదేశీ సంస్థలకు ప్రభుత్వం ఉపశమనం - ఐటీ చట్ట సవరణకు నిర్ణయం న్యూఢిల్లీ: భారత్‌లో శాశ్వత కేంద్రం లేని విదేశీ కంపెనీలకు ‘మ్యాట్’ (కనీస ప్రత్నామ్నాయ పన్ను) నుంచి ఊరట కల్పించే కీలక నిర్ణయాన్ని కేంద్రం తీసుకుంది. ఈ మేరకు ఆదాయపు పన్ను (ఐటీ) చట్టం సవరించనున్నట్లు ప్రభుత్వం గురువారం ప్రకటించింది. రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్‌తో (గత కాలం నుంచీ వర్తించే విధంగా) ఈ చట్ట సవరణ చేయాలని నిర్ణయించినట్లు ఆర్థికమంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. దేశంలో విదేశీ సంస్థలు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా వ్యాపారాన్ని నిర్వహించుకునేందుకు తగిన వెసులుబాటు కల్పిస్తామని ప్రభుత్వం ఇస్తున్న హామీ నేపథ్యంలో తాజా ప్రకటన వెలువడింది. భారత్‌తో ద్వంద్వ పన్నుల నివారణా చట్టం (డీటీఏఏ) చేసుకున్న దేశమా? కాదా? అన్న అంశంతో సంబంధం లేకుండా విదేశీ కంపెనీలు అన్నింటికీ తాజా పన్ను వెసులుబాటును కల్పిస్తున్నట్లు ఆర్థికమంత్రిత్వశాఖ వెల్లడించింది. 2001 ఏప్రిల్ నుంచీ లాభాలపై ఆయా కంపెనీలు మ్యాట్ మినహాయింపు పొందుతాయి.