breaking news
matralayam
-
వైఎస్ జగన్‌తోనే నా ప్రయాణం: మంత్రాలయం ఎమ్మెల్యే
సాక్షి,కర్నూలుజిల్లా: తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం నిజం కాదని మంత్రాలయం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి స్పష్టం చేశారు. తనపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఈ మేరకు మంగళవారం(ఫిబ్రవరి11)బాలనాగిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను ఎప్పటికీ వైఎస్సార్సీపీలోనే ఉంటానని, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ వెంటే నడుస్తానని బాలనాగిరెడ్డి స్పష్టం చేశారు. వ్యక్తిగత సమస్యల వల్ల పార్టీ కార్యక్రమాలకు కొంత దూరంగా ఉన్నానని,అంతేకానీ పార్టీ మారే ఆలోచన లేదని చెప్పారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులు, మండల నాయకుల ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమాలు కొనసాగిస్తామని బాలనాగిరెడ్డి తెలిపారు. -
మంత్రాలయంలో నలుగురు విద్యార్థుల అదృశ్యం
కర్నూలు : కర్నూలు జిల్లా మంత్రాలయంలో నలుగురు విద్యార్థులు ( వీరేష్, దేవేందర్, అమర్, రాఘవేంద్ర) అదృశ్యం అయ్యారు. నిన్నటి నుంచి తమ పిల్లలు కనిపించటం లేదని విద్యార్థులు తల్లిదండ్రులు పోలీసుల్ని ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు తమని కిడ్నాప్ చేసి బెంగళూరులోని ఓ గోడౌన్లో బంధించారంటూ అదృశ్యమైన విద్యార్థులు తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. దాంతో ఫోన్ కాల్‌పై పోలీసులు దృష్టి పెట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.