ఓటీటీలో 'మట్కా కింగ్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తెలుగులో ఒకటి రెండు సినిమాలు చేసిన విజయ్ వర్మ.. కొన్నాళ్ల క్రితం తమన్నాతో డేటింగ్ చేసి వార్తల్లో నిలిచాడు. తర్వాత వీళ్లిద్దరూ విడిపోయారు కూడా. ఇప్పుడు ఎవరికి వాళ్లు కెరీర్ పరంగా బిజీ అయిపోయాడు. విజయ్ వర్మ నటించిన క్రైమ్ డ్రామా సిరీస్ ఇప్పుడు స్ట్రీమింగ్కి సిద్ధమైంది. ఈ మేరకు రిలీజ్ డేట్ ప్రకటించడంతో పాటు టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఇంతకీ ఈ సిరీస్ సంగతేంటి? ఎందులోకి రాబోతుంది?(ఇదీ చదవండి: ఓటీటీలో ఉస్తాద్ భగత్‌సింగ్..!)మట్కా పేరుతో గతంలో బెట్టింగ్ తరహా గేమ్ ఉండేది. ఇప్పుడు దీన్ని బ్యాక్‌డ్రాప్ స్టోరీగా తీసుకుని తెరకెక్కించిన సిరీస్ 'మట్కా కింగ్'. విజయ్ వర్మ, కృతిక కమ్రా, గుల్షన్ గ్రోవర్ తదితరులు ప్రధాన పాత్రలు చేస్తున్నారు. 'సైరత్' లాంటి బ్లాక్‌బస్టర్ మూవీ తీసిన నాగరాజ్ ముంజలే ఈ సిరీస్‌కి దర్శకత్వం వహించాడు. ఏప్రిల్ 17 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఇది స్ట్రీమింగ్ కానుందని తాజాగా రిలీజ్ చేసిన టీజర్‌తో ప్రకటించారు.టీజర్ బట్టి చూస్తే.. ముంబైకి చెందిన రతన్ ఖత్రీ జీవితం ఆధారంగా ఈ సిరీస్ తీసినట్లు తెలుస్తోంది. 1960ల్లో ఓ సాధారణ పత్తి వ్యాపారి (విజయ్ వర్మ), తన తెలివితేటలతో మట్కా అనే జూద సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాడు? ఈ క్రమంలోనే అండర్ వరల్డ్, పోలీసులని ఎలా ఎదుర్కొన్నాడు? తదితర అంశాలే స్టోరీ అని తెలుస్తోంది. గతంలో తెలుగులో 'మట్కా' పేరుతో వరుణ్ తేజ్ హీరోగా సినిమా వచ్చింది గానీ అది ఘోరమైన డిజాస్టర్ అయింది. కానీ ఇప్పుడొస్తున్నది సిరీస్ కాబట్టి ఇందులో స్టోరీ మరింత రియలస్టిక్‌గా చూపించే అవకాశముంది.(ఇదీ చదవండి: ఓటీటీలో శ్రీవిష్ణు థ్రిల్లింగ్ సినిమా.. ప్రకటన వచ్చేసింది)